నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ | free training at BC study circle | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ

Published Thu, Aug 4 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

free training at BC study circle

సిద్దిపేట జోన్‌: ఎస్‌ఐ అర్హత సాధించిన యువతకు మెయిన్స్ కోసం శుక్రవారం నుంచి సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్‌ కె.రాములు తెలిపారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ పాసై, ఈవెంట్స్‌లో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. సంబంధిత విద్యార్థులు ఒర్జినల్‌ సర్టిఫికెట్లతో శుక్రవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్‌ టౌన్‌ హాల్‌నందు హాజరుకావాలని  సూచించారు.

అనుభవం కలిగిన నిపుణులచే శిక్షణ ఇప్పించి ఎస్‌ఐలుగా ఎంపికయ్యేందుకు స్టడీ సర్కిల్‌ దోహదపడుతుందన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి, ఉచిత స్టడీ మెటీరియల్‌ను కూడా అందిస్తామన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 80080 09970 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement