
మాట్లాడుతున్న మాజీ మంత్రి శైలజానాథ్
సాక్షి, ఎర్రుపాలెం: మధిర నియోజరవ్గాన్ని అభివృద్ధి చేసిన మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఉమ్మడి ఏపీ మాజీ విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ కోరారు. సోమవారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే డిప్యూటీ స్పీకర్‌గా మల్లు భట్టి విక్రమార్క ఉన్నప్పుడే ఎస్సీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించినట్లు చెప్పారు. బలమైన నేతగా గుర్తింపున్న భట్టిని ఈ నియోజవర్గ ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో కాంగ్రెస్, టీడీపీల మండల కమిటీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, దోమందుల సామేలు, బండారు నర్సింహారావు, బొగ్గుల శ్రీనివాసరెడ్డి,శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీను,వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి,షేక్ జానీబాషా, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment