జ్యూట్ బ్యాగులకు మార్కెటింగ్ సదుపాయం
Published Wed, Dec 28 2016 10:31 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– కలెక్టర్ విజయమోహన్
కర్నూలు (అగ్రికల్చర్): జూట్ బ్యాగులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మహిళా సంఘాలతో నిర్వహించినస మావేశంలో ఆయన మాట్లాడారు. జ్యూట్ బ్యాగుల తయారీ ద్వారా కర్నూలులో 1000 మంది మహిళలు ఉపాధి లభిస్తోందన్నారు. మహిళలందరూ సంఘటితంగా ఉండాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లను తెప్పిస్తామని తెలిపారు. రకరకాల బ్యాగుల తయారీలో మరింత బాగా రాణించేందుకు శిక్షణలు ఇప్పిస్తామన్నారు. బ్యాంకు రుణాలను కూడా మంజూరు చేయిస్తామని వివరించారు. డ్వాక్రా బజారుకు ప్రత్యేకంగా గదిని కేటాయిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో మెప్మా పీడీ రామాంజనేయులు, కర్నూలు నగరపాలక సంస్థ కమిసనర్ రవీంద్రబాబు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్‌రెడ్డి, అపిట్‌కో మేనేజర్ మోహన్‌రాజు, బ్రమరాంబ జూట్ ఫెడరేషన్ అధ్యక్షురాలు చంద్రిక, ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, ట్రెజరర్ సుశీల తదితరులు పాల్గొన్నారు.
Advertisement