jute bags
-
International Plastic Bag Free Day అందమైన డిజైన్లు, ఆకృతుల్లో ముద్దొచ్చే బ్యాగ్స్ ఇవే!
ఇంటి నుంచి మార్కెట్‌కు, షాపింగ్, ఆఫీసు ఇలా ఏ పనిమీద వెళ్లినా చేతి సంచిలేనిదే పని జరగదు. పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా సరుకులు ఏది తేవాలన్నా ఉండాల్సిందే.కానీ గత కొన్ని దశాబ్దాలుగా చేతి సంచి తీసుకెళ్లే పని లేకుండా చవకగా దొరికే ప్లాస్టిక్ బ్యాగులకు అలవాడి పడి పోయాం. ఈ అలవాటే ప్రకృతికి, పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ వర్థాలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందుకే జూలై 3వ తేదీన అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ప్లాస్టిక్ సంచుల ప్లేస్‌లో పర్యావరణ అనుకూల, బయో-డిగ్రేడబుల్ , కాల్చినా కూడా ఎలాంటి విషపూరిత పొగలు లేదా వాయువులను విడుదల చేయని ప్రత్యామ్నాయ బ్యాగులపై ఓ లుక్కేద్దాం.ప్లాస్టిక్ బ్యాగ్‌లు అత్యంత తక్కువ ఖర్చులో, అనుకూలంగా లభించేవే అయినప్పటి అవి మన పర్యావరణానికి చాలా చేటు చేస్తున్నాయి. అందులోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాకులు పర్యావరణానికి తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం.ప్లాస్టిక్ సంచులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలువివిధ రంగులు డిజైన్లలో లభించే కాగితపు సంచులను వాడదాంరీసైకిల్ చేయడానికి సులభమైనవి కాగితం సంచులుసహజమైన ఫైబర్‌తో తయారయ్యే జనపనార సంచులుప్లాస్టిక్ బ్యాగ్‌లకు మరో చక్కటి ప్రత్యామ్నాయం క్లాత్ బ్యాగ్‌లు మస్లిన్ నుండి డెనిమ్ వరకు పాత బట్టలతో చక్కటి బ్యాగులను తయారు చేసుకోవచ్చు ఎకో-ఫ్రెండ్లీ, డబ్బు ఆదా కూడా స్టైలిష్ ఆఫీస్ బ్యాగ్‌ల నుండి సాధారణ కిరాణా సంచుల వరకుకాన్వాస్తో తయారైన టోట్ బ్యాగ్స్ బెస్ట్ ఆప్షన్అందమైన డిజైన్లతో ఆకట్టుకునే వెదురు సంచులు, మన్నుతాయి కూడా -
Rambabu Muppidi: జ్యూట్ బ్యాగులపైన భారతీయ కళ
కళాకారులు మనదైన ఆత్మను కళ ద్వారా జీవం పోస్తారు. ఆ కళను నలుగురికి పరిచయం చేయడమే కాకుండా దానిని ఉపాధి వనరుగా మార్చి మరికొంత మందికి చేయూతగా నిలుస్తున్నారు డాక్టర్ ముప్పిడి రాంబాబు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉంటున్న ఈ కళాకారుడు ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరేళ్లుగా మహిళలకు, యువతకు జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని మహిళలకు శిక్షణ ఇస్తున్న సందర్భంగా భారతీయ కళను జ్యూట్ బ్యాగుల మీదకు ఏ విధంగా తీసుకువస్తున్నారో తెలియజేశారు.‘‘జ్యూట్ బ్యాగుల తయారీ సాధారణమే కదా అనుకుంటారు. కానీ, ఇండియన్ ఆర్ట్ మోటిఫ్స్ కలంకారీ, చేర్యాల, వర్లీ, గోండు, పటచిత్ర, మధుబని... డిజైన్స్‌ను ఉపయోగిస్తూ, స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా జ్యూట్ మీదకు తీసుకువస్తున్నాం. దీని ద్వారా జ్యూట్కి కొత్త కళ వస్తుంది. అలాగే, మొన్నటి ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని రైతు పొలం పనులకు వెళ్లే డిజైన్ని తీసుకువచ్చాను. ఈ కళ ద్వారా పర్యావరణ హితం, మనదైన ఆత్మను పరిచయం చేస్తున్నాం.ఉపాధికి మార్గంకరీంనగర్, ఏలూరు, జంగారెడ్డి గూడెం, పార్వతీ పురం, బొబ్బలి.. మొదలైన ప్రాంతాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వచ్చాను. నేషనల్ జ్యూట్ బోర్డ్ వాళ్లునన్ను సర్టిఫైడ్ డిజైనర్‌గా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ స్కిల్ క్రాఫ్ట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రస్తుతం మన్యం జిల్లా పార్వతీపురంలో 24 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో బ్యాగుల తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పటికే బ్యాగుల తయారీ నేర్చుకున్నవారు, సొంతంగా ఉపాధి మార్గాలను పొందుతున్నారు. ఈ స్కిల్ ప్రోగ్రామ్‌లో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నవారు ఉన్నారు. బ్యాగులే కాకుండా పాదరక్షలు, లెదర్ బ్యాగులు, వైర్లతో చెయిర్లు, ఇతర యాక్సెసరీస్ తయారుచేస్తుంటాను. వీటితో కంప్యూటర్ ఆధారిత త్రీడీ సాఫ్ట్వేర్ డిజైన్లు కూడా ΄్లాన్ చేస్తుంటాను.కళాకారులను కలిసి...మా ఊరు పశ్చిమగోదావరి దగ్గరిలోని జంగారెడ్డి గూడెం. సినిమా నటుల బ్యానర్లను సృజనాత్మకంగా తయారు చేసి, అందించిన కుటుంబం మాది. నాకున్న పెయింటింగ్ ఆసక్తిని మా అన్నయ్య శ్రీనిసవాసరావు గుర్తించాడు. దీంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన పూర్తి దృష్టి పెట్టాను. ముంబయ్ నిప్ట్ నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ చేశాను. స్కూల్ చదువు నుంచి డాక్టరేట్ చేసేవరకు మా అన్నయ్యప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్‌డిఐలో ఉద్యోగం చేస్తున్నాను. సాంకేతికంగానూ భారతీయ కళను క్రాఫ్ట్ తయారీలో ఎలా మేళవించవచ్చో పరిశోధన, ్రపాక్టీస్ చేస్తుంటాను. రాబోయే తరాల కోసం క్రాఫ్ట్స్‌ని డిజిటలైజేషన్ చేసే పనిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హస్తకళాకారులను నేరుగా కలుసుకొని చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని అందుకున్నాను. నా పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో మన కళ, కళాకారుల ప్రత్యేకతను తెలియ జేయడం అదృష్టంగా భావిస్తాను. ఏటి కొ΄్పాక కొయ్యబొమ్మల కళాకారులతో కలిసి, బొమ్మల తయారీ నేర్చుకున్నాను. నేను తయారు చేసిన కొయ్య బొమ్మలకు డిజైన్లకు, పేపర్ బాస్కెట్ డిజైన్స్‌కి పేటెంట్ హక్కులు ΄పొందాను. కళను భవిష్యత్తు తరాలు గుర్తించేలా మరింత సృజనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని.. దీని ద్వారా యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాను’ అని చె΄్పారు రాంబాబు. ఈ కళాకారుడు తన పనిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
జనపనార రైతులకు కేంద్రం శుభవార్త..!
జనపనార రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2022-23 సీజన్‌కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫారసుల ఆధారంగా క్వింటాకు రూ.250 పెంచుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23 సీజన్లో ముడి జనపనార(టీడీఎన్3 గ్రేడ్‌కు సమానమైన టీడీఎన్3) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.4,750గా నిర్ణయించారు. దీని వల్ల కనీస మద్దతు ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్వింటాకు రూ.250 పెరగనుంది. 2018-19 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎమ్ఎస్పీని అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు స్థాయిలో నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా కొత్త ఎమ్ఎస్పీని ప్రకటించింది. "దీని వల్ల లాభ శాతం కనీసం 50 శాతం పెరుగుతుంది. జనపనార రైతులకు మెరుగైన లాభదాయకమైన రాబడిని అందించడానికి, నాణ్యమైన జనపనార ఫైబరును ప్రోత్సహించడానికి ఇది ముఖ్యమైన నిర్ణయం" అని ప్రభుత్వం తెలిపింది. (చదవండి: గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. భారీ జరిమానా కట్టాల్సిందే!) -
గోనె సంచుల కొరత తీరేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల అవసరం భారీగా పెరుగుతోంది. అటు రైతుల నుంచి ధాన్యం సేకరణ, ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి ఏటా 27 కోట్లకు పైగా గోనె సంచులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో జనుము సాగు లేకపోవడం, గోనె సంచుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో వీటి కొనుగోలుకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని జనపనార పరిశ్రమలు తెలంగాణలో 80 శాతానికి పైగా గోనె సంచుల అవసరాలను తీరుస్తున్నాయి. జనుము సాగుకు పేరొందిన పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో జనపనార దిగుబడి తగ్గినా, అక్కడి పరిశ్రమల్లో సమస్యలు ఏర్పడినా ధాన్యం కొనుగోలు సమయంలో తెలంగాణ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనుము సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం కలిగేలా చూడటంతో పాటు, రైతులు పండించే జనపనారను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో జనపనార పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జనపనార పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో ఇటీవల కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.887 కోట్లతో మూడు జనపనార పరిశ్రమలు... దేశవ్యాప్తంగా సుమారు 140కి పైగా జనపనార పరిశ్రమలు ఉండగా, తెలంగాణలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా 38 వేలకు పైగా హెక్టార్లలో జనుము పంట సాగవుతుండగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనపనార ఉత్పత్తుల రంగంలో స్వయం స్వావలంబన సాధించేందుకు తొలి దశలో జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెలలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ఇటీవల పరిశ్రమల శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.887 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ మూడు పరిశ్రమల ద్వారా 10,448 మందికి ప్రత్యక్ష ఉపాధి, రెండింతల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. జనపనార పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు. ఆయా యూనిట్లు తయారు చేసే గోనె సంచులను రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది. తమకు అవసరమైన ముడి జనపనార కోసం రైతులు జనుము సాగు చేసేలా ఈ కంపెనీలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. 15 కోట్ల సంచుల ఉత్పత్తి సామర్థ్ద్యం... రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్న మూడు పరిశ్రమలు ఏటా సుమారు 15 కోట్ల గోనె సంచులను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటికి అవసరమైన జనపనారను బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి రవాణా చేసేందుకు అయ్యే మొత్తాన్ని మొదటి ఏడాది వంద శాతం, మరో రెండేళ్లు 50 శాతం, ఆ తర్వాత ఐదేళ్లు 25శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అదే విధంగా కంపెనీలు తయారుచేసే గోనె సంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వంద శాతం తిరిగి కొనుగోలు చేస్తుంది. ‘రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా పెంపొందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే జనపనార పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని జనపనార కంపెనీలు పెట్టుబడులతో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – ‘సాక్షి’తో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ -
జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్యామ్‌ల నిర్వహణకు ఆమోదం రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు. -
ఎమ్మెల్యే ఆర్కే వినూత్న ఆలోచన
సాక్షి, మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మంగళగిరి మిద్దె సెంటర్లో ఉచితంగా జ్యూట్ చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిని ప్లాస్టిక్ రహిత మంగళగిరిగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ సంచుల వాడకం మానేసి.. జ్యూట్ సంచులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అంతా కృషి చేయాలన్నారు. ఆదివారం నుంచి మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఒక జ్యూట్ చేతి సంచిని అందజేస్తామని ఆర్కే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోడుమూరులో జపనార బ్యాగుల తయారీ కేంద్రం
కోడుమూరు రూరల్: కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక సహకారంతో కోడుమూరులో జనపనార బ్యాగుల తయారీ కేంద్రం మంజూరైందని జాతీయ జనపనార బోర్డు కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. కోడుమూరులో మంగళవారం మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25మందికి 40రోజుల పాటు బ్యాగుల తయారీపై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలో పాల్గొనదలచిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం బ్యాగుల తయారీకి అవసరమయ్యే కుటీర పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా అవసరమైన లింకేజీ రుణాల సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సదస్సులో మాజీ సర్పంచ్ కేఈ.రాంబాబు, సీపీఎం రాజు, మల్లేష్, కృష్ణ, నీలంకృష్ణ, ఏకాంబరం, వెంకటేష్ తదితరులుపాల్గొన్నారు. -
జ్యూట్ బ్యాగులకు మార్కెటింగ్ సదుపాయం
– కలెక్టర్ విజయమోహన్ కర్నూలు (అగ్రికల్చర్): జూట్ బ్యాగులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మహిళా సంఘాలతో నిర్వహించినస మావేశంలో ఆయన మాట్లాడారు. జ్యూట్ బ్యాగుల తయారీ ద్వారా కర్నూలులో 1000 మంది మహిళలు ఉపాధి లభిస్తోందన్నారు. మహిళలందరూ సంఘటితంగా ఉండాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లను తెప్పిస్తామని తెలిపారు. రకరకాల బ్యాగుల తయారీలో మరింత బాగా రాణించేందుకు శిక్షణలు ఇప్పిస్తామన్నారు. బ్యాంకు రుణాలను కూడా మంజూరు చేయిస్తామని వివరించారు. డ్వాక్రా బజారుకు ప్రత్యేకంగా గదిని కేటాయిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో మెప్మా పీడీ రామాంజనేయులు, కర్నూలు నగరపాలక సంస్థ కమిసనర్ రవీంద్రబాబు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్‌రెడ్డి, అపిట్కో మేనేజర్ మోహన్‌రాజు, బ్రమరాంబ జూట్ ఫెడరేషన్ అధ్యక్షురాలు చంద్రిక, ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, ట్రెజరర్ సుశీల తదితరులు పాల్గొన్నారు.