సాక్షి, హైదరాబాద్: కేంద్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఐఏఎస్ పరీక్ష ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్‌ఏ షుకూర్ తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మే 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరో ఆరు కేంద్రాల్లో మే 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జూలై 16, 17 తేదీల్లో ముంబైలోని కేంద్ర హజ్ కమిటీ మౌఖిక పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 5 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
ఐఏఎస్‌కు ఉచిత శిక్షణ
Published Thu, Apr 28 2016 4:46 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement
Advertisement