ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఎంసెట్-3 పరీక్షకు ఉచిత శిక్షణ | Free training for EAMCET -3 to SC-STstudents | Sakshi
Sakshi News home page

ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఎంసెట్-3 పరీక్షకు ఉచిత శిక్షణ

Published Sun, Jul 31 2016 7:03 PM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

Free training for EAMCET -3 to SC-STstudents

ఎంసెట్-3 పరీక్ష కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఒక నెల రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌలిదొడ్డిలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవనంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఏసీ క్లాసు రూమ్స్‌లో నిష్టాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంసెట్-3 పరీక్ష వ్రాసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 99123 48111, 96661 22333లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement