biography movie
-
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్‌లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్‌లోని వెరావల్‌కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్‌ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్‌జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్‌కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
అడల్ట్ సినిమాతో మెప్పించిన 'చంద్రికా రవి' సిల్క్ స్మితగా వచ్చేస్తుంది (ఫోటోలు)
-
నా బిడ్డ పెళ్లికి వెళ్లనివ్వండి ప్లీజ్
దేశంలోనే దీర్ఘకాలంగా.. 28 ఏళ్లుగా.. జైల్లో ఉన్న మహిళా ఖైదీ నళిని ప్రస్తుతం కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెయిల్ ఇమ్మని అడుగుతోంది. కోర్టు ఆమె అభ్యర్థనపై విచారణను జూన్‌కి వాయిదా వెయ్యడంతో ఆమె ఇంకో రెండు నెలల పాటు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే నళిని పూర్తిగా విడుదల అయ్యేదెప్పుడు? రాజీవ్‌గాంధీ హత్య కేసులో పాతికేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కానీ రెండేళ్ల క్రితం ఆమె ఆత్మకథ మాత్రం విడుదలైంది. 500 పేజీల ఆ తమిళ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రచురణకర్తలు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఎదురు కావచ్చని మొదట అంతా అనుకున్నప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. పుస్తకాన్ని ఎండిఎంకె నేత వైకో ఆవిష్కరించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి హరిపరంథామన్ తొలి ప్రతిని అందుకున్నారు. నళిని జైల్లో ఉండడంతో ఆమె లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది.‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే అర్థం వచ్చే టైటిల్ ఉన్న ఈ తమిళ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత రాశారు.1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పటికి సరిగ్గా నెల ముందు ఎల్.టి.టి.ఇ. (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) తీవ్రవాది శ్రీహరన్ (మురుగన్)తో నళిని వివాహం అయింది. రాజీవ్ హత్యోదంతంలో అరెస్ట్ అయ్యేనాటికే నళిని గర్భవతి. విచారణ ఖైదీగా ఆమెను వెల్లూరులోని మహిళా జైల్లో ఉంచారు. ఇవాళ్టికే ఆమె ఆ జైల్లోనే ఉన్నారు.నళిని ఆత్మకథలో ఆమె బాల్యం, శ్రీహరన్‌తో ఆమె ప్రేమబంధం, రాజీవ్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షిగా ఆమె పరారీలో ఉండడం, అరెస్ట్ అవడం, కస్టడీలోకి వెళ్లడం, అక్కడ చిత్రహింసలకు గురికావడం, జైల్లోనే బిడ్డను ప్రసవించడం, దోషిగా నిర్ధారణ అవడం, జైలు శిక్షను అనుభవించడం వంటివన్నీ ఉన్నాయి. చివరిగా.. 2008 మార్చి 19న రాజీవ్ కుమార్తె ప్రియాంక, నళిని రహస్యంగా జైల్లో కలుసుకుని, ‘‘మీరు మా నాన్నను ఎందుకు చంపారు?! ఆయన ఎంతో మంచివారు కదా!’’ అని ఉద్వేగంగా అడగడం, ఆ తర్వాత 90 నిమిషాల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా.. నళిని ఆత్మకథలో ఉన్నాయి. పేరు పెట్టింది గాంధీజీ! నళిని తల్లి పద్మావతి. ఆమెకు పద్మావతి అని పెట్టింది మహాత్మాగాంధీ అని అంటారు. పద్మావతి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అనూహ్యంగా వారి జీవితాల్లోకి వచ్చాడు. అద్దె ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వారి పక్కనే చేరాడు. కొన్నాళ్లకు ‘ఒంటికన్ను’ శివరాసన్.. శ్రీహరన్ రూమ్మేట్ అయ్యాడు. కొద్ది రోజుల్లోనే వాళ్లతో ‘థను’ వచ్చి చేరింది. (రాజీవ్‌గాంధీని చంపడానికి మానవబాంబుగా మారింది ఈ ‘థను’నే). ఈ క్రమంలో శ్రీహరన్, నళిని ప్రేమలో పడ్డారు. రాజీవ్ హత్య తర్వాత నిందితులందరితో పాటూ ఈ దంపతులూ అరెస్ట్ అయ్యారు. ‘‘రక్తాన్ని దాహంగొన్న తేడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’అని హత్య తర్వాత నళిని కోర్టులో తన వాదన వినిపించారు. అయినా శిక్ష తప్పలేదు. తర్వాత్తర్వాత సోనియా గాంధీ క్షమాభిక్షతో ఉరిశిక్షను తప్పించుకుని, యావజ్జీవ శిక్షను అమె అనుభవిస్తున్నారు.నళిని చెన్నైలో పుట్టారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించేనాటికి ఆమె ఒక ప్రేవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. అంత పెద్ద ఆత్మకథను రాసుకున్న నళిని ఇప్పటికీ ఒక ప్రశ్న వేధిస్తోంది. ఆ రోజు ప్రియాంక పనిగట్టుకుని తననెందుకు కలిశారో ఆమె అంతుబట్టడం లేదట! ఈ అనుమానాన్ని కూడా ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారు. నళిని కూతురు హరిత ప్రస్తుతం యు.కె.లోని ఓ యూనివర్శిటీలో చదువుతోందన్నంత వరకే ప్రపంచానికి తెలుసు. నాలుగేళ్ల క్రితం హరిత జీమెయిల్ చాట్‌లో ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ.. తన తల్లిని, తండ్రిని విడిపించమనీ, జైలు జీవితం నుంచి వారికి విముక్తి కల్పించమని రాజీవ్ కుటుంబాన్ని, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.ఆమె అభ్యర్థకు ఇంతవరకు మన్నింపు దొరకలేదు. నళిని ఎప్పటికి విడుదలవుతుందో తెలియదు!లండన్‌లో ఉంటున్న తన కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలలు బెయిలు మంజూరు చెయ్యాలని ఇటీవల నళిని తన లాయర్ ద్వారా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ కేసును జూన్ 11కు వాయిదా వేస్తూ, ఈలోపు అత్యవసరం అయితే నళిని ‘వేసవి సెలవుల కోర్టులో’ తన వాదనను వినిపించుకోవచ్చని సూచించింది. నళిని కూతురు హరిత అలియాస్ మెగ్రా లండన్‌లోని అమ్మమ్మగారి ఇంట్లో ఉంటోంది. -
మన్మోహన్ సినిమాపై దుమారం
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రాజకీయంగా దుమారం రేపుతోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ‘ ఒక కుటుంబం పదేళ్ల పాటు దేశాన్ని తన గుప్పిట్లో ఎలా ఉంచుకుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించడంతో వివాదం రాజు కుంది. 2004–08 మధ్య మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. మన్మోహన్ రాజప్రతినిధా?: బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి మన్మోహన్ ఒత్తిడి ఎదుర్కొంటున్న దృశ్యాలను ప్రచార చిత్రంలో చూపడం కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై విమర్శలు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు విస్తృతంగా వ్యాపించాయి. ‘ఒక కుటుంబం ఏకంగా పదేళ్ల పాటు దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే సినిమా ఇది. వారసుడు సిద్ధమయ్యే వరకు ఆ కుటుంబం డా.సింగ్‌ను రాజ ప్రతినిధిగా పీఎం కుర్చీపై కూర్చోపెట్టిందా? యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ చూడండి’ అని బీజేపీ తన అధికార ట్విట్టర్లో పేర్కొంది. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ‘ ఇప్పటి మొద్దు ప్రధాని(మోదీ)పై వాళ్లు(కాంగ్రెస్) సినిమా తీసేదాకా వేచి ఉండలేకపోతున్నా. యాక్సిడెంటల్ ప్రధాని కన్నా ఇన్సెసిటివ్ ప్రధాని ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు. ‘బీజేపీని చూస్తే జాలేస్తోంది. నాలుగన్నరేళ్లుగా మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమున్నతుడైన మన్మోహన్ సింగ్‌పై సినిమాను స్పాన్సర్ చేశారు. మీరు ఆ మేధావికి సరితూగలేరు. కనీసం ఆయన విలువల్ని పాటించడానికైనా ప్రయత్నించండి‘ అని రాహుల్ సోదరి ప్రియాంక ట్వీట్ చేశారు. సృజన ప్రయత్నాన్నే చూడండి: ఖేర్ ఈ సినిమాను సృజనాత్మక కోణంలో చేసిన ప్రయత్నంగా చూడాలి తప్ప, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా భావించొద్దని అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ చిత్రం తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనగా నిలిచిపోతుందని తెలిపారు. మన్మోహన్ పాత్ర పోషణ తనకు పెద్ద సవాలుగా మారిందని, దీనికోసం ఆరు నెలలు శ్రమించానని అన్నారు. మన్మోహన్ హావభావాలు, ముఖ్యంగా ఆయన గొంతు అనుకరించడానికి చాలా కష్టపడ్డానని, అందుకోసం ఆయనకు సంబంధించిన వీడియోల్ని గంటల కొద్దీ చూశానని తెలిపారు. -
తెరకెక్కుతున్న తారల జీవితాలు
ఇద్దరు ప్రముఖ కథానాయికల జీవితాల ఆధారంగా హిందీలో రెండు సంచలన చిత్రాలు రూపొందనున్నాయి. ఒకటేమో-ఒకప్పటి అగ్రకథానాయిక సుచిత్రాసేన్ జీవిత కథ కాగా, మరొకటి - బాలీవుడ్ నంబర్‌వన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా లైఫ్ స్టోరీ.సుచిత్రా సేన్ హిందీలో ఎంత పాపులరో, బెంగాలీలో అంత కన్నా పాపులర్. ‘దేవదాస్’ లాంటి ఎన్నో కళాఖండాల్లో నటించిన సుచిత్ర ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా అందుకున్నారు. సినిమాలు నటించడం మానేశాక మూడు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన ఈ మహానటి మొన్న జనవరిలో కోల్‌కతాలో కన్ను మూశారు. ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో కూడిన ఆమె జీవితాన్ని తెరకెక్కించాలని అభిజిత్ చౌదురి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సుచిత్రాసేన్ను కలిసి చూచాయగా కథ కూడా వివరించారట. ఇప్పుడీ ఈ కథను ఆమె మనవరాలు రైమా సేన్‌తో తెరకెక్కిస్తున్నారు. రైమా సేన్ అంటే తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ధైర్యం’ చిత్రంలో కథానాయిక. నటి మూన్‌మూన్ సేన్ కూతురు. సుచిత్రాసేన్కి స్వయానా మనవరాలు. తెలుగులో ‘ధైర్యం’లో హీరోయిన్గా చేసిన అమ్మాయి. అమ్మమ్మ పాత్రను చేయడానికి రైమా తొలుత భయపడిందట. కానీ దర్శకుడు బలవంతంగా ఒప్పించారు. అందుకే రైమా తన అమ్మమ్మ నటించిన సినిమాలన్నీ చూస్తూ ఆ అభినయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హిందీ, బెంగాలీల్లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘నాయిక’ అని పేరు పెట్టారు. ఆగస్టు నుంచి షూటింగ్. ఇక ప్రియాంకా చోప్రా విషయానికొస్తే తను ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అందం కన్నా అభినయాన్నే నమ్ముకున్న ప్రియాంక జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. అవి ఆమె సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఆమెకు తొలి రోజుల ప్రియుడు అశీమ్ మర్చంట్, ప్రియాంక కథతో సినిమా నిర్మించనున్నారు. ‘67 రోజులు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పాత్రకు సాక్షి చౌదరిని ఎంపికచేశారు. ఈ సాక్షి తెలుగులో ఇటీవల ‘పోటు గాడు’ సినిమాలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రియాంక ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. చూద్దాం ఏమవుతుందో!