కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
విశాఖపట్నం: ఏపీ రాష్ట్ర కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన కాపు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. పేరున్న శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు విద్యోన్నతి పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.8 వేల ఆర్థిక సహాయం అందిస్తారు.
ఇవీ అర్హతలు..
కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లో నివాసమున్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల అభ్యర్థులు మాత్రమే అర్హులు.
తూర్పు కాపు, గాజుల కాపు కులాలకు చెందినవారు అనర్హులు.
అభ్యర్థి కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి.
తెల్లరేషన్ కార్డు ఉన్నవారు అర్హులే.
ప్రభుత్వం నుంచి ఏ ఇతర పథకంలోనూ లబ్ధిదారు కాదని నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
దరఖాస్తులు ఇలా..
www.kapucorp.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 76619 96966, 73311 74448 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు.
అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలివీ..
సంబంధిత అధికారి ఇచ్చిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తుదారుని ఆధార్ కార్డు.
వయస్సు ధ్రువీకరణ పత్రం (ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ లేదా పంచాయతీ / మున్సిపాలిటీ / కార్పొరేషన్ నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం.
విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు
అభ్యర్థి పేరిట ఉన్న ఏదైన జాతీయ బ్యాంకు పాస్‌బుక్ ఖాతా వివరాలు.
పాస్‌పోర్టు సైజు ఫొటో
ఆర్థిక సహాయం ఇలా..
ఎంపికైన అభ్యర్థి శిక్షణ సంస్థకు చెల్లించాల్సిన ఫీజు మొత్తం కార్పొరేషనే భరిస్తుంది.
శిక్షణకు ఎంపికైన అభ్యర్థికి పుస్తకాలు, స్టేషనరీ, వసతి, భోజన సౌకర్యం నిమిత్తం రూ.8 వేలు ఇస్తారు.
శిక్షణ పూర్తయిన తరువాత అభ్యర్థి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. అయితే అభ్యర్థి 90 శాతం హాజరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీనికోసం ఆయా శిక్షణ సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తారు.
ఎంపిక ఇలా..
ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు.
ఎస్సై పోస్టులకు 800 మందికి, కానిస్టేబుల్ పోస్టులకు 2,500 మందికి కాపు కార్పొరేషన్ ప్యానల్‌లోని శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ ఇస్తారు.
కార్పొరేషన్ ప్యానల్‌లో ఉన్న శిక్షణ సంస్థల జాబితా నుంచి అభ్యర్థి తనకు నచ్చిన సంస్థను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను కార్పొరేషన్ ముందుగా పరిశీ లిస్తుంది.
పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ
Published Wed, Sep 28 2016 10:05 AM | Last Updated on Thu, Mar 28 2019 5:35 PM
Advertisement