ఎస్.కోట ఎస్టీ హస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత | Five students of schedule tribe Hostel hospitalised in srungavarapukota | Sakshi
Sakshi News home page

ఎస్.కోట ఎస్టీ హస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

Published Tue, Nov 12 2013 10:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM

Five students of schedule tribe Hostel hospitalised in srungavarapukota

విజయనగరం జిల్లా ఎస్.కోటలోని గిరిజన వసతి గృహంలోని ఐదుగురు విద్యార్థినులు మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆ విద్యార్థులను అధికారులు హుటాహుటిన విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోటి విద్యార్థినులకు అస్వస్థత గురి అవటం పట్ల విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

వసతి గృహంలో పెట్టే భోజనం సరిగ్గా ఉండటం లేదని వారు ఆరోపించారు. అలాగే సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవని విద్యార్థినులు మండిపడ్డారు.  ఈ నేపథ్యంలో వసతి గృహంలోని విద్యార్థినులు మంగళవారం ఉదయం అల్పాహారాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వసతి గృహం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ ఆందోళనలో దాదాపు 140 మంది విద్యార్థునులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement