shailajanath
-
‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’
సాక్షి, కడప: గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించే ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలతో కలిసి మైసూరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని 7 ప్రాజెక్ట్‌లకు నీటిని తరలించాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మైసూరా రెడ్డి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలన్న అంశంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. -
భట్టిని ఆశీర్వదించండి : శైలజానాథ్
సాక్షి, ఎర్రుపాలెం: మధిర నియోజరవ్గాన్ని అభివృద్ధి చేసిన మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఉమ్మడి ఏపీ మాజీ విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ కోరారు. సోమవారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే డిప్యూటీ స్పీకర్‌గా మల్లు భట్టి విక్రమార్క ఉన్నప్పుడే ఎస్సీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించినట్లు చెప్పారు. బలమైన నేతగా గుర్తింపున్న భట్టిని ఈ నియోజవర్గ ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో కాంగ్రెస్, టీడీపీల మండల కమిటీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, దోమందుల సామేలు, బండారు నర్సింహారావు, బొగ్గుల శ్రీనివాసరెడ్డి,శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీను,వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి,షేక్ జానీబాషా, తదితరులున్నారు. మరిన్ని వార్తాలు... -
'చంద్రబాబుకు కమీషన్లు వస్తే చాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ సాధించుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల కాదని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని,ఆ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందని ఆయన అన్నారు. బుధవారమిక్కడ ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కావలసింది కమీషన్లని, అందుకోసమే ఆయన ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారని శైలజానాధ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు. వారి ప్రాణం. నిరుద్యోగ సమస్య పరిష్కారనికి అదొక్కటే మార్గం. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు రాజీ పడ్డారని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ వైఖరులకు వ్యతిరేకిస్తూ గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేబడుతున్నట్టు ఆయన చెప్పారు. అన్ని జిల్లాల కేంద్రాల్లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన మౌన దీక్షలను చేపడుతున్నట్టు ప్రకటించారు. -
'ఆయన అలా మాట్లాడటం సరికాదు'
హైదరాబాద్: జవహార్‌లాల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడటం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. గురువారం శైలజానాథ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశం కోసం బీజేపీ పెద్దలు చేసిన త్యాగాలేంటి అని శైలజానాథ్ ప్రశ్నించారు. -
'టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఉచిత ఇసుక'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలజానాథ్ శుక్రవారం మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి సొమ్ము లావాదేవీలను నిర్వహించేందుకే మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన చేపడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ఉచితమంటోందని శైలజానాథ్ ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత భూముల్లో దొరికిన ఎర్రచందనం దుంగలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనితీరు బాగోలేదని సర్వేలే చెబుతున్నాయని శైలజానాథ్ గుర్తు చేశారు. -
'కాంగ్రెస్‌లోనే ఉంటాను'
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ స్పష్టం చేశారు. అధికారంకోసం నిస్సిగ్గుగా పార్టీలు మారనని చెప్పారు. మోదీ సర్కార్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దళితులను అవమాన పరిచిన నేతలే కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్నారని చెప్పారు. -
'హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైన ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రలను చేపడతాననడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. చైతన్య యాత్రల కంటే ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలను అమలు చేయాలని శైలజానాథ్ సూచించారు. -
'ప్రత్యేక హోదా కోసం కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం'
హైదరాబాద్ : నెలాఖరు వరకు కోటి ఎస్ఎంఎస్ లు పంపే ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. 23న విశాఖలో ఎస్ఎంఎస్ లు పంపే ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందిరాభవన్ లో ఏపీలోని 13 జిల్లాల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ లీడర్లతో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శైలాజానాథ్ ఈ విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులకు ఎస్ఎంఎస్లు పంపుతామని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఎస్ఎంఎస్ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి విద్యార్ధిలోకం సహకరించాలంటూ శైలజానాథ్ పిలుపునిచ్చారు. -
'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు'
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ ఆరోపించారు. ఉన్నత విద్యాలయాల్లో యాజమాన్యం కోటా సీట్లను 50 శాతానికి పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రీ మెడికల్ కాలేజీల్లో 1500 సీట్లు మేనేజ్మెంట్లకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కిన చంద్రబాబు సర్కార్ రైతాంగాన్ని మోసం చేస్తోందని శైలజానాథ్ ధ్వజమెత్తారు. అనంతపురంలో యువరైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
'ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు'
-
ఆ మోసం చేసింది మీరు కాదా ?
-
చంద్రబాబు రైతు వ్యతిరేకి: శైలజానాథ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ అని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం అన్ని అంక్షలు విధిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తికి చంద్రబాబుకు చిత్తశుద్దిలేదన్నారు. పోలవరం నుంచి హంద్రీనీవాకు నికర జలాల్ని కేటాయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరికి మళ్లీ..
-
జీ హుజూర్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని మంత్రిగా చివరి క్షణం వరకూ శైలజానాథ్ అమలు చేశారా..? మాజీ మంత్రి శైలజానాథ్‌కు అధికారులు సాగిలపడ్డారా..? రూ.20 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో మంత్రి అస్మదీయులకు కట్టబెట్టారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. అధికారవర్గాలు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున పర్సంటేజీలు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఓ సీనియర్ ప్రజాప్రతినిధి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. శింగనమల నియోజకవర్గంలో తన అనుచరగణాన్ని కాపాడుకోవడానికి మాజీ మంత్రి శైలజానాథ్ పడరాని పాట్లు పడుతున్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించే కొత్త పార్టీలో చేరే దిశగా సాగుతోన్న ఆయన.. తన అనుచరులనూ అదే పార్టీలోకి తీసుకెళ్లడానికి పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే అస్మదీయులకు భారీ ఎత్తున పనులు కట్టబెట్టేందుకు ముందస్తుగానే వ్యూహం రచించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శింగనమల నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) కింద రూ.6 కోట్లు, గ్రామీణ సిమెంటు రోడ్లు(సీఆర్ఆర్) పథకం కింద మరో రూ.5 కోట్లు, పంచాయతీకి రూ.ఐదు లక్షల చొప్పున నియోజకవర్గంలోని 116 పంచాయతీలకూ రూ.5.80 కోట్లు మంజూరు అయ్యాయి. వీటితోపాటూ బీఆర్జీఎఫ్(వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి), సాధారణ నిధులు తదితర పథకాల కింద రూ.20 కోట్లతో శింగనమల నియోజకవర్గంలోని 116 పంచాయతీల పరిధిలో అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.రెండు లక్షల్లోపు విలువైన పనిని ఈఈ స్థాయి అధికారి.. రూ.5 లక్షల్లోపు విలువైన పనిని ఎస్ఈ స్థాయి అధికారి నామినేషన్‌పై కట్టబెట్టవచ్చునని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు కేవలం యుద్ధప్రాతిపదికన(కరువు, వరదలు వంటి ఉత్పాతాలు ఉత్పన్నమైనప్పుడు మాత్రమే) చేయాల్సిన పనులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ.. ఆ ఉత్తర్వులకు అధికారులు నీళ్లొదిలారు. కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా ఉన్న పంచాయతీలకు పనులను మార్చాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో.. మంత్రికి సాగిలపడిన అధికారులు.. ఆ మేరకు ప్రతిపాదనలను మార్చి సరి కొత్త ప్రతిపాదనలను ప్రతిపాదించారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల విలువైన పనులను శైలజానాథ్ అనుచరులైన ఐదారుగురికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. చివరి రోజున ఉత్తర్వులు జారీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి చేసిన రాజీనామాను శుక్రవారం గవర్నర్ ఆమోదించడంతో మంత్రిమండలి రద్దయింది. శైలజానాథ్ మాజీ మంత్రిగా మారిపోయారు. కాసేపట్లో సీఎం రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారనే సమాచారం అందుకున్న మంత్రి.. వివిధ శాఖల అధికారులను శుక్రవారం ఉదయం తన ఇంటికి రప్పించుకున్నట్లు సమాచారం. రూ.20 కోట్ల విలువైన పనులను తన అనుచరులకు కట్టబెడుతూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేయించినట్లు కాంగ్రెస్ వర్గాలు.. అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున పర్శంటేజీలు చేతులు మారినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై పంచాయతీరాజ్ ఎస్ఈ రవికుమార్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. శుక్రవారం ఉదయం శైలజానాథ్ ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. నామినేషన్ పనులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. -
చేతివాటం
సాక్షి, అనంతపురం : సాగుకు ఏ మాత్రం యోగ్యంగా లేని భూములకు పట్టాలు ఇస్తూ అటు అధికార పార్టీ నేతలు.. ఇటు రెవెన్యూ సిబ్బంది ఎవరికి వారు అందినకాడికి దోచుకుంటున్నారు. అర్హులకు మొండి చేయి చూపుతూ జేబులు నింపుకుంటున్నారు. మంత్రి శైలజానాథ్ పేరు చెప్పి ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిరుపేదలకు చుక్కలు చూపిస్తున్నాడు. పట్టా.. పట్టాకు ఓ రేటు కట్టి హల్చల్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. భూ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఓట్ల రూపంలో మలుచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. దాన్ని అదునుగా తీసుకున్న కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భూమి లేని నిరుపేదలకు పట్టాలు ఇస్తామని చెబుతూనే.. వాటిని పంపిణీ చేసే ముందు రానున్న ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేస్తామని లబ్ధిదారుల నుంచి ప్రమాణం చేయించుకునే నీచ సంస్కృతికి తెరలేపారు. ఈ క్రమంలో శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలానికి చెందిన ఓ ఉద్యోగి తాను మంత్రి శైలజానాథ్‌కు క్లాస్‌మేట్‌నంటూ ప్రచారం చేసుకుని ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఏడవ విడత భూ పంపిణీలో అర్హులైన లబ్ధిదారులను పక్కకు పెట్టి కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన జాబితాకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో అర్హులైన నిరుపేదలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకునేందుకు అటు నాయకులు.. ఇటు అధికారులు కలిసి చాలా మందికి సెంట్లలోనే భూమిని ఇచ్చారు. గుట్టల్లో పట్టాలు బుక్కరాయసముద్రం మండలంలోని పది గ్రామాల్లో 137 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఏడో విడత భూ పంపిణీలో పట్టాలు ఇచ్చారు. అయితే అందులో సగానికి సగం బండరాళ్లు ఉన్న గుట్టలే కావడం గమనార్హం. ఇలాంటి చోట్ల పట్టాలు మంజూరు చేసి అధికారులు మాత్రం లబ్ధిపొందారు. ఒక్కో పట్టాదారుడి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు బలవంతంగా వసూలు చేసినట్లు తెలిసింది. అయితే డబ్బులు ఇవ్వని వారికి మాత్రం తమ తడాఖా చూపిస్తున్నారు. డబ్బులిస్తే గానీ పాసు పుస్తకాలు ఇవ్వమని తెగేసి చెబుతుండడంతో కొందరు లబ్ధిదారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఒక ఉద్యోగి ‘ఎవ్వరికైనా ఫిర్యాదు చేసుకోండి.. మా మీద చర్యలు తీసుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నేను మినిష్టర్ శైలజానాథ్ క్లాస్‌మేట్‌ను. నేనేం చేసినా ఎవ్వరూ.... ఏం చేయలేరు’ అంటూ బహిరంగంగా చెబుతున్నాడు. ఫలితంగా తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. సాగుకు పనికి రాని భూములకు పట్టాలు ఇచ్చారని, వాటికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని మరికొందరు లబ్ధిదారులు ప్రశ్నిస్తే రెవెన్యూ సిబ్బంది విచిత్రమైన సమాధానాలు చెబుతున్నారు. ‘ పంపిణీ చేస్తున్న పట్టాలను తీసుకుని బ్యాంకుకు వెళ్లి క్రాప్ లోన్లు తెచ్చుకోండి’ అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. సెంట్లలో భూ పంపిణీ భూ పంపిణీలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేసే సాగు భూమి ఎకరాల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడి అధికారులు మాత్రం సెంట్లలో భూమిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బుక్కరాయసముద్రం మండలంలోని దండువారిపల్లిలో పార్వతమ్మ పేరుతో 70 సెంట్లు, టీ.లక్ష్మికి 50 సెంట్లు, టి.కామాక్షికి 88, శకుంతలమ్మకు 38, కుళ్లాయప్పకు 57 సెంట్లు పంపిణీ చేశారు. రెడ్డిపల్లిలో స్వాతి పేరుతో 60 సెంట్లు, అంకె తులసి పేరిట 71, సరస్వతి పేరిట 60, పుల్లమ్మ, జయమ్మ పేరిట 20, సునీత పేరిట 50 సెంట్లకు పట్టాలు ఇచ్చారు. రోటరీపురంలో చంద్రమ్మకు 67 సెంట్లు, సిద్దరాంపురంలో సరోజమ్మ పేరిట 65, జంతులూరులో పెద్దక్కకు 48, వెంకటలక్ష్మికి 50, సి.నాగమ్మకు 44, షేక్ మాబున్నీ పేరిట 40, ల క్ష్మిదేవి పేరిట 40 సెంట్లు, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన బి.సరస్వతమ్మకు 52, వెంకటలక్ష్మికి 87 సెంట్లకు మాత్రమే పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా 1.50 ఎకరం నుంచి 2 ఎకరాల్లోపు మాత్రమే పట్టాలు ఇచ్చారు. -
పెద్దయ్యవార్లేరీ?
సాక్షి, అనంతపురం : రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ పరిధిలోని సలకంచెరువు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు(హెచ్ఎం) చెండ్రాయుడు శింగనమల ఇన్చార్జ్ ఎంఈఓగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈయన వారంలో రెండు రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. 325 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో 64 మంది పదో తరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు కరువయ్యారు. దిశానిర్దేశం చేయాల్సిన హెచ్ ఎం... అదనపు బాధ్యతలతో ఎక్కువగా శింగనమలకే పరిమితమవుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యాబోధన గతి తప్పుతోంది. యాడికి మండలం చందన జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కె.చిన్నపెద్దయ్య ఆ మండల ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారంలో ఒక్కరోజు మాత్రమే.. అదీ ఓ అరగంట చుట్టపు చూపుగా పాఠశాలకు వెళ్తుంటారు. ఈ పాఠశాలలో 168 మంది విద్యార్థులున్నారు. వీరిలో 33 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరికి గణితం సబ్జెక్టును చిన్నపెద్దయ్యే బోధించాల్సి ఉంది. ఆయన అటువైపు వెళ్లకపోవడంతో మరో టీచర్ ఆ బాధ్యత తీసుకున్నారు. దీనికితోడు పాఠశాల నిర్వహణ కూడా గాడి తప్పుతోంది. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల జెడ్పీ హైస్కూల్ హెడ్మిసెస్ బి.యామినిబాల ఇన్చార్జ్ ఎంఈఓగానూ వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో నివసిస్తున్న ఆమె గార్లదిన్నెకు వెళ్లి అదనపు బాధ్యతలు చూసుకోవడానికే సమయం సరిపోతోంది. దీంతో పాఠశాలకు అప్పుడప్పుడు మాత్రమే వెళ్లి వస్తుంటారు. పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మొత్తం 151 మంది విద్యార్థులుండగా.. 42 మంది పదో తరగతి చదువుతున్నారు. హెచ్ఎం పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. హెచ్ఎం బోధించాల్సిన సోషియల్ సబ్జెక్టును మరో ఉపాధ్యాయిని అదనంగా చెప్పాల్సి వస్తోంది. పై మూడు పాఠశాలల్లోనే కాదు.. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి. ఇన్చార్జ్ ఎంఈఓలుగా వ్యవహరిస్తున్న హెచ్ఎంలు పాఠశాలలపై దృష్టి సారించడం లేదు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఇప్పటికైనా వారు పాఠశాలల వైపు చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,900 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 545 ఉన్నత పాఠశాలలు. వీటిలో 4.10 లక్షల మంది చదువుతున్నారు. ఒక్క పదో తరగతిలోనే 50 వేలకు పైగా ఉన్నారు. జిల్లాలోని 63 మండలాలకు గాను 14 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన 49 మండలాలకు సీనియర్ హెచ్ఎంలను ఇన్చార్జ్ ఎంఈఓలుగా ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్) హోదాలో నియమించారు. దీన్ని సాకుగా చూపి పలువురు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. నెలల తరబడిపాఠశాలలకు వెళ్లని దాఖలాలూ ఉన్నాయి. మండల విద్యాశాఖ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. సమీక్షలు, తనిఖీలు, సమాచార పంపిణీ...ఇలా బోలెడు సాకులు చెబుతూ పాఠశాలలను మరచిపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయ వేతనాల బిల్లులపై సంతకాలు చేయడానికి మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారు. అదే సందర్భంలో హాజరు పట్టికలో సంతకాలు చేసి వస్తున్నారు. దీనివల్ల ఆయా పాఠశాలల్లో నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తి కావస్తున్నా పూర్తి స్థాయిలో పుస్తకాలు, యూనిఫాం అందలేదు. నిధులకు లెక్కలు కూడా సక్రమంగా ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంచితే.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులు సజావుగా సాగాలంటే హెచ్ఎంలు అందుబాటులో ఉండాలి. నిత్యం ఉపాధ్యాయులతో మమేకమై విద్యార్థులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం 49 హైస్కూళ్లలో ఆ పరిస్థితి లేదు. దీంతో పదో తరగతి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. పాఠశాలలో గంటైనా గడపాలి ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు చూస్తున్న హెచ్ఎంలు ప్రతి రోజూ తప్పనిసరిగా వారి పాఠశాలలకు వెళ్లాలి. కనీసం గంట సేపైనా గడపాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పదో తరగతి ఉత్తీర్ణత ఏ మాత్రం తగ్గినా.. వారిదే బాధ్యత. మరీ అంత బిజీగా ఉంటే రోజుమార్చి రోజైనా వెళ్లాలి. లేదంటే చర్యలు తీసుకుంటాం. -మధుసూదన్‌రావు, జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ), అనంతపురం