యోగాలో ఏకాగ్రత అవసరం
ఆరిలోవ: యోగా చేస్తున్నవారిలో తప్పనిసరిగా ఏకాగ్రత అవసరమని ఏయూ సైకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎం.వి.ఆర్ రాజు తెలిపారు. ఆరిలోవ పారతం చినగదిలి నార్త్ షిరిడి సాయిబాబాల ఆలయంలో 14 రోజుల పాటు జరుగుతున్న ఉచిత యోగా శిక్షణ శిబిరంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడారు. యోగా శరీరానికి అవసరమన్నారు. దానివల్ల ఆరోగ్యం కుదుటపడుతుందన్నారు. ప్రతి ఒక్కరిలోను పోజిటివ్ ఆలోచన ఉండాలన్నారు.