'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు' | shailajanath slams chandrababu over medical seats | Sakshi
Sakshi News home page

'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు'

Published Sat, Jul 4 2015 1:14 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు' - Sakshi

'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు'

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ ఆరోపించారు. ఉన్నత విద్యాలయాల్లో యాజమాన్యం కోటా సీట్లను 50 శాతానికి పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు.

హైదరాబాద్లోని ఇందిరాభవన్లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రీ మెడికల్ కాలేజీల్లో 1500 సీట్లు మేనేజ్మెంట్లకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కిన చంద్రబాబు సర్కార్ రైతాంగాన్ని మోసం చేస్తోందని శైలజానాథ్ ధ్వజమెత్తారు. అనంతపురంలో యువరైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement