

సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా 'సిల్క్ స్మిత - ది క్వీన్ ఆఫ్ సౌత్' సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.

సిల్క్ స్మితగా నటిస్తున్న ఈ 35 ఏళ్ల బ్యూటీ 'చంద్రికా రవి' ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చంద్రికా రవి ఆస్ట్రేలియాలో పుట్టినప్పటికీ భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు.

లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్‌లో కెరీర్ మొదలు పెట్టింది.

‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్ విభాగాలలో యూఎస్‌లో శిక్షణ తీసుకుంది.

భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి వాటిలో శిక్షణ తీసుకుంది.

వీరసింహారెడ్డి సినిమాలో 'మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి' అంటూ బాలకృష్ణతో ఆడిపాడింది.

యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది.

2012 మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా ఆస్ట్రేలియాలో ఫైనలిస్ట్‌గా నిలిచిన మొదటి భారతీయ సంతతి మహిళగా గుర్తింపు పొందింది.

అడల్ట్ కామెడీ హారర్ 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాలో ఆమె నటించింది. ఒక దెయ్యం పాత్రలో ఆమె మెప్పించింది.