ఆర్ట్
కళాకారులు మనదైన ఆత్మను కళ ద్వారా జీవం పోస్తారు. ఆ కళను నలుగురికి పరిచయం చేయడమే కాకుండా దానిని ఉపాధి వనరుగా మార్చి మరికొంత మందికి చేయూతగా నిలుస్తున్నారు డాక్టర్ ముప్పిడి రాంబాబు.
హైదరాబాద్ రాయదుర్గంలో ఉంటున్న ఈ కళాకారుడు ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆరేళ్లుగా మహిళలకు, యువతకు జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని మహిళలకు శిక్షణ ఇస్తున్న సందర్భంగా భారతీయ కళను జ్యూట్ బ్యాగుల మీదకు ఏ విధంగా తీసుకువస్తున్నారో తెలియజేశారు.
‘‘జ్యూట్ బ్యాగుల తయారీ సాధారణమే కదా అనుకుంటారు. కానీ, ఇండియన్ ఆర్ట్ మోటిఫ్స్ కలంకారీ, చేర్యాల, వర్లీ, గోండు, పటచిత్ర, మధుబని... డిజైన్స్‌ను ఉపయోగిస్తూ, స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా జ్యూట్ మీదకు తీసుకువస్తున్నాం. దీని ద్వారా జ్యూట్‌కి కొత్త కళ వస్తుంది. అలాగే, మొన్నటి ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని రైతు పొలం పనులకు వెళ్లే డిజైన్‌ని తీసుకువచ్చాను. ఈ కళ ద్వారా పర్యావరణ హితం, మనదైన ఆత్మను పరిచయం చేస్తున్నాం.
ఉపాధికి మార్గం
కరీంనగర్, ఏలూరు, జంగారెడ్డి గూడెం, పార్వతీ పురం, బొబ్బలి.. మొదలైన ప్రాంతాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వచ్చాను. నేషనల్ జ్యూట్ బోర్డ్ వాళ్లునన్ను సర్టిఫైడ్ డిజైనర్‌గా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ స్కిల్ క్రాఫ్ట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రస్తుతం మన్యం జిల్లా పార్వతీపురంలో 24 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో బ్యాగుల తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పటికే బ్యాగుల తయారీ నేర్చుకున్నవారు, సొంతంగా ఉపాధి మార్గాలను పొందుతున్నారు. ఈ స్కిల్ ప్రోగ్రామ్‌లో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నవారు ఉన్నారు. బ్యాగులే కాకుండా పాదరక్షలు, లెదర్ బ్యాగులు, వైర్లతో చెయిర్లు, ఇతర యాక్సెసరీస్ తయారుచేస్తుంటాను. వీటితో కంప్యూటర్ ఆధారిత త్రీడీ సాఫ్ట్‌వేర్ డిజైన్లు కూడా ΄్లాన్ చేస్తుంటాను.
కళాకారులను కలిసి...
మా ఊరు పశ్చిమగోదావరి దగ్గరిలోని జంగారెడ్డి గూడెం. సినిమా నటుల బ్యానర్లను సృజనాత్మకంగా తయారు చేసి, అందించిన కుటుంబం మాది. నాకున్న పెయింటింగ్ ఆసక్తిని మా అన్నయ్య శ్రీనిసవాసరావు గుర్తించాడు. దీంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన పూర్తి దృష్టి పెట్టాను. ముంబయ్ నిప్ట్ నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ చేశాను. స్కూల్ చదువు నుంచి డాక్టరేట్ చేసేవరకు మా అన్నయ్యప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్‌డిఐలో ఉద్యోగం చేస్తున్నాను. సాంకేతికంగానూ భారతీయ కళను క్రాఫ్ట్ తయారీలో ఎలా మేళవించవచ్చో పరిశోధన, ్రపాక్టీస్ చేస్తుంటాను.
రాబోయే తరాల కోసం క్రాఫ్ట్స్‌ని డిజిటలైజేషన్ చేసే పనిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హస్తకళాకారులను నేరుగా కలుసుకొని చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని అందుకున్నాను. నా పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో మన కళ, కళాకారుల ప్రత్యేకతను తెలియ జేయడం అదృష్టంగా భావిస్తాను. ఏటి కొ΄్పాక కొయ్యబొమ్మల కళాకారులతో కలిసి, బొమ్మల తయారీ నేర్చుకున్నాను. నేను తయారు చేసిన కొయ్య బొమ్మలకు డిజైన్లకు, పేపర్ బాస్కెట్ డిజైన్స్‌కి పేటెంట్ హక్కులు ΄పొందాను. కళను భవిష్యత్తు తరాలు గుర్తించేలా మరింత సృజనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని.. దీని ద్వారా యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాను’ అని చె΄్పారు రాంబాబు.
ఈ కళాకారుడు తన పనిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలని కోరుకుందాం.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment