తెరపైకి సిల్క్‌ స్మిత జీవితం  | Chandrika Ravi to headline biopic Silk Smitha: The Untold Story | Sakshi
Sakshi News home page

తెరపైకి సిల్క్‌ స్మిత జీవితం 

Published Sun, Dec 3 2023 12:44 AM | Last Updated on Sun, Dec 3 2023 12:44 AM

Chandrika Ravi to headline biopic Silk Smitha: The Untold Story - Sakshi

అలనాటి గ్లామరస్‌ తార సిల్క్‌ స్మిత జీవితం ‘సిల్క్‌ స్మిత: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’గా వెండితెరపైకి రానుంది. సిల్క్‌ స్మితలా చంద్రికా రవి నటించనున్నారు. వి. మహాస్త్రీ అమృతరాజ్‌ సమర్పణలో జయరామ్‌ దర్శకత్వంలో ఎస్‌బీ విజయ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. శనివారం (డిసెంబరు 2) సిల్క్‌ స్మిత జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు.

‘‘సిల్క్‌ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. 1980, 1990వ దశకాల్లో గ్లామరస్‌ తారగా వెలుగొందారామె. స్మిత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ‘సిల్క్‌ స్మిత: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ని ప్రపంచానికి చెప్పనున్నాం. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement