
'టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఉచిత ఇసుక'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలజానాథ్ శుక్రవారం మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి సొమ్ము లావాదేవీలను నిర్వహించేందుకే మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన చేపడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ఉచితమంటోందని శైలజానాథ్ ఆరోపించారు.
అవినీతికి పాల్పడిన మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత భూముల్లో దొరికిన ఎర్రచందనం దుంగలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనితీరు బాగోలేదని సర్వేలే చెబుతున్నాయని శైలజానాథ్ గుర్తు చేశారు.