ST students
-
ఎస్టీ విద్యార్థులకు వర్చువల్ విద్య
సాక్షి, అమరావతి: గత ఏడాది కాలంగా ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం వల్ల మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు చదువులో వెనుకబడి పోకూడదు అన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అన్ని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో వర్చువల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా 10వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో పాఠాలు బోధించే కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 190 గిరిజన సంక్షేమ గురుకుల స్కూళ్లు ఉండగా అందులో 81 స్కూళ్లను హాస్టళ్ల నుంచి కన్వర్ట్ చేశారు. వీటిలో మూడు నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులు ఉంటారు. ఇవి మినహా మిగిలిన అన్ని గిరిజన సంక్షేమ స్కూళ్లలో విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేందుకు వీలుగా వర్చువల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఏదైనా ఒక స్కూలు నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వర్చువల్ క్లాసు చెబుతుంటే ఆ క్లాసును రాష్ట్రంలోని అన్ని గిరిజన గురుకుల స్కూళ్లలోని విద్యార్థులు వినే అవకాశం కల్పించారు. ప్రధానంగా 10వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రతిరోజు వర్చువల్ క్లాసులు జరుగుతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులతో కూడా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్లాసులు చెప్పిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతిలో గిరిజన గురుకుల విద్యార్థులు 3,399 మంది ఉన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,713 మంది, రెండో సంవత్సరంలో 5,217 మంది చదువుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రధానంగా మ్యాథమ్యాటిక్స్, ఇంగ్లిష్, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం సబ్జెక్టులపై ప్రత్యేకంగా వర్చువల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి.. హాస్టల్ కన్వర్టెడ్ రెసిడెన్సియల్స్ కాకుండా మిగిలిన అన్ని స్కూళ్లలోనూ వర్చువల్ క్లాసు రూములు ఏర్పాటు చేశాం. వర్చువల్ క్లాసుల నిర్వహణను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థులు కూడా సమగ్రంగా అర్థం చేసుకుని తోటి విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. – గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి కె శ్రీకాంత్ ప్రభాకర్ -
సీబీఎస్ఈ ఫీజు 24 రెట్లు పెంపు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ, 12వ తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు అంటే ప్రస్తుతమున్న రూ.50 నుంచి అమాంతం రూ.1,200కు పెంచింది. అదేవిధంగా జనరల్ కేటగిరీ విద్యార్థుల ఫీజును రూ.750 నుంచి రూ.1,500గా నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ గత వారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలు కావడంతో పాత రుసుము చెల్లించిన విద్యార్థులు పెంచిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పెంచిన ప్రకారం ఫీజును గడువులోగా చెల్లించని విద్యార్థులను 2019–20 వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని తెలిపింది. తాజా విధానం ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ.1,200 చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.350 మాత్రమే. జనరల్ కేటగిరీ వారికి ఇప్పటి వరకు ఉన్న ఫీజు రూ.750ను రూ.1,500కు పెంచింది. ఈ విధానం 10, 12వ తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది. 12వ తరగతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అదనంగా ఒక సబ్జెక్టు పరీక్ష రాయాలంటే గతంలో ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఇకపై వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా అదనపు సబ్జెక్టు కోసం రూ.150 బదులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 100 శాతం అంధ విద్యార్థులకు మాత్రం సీబీఎస్ఈ పరీక్ష రుసుమును మినహాయించింది. మైగ్రేషన్ ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350కి పెంచింది. -
ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఎంసెట్-3 పరీక్షకు ఉచిత శిక్షణ
ఎంసెట్-3 పరీక్ష కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఒక నెల రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌలిదొడ్డిలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవనంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఏసీ క్లాసు రూమ్స్‌లో నిష్టాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంసెట్-3 పరీక్ష వ్రాసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 99123 48111, 96661 22333లలో సంప్రదించవచ్చు. -
గిరిపుత్రుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం!
♦ పెద్దసంఖ్యలో బయటపడుతున్న థలసేమియా, సికిల్‌సెల్ కేసులు ♦ ఎస్టీ విద్యార్థులకు రక్తపరీక్షల నిర్వహణలో అధికారుల అలసత్వం సాక్షి, హైదరాబాద్ : ఏజెన్సీల్లో గిరిపుత్రులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన పిల్లల్లో ప్రాణాంతకమైన థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. పరిమితంగా నిర్వహించిన పరీక్షల్లోనే అనేక పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరుల (ఐటీడీఏల) పరిధిలో 27,856 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే మొత్తం 1,889 మంది ఈ వ్యాధుల బారిన పడినట్లు తేలింది. ఇందులో 992 మందికి థలసేమియా, 753 మందికి సికిల్‌సెల్ అనీమియా, 144 మందికి రెండూ ఉన్నట్లుగా బయటపడింది. అధికారుల నిర్లక్ష్యం... ఎస్టీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రక్తపరీక్షలను నిర్వహించి, మ్యాపింగ్ చేయాల్సిన జిల్లాల్లోని అధికారయంత్రాంగం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. సికిల్‌సెల్ అనీమియా, థలసేమియాలకు సంబంధించి గత ఏడాది చివరలోగా రాష్ర్టంలోని అన్ని ఎస్టీ విద్యాసంస్థల్లో రక్తపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయగా, వాటిని కూడా సక్రమంగా ఖర్చు చేస్తున్న దాఖ లాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా కేవలం 28 వేల లోపే పరీక్షలు నిర్వహించారు. వాటిలో కూడా గణనీయంగా ఈ కేసులు వెలుగు చూశాయి. ఎస్టీ విద్యార్థులందరికీ హెల్త్మ్యాపింగ్ చేసి, మలేరియాతో పాటు థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ గతంలోనే సూచించినా రాష్ర్ట అధికారయంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇవీ సమస్యలు ... రక్తహీనత జబ్బు ‘థలసేమియా’లో రక్త కణాల పునరాభివృద్ధి జరగదు. ఎప్పటికప్పుడు ఎర్రరక్త కణాలు క్షీణిస్తుండడంతో వారికి క్రమం తప్పకుండా రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కొత్త రక్తం ఎక్కించడం వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పుడూ మందులు వాడాల్సి ఉంటుంది. మూలకణ (బోన్‌మారో) చికిత్స ద్వారానే ఈ వ్యాధిని నివారించే అవకాశముంటుంది. సికిల్‌సెల్ అనీమియా కేసుల్లో గుండ్రటి ఆకారంలో ఉండాల్సిన ఎర్రరక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారడంతో రక్తనాళాల ద్వారా శరీరంలో ప్రయాణించడం కష్టంగా మారుతుంది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. తద్వారా ఆయా శరీరభాగాలకు ఆక్సిజన్ అందదు. ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణం ఆయుఃప్రమాణం 125 రోజులు కాగా, సికిల్‌సెల్ ఆయుప్రమాణం కేవలం 20 రోజులే. త్వరగా నశించిపోయే రక్తకణాలకు దీటుగా ఎముకల్లోని మూలుగు (బోన్‌మారో) కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు. దీనితో రోగి రక్తహీనత బారిన పడి చనిపోతాడు. -
అత్యధికుల గమ్యస్థానం అమెరికానే!
‘అంబేడ్కర్ ఓవర్సీస్’ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్లిన 268 మంది ఎస్సీ విద్యార్థుల్లో 241 మంది, 72 మంది ఎస్టీ విద్యార్థుల్లో 60 మందికిపైగా అమెరికాలోని కోర్సులను, అందులోనూ ఎక్కువ ఇంజనీరింగ్‌లో ఎమ్మెస్ను ఎంచుకున్నారు. షెడ్యూల్డ్కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి రూపంలో ఉన్నతవిద్యా స్పప్నం ఫలిస్తోంది. 2013-14లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రూ.10 లక్షల మేర ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న ఆర్థిక సహాయం సరిపోవడంలేదు. దీంతో అప్పు చేస్తే తప్ప కోర్సులు పూర్తి చేసే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని బీసీ విద్యార్థులకు కూడా వర్తింపచేసి రూ.10 లక్షల మేర విదేశాల్లో ఉన్నతవిద్యకు సహాయాన్ని అందించాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఈ మేరకు బీసీ సంక్షే మ శాఖ రూ.50 కోట్లకు ప్రతిపాదనలను సమర్పించినా బడ్జెట్ మాత్రం కేటాయించలేదు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 268 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.26.80 కోట్ల మేర ప్రభుత్వం కేటాయించింది. -
గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సంస్థ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ పి.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 24 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2003, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలని, బీసీ, ఓసీ విద్యార్థులైతే 2005, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 31 మధ్య పుట్టినవారై ఉండాలన్నారు. 2015-16 ఏడాదిలో తప్పనిసరిగా 4వ తరగతి చదివి ఉం డాలన్నారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థులైతే రూ.2 లక్షలు మించి ఉండరాదని, సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి వర్తించదన్నారు. ఆసక్తిగల విద్యార్థినీ,విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు ఆన్లైన్లో రూ.50 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 98665 59678 నంబర్లో సంప్రదించవచ్చు. -
'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు'
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ ఆరోపించారు. ఉన్నత విద్యాలయాల్లో యాజమాన్యం కోటా సీట్లను 50 శాతానికి పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రీ మెడికల్ కాలేజీల్లో 1500 సీట్లు మేనేజ్మెంట్లకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కిన చంద్రబాబు సర్కార్ రైతాంగాన్ని మోసం చేస్తోందని శైలజానాథ్ ధ్వజమెత్తారు. అనంతపురంలో యువరైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు'
-
అందని ఆర్థిక దీవెన
మూలనపడిన రాజీవ్ విద్యాదీవెన, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలు విద్యాహక్కు చట్టప్రకారం ఈ పథకాలు ప్రారంభం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక ఆసరా ఇవ్వడమే లక్ష్యం వేల మంది దరఖాస్తుదారులకు నిరీక్షణే మిగులు ఒకే ఒక్క ఎస్సీ విద్యార్థికి నగదు జమ వీరఘట్టం: దళితవర్గాల విద్యార్థుల్లో డ్రాపౌట్లను తగ్గించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యా దీవెన, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలు పూర్తిగా మూలన పడ్డాయి. ఈ పథకాల కింద జిల్లాలో ఒకే ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూర్చారు. విద్యాహక్కు చట్టం ప్రకారం సర్కారు విద్యను బలోపేతం చేసి, అన్ని వర్గాల వారికి విద్యావకాశాలు కల్పించాల్సి ఉంది. అందులో భాగంగా దళిత(ఎస్సీ, ఎస్టీ) వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇవ్వడం ద్వారా చదువుకొనే అవకాశం కల్పించడానికి ఈ పథకాలు ప్రవేశపెట్టారు. రాజీవ్ విద్యా దీవెన ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు ఏడాదికి రూ.2250, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా 5 నుంచి 8 తరగతులకు చెందిన బాలికలకు రూ.1500, బాలురకు రూ.1000 చొప్పున స్కాలర్‌షిప్పు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతవరకు జిల్లాలో ఒక్క గిరిజన విద్యార్థికి కూడా ఈ పథకాలు అందలేదు. ఆధార్ కార్డులు అనుసంధానం కాకపోవడం, ఆన్లైన్లో నమోదు కాకపోవడం వంటి కారణాలను అధికారులు చూపుతున్నా మొత్తం మీద విద్యార్థులకు మాత్రం నిరాశే మిగులుతోంది. ఎస్టీ విభాగంలో... రాజీవ్ విద్యాదీవెన కోసం ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా 1528 మంది ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 340 మంది పేర్లను ప్రతిపాదించారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా నగదు అందలేదు. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 452 మంది గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులేవీ ఇంతవరకు ఆన్‌లైన్‌కు నోచుకోలేదు. ఎస్సీ విభాగంలో..... రాజీవ్ విద్యా దీవెనకు 3662 మంది ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 3005 దరఖాస్తులను ఆన్లైన్ చేయగా 2651 మందికి స్కాలర్షిప్లు మంజూరయ్యాయి. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 5680 మంది దరఖాస్తు చేసుకోగా 4819 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. వీరిలో 1671 మందికి స్కాలర్షిప్లు మంజూరయ్యాయి. కానీ ఒక్క విద్యార్థికి మాత్రమే రూ.1000 స్కాలర్షిప్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. మిగిలిన వారంతా స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. -
కరువైన ‘విద్యా దీవెన’
ఒంగోలు సెంట్రల్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు...వారు మధ్యలోనే బడి మానేయకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ విద్యాదీవెన పథకం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ పథకం కింద ఉపకార వేతనాలు పొందేందుకు 2013-14 విద్యా సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు, ఈ విద్యా సంవత్సరం సగం గడిచిపోయినా..ఇంత వరకు ఉపకార వేతనాలు అందించలేదు. కొత్తగా ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాలనుకున్న విద్యార్థులకూ బ్యాంకర్లు, మీసేవ కేంద్రాలతో సమస్యలు ఎదురవుతున్నాయి. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాలో 3,500 మంది విద్యార్థులు ఈ పథకం కింద ఆన్లైన్లో నమోదు చేసుకోగా..1500 మందికి మాత్రమే ఉపకార వేతనాలు మంజూరు చేశారు. మిగిలిన వారికి అవసరమైన నిధులు రూ.35 లక్షలు లేకపోవడంతో ఆపేశారు. వారికి ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థులకు కలిపి ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో 9, 10 తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డేస్కాలర్లకు నెలకు రూ.150, హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.350 చొప్పున ఉపకార వేతనాలు అందిస్తారు. అవి కాకుండా పుస్తకాల కొనుగోలుకు డేస్కాలర్లకు రూ.750, హాస్టల్ విద్యార్థులకు వెయ్యి రూపాయలు ఇస్తారు. అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌కార్డు నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, మీసేవా కేంద్రం నుంచి పొందిన ఆదాయ, కులధ్రువీకరణ పత్రంతో పాటు విద్యార్థి చదివే పాఠశాల హెచ్ఎం అందించే బోనఫైడ్ సర్టిఫికెట్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా 1700 పాఠశాలల్లో 13 వేల మందికిపైగా ఎస్సీ విద్యార్థులున్నారు. వీరిలో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈనెల 15వ తేదీ వరకు గడువు విధించారు. దరఖాస్తులు చాలా స్వల్పంగా రావడంతో మరో 15 రోజులు అంటే ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయినా జిల్లాలో ఇప్పటి వరకు 2,400 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మీ సేవ కేంద్రాలతో ఇక్కట్లు: విద్యార్థులందరికీ బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించినా..బ్యాంకర్లు మాత్రం రూ.500 బ్యాలెన్స్‌తో అయితేనే ఖాతా తెరుస్తామంటున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బ్యాంకు ఖాతా ఉంటే ఆ ఖాతాని జాయింట్ అకౌంట్‌గా మార్చుకుని విద్యార్థి పేరును ఆ అకౌంట్లో చేర్చవచ్చు. కానీ ఈ విషయాల్ని అధికారులు వారికి తెలియజేయడం లేదు. ఆన్లైన్ సౌకర్యం ఉన్న బ్యాంకుల్లోనే ఖాతాలు తెరవాల్సి రావడంతో..గ్రామీణ ప్రాంతాల్లో అవి అందుబాటులో లేక దూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో ఖాతాలు తెరవాల్సి వస్తోంది. ఎలాగో నగదు సమకూర్చుకుని బ్యాంకుల వద్దకెళ్లినా వారు ఆ పత్రాలు లేవు, ఈ పత్రాలు లేవంటూ విద్యార్థులను తిప్పుకుంటున్నారు. ఆధార్‌కార్డు లేని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇంకా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రా లు మీ సేవా కేంద్రాల నుంచే తేవాల్సి ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల కోసం 10 నుంచి 15 రోజుల గడువు విధిస్తుండటంతో నూతన విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఈనెల 30 వరకు గడువుంది..కే సరస్వతి, డీడీ విద్యాదీవెన పథకం కింద ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నెల 30 వరకూ గడువు పొడిగించింది. విద్యార్థులకు జన్‌ధన్ యోజన కింద ఖాతాలు తెరవాలని బ్యాంక్‌లకు ఈపాటికే ఆదేశాలు అందాయి. -
ఎస్.కోట ఎస్టీ హస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత
విజయనగరం జిల్లా ఎస్.కోటలోని గిరిజన వసతి గృహంలోని ఐదుగురు విద్యార్థినులు మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆ విద్యార్థులను అధికారులు హుటాహుటిన విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోటి విద్యార్థినులకు అస్వస్థత గురి అవటం పట్ల విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో పెట్టే భోజనం సరిగ్గా ఉండటం లేదని వారు ఆరోపించారు. అలాగే సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవని విద్యార్థినులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వసతి గృహంలోని విద్యార్థినులు మంగళవారం ఉదయం అల్పాహారాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వసతి గృహం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ ఆందోళనలో దాదాపు 140 మంది విద్యార్థునులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకూ ఇక ఎస్ఎస్ఏ యూనిఫాంలే
సాక్షి, ముంబై: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం యూనిఫారాలను అందజేయదు. వీరికి కూడా సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) పథకం ద్వారానే యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూనిఫారాలు అందజేయబోమని అందులో స్పష్టం చే సింది. అందుకుగల కారణాలను సంబంధిత అధికారి ఒకరు వివరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం నిధులు వృథా అవుతున్నాయని, పథకం అమలులో చోటుచేసుకుంటున్న అవకతవకలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పా రు. సర్వశిక్షా అభియాన్ ఎస్సీ, ఎస్టీలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు యూనిఫారాల కోసం నిధులను 2010 నుంచే అందజేస్తోందని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయిస్తున్నాయని, దీంతో మరో పథకం ద్వారా ప్రత్యేకించి యూనిఫారాల కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం లేకుండా ఎస్ఎస్ఏ ద్వారానే ఎస్సీ, ఎస్టీలకు యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించిందన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్-2009 ప్రకారం ఎస్ఎస్ఏ ఏర్పాటైంది. దీనిలోభాగంగా ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫారాల కోసం రూ.400 అందజేస్తారు. ఇక నుంచి ఈ పద్ధతినే ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేయనున్నారు. పెదవి విరుస్తున్న ప్రధానోపాధ్యాయులు... ఎస్ఎస్ఏలో భాగంగా యూనిఫారాల కోసం ఇస్తున్న రూ.400 ఎటూ సరిపోవడంలేదని జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ఒక జత యూనిఫారానికి రూ. 200 ఇవ్వడంవల్ల నాసిరకం దస్తులతోనే విద్యార్థులు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. యూనిఫారాల డబ్బులు కూడా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయడం ద్వారా అవి సద్వినియోగం అయ్యే అవకాశం లేదని, నేరుగా దుస్తులు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ పథకమే బాగుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర పాఠశాల ఉపాధ్యాయుల అసోసియేషన్ అధికారి అనిల్ బోర్నారే వ్యక్తం చేశారు. -
విదేశీ విద్యకు స్పందన ఏదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎస్సీ, ఎస్టీ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకానికి స్పందన కరువైంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. పథకంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ పథకానికి తొలి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 22 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా.. జిల్లా నుంచి కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పైచదువుల కోసం ఏటా సగటున 250 మందికిపైగా విదేశాలకు పరుగులు పెడుతున్నట్లు అంచనా. అయితే సర్కారు ప్రవేశపెట్టిన కొత్త పథకానికి స్పందన అత్యంత స్వల్పంగా ఉందంటే పథకంప్రచారం ఎలా ఉందో తెలుస్తోంది. నలుగురంటే నలుగురే..! అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద జిల్లా వ్యాప్తంగా కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్సీ సంక్షేమ శాఖకు ముగ్గురు విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖకు మరో విద్యార్థి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా నలుగురు విద్యార్థుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హతలను బట్టి వారిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే హైదరాబాద్ జిల్లాలో ఎస్టీ కేటగిరీ నుంచి ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.