అల్లరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న చంద్రికా రవి డ్యాన్సర్‌గా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మోడలింగ్‌లోనూ మంచి మార్కులు కొట్టేసింది. నటనలో ‘వాహ్వా’ అనిపించింది. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రికా రవి భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. ఆమె మాట, పాట, నటన, నృత్యంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. తాజా విషయానికి వస్తే... యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పుట్టింది చంద్రికా రవి. మల్లిక, రవి శ్రీధరన్‌లు తల్లిదండ్రులు. మూడు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యాక్టింగ్‌లలో చంద్రికకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే సింగపూర్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చింది. కొత్త్ర పాంతాలకు వెళ్లడం అంటే చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్‌లోనే ఎన్నో దేశాలు చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్‌లో కెరీర్ మొదలు పెట్టింది..
‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో నటించింది. నిజానికి నిజజీవితంలోనూ ఆమెకు రెండు సంస్కృతులపై గాఢమైన పరిచయం ఉంది. ‘నా మూలాలు దక్షిణ భారతంలో ఉన్నాయి’ అని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటుంది చంద్రిక. మోడలింగ్ చేసినప్పటికీ తన తొలి ్రపాధాన్యత మాత్రం నటనే.
‘ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్‌లో యూఎస్‌లో శిక్షణ తీసుకున్నాను. విదేశాల్లో కొన్ని ఫీచర్ ఫిల్మ్‌లు చేశాను. నటన అంటే ఇష్టం అయినప్పటికీ ఒకేరకమైన పాత్రలు చేయడం ఇష్టం లేదు. వైవి«ధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ్రపాధాన్యత ఇస్తాను’ అంటున్న చంద్రిక పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్‌లో లీడ్ రోల్‌లో నటించింది. ‘అచ్చం స్మితలాగే ఉంది’ అనిపించుకుంది.
రేడియో టాక్ షో విషయానికి వస్తే...
‘ది చంద్రికా రవి షో’లో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన రకరకాల అనుభవాలు, సవాళ్లు, పోరాటాలను పంచుకోనుంది. చంద్రిక పోరాట నేపథ్యం గురించి విన్న రూక్స్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు వ్యాఖ్యాతగా అరుదైన అవకాశం ఇచ్చాడు.
‘ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుంది’ అంటుంది చంద్రిక. అమెరికాలోని అతి పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన ‘ఐహార్ట్’ రేడియోలో ఈ షో ప్రసారం కానుంది. తన షోను ఆషామాషీగా తీసుకోవడం లేదు చంద్రిక. షో సక్సెస్ కోసం డిజైన్, ్ర΄÷డక్షన్, ప్రమోషన్‌లకు సంబంధించి బాగా కష్టపడింది.
యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి భారతీయ నటిగా ప్రత్యేకత సాధించిన చంద్రిక.. ‘నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి, ప్రపంచంతో నా వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఈ షో నాకు వరం లాంటిది’ అంటుంది.
"ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రేడియో షో ఉపయోగపడుతుంది". – చంద్రికా రవి
Comments
Please login to add a commentAdd a comment