Chandrika Ravi
-
అడల్ట్ సినిమాతో మెప్పించిన 'చంద్రికా రవి' సిల్క్ స్మితగా వచ్చేస్తుంది (ఫోటోలు)
-
ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’!
అల్లరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న చంద్రికా రవి డ్యాన్సర్‌గా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మోడలింగ్‌లోనూ మంచి మార్కులు కొట్టేసింది. నటనలో ‘వాహ్వా’ అనిపించింది. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రికా రవి భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. ఆమె మాట, పాట, నటన, నృత్యంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. తాజా విషయానికి వస్తే... యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టింది చంద్రికా రవి. మల్లిక, రవి శ్రీధరన్‌లు తల్లిదండ్రులు. మూడు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యాక్టింగ్‌లలో చంద్రికకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే సింగపూర్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చింది. కొత్త్ర పాంతాలకు వెళ్లడం అంటే చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్లోనే ఎన్నో దేశాలు చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్‌లో కెరీర్ మొదలు పెట్టింది..‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో నటించింది. నిజానికి నిజజీవితంలోనూ ఆమెకు రెండు సంస్కృతులపై గాఢమైన పరిచయం ఉంది. ‘నా మూలాలు దక్షిణ భారతంలో ఉన్నాయి’ అని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటుంది చంద్రిక. మోడలింగ్ చేసినప్పటికీ తన తొలి ్రపాధాన్యత మాత్రం నటనే.‘ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్‌లో యూఎస్‌లో శిక్షణ తీసుకున్నాను. విదేశాల్లో కొన్ని ఫీచర్ ఫిల్మ్‌లు చేశాను. నటన అంటే ఇష్టం అయినప్పటికీ ఒకేరకమైన పాత్రలు చేయడం ఇష్టం లేదు. వైవి«ధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ్రపాధాన్యత ఇస్తాను’ అంటున్న చంద్రిక పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్‌లో లీడ్ రోల్లో నటించింది. ‘అచ్చం స్మితలాగే ఉంది’ అనిపించుకుంది.రేడియో టాక్ షో విషయానికి వస్తే...‘ది చంద్రికా రవి షో’లో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన రకరకాల అనుభవాలు, సవాళ్లు, పోరాటాలను పంచుకోనుంది. చంద్రిక పోరాట నేపథ్యం గురించి విన్న రూక్స్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు వ్యాఖ్యాతగా అరుదైన అవకాశం ఇచ్చాడు.‘ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుంది’ అంటుంది చంద్రిక. అమెరికాలోని అతి పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన ‘ఐహార్ట్’ రేడియోలో ఈ షో ప్రసారం కానుంది. తన షోను ఆషామాషీగా తీసుకోవడం లేదు చంద్రిక. షో సక్సెస్ కోసం డిజైన్, ్ర΄÷డక్షన్, ప్రమోషన్లకు సంబంధించి బాగా కష్టపడింది.యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి భారతీయ నటిగా ప్రత్యేకత సాధించిన చంద్రిక.. ‘నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి, ప్రపంచంతో నా వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఈ షో నాకు వరం లాంటిది’ అంటుంది."ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రేడియో షో ఉపయోగపడుతుంది". – చంద్రికా రవి -
బొమ్మలా మెరిసిపోతున్న జాన్వీ.. హాట్ బ్యూటీ అలాంటి లుక్!
లంగా ఓణీలో కుందనపు బొమ్మలా హీరోయిన్ జాన్వీ కపూర్ బ్యాక్ చూపించి రచ్చ లేపుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే చార్మినార్ దగ్గర స్పెషల్ సాంగ్స్ బ్యూటీ చంద్రిక రవి పట్టుచీరలో సరికొత్తగా కనిపిస్తున్న హాట్ భామ పూనమ్ బజ్వా పొట్టి నిక్కర్లో హీరోయిన్ రియాసేన్ వలపు వల.. చూస్తే అంతే శ్రీలంకలో బికినీతో చిల్ అవుతున్న ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ కేరళలో ఎంజాయ్ చేస్తున్న సురేఖావాణి కూతురు సుప్రీత 22 ఏళ్ల తర్వాత నాగార్జునని కలిసిన 'మన్మథుడు' బ్యూటీ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by riya sen (@riyasendv) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
తెరపైకి సిల్క్ స్మిత జీవితం
అలనాటి గ్లామరస్ తార సిల్క్ స్మిత జీవితం ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’గా వెండితెరపైకి రానుంది. సిల్క్ స్మితలా చంద్రికా రవి నటించనున్నారు. వి. మహాస్త్రీ అమృతరాజ్ సమర్పణలో జయరామ్ దర్శకత్వంలో ఎస్బీ విజయ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. శనివారం (డిసెంబరు 2) సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. 1980, 1990వ దశకాల్లో గ్లామరస్ తారగా వెలుగొందారామె. స్మిత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’ని ప్రపంచానికి చెప్పనున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సిల్క్ స్మిత మరో బయోపిక్.. హీరోయిన్ ఎవరంటే..?
సిల్క్ స్మిత.. సినీ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయే పేరు ఇది. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రుతలూగించింది. చనిపోయి పాతికేళ్లు దాటినా..ఇప్పటికే సిల్క్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే ఈ శృంగార తారపై బాలీవుడ్లో డర్టీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. తాజాగా మరో సిల్క్ జీవితం ఆధారంగా మరో చిత్రం రాబోతుంది. చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోన ఈ చిత్రాన్ని జయరామ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. (చదవండి: ఊహించని పేరు, డబ్బు.. చివరి క్షణాల్లో నరకం.. ‘ఐటమ్ గర్ల్’ విషాద గాథ) సిల్క్ స్మిత- ది అన్‌టోల్డ్ స్టోరీ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం(డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకొని ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో చంద్రిక..అచ్చం స్మితలా కనిపించింది. ఎవరీ రవి చంద్రికా! భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్, నటి చంద్రికా రవి. ‘చీకటి గదిలో చితకొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో 'మా మనోభావాలు దెబ్బ తిన్నాయి'పాటకు బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. సిల్క్ పాత్రలో రవి చంద్రికా ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్లో డర్టీ పిక్చర్ వచ్చింది. అందులో స్మిత జీవితం మొత్తాన్ని చూపించారు. అంతకు మించి ఈ చిత్రంలో కొత్తగా ఏం చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi)