టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క(ఫైల్)
సాక్షి, ఖమ్మం : టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని రైతు సంక్షోభ ప్రభుత్వమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. రైతు జేబులో డబ్బులు కొట్టేసి వాటినే తిరిగి రైతుకిస్తున్నారని, ఇది రైతు ప్రభుత్వమా అని ఆయన ప్రశ్నించారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేని టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో హంగూ, ఆర్భాటంగా రైతులకు చెక్కులంటూ మోసం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే రైతన్నలకు బేడీలు వేసిన పరిస్థితిని మర్చిపోలేమని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment