
ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రిస్తుండగా టెర్రస్‌పై నుంచి కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బిలాస్‌పూర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ షూట్ చేసేందుకు టెర్రస్‌పైకి ఎక్కాడు. ఐతే వీడియో చిత్రీకరించే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థి టెర్రస్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని అశుతోష్ సోవోగా గుర్తించారు పోలీసులు. అతను తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రాం రీల్ చేయడానిక ప్లాన్ చేసినట్లు తెలిపారు.
ఐతే అశుతోష్ కాలేజ్ టెర్రస్ సరిహద్దు గోడను దూకి కిటికి స్లాబ్‌పైకి ఎక్కుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. అదే సమయంలో స్నేహితులు మొబైల్‌లో చిత్రికరిస్తుండటంలో మునిపోవడంతో.. ఈ అనుహ్య ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో అతన్ని రక్షించలేకపోయారని పోలీసులు తెలిపారు. మృతుడు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు మృతి చెందిన కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి రిస్క్‌లు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇంతకీ ఆ ఈ వీడియోలో వారు ఏం చెప్పాలనుకున్నారంటే..సావో అనే వ్యక్తి కిటికీ స్లాబ్‌పైకి దూకడం వీడియోలో కనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి దూకితే తిరిగి రాలేను అను చెబుతాడు. అప్పుడే అతని స్నేహితుడు నువ్వు రాగలవు అని చెబుతున్నట్లు వీడియోలో వినపడుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే పట్టు తప్పి అశుతోష్ కిందపడిపోయాడు. అతని స్నేహితులు అశుతోష్‌ని రక్షించలేకపోయారు. ఇలాంటి రిస్క్‌లతో కూడిన రీల్‌ని చిత్రీకరించేటప్పుడూ పలు జాగ్రత్తుల తీసుకోవడం ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment