TPCC Working President Mallu Bhatti Vikramarka
-
భట్టిని ఆశీర్వదించండి : శైలజానాథ్
సాక్షి, ఎర్రుపాలెం: మధిర నియోజరవ్గాన్ని అభివృద్ధి చేసిన మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఉమ్మడి ఏపీ మాజీ విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ కోరారు. సోమవారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే డిప్యూటీ స్పీకర్‌గా మల్లు భట్టి విక్రమార్క ఉన్నప్పుడే ఎస్సీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించినట్లు చెప్పారు. బలమైన నేతగా గుర్తింపున్న భట్టిని ఈ నియోజవర్గ ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో కాంగ్రెస్, టీడీపీల మండల కమిటీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, దోమందుల సామేలు, బండారు నర్సింహారావు, బొగ్గుల శ్రీనివాసరెడ్డి,శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీను,వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి,షేక్ జానీబాషా, తదితరులున్నారు. మరిన్ని వార్తాలు... -
కలెక్టర్ల స్థానంలో వారే ఉంటారేమో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా? లేక టీఆర్ఎస్ పార్టీనా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు జరిగినా.. ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యహారాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో జరగాలని.. కానీ పార్టీ నిర్వహించకూడదని భట్టి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన పంచాయతీలను ప్రోటోకాల్ పాటించకుండా టీఆర్ఎస్ నాయకులు ప్రాంభించారని భట్టి అన్నారు. తన నియోజకవర్గంలోని కొత్త పంచాయతీ భవనాన్ని రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ప్రారంభించడమెంటని ప్రశ్నించారు. స్థానిక నాయకులు, అధికారులు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన కార్యక్రమం ఇలా ప్రోటోకాల్ లేని వ్యక్తులు నిర్వహించడాన్ని విమర్శించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీడీవోని బదిలీ చేయడం దుర్మార్గ చర్యగా భట్టి పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలన ఇలాగే సాగితే.. జిల్లాల్లో కలెక్టర్ల స్థానాల్లో టీఆర్ఎస్ అధ్యక్షులే పాలన చేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇది దుర్మార్గ పాలన: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం : మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రంలో భారీ కుంభకోణాలకు టీఆర్ఎస్ సర్కార్ పాల్పడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఈ పథకాలేవీ నడవనీయకుండా చేసి కృత్రిమంగా నీటి ఎద్దడి పరిస్థితులను సృష్టిస్తున్నాయని భట్టి నిప్పులు చెరిగారు. సీపీడబ్ల్యూడీ పథకాలను నిర్వీర్యం చేసి మిషన్ భగీరథ లేకపోతే.. రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేదనే పరిస్థితులను తయారు చేస్తున్నారని అన్నారు. గత మూడేళ్లుగా.. ఈ సీపీడబ్ల్యూడీ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని, విద్యుత్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిపేసిందని భట్టి తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.30 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టి.. ఎవరినీ పనిచేయనీకుండా ప్రభుత్వం చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేస్తూ.. వీటికి మాత్రం రూపాయి విడుదల చేయడం లేదని భట్టి నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాలొనే ఇటువంటి పథకాల్లో 340 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి 9 నెలలుగా జీతాలు లేవని చెప్పారు. దీనికి జిల్లా కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని భట్టి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పేరు చెప్పుకుని.. దానిమీద 56 వేల కోట్ల రూపాయల్లో, కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఆ సొమ్ముతో రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చేయాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని భట్టి తెలిపారు. నేను అసెంబ్లీకే పోటీ చేస్తా..! లోక్ సభకు పోటీచేస్తారని వస్తున్న వార్తలపై భట్టి విక్రమార్క స్పష్టమైన సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి మాత్రమే పోటీచేస్తానని ప్రకటించారు. తన కుటుంబం నుంచి మరెవ్వరూ ఎన్నికల్లో పోటీచేయరని తెలిపారు. -
టీఆర్ఎస్ రైతు సంక్షోభ ప్రభుత్వం : మల్లు విక్రమార్క
సాక్షి, ఖమ్మం : టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని రైతు సంక్షోభ ప్రభుత్వమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. రైతు జేబులో డబ్బులు కొట్టేసి వాటినే తిరిగి రైతుకిస్తున్నారని, ఇది రైతు ప్రభుత్వమా అని ఆయన ప్రశ్నించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేని టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో హంగూ, ఆర్భాటంగా రైతులకు చెక్కులంటూ మోసం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే రైతన్నలకు బేడీలు వేసిన పరిస్థితిని మర్చిపోలేమని ఆయన అన్నారు. -
నిన్ను.. నీ అయ్యను పాతరేసే రోజులు దగ్గర్లోనే..
కేటీఆర్, కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన మల్లు భట్టి విక్రమార్క నేలకొండపల్లి: కాంగ్రెస్‌ను కాదు.. నిన్ను, నీ అయ్యను, నీ కుటుంబాన్ని పాతరేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారంలో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ పిల్లకాకి లాంటి వాడని, నోరు అదుపులో పెట్టుకోకుంటే పాలేరు ప్రజలు తరిమికొడతారని అన్నారు. కాంగ్రెస్‌ను పాతరేసే శక్తి ఆయనకు లేదని, కాంగ్రెస్ ఉండేలు దెబ్బ రుచి చూపిస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, తుమ్మల ప్రణాళికలు రూపొందించినట్లు ఆరోపించారు. అభివృద్ధి పేర కేటీఆర్ చేసిన అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇటీవల ఆయన మంత్రిత్వ శాఖను మార్చారని ఆరోపించారు. దోపిడీ సొమ్ముతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసినట్లు పాలేరు ప్రజలను కొనాలని చూస్తే.. ఇక్కడే పాతరేస్తారన్నారు.