sand policy
-
చంద్రబాబు ఫ్రీ ఇసుక స్కాం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
-
చంద్రబాబు ప్లాన్ ఇదేనా?.. అందుకే పవన్‌ను పక్కన పెట్టేశాడా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాను,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కాని, మానిఫెస్టోలోని ఇతర వాగ్దానాలను కాని అమలు చేయలేని పరిస్థితిలో మొత్తం నెపాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన నెట్టి తప్పించుకోవడానికి తగట్లుగా పావులు కదుపుతున్నారు. దానికి ఈనాడు మీడియా, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎటూ బాండ్ బాజా వాయిస్తాయి కనుక సూపర్ సిక్స్ గురించి జనం మర్చిపోయి జగన్ ప్రభుత్వంలో ఏదో జరగకూడనిది జరిగిపోయిందన్న చర్చ ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు ఢిల్లీ పర్యటనను కొంతమేర వాడుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించండి. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్దిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఏపీని ఆదుకోవాలని చంద్రబాబు ప్రధాని మోడీని కోరారని ఈనాడు ప్రచారం చేసింది. అప్పట్లో ఆర్ధిక వనరులు అన్ని ఆవిరి అయిపోయాయట. వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని ముఖ్యమంత్రి చెప్పారట. అందువల్ల కేంద్రం చేయూత ఇవ్వాలని ఆయన కోరారట. చంద్రబాబు ఢిల్లీ పర్యటించి రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధాని, కేంద్ర మంత్రులను కోరడం తప్పు కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా తన వంతు ప్రయత్నం చేస్తారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ అంతకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేసి తన బాధ్యతను తప్పించుకోవాలని చూడలేదు. ఖజానాలో వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉంచి, వేలాది కోట్ల రూపాయల బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినా, జగన్ మాత్రం డబ్బులు లేవని, హామీలు అమలు కష్టమని చెప్పలేదు. తనకు ఉన్న అవకాశాలను వాడుకుని, కేంద్రం నుంచి ఆయా స్కీముల కింద ఆర్దిక సాయం వచ్చేలా చూసుకుని పధకాలు అమలు చేసి చూపించారు. ఇది ఏ రకంగా దుష్పరిపాలన అవుతుందో చంద్రబాబుకాని, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు తదితర టీడీపీ మీడియా వివరించలేదు. విశేషం ఏమిటంటే జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఐదువేల కోట్ల రూపాయలు నిల్వ ఉంది. వంద కోట్లే మిగిల్చి వెళ్లిన చంద్రబాబుదేమో ఉత్తమ పాలన అట. ఐదువేల కోట్లు నిధులు ఉంచితే అది దష్పరిపాలన అట. జగన్ టైమ్ లో నిత్యం అప్పులు అంటూ గగ్గోలు పెట్టారు. తాము వస్తే సంపద సృష్టిస్తాం కాని, అప్పులు చేయబోం అన్నట్లుగాటీడీపీ, జనసేన,బిజెపిలు ప్రచారం చేశాయి. ఆ సంపద ఏమైపోయిందో కాని, అప్పుడే దాదాపు పదిహేనువేల కోట్ల రూపాయల అప్పులు చేసేస్తున్నారు. అది చాలా సత్పరిపాలన అట. స్కూళ్లు బాగుచేస్తే, ఆస్పత్రులను మెరుగుపరిస్తే, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజల ఇళ్ల వద్దకు పాలనను తీసుకు వెళితే అది దుష్పరిపాలనగా ఈనాడు మీడియా దుర్మార్గంగా ప్రచారం చేసింది. జన్మభూమి కమిటీలతోటీడీపీ హయాంలో అరాచకంగా అవినీతికి పాల్పడితే అది గొప్పపాలన అట. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అరకొరగా చేసి ఎగవేసిన టీడీపీ దేమో మంచి పాలన. చెప్పిన స్కీములు చెప్పినట్లు అమలు చేస్తే అది దుష్టపాలనట. ఒక్క బిడ్డకు అమ్మ ఒడి స్కీము కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని జగన్ చెప్పి, దానిని చేసి చూపించితే ఆర్దిక సుడిగుండంలోకి ఏపీని నెట్టినట.ఇప్పుడుటీడీపీ మొత్తం విద్యార్దులందరికి, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరికి తల్లికి వందనం పేరుతో పదిహేనువేల రూపాయల చొప్పున అందదచేస్తామని హామీ ఇస్తే అది సుడిగుండం కాదట.కాకపోతే ఆ ఊసే ఎత్తకుండా కధ నడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం కాదట. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని చంద్రబాబు కేంద్ర పెద్దలకు చెప్పారు. బాగానే ఉంది.అయినా అధికారం కోసం అడ్డగోలు హామీలు ఎలా ఇచ్చారో వివరించరు. వారివి రాజకీయ తెలివితేటలు అని అనుకోవాలా! జగన్ ప్రభుత్వ హయాంలో అప్పును పదమూడు లక్షల కోట్లకు తీసుకు వెళ్లిందని ఎన్నికల ముందు ఆరోపించిన వీరిద్దరూ ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చయ్యే హామీలను ఎలా ఇచ్చారో చెప్పరు. జగన్ తన స్కీముల అమలుకు ఏభైవేల కోట్ల రూపాయలు వ్యయం అవుతున్నాయని,టీడీపీ, జనసేన లు కలిసి ఇచ్చిన వాగ్దానాలకు లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ,అవి ఆచరణ సాధ్యం కాదని జగన్ చెబితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈనాడు వారు ఏమన్నారు?చంద్రబాబు సంపద సృష్టించి అన్ని చేసి చూపిస్తారని చెప్పారా?లేదా?ఇప్పుడేమో బీద అరుపులు ఎందుకు మొదలుపెట్టారో జనం అర్ధం చేసుకోరా?అనుత్పాదక వ్యయం ,వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ మొదలైనవి గత ప్రభుత్వ హయాంలో జరిగాయని చంద్రబాబు అంటున్నారు. అది నిజమా?కాదా?అన్నది చర్చించవలసిన అవసరం ఉంది. ఏది అనుత్పాదక వ్యయం అని ఆయన చెప్పదలిచారు. జగన్ చేసిన స్కీములా?ఇంకేమైా ఉన్నాయా?అవి అనుత్పాదక ఖర్చు అయితే జగన్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి స్కీమ్ ను ఎందుకు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ల ప్రభుత్వం అనుసరిస్తామని తెలిపింది?సహజవనరుల దోపిడీ అంటున్నారు. అంటే ఇసుక సహజ వనరు కింద వస్తుందా?రాదా? దానికి ఒక విధానం తీసుకువచ్చి ప్రభుత్వనికి వేల కోట్ల ఆదాయం వచ్చేలా చేస్తే అది దోపిడీ అట. జగన్ హయాంలో పెట్టిన ఇసుక స్టాక్ లన్నిటినిటీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు దోచుకువెళితే అది సహజ వనరును రక్షించినట్లా! ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.అది విజన్. అయినా ఏదో రూపంలో డబ్బు వసూలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తే గొప్ప సంగతి.కేంద్రం ఆర్ధిక సాయం చేయూత ఇవ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారట. అంటే చంద్రబాబు ముందుగానే తన సూపర సిక్స్ పై చేతులు ఎత్తివేసినట్లు అనుకోవాలా? సామాజిక పెన్షన్లు ఒకేసారి నాలుగువేల రూపాయలు చేసి, బకాయిలు మూడువేల రూపాయల చొప్పున ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే అదే గొప్ప ఆర్ధిక నిర్వహణ,సమర్ధత అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడ , ఢిల్లీ వెళ్లి సర్వం దివాళా తీసినట్లు చెప్పుకోవడం ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజీని కూడా దెబ్బతీస్తున్నట్లు అనిపిస్తుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రత్యేక హోదా గురించి అడగకుండా, కేవలం నిధులు అడగడం ద్వారా తన అసలు ఉద్దేశం బయటపెట్టినట్లనిపిస్తుంది. గతంలో కూడా ప్రత్యేక హోదాపై పలుమార్లుటీడీపీ మాట మార్చిన అనుభవం ఉంది.బీహారు లో ముఖ్యమంత్రి నితీష్ కమార్ కూడా మోడీకి మద్దతు ఇస్తున్నా,తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ధైర్యంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు. చంద్రబాబు ఆ పని చేయకపోగా,అసలు ఆ ప్రస్తావనే చేయడం లేదు. స్వల్పకాలికంగా రాష్ట్రానికి ఆర్ధికంగా చేయూత నివ్వాలని చంద్రబాబు కోరారు. సుమారు లక్ష కోట్ల మేర ఆర్థిక సాయం అడిగారని కదనాలు వచ్చాయి. అది నిజమే అయితే కేంద్రం ఆ మేర సాయం చేస్తే గొప్ప విషయమే అవుతుంది. కాని అదంత తేలిక కాదని అందరికి తెలుసు. పోలవరం ప్రాజెక్టు , అమరావతి, పారిశ్రామికాభివృద్ది ప్రోత్సాహకాలు,బుండేల్ ఖండ్ ప్యాకేజీ మొదలైనవాటిపై చంద్రబాబు కేంద్రానికి వినతులు అందించారు. ప్రత్యేక హోదా గురించి అడగలేదు. దానికి కవరింగ్ ఇవ్వడానికి అంతకన్నా ఎక్కువే కోరినట్లు మీడియాకు వెల్లడించారు. కోరడానికి ఎంతైనా కోరవచ్చు. కాని ఆచరణ సాధ్యంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అడిగితే మంచిది. అలాకాకుండా ప్రజలను మభ్య పెట్టాలనో, రాజకీయాల కోసం వినతిపత్రాలు ఇస్తే మాత్రం రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. కొసమెరుపు ఏమిటంటే పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీ టూర్‌కు తీసుకుని వెళ్లకపోవడం ద్వారా ఆయన ప్రాధాన్యతను తెలివిగా చంద్రబాబు తగ్గించారని గుసగుసలు రావడం..– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘ఉచిత’ నాటకం! ఇసుక పేరుకే ఫ్రీ.. డబ్బులు సమర్పించుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. వర్షాకాలంలో కొరత లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఉంచింది. తాజాగా టీడీపీ సర్కారు దీన్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పినా అన్నిచోట్లా టన్నుకి నిర్దేశిత ధర చెల్లించాలని తేల్చి చెప్పడంతో ఇసుక కోసం వచ్చిన వారు కంగు తిన్నారు. చీరాల సమీపంలోని వేటపాలెం స్టాక్‌యార్డులో టన్ను ఇసుక రూ.675గా బోర్డు పెట్టారు. దీంతో ఉచితంగా ఇసుక తీసుకెళదామని ట్రాక్టర్లతో వచ్చిన పలువురు మోసపోయామని గ్రహించి వెనుతిరిగారు. అన్ని స్టాక్ యార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఎలాంటి మేలు చేయని.. ఖజానాకు ఆదాయం సమకూరని తాత్కాలిక కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది. దీనిల్ల అటు ప్రజలు, ఇటు ఖజానాకు నష్టం వాటిల్లుతుండగా టీడీపీ నేతలు మాత్రం జేబులు నింపుకునేందుకు మార్గం సుగమం అయింది. పేరుకు ఉచిత ఇసుక అని ప్రకటించినా ప్రజలు మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఇదే ఉచిత ఇసుక విధానంలోని ప్రత్యేకత. ఉచిత ఇసుక విధానం పేరుతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ సోమవారం జీవో ఎంఎస్ నెంబర్ 43 జారీ చేశారు. గత సర్కారు హయాంలో అమలైన విధానం స్థానంలో తాత్కాలికంగా ఉచిత విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్ల ఆదాయం సమకూరగా ప్రజలకు సులభంగా, అందుబాటు ధరలో లభ్యమయ్యేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఖజానాకు ఒక్క రూపాయి ఆదాయం రాదు. మరోవైపు ప్రజలు డబ్బులిచ్చి మరీ ఉచిత ఇసుకను కొనుగోలు చేయాల్సిన ఆగత్యం దాపురించింది!ఇదీ కొత్త విధానం..జిల్లా స్థాయిలో కమిటీలు ఆయా రీచ్‌ల్లో ఇసుక ధరలను నిర్ణయిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఎస్పీ, జేసీ, ఆర్డీఓ తదితర అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటైన ఇసుక కమిటీలు తమ పరిధిలోని ఇసుక స్టాక్ యార్డులను స్వాధీనంలోకి తీసుకుని ధరలు నిర్ణయించాయి. సీనరేజి ఫీజు, ఇతర పన్నులు, తవ్వకం, లోడింగ్, రవాణా, ర్యాంపు నిర్వహణ, పరిపాలనాపరమైన ఖర్చులన్నీ లెక్కించి టన్ను ఇసుక ధరను నిర్ణయించారు. యార్డులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లేదా వీఆర్ఓ, వీఆర్ఏలను ఇన్ఛార్జీలుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వినియోగదారులు స్టాక్ పాయింట్ల వద్ద నేరుగా ఇసుక కొనుగోలు చేయవచ్చని, తరలించేందుకు వారే లారీలు తెచ్చుకోవాలని సూచించారు. స్టాక్ పాయింట్లలో నగదు లావాదేవీలు కాకుండా డిజిటల్‌గా మాత్రమే డబ్బులు స్వీకరించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ఇసుక కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్లో పర్మిట్లు జారీ చేసే విధానం రూపొందిస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఇసుక ఆపరేషన్స్ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్, రాష్ట్ర స్థాయిలో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తామని తెలిపారు. ఒక వ్యక్తి ఒక రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తామన్నారు.సగం ‘స్టాక్’ స్వాహాఅధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న టీడీపీ నేతలు ఇష్టానుసారం విక్రయించేశారు. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నుల వరకూ ఇసుకను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచింది. గత నెల 4వ తేదీ నుంచి అధికారం అండతో టీడీపీ నేతలు ఇసుక యార్డులను దౌర్జన్యంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులను బెదిరించి తరిమేశారు. ఇప్పటికే చాలా వరకూ ఇసుకను అమ్మేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను విక్రయించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 40 లక్షల టన్నుల ఇసుక మాత్రమే స్టాక్ యార్డుల్లో ఉందని గనుల శాఖ చెబుతోంది. అంటే మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు నెలరోజుల్లోనే మింగేసినట్లు స్పష్టమవుతోంది.ఉసూరుమంటూ..ఉచితంగా ఇసుక దొరుకుతుందని భావించిన నిర్మాణదారులు ఉదయాన్నే ట్రాక్టర్లలో స్టాక్ పాయింట్ల వద్దకు వచ్చి బారులు తీరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల బోర్డులు చూసి విస్తుపోయారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ఊరించి టన్నుల లెక్కన డబ్బులు కట్టాలని బోర్డులు ఏర్పాటు చేయటాన్ని చూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు. కొత్త ఇసుక విధానంలో బాపట్ల జిల్లా చీరాలలో ట్రాక్టర్ ట్రక్కు ఇసుక కొనుగోలు చేయాలంటే రూ.3,034 అవుతుంది. ఒక్కో ట్రాక్టర్లో 4.50 టన్నులు లోడింగ్ చేయవచ్చు. దీనికి రవాణా ఛార్జీలు మరో రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ట్రక్కు ఇసుక రూ.4 వేలు సమర్పించుకుని కొనుగోలు చేయాల్సిన పరిíస్థితి నెలకొంది.తిరిగి వెళ్లిపోతున్న వినియోగదారులు..స్టాక్ పాయింట్ల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీతో రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా ఇసుక అని పేర్కొంటూ షరతులు వర్తిస్తాయి అనే మాదిరిగా టన్ను ఇసుక రూ.675 అని బోర్డులు పెట్టారు. అక్కడకు వచ్చిన వారంతా బోర్డులు చూసి ఈ ధరలకు కొనలేమని తిరిగి వెళ్లిపోతున్నారు. వేటపాలెం స్టాక్ పాయింట్‌కి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 20 ట్రాక్టర్లు రాగా అన్నీ ఖాళీగా తిరిగి వెళ్లిపోయాయి. ఒక్కరూ కూడా ఇసుక కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. మోసపోయాం..టీవీలు, పేపర్లలో ఇసుక ఉచితంగా అందిస్తామని, కేవలం రూ.88కే అని ప్రకటించారు. ఇసుక అమ్మకాలు ప్రారంభించారని స్టాక్ పాయింట్‌కి వచ్చాం. ఇక్కడ బోర్డు పెట్టి టన్ను రూ.575, ట్రాక్టర్ ఇసుక రూ. 3,038 అని చెప్పారు. మోసపోయామని గ్రహించి కొనుగోలు చేయకుండా తిరిగి వెళ్లిపోయాం. – నాగార్జున, వేటపాలెం30 కి.మీ. నుంచి వచ్చా..ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్ రూ.3,038 అని చెబుతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. – శ్రీనివాస్‌నాయక్, పూనూరు, యద్దనపూడి మండలంరవాణా ముసుగులో దోపిడీకి స్కెచ్!ఇసుకపై కొత్త విధానంలో ఉచితం అనేది ఒక మాయ కాగా రవాణా అనేది మరో సరికొత్త దోపిడీకి స్కెచ్‌గా కనిపిస్తోంది. రవాణా ముసుగులో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇసుకను తామే రవాణా చేస్తామనడం వెనుక ఉద్దేశం అదేనని భావిస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరతను అధిగమించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన ఇసుకను అధికారం మారగానే కూటమి సర్కారు మాయం చేసింది. దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను గత 40 రోజుల్లో లెక్కాపత్రం లేకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అమ్మేసుకున్నారు. అదే తరహాలో రవాణా పేరుతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొత్త విధానానికి రూపకల్పన చేశారు. పేరుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ఇసుక కమిటీలు అమ్మకాలను పర్యవేక్షిస్తాయని చెబుతున్నా స్థానిక టీడీపీ నేతలే ఇసుక వ్యవహారాలను నియంత్రించే పరిస్థితి నెలకొంది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్చల్ చేయడమే ఇందుకు ఉదాహరణ. ఉచితంగా ఇసుకను అందిస్తున్నామంటూ బ్యానర్లతో స్టాక్ పాయింట్లు వద్ద ర్యాలీలు నిర్వహిస్తూ హడావుడి చేశారు. దీన్నిబట్టి స్టాక్ యార్డులు ఎవరి చేతుల్లో ఉన్నాయో అర్థమవుతోంది. ఇప్పటివరకు జిల్లా ఇసుక కమిటీలు స్టాక్ పాయింట్ల వద్ద పూర్తిస్థాయిలో ఇన్చార్జీలను కూడా నియమించలేదు. యార్డుల్లో ఎంత ఇసుక ఉందో కచ్చితమైన సమాచారం అధికారుల వద్ద లేదు. వర్షాకాలం సీజన్ వరకు ఉచిత ఇసుక పేరుతో దోపిడీని కొనసాగించి ఆ తర్వాత పూర్తిస్థాయి విధానాన్ని తెచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు స్పష్టమవుతోంది.30 కి.మీ. నుంచి వచ్చా..ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్ రూ.3,038 అని చెబుతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. – శ్రీనివాస్‌నాయక్, పూనూరు, బాపట్ల జిల్లా యథేచ్ఛగా తరలింపుకూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే టీడీపీ నేతలు ఇసుక స్టాక్ యార్డుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో ఇసుక నిల్వల లెక్కలకు, గతంలో కాంట్రాక్టర్ నిల్వ చేసిన ఇసుకకు పొంతనలేకపోవడం దీనికి బలం చేకూర్చుతోంది. విజయనగరం జిల్లాలో ఇసుక రీచ్‌లు లేకపోవడంతో డెంకాడ మండలం పెదతాడివాడ, బొబ్బిలి గ్రోత్ సెంటర్, కొత్తవలస వద్ద ఇసుక స్టాక్ యార్డులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని స్టాక్‌యార్డ్ నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక ఇక్కడ నుంచి ప్రభుత్వ ధరలకు ఇసుకను సరఫరా చేసేది. బొబ్బిలిలో లక్షా14వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉండగా, ఇప్పుడు అధికారుల లెక్కల ప్రకారం 72,466 మెట్రిక్ టన్నులు ఉన్నట్టు తేలింది. కొత్తవలసలో 11,805 మెట్రిక్ టన్నులు, డెంకాడలో 9,756 మెట్రిక్ టన్నులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నా... ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి.వందలాది వాహనాలతో..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ముందు నాటికి ఎనిమిది చోట్ల ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నాయి. ఒక్కొక్క డంపింగ్ యార్డులో 5 లక్షల నుంచి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు అప్పటి యార్డుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానంగా మర్రిపాడు యార్డులో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉండగా ఎన్నికల కౌంటింగ్ అయిన రాత్రి నుంచి టీడీపీ నేతలు వందలాది వాహనాలతో ఇసుకను ఖాళీ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడుకు చెందిన ఓ వ్యక్తి (ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనాయణరెడ్డి అనుచరుడు) ఇసుక డంప్‌ను రూ.2 కోట్లకు కొనేసి.. చెన్నై, బెంగళూరు తదితర మహా నగరాలకు తరలించడం బహిరంగ విషయమే. నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెంలో డంపింగ్ యార్డులో 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు పూర్తిగా ఖాళీ చేశారు. అయితే తాజాగా జిల్లా అధికారులు ప్రకటించిన విధంగా జిల్లాలోని మూడు స్టాక్ యార్డుల్లో ప్రస్తుతం 1,75,301 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. మర్రిపాడు యార్డులో 1,25,211 మెట్రిక్ టన్నులు, మినగల్లులో 41,885 మెట్రిక్ టన్నులు, పల్లిపాడులో 8,205 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన యార్డుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి తవ్వి నిల్వ చేసిన ఇసుకను అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. -
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానం అవినీతికి ఆలవాలంగా మారిందని.. అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానం తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక రవాణా, టీఎస్ఎండీసీ కార్యకలపాలపై విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూగర్భ గనులు, ఖనిజ వనరుల శాఖపై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, ఆ శాఖ అధికారులతో రేవంత్ సమీక్షించారు. అన్ని స్థాయిల్లో అవినీతి ఇసుక క్వారీయింగ్, రవాణాకు సంబంధించి అన్నిస్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని వెంటనే అరికట్టాలని అధికారులను సీఎం హెచ్చరించారు. 48 గంటల్లోగా అన్నిస్థాయిల అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. రెండు రోజుల తర్వాత ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను రంగంలోకి దింపాలని.. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. అన్నిరూట్లలో ఉన్న టోల్గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని బయటికి తీయాలని సూచించారు. ఇసుక రీచ్‌లు, డంపులను తనిఖీ చేయాలని.. అక్రమాలకు పాల్పడినవారికి జరిమానాలు విధిస్తే సరిపోదని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేయించి..: ఇసుక రీచ్లన్నింటా సీసీ కెమెరాలు ఉన్నాయని అధికారులు చెప్పడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న తాను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాదయాత్ర చేసినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లానని.. అక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ఈనెల 3న రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించామన్నారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. అందులో 22 లారీలకు అనుమతి లేదని.. ఒకే పర్మిట్, ఒకే నంబర్‌తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయని తేలిందని స్పష్టం చేశారు. అంటే 25శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు. అనుమతిలేని క్రషర్స్ సీజ్ చేయండి హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. భారీ భవన సముదాయాలు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సెల్లార్ల కోసం ఆరు మీటర్ల కంటే లోతుగా తవ్వితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఖనిజ వనరుల శాఖను ఆదేశించారు. అలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేప్పుడే.. వాటి వివరాలు ఖనిజ వనరుల శాఖకు చేరేలా సమీకృత ఆన్లైన్ విధానం అమలు చేయాలన్నారు. గ్రానైట్, ఖనిజ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ను వినియోగించాలని సూచించారు. గ్రానైట్‌తోపాటు ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు ఏమేం ఉన్నాయి, ఏయే ఏజెన్సీల వద్ద ఉన్నాయి, వాటి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
ఇసుకపై మళ్లీ ‘ఈనాడు’ తప్పుడు రాతలు..
సాక్షి, అమరావతి: ఏపీలో అభివృద్ధి, సుపరిపాలనను చూసి తట్టుకోలేకపోతున్న పచ్చ మీడియా ‘ఈనాడు’ మరోసారి తప్పుడు రాతలు రాసుకొచ్చింది. ఇసుకపై చెత్త కథనాలను ప్రచురించింది. అబద్దపు రాతలతో వక్రీకరణ కథనాలను వడ్డించింది. పాదర్శకంగా ఉన్న ఇసుక టెండర్లపై అసత్యపు వార్తలు రాసింది. ఇందులో సంబంధంలేని వ్యక్తుల పేర్లను కూడా రాయడం గమనార్హం. దీంతో, తప్పుడు రాతపై గనుల శాఖ సీరియస్ అయ్యింది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అసలు జరిగింది ఇది.. 1) రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ‘ఈనాడు దినపత్రిక’.. ‘ఇసుకలో కొత్త తోడు దొంగలు’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవాలతో రాసినదని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సీఎం సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు.. పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారంటూ అర్థం లేని రాతలు రాయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2) ఉచిత ఇసుక విధానం పేరుతో గతంలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత పారదర్శక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారని అన్నారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక ఆపరేషన్స్‌కు ఏజెన్సీలను ఖరారు చేసి, ఆపరేషన్స్ ప్రారంభించిన నేపథ్యంలో ఈనాడు పత్రిక ఓర్వలేనితనంతో అభూతకల్పనలను, అవాస్తవాలను పోగుచేసి పదేపదే ఇసుకపై అవాస్తవాలతో కూడిన కథనాలను ప్రచురిస్తోందని అన్నారు. 3) రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న MSTC ద్వారా టెండర్లు నిర్వహించాం. దానిలో ప్రతిమా ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్యాకేజీ -1, ప్యాకేజీ-3లోని 18 జిల్లాలకు, జిసికెసి ప్రాజెక్ట్స్ & వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజీ-2లోని 8 జిల్లాల్లో ఇసుక ఆపరేషన్స్‌కు సక్సెస్ ఫుల్ బిడ్డర్లుగా ఎంపికయ్యాయి. 4) ఈ టెండర్లలో సక్సెస్ ఫుల్ బిడ్డర్లుగా ఎంపికైన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్డింగ్ జరుగుతోంది. 5) ఇసుక ఆపరేషన్స్ అనేది గనులశాఖకు సంబంధించిన వ్యవహారం. రీచ్‌లకు లీజు అనుమతుల మంజూరు గనులశాఖ ద్వారా జరుగుతుందే తప్ప సీఎంవో నుంచి కాదు. సీఎం సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ.. అదేమని ప్రశ్నించిన వారికి తమకు సీఎంవో నుంచి అనుమతులు ఉన్నాయంటూ చెబుతున్నారని ఈనాడు పత్రిక ఏ ఆధారాలతో తన కథనంలో ఆరోపించిందో స్పష్టం చేయాలి. రాష్ట్రంలో టెండర్ల ద్వారా ఇసుక ఆపరేషన్లకు ఎంపికైన సంస్థలు ఒకవైపు పని చేస్తుంటే, మరోవైపు బయటి వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ ఈనాడు తన కథనంలో ఆరోపించడం పచ్చి అబద్ధం. సీఎం సోదరుడికి, మరో వ్యక్తికి ఇసుక ఆపరేషన్ల తోటి ఎటువంటి సంబంధమూ లేదు. కావాలని ఇసుక ఆపరేషన్లను రాజకీయం చేయాలని దురుద్దేశంతో ఈనాడు పత్రిక తప్పుడు విమర్శలకు పాల్పడుతోంది. నిరాధార అంశాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని పదేపదే ఇలాంటి కథనాలను ప్రచురిస్తోంది. 6) ఇసుక అక్రమాలపై నిఘా కోసం ఎస్ఈబీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ జిల్లాకు ఒక విజిలెన్స్ స్వ్కాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు నిర్వహిస్తున్నాం. ఈ విభాగాల పనితీరును కూడా ఈనాడు ఆక్షేపించడం దారుణం. అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ ఈనాడు ఏ ఆధారాలతో అటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తోంది? 7) ఇంత పకడ్భందీగా ఇసుకపై పర్యవేక్షణ జరుగుతుంటే, ఈనాడు పత్రికకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. కళ్ళముందు కనిపిస్తున్న దానిని చూడకుండా, ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో, నిత్యం ఏదో ఒక రకంగా ప్రభుత్వంపై దుష్ర్పచారం చేయాలనే లక్ష్యంతోనే ఇసుకపై ఈనాడు పదేపదే ఒకే అంశంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వరుస కథనాలను ప్రచురితం చేస్తోంది. ఒకే అబద్దాన్ని ఎక్కువసార్లు చెప్పడం ద్వారా దానిని నిజంగా చిత్రీకరించాలనేది ఈనాడు తాపత్రేయం, కుట్రపూరిత విధానం అర్థమవుతోంది. ఇటువంటి తప్పుడు వార్తాకథనాలపై ఈనాడుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. -
Chandrababu: లొంగిపోయి పూచీకత్తుల సమర్పణ
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనపై దాఖలైన మూడు కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని నేర పరిశోధన సంస్థ(సీఐడీ) కార్యాలయం, తాడేపల్లి సిట్, గుంటూరు సీఐడీ ఆఫీసుల్లో ఆయా కేసుల్లో శనివారం లొంగిపోయిన ఆయన.. పూచీకత్తులు, బాండ్ షూరిటీలు సమర్పించారు. ముందుగా విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ ఆఫీస్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ అభిమానులకు ఆయన అభివాదం చేశారు. అక్కడి నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు.. ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఆపై పూచీకత్తులు సమర్పించారు. చివరగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత.. మద్యం పాలసీ కేసులో ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో అధికారులకు ష్యూరిటీ సమర్పించారు. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు ‘పూచీకత్తు’ సంతకాలు చేశారు. ఇసుకాసురుడి అవతారంలో చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఈనాడు దినపత్రిక ఇచ్చిన కథనంపై ఏపీ రాష్ట్ర గనుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఒక పారదర్శక విధానం రూపొందించి అమలు చేస్తుంటే.. అపోహ, అసత్య కథనాన్ని ఈనాడు ఇచ్చిందని పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ ఇసుక ఆపరేషన్స్‌పై ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంవోనా?’’ అనే శీర్షికన ఓ కథనం ఈనాడులో ప్రచురితమైంది. అయితే అందులో ఉన్నవి అవాస్తవాలేనని వీజీ వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థం లేని రాతలు రాయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇసుక విధానాన్ని పారదర్శకంగా రూపొందించి మరీ అమలు చేస్తోందని, పొంతనలేని అంశాలతో ఈనాడు అసత్య కథనాన్ని వండివార్చిందని అన్నారాయన. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు గతంలో టెండర్లు నిర్వహించాం. ఈ టెండర్లలో జెపీ సంస్థ సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా ఎంపికయ్యింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక ఆపరేషన్స్ జరిగాయి. తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ చేస్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వరంగ సంస్థ MSTC ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. అప్పటి వరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాం. .. వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఎండాకాలంలో జేపీ సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్‌లలో నిల్వ చేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్‌ల్లో పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఇసుక తవ్వకాలకు సిద్దమవుతోంది. కానీ, దీనంతటిని వక్రీకరిస్తూ.. బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంవో నుంచి మాకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు దినపత్రిక కథనాన్ని ప్రచురించడం ఎంత వరకు సమంజసం?’’ అని ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. .. ‘ఇసుక ఆపరేషన్స్‌కు గనులశాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయి. మైనింగ్ రంగంలో ఉన్నప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. అటువంటిది సీఎంవో అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎలా అంటారు?. ఒక అంశంపై వార్తాకథనం ప్రచురించే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇటువంటి అసత్య కథనాలను ఎలా ప్రచురిస్తారు? ’అని ఈనాడుపై ఆయన మండిపడ్డారు. ‘‘గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకుంది. ఆరోజు ఈనాడు దినపత్రికకు ఆ అక్రమాలు కనిపించలేదా? జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక విధానంను తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో.. పైగా వర్షాకాలంలోనూ ఇసుక కొరత లేకుండా ఇసుకను అందిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, మినిరత్న గా గుర్తింపు పొందిన MSTC ద్వారా ఇసుక టెండర్లు నిర్వహణ జరగుతోంది. ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే వాస్తవాలు ఇలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, జిల్లా కో ఇంఛార్జిని నియమించారని.. ఈనాడు పత్రిక తన ఊహలన్నింటినీ పోగు చేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. ఇకనైనా మరోసారి ఇలాంటి కథనాలు ఇస్తే.. ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటనలో రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
ఏపీ: ఏ పార్టీతోనూ సంబంధం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే తాము ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) సంస్థ స్పష్టం చేసింది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని, ఓ పత్రికలో ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జేపీవీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తమ సంస్థపై అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జేపీవీఎల్ ఇసుక సబ్ కాంట్రాక్టులను అధికార పార్టీ నేతలకు జిల్లాల వారీగా ఇచ్చినట్లు ఎల్లో మీడియా రెండు రోజులుగా తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ప్రభుత్వమే ఈ సబ్ కాంట్రాక్టులను ఇస్తున్నట్లు, ఇసుకలో భారీ దోపిడీ జరుగుతున్నట్లు అసత్య కథనాలను వెలువరిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై జేపీవీఎల్ సంస్థ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా నిర్వహించిన టెండర్లలో తమ సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకున్నట్లు పేర్కొంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడి తమ సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించుకుని కాంట్రాక్టు పొందినట్లు వెల్లడించింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటిస్తూ ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థకు విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో విస్తారమైన అనుభవం ఉందని, తాము చేపట్టిన ఏ ప్రాజెక్టునైనా సమర్థంగా నిర్వహిస్తామని పేర్కొంది. ఇతరులు లావాదేవీలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు.. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు టెండర్ల ద్వారా దక్కించుకున్న జేపీవీఎల్ అనుమతించిన వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉందని జిల్లాల ఎస్పీలు స్పష్టం చేశారు. ఇతరులు ఎవరైనా ఇసుక సబ్ కాంట్రాక్టర్ లేదా ఇతర పేర్లతో లావాదేవీలు జరిపితే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సబ్ కాంట్రాక్టులు పొంది జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నట్లు ఎవరైనా ప్రచారం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీపీవీఎల్ పోలీస్ శాఖను కోరినట్లు తెలిపారు. -
‘ఇసుక లేకుండా ఇళ్లు ఎలా కట్టాలో చంద్రబాబు చెప్పాలి’
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారానికే టీడీపీ పరిమితమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన సజ్జల.. రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ టీడీపీ ఏడుపు మొదలుపెట్టిందని, గత ప్రభుత్వం హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారనే సంగతి వారు తెలుసుకుంటే మంచిదని చురకలంటించారు. గతంలో ఇసుక లేకుండానే నిర్మాణాలు జరిగాయా? అని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇసుక లేకుండా ఇళ్లు ఎలా కట్టాలో చంద్రబాబు చెప్పాలి. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు చెబుతున్న దాంట్లో వాస్తవమే లేదు’ అని సజ్జల తెలిపారు. -
సచివాలయాల్లోనూ ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: ఇసుక రవాణాను మరింత సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇసుక డోర్ డెలివరీకి ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు ఈ బుకింగ్ బాధ్యతను అప్పగించారు. వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో డబ్బు కడితే అక్కడి నుంచే చలానా వస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన అడ్రస్‌కు ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మకాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఆంధ్రా శ్యాండ్ పేరుతో వెబ్ పోర్టల్ www. andhrasand.com మొబైల్ యాప్ andhrasand app ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆఫ్‌లైన్ విధానంలో రవాణా చేసే వ్యక్తులు మధ్యవర్తులుగా మారి ఎక్కువ రేటుకు ఇసుక విక్రయిస్తుండడంతో ఆన్లైన్ డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు (ఆదివారం, సెలవులు మినహా) మ.12 గంటల నుండి సా.6 గంటల వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. రీచ్, డిపో నుండి 20 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ఉన్న బుకింగ్‌కు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడి ఇసుకనైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. బుకింగ్ ఇలా.. ► సాధారణ వినియోగదారుడు మొబైల్ నెంబర్‌తో, బల్క్ వినియోగదారుడు మొబైల్, ఈ–మెయిల్, పాన్, జీఎస్టీ నెంబర్‌తో ఇసుకను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ► డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో ఆన్లైన్లోనే డబ్బు చెల్లించే ఏర్పాటుచేశారు. ► డిపోలో ఇసుక లోడ్ చేసిన తర్వాత వినియోగదారునికి జీపీఎస్ నావిగేషన్ ప్రారంభమవుతుంది. బుక్ చేసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు రవాణా చేసే వాహనాన్ని ట్రాక్ చేస్తారు. వెబ్ పోర్టల్, యాప్, కస్టమర్ కేర్ కాల్ సెంటర్ ద్వారా కూడా వినియోగదారులు బుకింగ్ ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. ► ఏమైనా ఇబ్బందులు వస్తే కస్టమర్ కేర్ కాల్ సెంటర్ 9700009944కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న రోజే డెలివరీ ప్రస్తుతం 147 డిపోలు, 215 రీచ్‌లలో ఇసుక విక్రయాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరుగుతాయి. పీక్ స్టేజ్‌లో ఇది కోటిన్నర క్యూబిక్ మీటర్లు ఉంటుంది. గతంలో బుక్ చేసుకున్న రెండు, మూడు రోజులకు ఇసుక వచ్చేది. కానీ, ఇప్పుడు బుక్ చేసుకున్న రోజే డెలివరీ చేస్తున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లను ఇప్పటికే ప్రకటించారు. రీచ్‌లు, డిపోల వద్ద ధరల పట్టిక, హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. మధ్యవర్తులు ఎక్కువ రేటుకి అమ్మకుండా ఈ చర్యలు చేపట్టారు. బ్లాక్ మార్కెటింగ్‌ను సహించం వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరసమైన రేటుకు, నాణ్యమైన ఇసుకను సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండూ విధానాలు పెట్టాం. మధ్యవర్తులు ఎక్కువ రేటుకు అమ్మకుండా చూసేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను సహించం. ఫలానా రీచ్‌లోనే బుక్ చేసుకోవాలనేది లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షల్లేవు. వినియోగారులకు ఇంకా సులభంగా ఇసుకను అందించేందుకు ప్రయత్నిస్తాం. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ -
ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స
సాక్షి, అనంతపురం: ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా కార్యాలయాల్లో ఉండాలని అన్నారు. పేదలకు 1.28 లక్షల ఇళ్లు అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు. -
జేపీ పవర్‌కు ఇసుక తవ్వకం పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకం టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీ పవర్) సొంతం చేసుకుంది. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్దదైన హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి కేందాన్ని నిర్వహిస్తోంది. మూడు ప్యాకేజీలకు జేపీ పవర్ ఎక్కువ ధర కోట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) దానికే టెండర్లు ఖరారు చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం లభిస్తుంది. గతేడాది కంటే ఇది 20 శాతం అధికం. పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకాలు జరిపేందుకు అర్హత గల సంస్థను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర గనుల శాఖ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకు అప్పగించింది. ఎంఎస్టీసీ ఈ–టెండర్లు ఆహ్వానించగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, జయప్రకాష్ పవర్ వెంచర్స్, ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మూడు సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలను పరిశీలించి ఎక్కువ ధర కోట్ చేసిన జయప్రకాష్ పవర్ వెంచర్స్‌కు టెండర్‌ను కట్టబెట్టారు. ఈ సంస్థ ఒకటో ప్యాకేజీకి రూ.477.50 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.745.50 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.305.60 కోట్లను కోట్ చేయగా మిగిలిన రెండు సంస్థలు అంతకంటే తక్కువ ధర కోట్ చేశాయి. రెండేళ్లపాటు జేపీ పవర్ ఇసుక తవ్వకాలను నిర్వహించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానంలో ప్రభుత్వానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.161.30 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు రూ.380.00 కోట్ల నికర ఆదాయం లభించింది. కాగా టెండర్‌ను దక్కించుకున్న జేపీ గ్రూప్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ ప్రైవేటు సంస్థగా ఉంది. విద్యుత్ రంగంలోనే కాకుండా సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణం, సిమెంట్, రోడ్ల నిర్మాణం, ఆతిథ్యం, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, క్రీడా, విద్యా రంగాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు అవసరం లేదు.. ► రీచ్‌ల వద్దే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నేరుగా ర్యాంపుల దగ్గర ఇసుక నాణ్యతను పరిశీలించి నచ్చిన రీచ్‌లో డబ్బు కట్టి రసీదు తీసుకోవచ్చు. అక్కడ కావాల్సినంత ఇసుకను తెచ్చుకున్న వాహనంలో తీసుకెళ్లవచ్చు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రీచ్ వద్ద ఒకే ధర ఉంటుంది. దూరం ఆధారంగా, ప్రాంతాల వారీగా అప్పర్ సీలింగ్‌తో ఒక ధర నిర్ణయిస్తారు. ► ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఫిర్యాదులపై కఠిన చర్యలుంటాయి. ► ఇసుక అమ్మకాల్లో సిఫార్సులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ► ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ► ఇసుక సరఫరాలో రవాణా కాంట్రాక్టర్, దళారీల ప్రమేయం ఉండదు. ► ఇకపై పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు అనుమతించరు. ► ఓపెన్ రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలను అనుమతించడం వల్ల నాణ్యమైన ఇసుక దొరుకుతుంది. -
ఇబ్బంది లేకుండా 'ఇసుక'
సాక్షి, అమరావతి: ఇసుక కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా కోరినంత సరఫరా చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలాఖరు నుంచి ఎక్కడా ఇసుక లేదనే మాట లేకుండా అడిగినంత అందించాలని నిర్ణయించింది. రాజకీయ జోక్యానికి ఏమాత్రం తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక అందించనుంది. అనుభవం, అర్హత కలిగిన పెద్ద సంస్థలకు ఇసుక నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా సంస్థలను పారదర్శకంగా ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ)కి అప్పగించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు విభాగాలుగా విభజించి వేర్వేరుగా బిడ్లు స్వీకరించి ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేసేందుకు సాంకేతిక కసరత్తు పూర్తి చేసిన ఎంఎస్టీసీ టెండర్ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి చూపిన సంస్థలతో సోమవారం రాత్రి ప్రీ బిడ్ సమావేశం నిర్వహించింది. ప్రీ బిడ్ సమావేశంలో వ్యక్తం చేసిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా త్వరలో రాతపూర్వకంగా సమాచారం ఇస్తామని ఎంఎస్టీసీ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. 4న టెక్నికల్ బిడ్ల స్వీకరణ ఫిబ్రవరి 4వతేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా టెక్నికల్ బిడ్లు సమర్పించాలని ఎంఎస్టీసీ పేర్కొంది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ మేరకు ఇసుక సరఫరా సంస్థల ఎంపిక కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి వేర్వేరుగా బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలను ఒక రీచ్‌గానూ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను మరో రీచ్‌గానూ, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలను మూడో రీచ్‌గానూ టెండర్లు స్వీకరించనుంది. అర్హతలు, టర్నోవర్, అనుభవం వివరాలను టెండర్ దరఖాస్తులో పొందుపరిచారు. రూ.25 లక్షలు (జీఎస్టీ కాకుండా) చెల్లించి దరఖాస్తు ఫారాలను ఎవరైనా పొందవచ్చు. ఇందులో విధి విధానాలు, నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. టెక్నికల్ బిడ్లను ఎంఎస్టీసీ పరిశీలించిన అనంతరం నిర్దేశిత ప్రమాణాలు కలిగిన సంస్థలను అర్హమైనవిగా ప్రకటిస్తుంది. అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్లకు సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థలను ఫైనాన్షియల్ బిడ్లకు ఆహా్వనిస్తారు. మూడు జోన్లకు అధిక మొత్తానికి కోట్ చేసి (హెచ్ – 1)గా నిలిచిన సంస్థలను సక్సెస్ బిల్ బిడ్డర్లుగా నిర్ణయించి రాష్ట్ర భూగర్భ గనులశాఖ సంచాలకులకు తెలియచేస్తారు. ఆయా సంస్థలతో సంచాలకులు ఒప్పందం చేసుకోనున్నారు. నిర్ణయించిన డిపాజిట్ చెల్లించడంతోపాటు నిబంధనలన్నీ పాటించిన సంస్థలకు ఇసుక సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు. ఆయా ప్రాంతాల పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు కోరినంత ఇసుకను ఆయా సంస్థలు రీచ్‌లు/ స్టాక్ పాయింట్లలో అందించాలి. ఈ మేరకు ఇసుకను అందుబాటులో ఉంచే బాధ్యత ఈ సంస్థలపై ఉంటుంది. నచ్చిన రీచ్‌లో తీసుకోవచ్చు.. ప్రజలు తమకు నచ్చిన రీచ్/నిల్వ కేంద్రం వద్దకు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే డబ్బు చెల్లించి రసీదు తీసుకుని అద్దె/ సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లవచ్చు. పరిమాణంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఆన్లైన్ బుకింగ్ స్థానంలో ఆఫ్‌లైన్ విధానం ఉంటుంది. సర్వర్ మొరాయించడం, ఆన్లైన్ ఇబ్బందులు, సిఫార్సులకు తావుండదు. ఎడ్ల బండ్లలో ఉచితమే నదీ పరిసర ప్రాంతాల ప్రజలు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నిర్మించే సహాయ పునరావాస కాలనీల ఇళ్లకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ఇప్పటికే 500 రీచ్‌లను గుర్తించింది. వీటికి వేగంగా అన్ని రకాల అనుమతులు తెచ్చే పనిలో అధికారులున్నారు. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో జలవనరులు, భూగర్భ గనుల శాఖలు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. బ్యాతమెట్రిక్ సర్వే ద్వారా ఇక్కడ భారీగా ఇసుక నిల్వలున్నట్లు గుర్తించారు. -
ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రెండ్రోజుల్లో ఇందుకు సంబంధించిన సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించనుంది. ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైనంత ఇసుకను అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్లైన్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటన్నింటికీ చెక్ పెట్టనుంది. ఇక నుంచి బల్క్ బుకింగ్స్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు అప్ప చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండ్రోజుల క్రితం సీఎం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలుచేస్తామని, స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు పెంచుతామని ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► ఇసుక బుకింగ్ కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం పోర్టల్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే బుకింగ్స్ అయిపోతున్నాయి. దీనివల్ల మిగిలిన వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగులకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తున్నాం. మరింత పారదర్శకంగా బుకింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ► సొంత అవసరాలకే ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయా? లేదా? అన్న విషయం సచివాలయాల ద్వారా నిర్ధారించే వ్యవస్థను ఏర్పాటుచేస్తాం. ► అలాగే, బల్క్ బుకింగ్స్‌కు అనుమతిచ్చే అధికారం జాయింట్ కలెక్టర్లకే ఇచ్చాం. ► ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని మూడు లక్షల టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వచేస్తున్నాం. వలస కూలీలు వెళ్లిపోవడంతో ఇబ్బందులు ► గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరిపేవారు. కరోనా లాక్డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధిక శాతం స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ► దీంతో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరపాల్సిరావడంవల్ల కొంత సమస్య ఏర్పడింది. ► ఇసుక తవ్వకాల్లో నైపుణ్యం వున్న వలస కూలీలను తిరిగి రప్పించేందుకు కలెక్టర్ల ద్వారా ప్రయత్నిస్తున్నాం. ► పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే అనుమతిస్తున్నాం. -
‘14500’తో అక్రమార్కులకు హడల్!
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మల్లవరం ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని నవంబర్ 18న టోల్‌ఫ్రీ నంబర్ ‘14500’కు ఓ మహిళ ఫోన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే కాల్ సెంటర్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు సీఐ తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా మద్యం అమ్ముతున్న దేవమ్మ అనే మహిళను పట్టుకుని కేసు నమోదుచేశారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పక్కనున్న మరో గ్రామంలో కూల్‌డ్రింక్స్ షాపులో మద్యం అమ్ముతున్నారని ‘14500’కు ఫోన్ వచ్చింది. వెంటనే ఈ విషయం స్థానిక అధికారులకు తెలిపారు. వీరు అక్కడికెళ్లి తనిఖీ చేయగా మద్యం దొరకలేదు. అయితే, షాపు నిర్వాహకుడు గతంలో మద్యం అమ్మేవాడని విచారణలో బయటపడింది. దీంతో అతన్ని హెచ్చరించి వదిలేశారు. సాక్షి, అమరావతి : ..ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. గత నెల 18న టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం విషయంలో ఎక్కడ అక్రమాలు జరిగినా వెంటనే స్థానికుల నుంచి ‘14500’ కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. కాల్ సెంటర్ సిబ్బంది తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయడం, వారు వెంటనే స్పందించడం చకచకా జరిగిపోతున్నాయి. దీంతో గతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించిన వారు ఇప్పుడు అక్రమంగా మద్యం అమ్మాలంటే భయపడుతున్నారు. మద్యం, ఇసుక అక్రమ విక్రయాలు, ఎక్కడ జరిగినా ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్న ముఖ్యమంత్రి పిలుపునకు జనం భారీగా స్పందించడమే ఇందుకు కారణం. ఎక్కడ అక్రమాలు జరిగినా నయాపైసా ఖర్చులేకుండా జనం ఉచిత ఫోన్‌కాల్ ద్వారా ఫిర్యాదులు చేస్తుండటంతో ఎక్కడ జైలుపాలు కావాల్సి వస్తుందోనన్న భయం అక్రమార్కుల్లో వెంటాడుతోంది. దీనివల్లే గ్రామాల్లో గతంలో అడుగడుగునా ఉన్న మద్యం బెల్ట్ షాపుల జాడ ఇప్పుడు పత్తా లేకుండాపోయింది. బెల్ట్ షాపులపైనే అధిక ఫిర్యాదులు మొత్తం 248 ఫిర్యాదులు రాగా అందులో 204 బెల్ట్ షాపులకు సంబంధించినవే కావడం గమనార్హం. మరో 25 ఫిర్యాదులు ఎమ్మార్పీ ఉల్లంఘనలకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే, నిర్ణీత సమయం దాటి రాత్రిపూట అమ్ముతున్నారని ఏడు ఫిర్యాదులు వచ్చాయి. మిగిలినవి ఇతరత్రా ఫిర్యాదులు. కాగా, ఈ ఫిర్యాదుల్లో సింహభాగం మహిళల నుంచే వస్తున్నట్లు సమాచారం. -
ఇ,ఇ, రికార్డులు అరిగిపోయి ‘ఉ’ మీద పడ్డారు..
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని గురించి ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారో ప్రజలకు బాగా అర్థమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ‘రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయనేదే ఆయన ప్రధాన బాధ. ల్యాండ్ మాఫియా కోసమే రాజధాని పర్యటన. రౌండ్ టేబుల్ సమావేశాలు. ప్రజల కోసం ఏనాడూ పనిచేసింది లేదు’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఇ’సుక, ‘ఇం’గ్లీష్ మీడియం రికార్డులు అరిగిపోయాక ఇప్పుడు ‘ఉ’ల్లిపాయల మీద పడ్డారు. ఇది ఒక్క మన రాష్ట్ర సమస్యే కాదు. ప్రజలను రెచ్చగొట్టడానికి ఏదో ఒక సమస్య కావాలిగదా. రైతు బజార్లలో కిలో రూ.25కు అందజేస్తున్న సంగతి మాట్లాడరు. ఇ,ఇ,ఉ తర్వాత తర్వాత దేని గురించి ఎగిరి పడతారో అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్, ట్రిపుల్ యాక్షన్లు చేసినట్టు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేర్వేరు అవతారాలు ధరిస్తాడు. వింతేమిటంటే ఒక పక్క యజమాని చంద్రబాబు నాయుడును సంతృప్తి పరుస్తూనే, ఇంకో పక్క బీజేపీతో బేరసారాలు సాగిస్తున్నాడు. వాహ్ పావలా...!’ అంటూ జనసేన అధినేతపై విమర్శలు గుప్పించారు. -
ప్రతిష్టాత్మకం.. వైఎస్సార్ నవశకం
అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1 నుంచి కొత్త కార్డులను ముద్రించి, పంపిణీ చేయాలి. వైఎస్సార్ నవశకం మార్గదర్శకాలు చేరని జిల్లాలకు వెంటనే పంపించండి. అర్హులైన ప్రతి వారూ లబ్ధి పొందాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అధికారులు సీరియస్‌గా పని చేయాలి. సంక్షేమ పథకాల వర్తింపులో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడొద్దు. కేవలం అర్హతే ప్రామాణికం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉండాలి. అధికారులందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఫలానా కలెక్టర్ హయాంలో ఇళ్ల పట్టా ఇచ్చారన్న పేరు చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయేలా పని చేయాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా గరిష్టంగా రూ.5 వేలు ఇస్తాం. ఆ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుంది. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇందుకు ఏడాదికి దాదాపు రూ.268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలి. ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలి. మనసా, వాచా, కర్మణా పని చేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతాం. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తుది జాబితాను డిసెంబర్ 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాజిక తనిఖీల కోసం డిసెంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు ఆయా పథకాల అర్హుల జాబితాను అక్కడే ప్రదర్శించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రారంభమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తామని చెప్పారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ కాపు నేస్తం, రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారుల ఎంపిక కోసం సాగుతున్న ప్రక్రియ తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి రోగులకు ఆర్థిక సాయం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద నిర్ధారించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకునే సమయంలో దేశంలో తొలిసారిగా ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం ఆరోగ్య మిత్రలకు అవసరమైన ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా మన పని తీరు ఉండాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేలు, ఎలిఫెంటియాసిస్, పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోపీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చే వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. మంగళవారం స్పందనపై సమీక్షలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని ఉన్నతాధికారులతో ప్రమాణం చేయిస్తున్న సీఎం వైఎస్ జగన్ 45.82 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఈ చెల్లింపుల విషయంలో కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకర్లతో సమావేశమై మిగిలిన రైతులకు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ డబ్బును బ్యాంకర్లు పాత అప్పుల కింద జమ చేసుకోవడానికి వీలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. అన్ ఇంకంబర్డ్ అకౌంట్ కింద మాత్రమే భరోసా మొత్తాన్ని రైతులకు చెందేలా జమ చేయాలని మరోసారి స్పష్టం చేశారు. ‘ఉపాధి’తో వర్క్‌షాపుల అనుసంధానం గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్‌షాపులపై కలెక్టర్లు సీరియస్‌గా దృష్టి సారించాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల్లో వర్క్‌షాపులను కచ్చితంగా తెరవాలని.. విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత మాత్రమే వాటిని రైతులకు విక్రయించాలని చెప్పారు. ఈ వర్క్‌షాపుల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, జనవరి 1 నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మార్చి 1 నాటికి కటాఫ్ తేదీగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 22.7 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని అధికారులు వివరించారు. 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అవినీతిని తగ్గించడం, ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్ లక్ష్యమని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని స్పష్టీకరించారు. ఇది సక్రమంగా అమలవుతోందా లేదా అనేది జిల్లా ఇన్చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో, సెక్రెటరీలు సచివాలయ స్థాయిలో పర్యవేక్షిస్తారని సీఎం పేర్కొన్నారు. 21న వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.24 వేల సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారులను గుర్తించారని, మగ్గమున్న ప్రతి ఇంటికీ ఈ పథకం వర్తించాలని చెప్పారు. అర్హత ఉండీ పథకం వర్తించని వారు ఉండకూడదన్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిసెంబర్ 15 వరకు అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడిని ఈ పథకానికి దూరం చేయరాదని స్పష్టం చేశారు. వైఎస్సార్ వాహన మిత్రకు నేటితో గడువు ముగిసిందని, అర్హులైన లబ్ధిదారులందరకీ చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటి వరకు 92 శాతం చెక్కులు పంపిణీ జరిగిందన్నారు. వచ్చే సమావేశం నాటికి నూరు శాతం చెక్కులు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకొవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మద్యం షాపులను తగ్గించడంతో పాటు బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించామని సీఎం అన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని, ఎస్పీలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక.. రెండింటిలోనూ అక్రమాలకు అడ్డుకట్టు వేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రతి వారం ఇసుక ధరలు, లభ్యతపై జిల్లా స్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరి చేయాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఏర్పాటు చేసిన 439 చెక్ పోస్టుల్లో నైట్ విజన్ సీసీ కెమెరాలను కూడా అదే రోజుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తోందని, రోజుకు 80 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం 3 లక్షల 95 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఆన్లైన్లో ఇవాల్టికి (మంగళవారం) అందుబాటులో ఉంచామని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని విస్తృతంగా తెలియజేయాలని సీఎం సూచించారు. ‘స్పందన’ కింద వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 4న అనంతపురం, కర్నూలులో ఆఖరి విడతగా ఓరియెంటేషన్ తరగతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అవినీతిపరుల భరతం పట్టాలి - 14400 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఒక్క ఫోన్ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పించాలి. - ఎవరూ లంచాలు తీసుకోకూడదనేలా చర్యలుండాలి. - ప్రతి దశలోనూ అట్టడుగు స్థాయి వరకూ ఇది ప్రజల్లోకి వెళ్లాలి. - నా (సీఎం) స్థాయిలోనో, అధికారులగా మీ స్థాయిలోనో అవినీతికి నో చెబితే 50 శాతం వరకూ పోతుంది. మిగిలిన 50 శాతం అవినీతి పోయినప్పుడే వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. ఇందుకోసం ఐఐఎం, ఏసీబీ రెండూ కలిసి పని చేస్తాయి. - ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నప్పుడు వాటిని అవినీతికి తావులేకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే. సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గదర్శకాలు - నిబంధనలను సరళతరం చేయాలి. - 52 సెంటర్ల ద్వారా ఇకపై వారానికి రెండు దఫాలుగా సర్టిఫికెట్లు జారీ చేయాలి. - డిసెంబర్ 3న వరల్డ్ డిజేబుల్డ్ డే నాటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలి. - డిసెంబర్ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపు నిర్వహించాలి. - అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. - కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 3, 4 రోజుల్లో సర్టిఫికెట్ అందించడమే లక్ష్యంగా పని చేయాలి. -
పారదర్శకంగా ఇసుక రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక రవాణాపై పూర్తిస్థాయి నియంత్రణ ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 400 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక విక్రయాలు, రవాణా పూర్తి పారదర్శకంగా జరిగేలా రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్‌ను మంత్రి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తవ్వకాలను పరిశీలించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక లారీల యజమానులతో మాట్లాడారు. జీపీఎస్‌తో అనుసంధానం చేసుకోని లారీలను రవాణాకు అనుమతించవద్దని ఆదేశించారు. అనంతరం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చెక్‌పోస్టుల్లో ఇప్పటికే వంద సిద్ధమయ్యాయని, ప్రతి చెక్పోస్టులోనూ రెండు సీసీ కెమెరాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపేలా అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకుని రాబోతున్నామన్నారు.రాష్ట్రంలో ఇప్పటికే రోజువారీ ఇసుక తవ్వకం దాదాపు 4 లక్షల టన్నులకు చేరిందని చెప్పారు. మరో నాలుగైదు రోజుల్లో ఇది 10 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. రోజువారీ సగటు వినియోగం 65 వేల టన్నులు ఉందని చెప్పారు. వచ్చే వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఇసుకను డిపోలు, స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 130 ఇసుక రీచ్‌లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. దీనిలో 102 ఓపెన్ రీచ్‌లు ఉన్నాయని అన్నారు. అలాగే 53 డీసిల్టేషన్ రీచ్‌లు గుర్తిస్తే, వాటిలో 43 పనిచేస్తున్నాయని, 23 డీకాస్టింగ్ పాయింట్లలో కూడా ఇసుక వెలికితీస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 158 స్టాక్‌యార్డ్‌లు 50 ఇసుక డిపోలతో కలిపి మొత్తం 208 ఇసుక విక్రయ కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. బాబు హయాంలో యథేచ్ఛగా దోపిడీ చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగిందని మంత్రి అన్నారు. అయిదేళ్ల కాలంలో ఇసుక ద్వారా చంద్రబాబు ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలను వెనకేసుకువచ్చారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తుంటే.. ఎల్లో మీడియాతో ప్రభుత్వంపై బురద చల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఇసుక కొరత అంటూ రాశారని, ఈ రోజు సమస్య పరిష్కారం కావడంతో అక్రమ రవాణా అంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని చెప్పారు. -
ఇసుక సగటు వినియోగం 65 వేల టన్నులు
సాక్షి, అమరావతి: ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో ఇసుక రోజుకు సగటు వినియోగం 65 వేల టన్నులు పైగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆన్లైన్ బుకింగ్ గణాంకాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. ఏడాది మొత్తమ్మీద చూస్తే రోజుకు సగటు వినియోగం 80 – 85 వేల టన్నులు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల నిర్మాణరంగంలో పనులు తగ్గాయి. వేసవితో పోల్చితే వర్షాకాలంలో నిర్మాణ పనులు మరింత తక్కువగా ఉంటాయి. ఈ ప్రభావం ఇసుక వినియోగంపైనా ఉంటుంది. ఇవి రిటైల్ ఇసుక వినియోగానికి సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇసుక బల్క్ బుకింగ్ గణాంకాలను ఇందులో లెక్కలోకి తీసుకోలేదు. భారీగా పెరిగిన ఇసుక సరఫరా రీచ్‌ల నుంచి స్టాక్ యార్డుల్లోకి ఇసుక తరలింపు భారీగా పెరిగింది. ప్రస్తుతం స్టాక్ యార్డుల్లో 2.95 లక్షల టన్నుల ఇసుక బుకింగ్‌లకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 62,125 టన్నుల ఇసుక బుకింగ్స్ జరిగాయి. -
స్టాక్ యార్డుల్లో నిండుగా ఇసుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక స్టాక్ యార్డులు, డిపోలు నిండుగా ఇసుక రాశులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా భారీగా పెరిగింది. 20 రోజుల క్రితం వరకూ రోజుకు సగటున 22 వేల నుంచి 23 వేల టన్నుల దాకా ఉన్న ఇసుక సరఫరా బుధవారానికి ఏకంగా 2.66 లక్షల టన్నులకు పెరిగింది. ఈనెల 13వ తేదీన ఇసుక సరఫరా 1.44 లక్షల టన్నులు, బుకింగ్ 37,789 టన్నులు ఉండగా.. బుధవారానికి సరఫరా 2.66 లక్షల టన్నులకు, బుకింగ్ 67,806 టన్నులకు చేరింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, ప్రజలకు అవసరమైనంత ఇసుక అందజేయడమే లక్ష్యంగా నవంబరు 14వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం అయ్యాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. వినియోగదారులకు 56,499.5 టన్నుల ఇసుక ఇసుక వారోత్సవాలు ముగిసే సరికి ఇసుక సరఫరా లక్ష్యాన్ని రోజుకు సగటున రెండు లక్షల టన్నులకు చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించగా... అధికారులు కేవలం 48 గంటల్లోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌ల నుంచి 2.66 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేయగా.. 67,806 టన్నుల ఇసుక బుకింగ్ అయింది. ఇదే సమయంలో 56,499.5 టన్నుల ఇసుకను స్టాక్ యార్డులు/స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారులకు పంపించారు. ఇవి సాధారణ వినియోగదారులకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. బల్క్ బుకింగ్ చేసుకున్న వారికి అందించిన ఇసుక దీనికి అదనమని సంబంధిత అధికారులు తెలిపారు. ఇసుక వారోత్సవాలు గురువారంతో ముగియనున్నాయని చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు నిఘాను పటిష్టం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే స్టాక్ యార్డులు/రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని చెక్‌పోస్టుల వద్ద రాత్రిపూట కూడా పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాకు చెక్ ఏడుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చింతూరు (రంపచోడవరం): రాష్ట్రం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో 13 ఇసుక ర్యాంపులను అధికారులు గుర్తించారు. సరిహద్దుల వెంబడి ఏడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఇసుక అక్రమంగా తరలి వెళ్లకుండా చింతూరు మండలం చిడుమూరు సరిహద్దుల్లో, ఒడిశాకు తరలి వెళ్లకుండా చింతూరు మండలం కల్లేరులో చెక్‌పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రా నుంచి తెలంగాణకు అక్రమ రవాణాను అరికట్టేందుకు మేడువాయి, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, తునికిచెరువు, లక్ష్మీపురంలో చెక్‌పోస్టులు పెడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఈ నెల 24లోపు ఏడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్ డీఈ మోహనరెడ్డి సాక్షికి తెలిపారు. -
ఇంటి నుంచే ఇసుక బుకింగ్
ఇసుక కావాలంటే ఇక ఎక్కడికో పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటే చాలు కాలు కదపకుండా ఎక్కడ నుంచైనా ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. – సాక్షి, అమరావతి సాక్షి, అమరావతి: ఇసుక అక్రమార్కులకు కఠిన శిక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఇసుక నిల్వ, బ్లాక్ మార్కెటింగ్, ఇసుకతో వ్యాపారం చేసిన వారికి రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ రాయితీల నిబంధనలను సవరిస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొందరు ఏపీఎండీసీ వెబ్సైట్ నుంచి నకిలీ ఐడీలతో మోసపూరితంగా ఇసుక బుక్ చేసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించేలా నిబంధనావళిని సవరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పరిమితికి మించి ఇసుక నిల్వ చేస్తే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తారు. అపరాధ రుసుముతోపాటు చట్ట ప్రకారం రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఇసుక బుకింగ్ ఇలా.. - ఆన్లైన్లో sand.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లగానే ‘వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ శాండ్’ అని ఉంటుంది. దాని కిందే జనరల్ బుకింగ్ / బల్క్ కన్జూమర్ లాగిన్ అని ఉంటుంది. - సాధారణ వినియోగదారులు ‘జనరల్’ అనే కాలమ్ కింద, అధిక పరిమాణంలో ఇసుక కావాల్సిన వారు ‘బల్క్ కన్జూమర్ లాగిన్’ కింద రిజిస్ట్రేషన్ అనే చోట్ల క్లిక్ చేయగానే మొబైల్ నంబరు అనే కాలమ్ ఉంటుంది. - అందులో మొబైల్ నంబరు టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆరు అంకెల వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ నంబరును పాస్వర్డ్ అనే చోట టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆధార్ నంబరు, జిల్లా, పట్టణం/ గ్రామం, చిరునామా తదితర కాలాలు కనిపిస్తాయి. - అన్ని కాలాలను సక్రమంగా భర్తీ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం వస్తుంది. వెంటనే మొబైల్ నంబరు అనే కాలమ్‌లో ఫోన్ నంబరు టైప్ చేసి దాని కింద సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తే మొబైల్‌కు ఆరు అంకెల నంబరు వస్తుంది. - దీన్ని టైప్ చేసి సెండ్ ఓటీపీ అని నొక్కితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు మెసేజ్ వస్తుంది. వెంటనే యూజర్ ఐడీ, ఐపీ నంబరు కనిపిస్తాయి. ఎంత కావాలంటే అంత.. - శాండ్ ఆర్డర్‌లోకి వెళ్లి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అక్కడ ఎన్ని టన్నులు, ఎక్కడి (స్టాక్ యార్డు) నుంచి ఎక్కడకు డెలివరీ చేయాలి? వివరాలు నమోదు చేయాలి. - టన్ను రూ.375 చొప్పున ఎంత డబ్బు చెల్లించాలో కూడా వెబ్సైట్లో కనిపిస్తుంది. అన్నీ నమోదు చేసిన తర్వాత చెక్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తే ‘పేమెంట్ గేట్‌వే’ అని కనిపిస్తుంది. నచ్చిన విధానంలో ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలి. - ఈ రసీదు సంబంధిత స్టాక్ యార్డులో అందచేసి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డుల దగ్గరే వాహనాలు కూడా ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే ప్రస్తుతం ఇసుక బుకింగ్ అందుబాటులో ఉంది. ఇలా ఇసుక బుక్ చేసుకున్న వారు మరుసటి రోజు ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. -
చంద్రబాబు అలా చేయడం విడ్డూరంగా ఉంది: స్పీకర్
సాక్షి, శ్రీకాకుళం : ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో లోపాలు ఉంటే ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే స్వాగతిస్తామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం తెలిపారు. గురువారం జిల్లాలోని ఆముదాలవలస మున్సిపాలిటీలోని రెండో వార్డులో శుభోదయం కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల ముఖ చిత్రాన్నే మార్చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. మున్సిపాలిటీలలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. త్వరలోనే ఆక్రమణదారుల భరతం పడతామన్నారు. అలాగే ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం వారోత్సవాలు చేపడుతుంటే.. ప్రతిపక్షనేత చంద్రబాబు దొంగ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ఉనికిని చాటుకోడానికి చేపడుతున్న దొంగ దీక్షలను ప్రజలు హర్షించరన్న విషయం ప్రతిపక్షం తెలుసుకోవాలని హితవు పలికారు. -
ఇక ఇసుక పుష్కలం
రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి, తుంగభద్ర, వంశధార, నాగావళి నదులకు వరద పోటెత్తింది.. శ్రీశైలం డ్యాం, నాగార్జునసాగర్ గేట్లు ఈ ఒక్క సీజన్లోనే ఎనిమిదిసార్లు ఎత్తారు.. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం గేట్లు 77 రోజులుగా తెరిచే ఉంచారు.. కృష్ణా, గోదావరిలో ప్రవాహం నేటికీ కొనసాగుతోంది.. ఇంతగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటే ఇసుక రీచ్‌లన్నీ నీట మునిగాయి.. వాస్తవానికి నిర్మాణాలకు, ఇసుకకు ఇది అన్‌సీజన్.. గత ఐదేళ్లలో వర్షాలు,వరదలు లేకపోవడంతో కరువొచ్చింది కానీ ఇసుక కొరత ఏర్పడలేదు.. మామూలుగా వర్షాకాలానికి ముందే ఇసుక నిల్వపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉన్నా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు.. వరద తగ్గగానే ఇసుక రీచ్‌ల నుంచి కావాల్సినంత తవ్వవచ్చనే విషయాన్నీ ఇప్పుడు విస్మరించారు.. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇసుక రాజకీయానికి తెర తీయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.. ఈ తరుణంలో ఈ సమస్య లోతుల్లోకి వెళ్లి పరిశీలిద్దాం. – సాక్షి, అమరావతి జూలై 31న శ్రీశైలానికి వరద ప్రవాహం చేరింది. ఈ నీటి సంవత్సరంలో ఎనిమిది దఫాలుగా శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చింది. దీని వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఎనిమిది దఫాలుగా 42 రోజులపాటు ఎత్తేయాల్సి వచ్చింది. పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం వస్తుండటం వల్ల 77 రోజులు గేట్లు ఎత్తేశారు. ఈ ఏడాది కృష్ణా నదికి 90 రోజులకుపైగా వరద వచ్చింది. నేటికీ ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా బుధవారం ఉదయం 6 గంటల వరకు 798.27 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. గోదావరి వరద ప్రవాహం జూన్ రెండో వారంలోనే ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను జూన్ 25 నుంచి ఇప్పటి వరకు ఎత్తే ఉంచారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటి దాకా 3,739.68 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. వంశధార వరద ఉద్ధృతి గొట్టా బ్యారేజీలోకి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సీజన్లో జూన్ 30 నుంచి ఇప్పటి దాకా గొట్టా బ్యారేజీ గేట్లు ఎత్తి ఉంచారు. ఇప్పటి దాకా 119.97 టీఎంసీల ప్రవాహం సముద్రంలో కలిసింది. ఎన్నడూ లేని రీతిలో పెన్నా నదిలోనూ ఈ ఏడాది వరద ప్రవాహం భారీగా వచ్చింది. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరింది. దీని వల్ల ఇసుక రీచ్‌లు వరద నీటిలో మునిగిపోయాయి. సాధారణంగా జూన్‌లో వర్షాలు ప్రారంభమవుతాయి. నదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొరతను అధిగమించడానికి ముందు జాగ్రత్తగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే నదులు, వాగులు, వంకల్లోని ఇసుకను తవ్వి నిల్వ చేయడం ప్రభుత్వం బాధ్యత. కానీ అప్పటి సీఎం చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జూన్ నుంచి ఈనెల ప్రథమార్థం వరకూ రాష్ట్రంలో ఇసుక కొరతకు దారితీసింది. ఇప్పుడు వరద తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌ల నుంచి భారీ ఎత్తున ఇసుకను తవ్వి తీసి.. ప్రజలకు అవసరమైన మేరకు సరఫరాను రోజురోజుకూ పెంచుతోంది. ప్రస్తుతం రోజూ 1.44 లక్షల టన్నుల ఇసుకను వెలికితీస్తోంది. జగన్ సర్కారు చేసిందిదీ.. టీడీపీ సర్కారు హయాంలో ఇసుక మాఫియా దోచుకుందని, దీనికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వమే ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. నూతన పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించి ఇసుక సరఫరా బాధ్యతలు అప్పగించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. రీచ్‌లు, స్టాక్ యార్డుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇసుక తరలించే వాహనాలు దారి మళ్లకుండా జీపీఎస్ ఏర్పాటు చేయాలని కొత్త పాలసీ పకడ్బందీగా రూపొందించారు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘా పెట్టారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త పాలసీని తీసుకొచ్చింది. తాజా పరిస్థితి.. నదుల్లో వరద తగ్గుతుండటం, సర్కారు తీసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా పెరిగింది. వారం రోజులుగా డిమాండ్‌కు సరిపడా సరఫరా అవుతోంది. బుక్ చేసుకున్న వారికి వెంటనే అందుతోంది. స్టాక్ యార్డుల్లో నిల్వలు పెరిగాయి. ఎక్కడా ఇసుక కొరత మాటే వినిపించని విధంగా ప్రభుత్వం గురువారం నుంచి ఈనెల 21వ తేదీ వరకూ ఇసుక వారోత్సవాలను ప్రకటించింది. ఈ సందర్భంగా నీరు ఇంకిన ప్రతి రీచ్‌లో తవ్వకాలు చేపడతారు. ప్రతి స్టాక్ యార్డును నిండుగా ఇసుక నింపి అడిగిన వారికి అడిగినంత సరఫరా చేసే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. - ఇసుక సరఫరాపై పెరిగిన నిఘా. - అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం.. రూ.2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్ట సవరణకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదం. - సరిహద్దు చెక్పోస్టులన్నింటిలో రాత్రిపూట కూడా పనిచేసే సీసీ కెమెరాలు పది రోజుల్లో ఏర్పాటు. - కేవలం 13 రోజుల్లో స్టాక్ యార్డులకు ఆరు రెట్లు పెరిగిన ఇసుక సరఫరా. - గత సర్కారు హయాంలో ఇసుక అడ్డగోలు అక్రమ తవ్వకాల వల్ల కృష్ణా, గోదావరి నదుల్లో బావుల్లా ఏర్పడిన గోతులన్నీ ఈ సీజన్లో భారీ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఇసుకతో నిండిపోయాయి. 10 కోట్ల టన్నులపైగా ఇసుక వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రీచ్‌లలోనే కాకుండా ఇతరత్రా యత్నాలు - వరదలవల్ల తాత్కాలికంగా ఇసుక సమస్య ఏర్పడిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. వీలైనంత మేరకు బహిరంగ (నదుల్లోని) రీచ్‌ల నుంచి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక తవ్వకాలు జరుపుతూ స్టాక్ యార్డులకు చేర్చుతూ వచ్చింది. ఆరంభంలో రోజుకు 5 వేల టన్నుల ఇసుకను మాత్రమే స్టాక్ యార్డులకు తరలించిన ఏపీఎండీసీ దీనిని క్రమేణా పెంచుతూ ఇప్పుడు 1.44 లక్షల టన్నులకు తీసుకెళ్లింది. - వరదను దృష్టిలో పెట్టుకుని ప్రయివేటు వ్యక్తులకు చెందిన పట్టా భూముల్లో ఎక్కడెక్కడ ఎంతెంత పరిమాణంలో ఇసుక ఉందో గుర్తించి అక్కడ నుంచి తవ్వి ప్రజలకు సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈమేరకు పట్టా భూముల రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. - ప్రజల తక్షణ అవసరాలు తీర్చడం కోసం వంకలు, వాగులు, ఏర్లు (అప్ టు థర్డ్ స్ట్రీమ్స్) లో 300పైగా రీచ్‌లను గుర్తించింది. గ్రామ సచివాయంలోనే డబ్బు చెల్లించి పర్మిట్లు తీసుకుని స్థానిక అవసరాలకు వీటి నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. - దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోబో శాండ్ తయారీ యూనిట్లకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. టీడీపీ నేతల ఆదాయానికి గండి టీడీపీ హయాంలో ఇసుక రీచ్‌లలో చెక్ పోస్టులే పెట్టలేదు. టీడీపీ నాయకులే ఇసుక మాఫియాగా మారి దోచుకున్నారు. దీనివల్ల సర్కారు ఖజానాకు రూ.2,500 కోట్లు పైగా గండిపడిందని అప్పట్లో ఆర్థిక మంత్రి యనమల ప్రకటించడం గమనార్హం. జగన్ సర్కారు కొత్త పాలసీ వల్ల తమ ఆదాయానికి గండి పడుతుందని మాఫియా గ్యాంగులు బాధపడ్డాయి. దానిని విఫలం చేయాలని ప్రయత్నించాయి. ఇసుక సరఫరా టెండర్లలో గిట్టుబాటుకాని ధరలకు టీడీపీ నేతలే బిడ్లు వేయించినట్లు విజిలెన్స్ విచారణలో దొరికిపోవడం ఇందుకు నిదర్శనం. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్య ఇతర రాష్ట్రాల్లో లేని ఇసుక సమస్య ఇక్కడే ఎందుకు వచ్చిందని టీడీపీతోపాటు దానికి వంతపాడే కొన్ని రాజకీయ పక్షాల నేతలు మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇసుక దొరక్కపోవడానికి వానలు, వరదలు కారణమని తెలంగాణలో రాస్తున్న ఎల్లో పత్రికలు ఏపీలో మాత్రం ప్రభుత్వంపై కావాలని నిందలేస్తున్నాయి. ఇసుక కొరత వల్ల తెలంగాణలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. తెలంగాణాలో ఆగస్టులో టన్ను ఇసుక రూ.1,250కు దొరకగా, ఆ తర్వాత భారీగా పెరిగింది. టన్ను రూ.2,500 నుంచి రూ.3,600 వరకూ పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రోజుకు సగటున 40 వేల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపేది. ప్రస్తుతం వరదల వల్ల ఇది 10 వేల టన్నులకు తగ్గింది. దీంతో స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులు, పెద్ద ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఇస్తున్నారు. చిన్న బిల్డర్లు, సొంత ఇళ్లు కట్టుకునే వారి అవసరాల కోసం ఆన్లైన్లో పరిమిత బుకింగ్‌కు మాత్రమే టీఎస్ఎండీసీ అనుమతిస్తోంది. - కర్ణాటకలోనూ ఇసుక కొరత తీవ్రంగా ఉంది. రాయచూరు దగ్గర కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు జరిపి ప్రజలకు సరఫరా చేయాలని కర్ణాటక ప్రభుత్వం కోరగా ప్రభుత్వ రంగ సంస్థ మైసూర్ మినరల్స్ ఆ బాధ్యత తమకొద్దని చెప్పిందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. - తమిళనాడులోనూ తాత్కాలికంగా ఇసుక కొరత ఉంది. అక్కడ కూడా స్థానిక అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళుతున్నారు. ఇలా వర్షాల సమయంలో నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగడం సహజమేనని తమిళనాడుకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి తెలిపారు. ఇసుక కొరత అప్పుడే ఉంది నిజానికి ఇసుక కొరత సమస్య వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు అధికారంలోకి రాక ముందునుంచే ఉంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఈ ఏడాది మే నెలలో ఈనాడు పత్రిక కథనం ప్రచురించింది. ఒక్క విశాఖ నగరంలోనే సుమారు 30 వేల మంది కార్మికుల జీవనోపాధి కోల్పోయారని, రెండు నెలలుగా తీవ్ర ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని ఆ వార్తలో పేర్కొంది. గతంలో ఎప్పుడూ ఇసుక కొరత లేదని, ఇప్పుడే ఉత్పన్నమైందంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. భారీగా పెరిగిన ఇసుక నిక్షేపాలు మొన్నటి దాకా తాత్కాలికంగా ఇసుక తవ్వకాలకు ప్రకృతి ప్రతికూలంగా మారినప్పటికీ ఇప్పుడు ఇసుక నిక్షేపాలు భారీగా పెరగడానికి అది దోహదపడింది. రీచ్‌లలో నీరు ఇంకిపోతున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రైతుల పట్టా భూముల్లోనే 90 లక్షల టన్నుల ఇసుక ఉంది. తవ్వకాలు జరిపి ప్రజలకు సరఫరా చేసేందుకు వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. స్టాక్ యార్డులకు భారీగా ఇసుక చేరవేస్తున్నాం. – మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీఎండీసీ అడిగిన వారికి అడిగినంత సరఫరా వర్షాలు, వరదలు ఆగిపోయినందున వచ్చే వారం రోజుల్లో నదుల్లోని రీచ్‌లన్నీ నీళ్లలోంచి బయటపడతాయి. ఇప్పటికే సరఫరా పెంచాం. ఇకపై అడిగిన వారికి అడిగినంత ఇసుక అందిస్తాం. ఇసుక వారోత్సవాలు ముగిసేలోగా రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక చేరవేసే దిశగా ఏపీఎండీసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. – రాంగోపాల్, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి నాడు పేరుకే ఉచితం.. దోపిడీ నిజం అప్పటి సీఎం నివాసం పక్కనే అక్రమ తవ్వకాలు ఎన్జీటీ అక్షింతలు, జరిమానానే నిదర్శనాలు రాష్ట్రంలో గత ఐదేళ్లు ఇసుక దందా భారీగా నడిచింది. కొంతకాలం డ్వాక్రా మహిళా సంఘాల ముసుగులో టీడీపీ నాయకులే ఇసుకను అడ్డగోలుగా తవ్వి పొరుగు రాష్ట్రాలకు తరలించి వేల కోట్లు దోచుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలతో రేయింబవళ్లు ఇసుక తోడించి లారీల్లో తరలించారు. అయినా అప్పటి సర్కారు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఈ అక్రమ వ్యవహారం పాత్రధారులు, సూత్రధారులు టీడీపీ పెద్దలు, నాయకులు కావడమేనన్నది బహిరంగ రహస్యం. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై స్వయంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కారుకు తలంటడం, ఏకంగా రూ.వంద కోట్ల జరిమానా విధించడం తెలిసిందే. తుంగభద్ర, గోదావరి నదుల్లో ఏకంగా కిలోమీటర్ల కొద్దీ రహదారులు ఏర్పాటు చేయడంపై అప్పట్లో హైకోర్టు ఘాటుగా స్పందించడం గమనార్హం. టీడీపీ అధికారంలో ఉండగా ఇసుక దోపిడీని అడ్డుకోవాలని ప్రయత్నించిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పట్ట పగలే విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఎమ్మార్వో ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పైగా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు తప్పంతా ఎమ్మార్వోదేనని తేల్చి, రాజీ యత్నాలు చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో 2017లో ఇసుక అక్రమ రవాణాకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన మునగలపాళెం గ్రామస్తులపై ఇసుక లారీ దూసుకెళ్లడంతో 15 మంది మృత్యువాత పడ్డారు. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబు స్పందిస్తూ అదంతా వారి తలరాత అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు ఇసుకపై.. అదీ కొరత తీరుతున్న సమయంలో దీక్షకు దిగుతుండటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం వరద తగ్గడంతో సరఫరా పెంచామని, వారం రోజులపాటు పూర్తిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టి అడిగిన వారికి అడిగినంత ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం ఆయన ‘స్పందన’పై సచివాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వరద తగ్గినందున వారం రోజులుగా సరఫరా పెరిగిందని, ప్రస్తుతం రోజుకు 1.20 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లో దీనిని 2 లక్షల టన్నులకు పెంచాలన్నారు. ఈ నెల 6వ తేదీ నాటికి మొత్తం 275 రీచ్‌లకు గాను 83 చోట్ల ఇసుక తవ్వకాలు జరపగా, ఈనెల 11వ తేదీ నాటికి మొత్తం 280 రీచ్‌లలో 99 ఆపరేషన్‌లో ఉన్నాయని చెప్పారు. ఇసుక వారోత్సవాలు ముగిసే నాటికి ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుంచి 180కి పెంచేలా జాయింట్ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా రేటు కార్డులు నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలను ఖరారు చేసి రేటు కార్డులను ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. ఈ ధరలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ప్రజల అవసరాలకు సరిపడా ఇసుకను స్టాక్ యార్డుల్లో సిద్ధంగా ఉంచుతామని, నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఎవరు విక్రయించినా ఇసుకను సీజ్ చేయాలని ఆదేశించారు. దీనికితోడు అపరాధ రుసుం, రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా రూపొందించిన ముసాయిదా చట్టానికి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకుంటామన్నారు. ఇసుక కొరత తీరే వరకు సంబంధిత విభాగాల్లోని ఉద్యోగులెవరూ సెలవులు తీసుకోరాదని సీఎం సూచించారు. పది రోజుల్లోగా సరిహద్దుల్లో చిన్న, పెద్ద రూట్లలో ప్రతి చోటా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినా, నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
అక్రమ ఇసుక, మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక, మద్యం పాలసీల అమలుతీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నెంబరు ఖరారయ్యింది. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు.. మద్యం అక్రమ విక్రయాలపై ఫిర్యాదులకు ‘14500’ నెంబర్‌ను కేంద్ర టెలికం శాఖ కేటాయించింది. దీంతో దీనిని టోల్‌ఫ్రీ నంబరుగా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తగు ఏర్పాట్లుచేసిన తర్వాత ఈ నంబర్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని.. ఆ సమాచారం త్వరలో ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. -
అధిక ధరలకు అమ్మితే జైలుకే
రాష్ట్రంలో ఏ సమస్యా లేకపోవడంతో ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నాయి. మంచి మనసుతో పనిచేస్తున్నప్పుడు కచ్చితంగా దేవుడు సహకరిస్తాడు. వరదలన్నవి మన చేతిలో లేవు. ఆగస్టు నుంచి ఇవాల్టి వరకు నదుల్లో వరద కొనసాగుతోంది. మనం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైంది. మంత్రులు జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. పాలనకు సన్నద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు ప్రారంభం అయ్యాయి. ఐదు నెలల్లో 3 నెలల పాటు వరద పరిస్థితులు నెలకొన్నాయి. వరదల వల్ల ఇసుక రీచ్‌లు నీటిలో మునిగితే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కొంత సమస్య తప్పదు. ప్రతిపక్షాలు దీన్ని పట్టుకుని కుట్రలు చేస్తున్నాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ప్రత్యేక చట్టం తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదలు తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుకను పెద్ద ఎత్తున స్టాక్ యార్డులకు తరలించి ఎక్కడా కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు ఖరారు చేసి పక్కాగా అమలు చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఇసుక సరఫరా పెంపు, మద్యం నియంత్రణపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో చర్చించి ఇసుక ధరలు ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సరఫరా పెంచాలని, ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలలో సాధారణ పరిస్థితులు: అధికారులు రెండు మూడు రోజులుగా వరద కొంత తగ్గినందున రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల సంఖ్య 61 నుంచి 83కు పెరిగిందని అధికారులు తెలిపారు. సరఫరా రోజుకు సగటున 41 వేల టన్నుల నుంచి 69 వేల టన్నులకు పెరిగిందని వివరించారు. వారం రోజుల్లో దీన్ని లక్ష టన్నులకు పెంచుతామన్నారు. వాతావరణం సహకరిస్తే 15 నుంచి 30 రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని, అన్ని రీచ్‌ల్లో ఇసుక వెలికితీత ప్రారంభమై సరఫరా రోజుకు 2 నుంచి 3 లక్షల టన్నుల వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ పోలీస్ అధికారులు రవిశంకర్ అయ్యన్నార్, సురేంద్రబాబు, గనులశాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు గ్రామాల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మద్యంపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ఎవరైనా విక్రయించినట్లు సమాచారం అందితే విచారించి జైలుకు పంపాలని స్పష్టం చేశారు. మద్య నియంత్రణ విధి విధానాలపై మరో సమావేశంలో చర్చించి చట్టం తెద్దామని సూచించారు. ఈసారి ‘స్పందన’ ఇసుకపైనే.. ‘ఎక్కడా అవినీతికి తావులేకుండా వ్యవహరిస్తున్నప్పటికీ విపక్షాలు మనపై బండలు వేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. వచ్చే వారం ‘స్పందన’ నాటికి ఇసుక ధరలతోపాటు ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రకటించాలి. ఈసారి ‘స్పందన’ కేవలం ఇసుకపైనే నిర్వహిస్తాం. అదే వేదికగా ఇసుక వారోత్సవాలను ప్రకటిస్తాం’ సీఎం సమీక్షలో కీలక అంశాలివీ.. - ఇసుక స్మగ్లింగ్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా సరిహద్దుల్లో నిఘా పెంచి టెక్నాలజీని వినియోగించుకోవాలి. - ప్రతి రూట్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందికి సదుపాయాలు కల్పించాలి. - తప్పు చేసిన వారిని జైలుకు పంపితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది. - ప్రతి రీచ్‌లో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా చూడగలగాలి. తవ్వకాలు నిలిచిపోతే వెంటనే కారణం తెలియాలి. - మొత్తం 275 రీచ్‌లలో రాత్రి పూట కూడా పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. - రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు సిద్ధం కావాలి. జాప్యాన్ని నివారించేందుకు వేర్వేరు సంస్థల నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలి. - వరద తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా కోసం వాహనాలను విస్తృతంగా అందుబాటులో ఉంచాలి. - కిలోమీటరుకు టన్ను రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వెంటనే అనుమతి ఇవ్వాలి. - స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు సరిపడా చేరేవరకు విరామం లేకుండా పనిచేయాలి. - అవసరమైతే స్టాక్ పాయింట్లు పెంచాలి. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఇసుక సరఫరా చేయాలి. -
ప్రభుత్వానికి రెండు వారాల గడువు
సాక్షి, విశాఖపట్నం: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక సమస్యపై పోరాటంలో భాగంగా విశాఖ నగరంలోని మద్దిలపాలెం జంక్షన్ నుంచి వీఎంఆర్డీఏ సెంట్రల్ పార్క్ వరకు జనసేన నిర్వహించిన లాంగ్‌మార్చ్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం సెంట్రల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జనాలు ఇళ్లు వదిలి రోడ్డెక్కారంటే ప్రభుత్వం సరిగా పని చెయ్యనట్లేనని పవన్ విమర్శించారు. ఏడాది వరకూ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు, పోరాటాలు చెయ్యనని అనుకున్నాననీ, అయితే భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడంతో కవాతు చెయ్యాల్సి వచ్చిందన్నారు. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలవుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రెండు వారాల్లో స్పందించి.. ఇసుక సరఫరాపై సరైన నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ.50 వేల పరిహారం, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షలు చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. తనపై నమ్మకం లేకపోవడం, అనుభవం లేదనే కారణంతో తన అభిమానులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని పవన్ కల్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, పార్టీ నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో పాటు, టీడీపీ మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సభలో అపశృతి... పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. కవాతు ప్రారంభమైన మద్దిలపాలెం జంక్షన్ వద్ద జరిగిన తోపులాటలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ త్రిమూర్తులకు స్వల్పగాయాలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద విద్యుదాఘాతం సంభవించి నలుగురు గాయపడ్డారు. వీరిలో రమణారెడ్డి అనే యువకుడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. పేరు లాంగ్ మార్చ్.. వాహనంపై నుంచే అభివాదం ఇసుక కొరతపై జనసేన నిర్వహించే లాంగ్ మార్చ్‌లో 2.5 కి.మీ. వరకు పవన్ కల్యాణ్ నడుస్తారని ముందుగా ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కానీ. పవన్ మాత్రం నడవకుండా వాహనం పైన నిలబడి అభివాదం చేశారు. దీనిపై ఆ పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి నెలకొంది. -
వర్షాల కారణంగానే రాష్ట్రంలో ఇసుక కొరత
-
పవన్ చేస్తోంది లాంగ్ మార్చా?.. రాంగ్ మార్చా?
సాక్షి, తాడేపల్లి: అయిదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొన్నికోట్ల మేర ఇసుక దందా నడిచిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన అంతా కరవేనని ఆయన అన్నారు. మంత్రి అనిల్ కుమార్ శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ వరద కారణంగానే రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది. ఎక్కడా ఇసుక మాఫియా జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదలు తగ్గగానే పుష్కలంగా ఇసుక అందుబాటులోకి వస్తుంది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ప్రకృతి పరవశించింది. మంచి నేత ముఖ్యమంత్రి అయినందువల్లే 86శాతం రిజర్వాయర్లు నిండాయి. ఇంతకీ పవన్ కల్యాణ్ చేస్తోంది లాంగ్ మార్చా?... రాంగ్ మార్చా?. ఉనికి కోసమే ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఇసుకను దోచుకుంటుందా? అయిదేళ్లుగా ఎవరు ఇసుక మాఫియా చేశారో అందరికీ తెలుసు. అందుకే ప్రజలు చంద్రబాబుకు 23 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఏ రోజూ చంద్రబాబును పవన్ ప్రశ్నించిన దాఖలాలు లేవు. వాళ్లిద్దరూ కుమ్మక్కయ్యారు. చంద్రబాబు, పవన్‌ను సూటిగా అడుగుతున్నా?. విశాఖలో లాంగ్ మార్చ్ ఎందుకు చేస్తున్నారు?. కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డన చేయాలని కోరుతున్నా. రాష్ట్రంలో రైతులు సహా అందరూ సంతోషంగా ఉన్నారు. వారం, పదిరోజుల్లో ఇసుక కొరత తీరుస్తాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పవన్ లాంగ్ మార్చ్ అంటున్నాడు. చంద్రబాబు హయాంలో ఎక్కడైనా ఒక్క ఇసుక లారీని సీజ్ చేశారా? ప్రభుత్వ పాలన పారద్శకంగా నడస్తుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో నీటితో నిండి ఉన్న నదులు పవన్‌కు కనిపించడం లేదా?. ఇసుక పేరుతో చంద్రబాబు, పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. గత అయిదేళ్లు ఇసుక మాఫియా చేసిన దారుణాలపై ఎందుకు ప్రశ్నించలేదు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. సమస్య ఉంటే ముఖ్యమంత్రి వద్దకు వచ్చి చెప్పొచ్చుగా. అలా ఎందుకు చేయడం లేదు. వయసు మందగించి, అధికారం కోల్పోయి బాధ, వ్యధతో చంద్రబాబు ఆందోళనలో ఉన్నారు. మళ్లీ నన్నే రమ్మంటున్నారు అని ఆయన అంటుంటే రైతులు భయపడిపోతున్నారు. కొడుకును కొంగుచాటు బిడ్డలా కాపాడుకుంటూ.. దత్త పుత్రుడితో లాంగ్ మార్చ్ అంటున్నారు. చంద్రబాబుతో స్నేహం చేస్తే జనసేనకు వచ్చే ఎన్నికలు కూడా కష్టమే. ఇప్పటికైనా పవన్ సొంత రాజకీయాలు చేసుకోవాలి.’ అని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు. -
ఇసుక తవ్వకాలపై చంద్రబాబు చట్టాలను ఉల్లంఘించాడు
-
గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నచిన్న వాగులు, వంకలు, ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు కొరత తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏరులు, వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు, రవాణాను క్రమబద్ధీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్ట్రీమ్స్‌గా పరిగణించే వంకలు, వాగులు, ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సూచన మేరకు మార్గదర్శకాలు.. ఇప్పటివరకు ప్రజలు ఎక్కువగా పెద్ద పెద్ద నదుల ఇసుకపైనే ఆధారపడుతూ వస్తున్నారు. వరదల నేపథ్యంలో దీనివల్ల సమస్య ఏర్పడింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో బుధవారం చర్చించిన అనంతరం ఆయన సూచనల మేరకు భూగర్భగనుల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్ట్రీమ్స్‌లో ఇసుక తవ్వకాలు, వినియోగానికి సంబంధించి తాజాగా రూపొందించిన మార్గదర్శకాలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని, తర్వాత సమీక్షించి అవసరమైన మార్పు చేర్పులు చేస్తామని అందులో స్పష్టం చేసింది. రీచ్‌ల గుర్తింపు బాధ్యత కలెక్టర్లకు భారీగా ఇసుక లభించే గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా లాంటి పెద్ద నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు వీలు లేనందున ఏర్పడిన కొరతను వంకలు, ఏరులు, వాగుల ద్వారా అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్ టు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్‌గా పేర్కొనే వీటిలోని ఇసుకను ఏపీ వాల్టా చట్టం నిబంధనల మేరకు తవ్వి స్థానిక అవసరాలు తీర్చాలని గనుల శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలవారీగా జిల్లాల్లో ఈ తరహా ఇసుక రీచ్‌లు ఎన్ని ఉన్నాయో గుర్తించే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. ఇందులోని ఇసుకను స్థానిక అవసరాలకు (వ్యాపారానికి కాదు) మాత్రమే వినియోగించుకునేలా గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షిస్తారు. సరఫరా ఇలా... ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్ (ట్రాన్సిట్ పాస్) తీసుకోవాలి. సచివాలయ అధికారి ఒరిజినల్ పర్మిట్‌ను ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు. ఇసుక రీచ్‌ల పర్యవేక్షణను గ్రామ సచివాలయ ఇన్చార్జి సంబంధిత వలంటీర్‌కు అప్పగిస్తారు. సచివాలయంలో డబ్బులు చెల్లించిన వారు రేవు వద్దకు వెళ్లి పర్మిట్‌ను వలంటీర్‌కు ఇచ్చి ట్రాక్టరు, ఎద్దుల బండిలో ఇసుక నింపుకొని తీసుకెళ్లవచ్చు. ఈ పర్మిట్ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్ చెల్లుబాటు కాదు. ట్రాక్టర్లలో ఇసుకను రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి తీసుకెళ్లరాదు. ఎవరూ అవసరానికి మించి ఇసుక నిల్వ చేయరాదు. ఇలా చూడాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ అధికారులదే. పర్మిట్ తప్పనిసరి.. ఇసుక రవాణా పర్మిట్ పాస్‌ల జారీ కోసం ముద్రించిన ఫారం–ఎస్ 3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేస్తుంది. ఇసుకను తరలించేందుకు పర్మిట్ తప్పనిసరి. పాస్ లేకుండా తరలిస్తే జరిమానా విధిస్తారు. ప్రతి పాస్‌కు ఒరిజనల్, డూప్లికేట్ అనే రెండు పేపర్లు ఉంటాయి. దీంతో ఏయే గ్రామ సచివాలయం పరిధిలో ఎంత ఇసుక విక్రయించారనే గణాంకాలు పక్కాగా ఉంటాయి. వరదల వల్ల తాత్కాలికంగా ఏర్పడిన ఇసుక సమస్యను పరిష్కరించడం కోసమే భూగర్భ గనుల ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. భారీ వరదలు, వర్షాలతో... మాఫియాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇసుక తవ్వకం, సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు నాలుగో తేదీన కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రజల అవసరాల మేరకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఈ సీజన్లో నిరంతరాయంగా గోదావరిలో ధవళేశ్వరం వద్ద 55 రోజుల నుంచి, కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజి వద్ద 71 రోజులుగా వరద కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో 400 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై తుంగభద్రలో భారీగా వరదనీరు పొంగుతోంది. వంశధార, పెన్నాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వాయుగుండం/ తుపాను ప్రభావం వల్ల వర్షాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రీచ్‌లన్నీ నీటితో నిండిపోయి ఇసుక తవ్వకాలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులుగా ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున ఇసుక సమస్య ఉత్పన్నమైంది. ఐదేళ్లకు సరిపడా నిల్వలు రాష్ట్రంలో గత పుష్కర కాలంలో ఎన్నడూ లేనన్ని రోజులు గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వంశధార ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి నీటితోపాటు ఇసుక భారీగా కొట్టుకువచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నదుల్లో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలున్నాయి. వరదనీరు తగ్గుముఖం పట్టగానే రీచ్‌లలో తవ్వకాలు ఆరంభించి ప్రజలు కోరినంత ఇసుక సరఫరా చేస్తామని భూగర్భ గనులశాఖ అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఏపీఎండీసీ రోజుకు ఐదు వేల టన్నుల ఇసుకను మాత్రమే ప్రజలకు సరఫరా చేసేది. ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ 45 వేల టన్నుల వరకు సరఫరా చేస్తోంది. వరద తగ్గితే రోజుకు లక్ష టన్నులు సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఏపీఎండీసీ అధికారులు తెలిపారు. ఏపీఎండీసీ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈనెల 22 వరకు 6,07,311 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసింది. ఇదే కాలంలో అధికారులు గుంటూరు జిల్లాలో 2 లక్షల టన్నులు, గోదావరి జిల్లాలో 55 వేల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. కొత్త మార్గదర్శకాలతో సమస్య పరిష్కారం ‘రాష్ట్రంలో రోజుకు సగటున 80 నుంచి 85 వేల టన్నుల ఇసుక అవసరం. నిర్మాణ రంగం భారీగా వేగం పుంజుకుంటే రోజుకు సగటున ఇసుక అవసరం లక్ష టన్నులకు చేరవచ్చు. ప్రస్తుతం ఏపీఎండీసీ స్టాక్ యార్డుల ద్వారా రోజుకు 45 వేల టన్నుల వరకూ ఇసుక సరఫరా చేస్తోంది. దీన్ని 85 వేల టన్నులకు పెంచితే ఎలాంటి సమస్య ఉండదు. నదుల్లో నీరు తగ్గిపోగానే రేవులన్నీ అందుబాటులోకి వస్తాయి. రోజుకు లక్ష టన్నులు కూడా ఇసుక సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉంది. వరదలు, భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఇసుక సమస్య తాత్కాలికమే. దీన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏరులు, వాగులు, వంకలలో, ఇసుక తవ్వకాలు, సరఫరాకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశాం. దీంతో ఇసుక సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది’ – సాల్మన్ ఆరోఖ్యరాజ్ (ముఖ్యమంత్రి కార్యదర్శి) -
ఇసుక పాలసీకి ఏపీ కేబినేట్ ఆమోదం
-
ఇసుకపై.. చంద్రబాబు, లోకేష్ కుట్ర !
సాక్షి, అమరావతి : అధికారంలో ఉండగా ఇసుక దోపిడీకి కొమ్ముకాస్తూ అనుచరగణాన్ని ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నూతన విధానాన్ని నీరుగార్చేందుకు పన్నిన కుట్రలను విజిలెన్స్ విభాగం బట్టబయలు చేసింది. దోపిడీకి ఆస్కారం లేని, పారదర్శక విధానంలో వీలైనంత తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ నేతలు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తేల్చింది. చంద్రబాబు, లోకేష్‌లు తమ సన్నిహితులకు చెందిన కంపెనీల ద్వారా ఇసుక రీచ్ టెండర్లలో అతి తక్కువ ధరలకు షెడ్యూలు దాఖలు చేయించడం ఇందులో భాగమేనని వెల్లడైంది. కొన్ని రీచ్‌లకు అత్యంత తక్కువ ధరకు షెడ్యూళ్లు దాఖలు కావడం వెనుక వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రీచ్ దక్కించుకున్నాక కొరత సృష్టించే కుట్ర ఇసుక రీచ్‌లకు నిర్వహించిన టెండర్లను సమగ్రంగా అధ్యయనం చేసిన విజిలెన్స్ విభాగం ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తమ అనుచర గణంతో అతితక్కువ ధరకు టెండర్లను దాఖలు చేయించినట్లు తేల్చింది. తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ షెడ్యూలు దాఖలు చేయడం వెనుక దురుద్దేశపూరిత కుట్ర దాగి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అతి తక్కువ ధరకు టెండర్లను దక్కించుకున్న తరువాత పాత అనుభవంతో ఇసుక స్మగ్లింగ్‌కు పాల్పడి రూ. వేల కోట్లను కొల్లగొట్టడం, కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర ఇందులో దాగి ఉన్నట్లు విజిలెన్స్ విభాగం పేర్కొంది. విజిలెన్స్ నివేదికతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌లు దక్కించుకున్న కాంట్రాక్టర్లపై డేగ కన్ను వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా తక్కువ ధరకే ప్రజలకు ఇసుక సరఫరా చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీచ్‌ల నుంచి తవ్వి ఇసుకను డంపింగ్ యార్డ్‌కు తరలించే పనులకు ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ) ఇటీవల టెండర్లు నిర్వహించింది. సగం ధరకే షెడ్యూలు దాఖలు.. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాణ్యమైన ఇసుక విస్తారంగా లభిస్తుంది. ఇసుక లభ్యత అధికంగా ఉండే ఈ మూడు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లపై కన్నేసిన చంద్రబాబు, లోకేష్‌లు తమ సన్నిహితులకు చెందిన ఆరు కంపెనీలతో 26 రీచ్‌ల్లో టన్ను ఇసుకను డంపింగ్ యార్డుకు తరలించేందుకు రూ.50 కంటే తక్కువకే షెడ్యూలు దాఖలు చేయించారు. టన్ను ఇసుక తవ్వి డంపింగ్ యార్డుకు చేర్చడానికి కనీసం రూ.వంద వ్యయం అవుతుందన్నది అధికారవర్గాల అంచనా. అలాంటిది టీడీపీ పెద్దల అనుచర గణం రూ.50 కన్నా తక్కువకే షెడ్యూలు దాఖలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నది స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇసుక టెండర్లను పూర్తిగా అధ్యయనం చేసి కుట్ర కోణాన్ని బహిర్గతం చేసింది. ఇసుక రీచ్‌లను దక్కించుకున్న తరువాత గిట్టుబాటు కావడం లేదని డంపింగ్ యార్డ్‌లకు తరలించకుండా మొండికేయడం ద్వారా కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే పన్నాగం ఇందులో దాగి ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కుట్రకు సాక్ష్యాలు ఇవిగో.. కృష్ణా జిల్లాలో గొట్టిపాటి శ్రీధర్ గోపాలకృష్ణ పేరుతో కేవలం రూ.36కే ఒకటో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డు తరలిస్తామంటూ షెడ్యూలు దాఖలైంది. ఈయన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుడు, టీడీపీ ఎమ్మెల్సీ బి.అర్జునుడికి సన్నిహితుడు. కృష్ణా జిల్లా 15వ ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి కేవలం రూ.29కే టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డుకు తరలిస్తామంటూ టీడీపీ నేత యలమంచిలి వెంకట కృష్ణమోహన్‌కు చెందిన శ్రీనివాస ఎడిపైస్ ప్రైవేట్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసింది. ఈయన లోకేష్ సన్నిహితుడు కావడం గమనార్హం. గుంటూరు జిల్లా ఏడో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి మొగిలి శ్రీనివాసరెడ్డికి చెందిన ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్స్ సంస్థతో కేవలం రూ.15కే టన్ను ఇసుకను రీచ్ నుంచి తవ్వి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తామంటూ షెడ్యూలు దాఖలు చేయించారు. మొగిలి శ్రీనివాసరెడ్డి తెలంగాణకు చెందిన టీడీపీ నేత. 2014 తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ ఆయన చంద్రబాబు, లోకేష్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సన్నిహితుడు. మొగిలి శ్రీనివాసరెడ్డి సంస్థకే గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు అప్పగించేలా పావులు కదిపారు. ఈ టెండర్‌ను ఇటీవల సర్కార్ రద్దు చేసింది. తూర్పు గోదావరి జిల్లా మూడో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డుకు చేర్చేందుకు సుధాకర్ ఇన్ఫ్రా పేరుతో మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ అనుచరులు రూ.68కే షెడ్యూల్ దాఖలు చేశారు. -
‘ఇసుక విషయంలో పారదర్శకంగా ఉంటాం’
సాక్షి, విజయవాడ: ఇసుక విషయంలో తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్లనుంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు పందికొక్కుల్లా ఇసుక, మట్టిని దోచుకుతిన్నారని మండి పడ్డారు. మాజీ స్పీకర్ కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ చోరికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. గతంలో టీడీపీ నాయకులు తప్పు చేస్తే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్పీ, కలెక్టర్లకు సూచించేవారని ఆరోపించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేసిన వారిని ఎవరిని వదలొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. కట్టలేరు బ్రిడ్జీని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు ప్రకటనలు గుప్పించారు.. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదని రక్షణ నిధి ఆరోపించారు. గత పాలకుల్లా తాము మోసపూరిత వాగ్దానాలు చేయమని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రక్షణ నిధి స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉందని తెలిపారు. నిరుద్యోగులు సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గ్రామ వలంటీర్లు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే కానీ జన్మభూమి కమిటీల్లా దోచుకోవడానికి కాదని రక్షణ నిధి పేర్కొన్నారు. -
కొరత లేకుండా.. ఇసుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఇసుక లభ్యతపై కలెక్టర్లను ఆరా తీసిన ముఖ్యమంత్రి సెప్టెంబర్ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని, అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు అమర్చి పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. అవసరమైతే కొత్త ర్యాంపులు ప్రారంభించి ఇసుక లభ్యత పెంచాలని, అదే సమయంలో అవినీతికి తావులేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తగినంత ఇసుక లభ్యత లేకుంటే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ నేపథ్యంలో సమస్యపై కచ్చితంగా దృష్టి పెట్టాల్సిందేనని సీఎం పేర్కొన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అంకితభావంతో వ్యవహరిస్తున్నందువల్ల ప్రజల నుంచి స్పందన దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. తాము ఇచ్చిన అర్జీలు చెత్తబుట్ట పాలుకావడం లేదని, కలెక్టర్లు కచ్చితంగా పట్టించుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిం దన్నారు. ఈ సమయంలో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమని, కలెక్టర్లు ధ్యాస పెడితే తప్ప ఇది సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు స్పందనలో పాల్గొంటున్నారా? లేదా? అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు భావిస్తున్నానని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు సమర్థులని గట్టిగా నమ్ముతున్నానన్నారు. అవినీతికి తావులేదు.. ప్రజలు సంతృప్తి చెందాలి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా అవినీతికి తావులేకుండా చూడాలని, ప్రజలు సంతృప్తి చెందేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. అవినీతి కార్యకలాపాలను సహించబోమని ప్రతి సమీక్షా సమావేశంలో గట్టిగా చెప్పడమే కాకుండా ఎక్కడైనా అలాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తెచ్చుకోవద్దన్నారు. ·ఎమ్మార్వో కార్యాలయంలో అవినీతి జరిగితే కలెక్టర్‌కు, పోలీస్‌స్టేషన్‌లో జరిగితే ఎస్పీకి చెడ్డపేరు వస్తుందని, అందుకే ప్రతి సమీక్షలోనూ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. స్పందన కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ సవాంగ్ తదితరులు. ‘మధ్యాహ్న భోజనం’ బాధ్యత కలెక్టర్లదే మధ్యాహ్న భోజనం నాణ్యతపై దృష్టిపెట్టాలని, పాత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకానికి సకాలంలో డబ్బులు ఇవ్వాలని లేదంటే ఆహార పదార్థాల నాణ్యత పడిపోతుందని హెచ్చరించారు. చెల్లింపులు కచ్చితంగా సకాలంలో జరగాలని, దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెడుతుందని తెలిపారు. కోడి గుడ్లు నాసిరకంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. మధ్యాహ్న భోజన పథకం బాధ్యతను కలెక్టర్లకే అప్పగిస్తున్నామని, పైస్థాయిలో దీనిపై ఎలాంటి నిర్ణయాలు వద్దని సూచించారు. దరఖాస్తు అందిన 72 గంటల్లోగా ఇవ్వాలి... కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ, వార్డు సచివాలయాల భవనాలకు గుర్తింపు తప్పనిసరని, వసతులు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సీఎం సూచించారు. అక్కడ కంప్యూటర్‌తోపాటు ఇంటర్నెట్ సదుపాయం, స్కానర్, ప్రింటర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు దరఖాస్తు అందచేసిన 72 గంటల్లోగా రేషన్ కార్డు, పెన్షన్ ఇచ్చేవిధంగా అన్నీ సమకూర్చుకోవాలన్నారు. గ్రామ సచివాలయాలను ప్రారంభించిన తరువాత అర్హులకు కార్డులు జారీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలా అయితేనే గ్రామ సచివాలయానికి ఒక అర్థం ఉంటుందని, అలాంటప్పుడే ప్రజల హృదయాల్లో నిలుస్తుందని చెప్పారు. ప్రతి కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూసుకోవాలని సీఎం సూచించారు. వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి.. ప్రజలు సంతృప్తికరంగా ఉండాలని, సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు జరగాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో కనీసం లక్ష మంది పరీక్షలకు హాజరు కానున్నారని, ఇంతమంది రాయడం ఎప్పుడూ చూడలేదని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇబ్బందులను ముందుగానే గుర్తించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. విమర్శలకు తావివ్వకుండా కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. మినర్ వాటర్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లను తిరిగి నిర్వహణలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని ప్లాంట్లు కచ్చితంగా పని చేసేలా చూడాలని ఆదేశించారు. కరువు పీడిత ప్రాంతాల్లో నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. -
సహజ నిధి దోపిడీ ఆగేదెన్నడు..?
ఒక వైపు ఇసుక రీచ్‌లపై రాజకీయ రాబంధుల అడ్డుకట్టకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంటే మరో వైపు అర్ధరాత్రుల్లో అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న అనుమతులను అడ్డం పెట్టుకుని విచ్చల విడిగా అక్రమ రవాణా చేస్తూ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అడ్డూ అదుపూ లేకుండా నెల్లూరు నగరంతో పాటు, పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి,నెల్లూరు: నదీ గర్భాల్లో సహజ నిధి ఇసుక దోపిడీ ఆగడం లేదు. నిశీధి వేళ ఇసుక మాఫియా దందా కొనసాగుతోంది. టీడీపీ హయాంలో చెలరేగిపోయిన ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పాలసీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీచ్‌ల నుంచి ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. పేదల అవసరాల కోసం మాత్రం అధికారుల అనుమతితో ఇసుక తరలింపునకు ఆదేశాలిచ్చింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని ఇసుక మాఫియా గుట్టుగా ఇసుకను కొల్లగొట్టుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఇసుక మాఫియా మాత్రం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి పోలీసుల సహకారంతో యథేచ్ఛగా అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా సాగిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఇసుక తరలింపు జీఓలను అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో బిల్డర్స్‌కు ఇసుక ధర పెంచి విక్రయాలు చేస్తూ మాఫియా సొమ్ము చేసుకుంటుంది. అర్ధరాత్రి వేళ నగరానికి రవాణా గత ప్రభుత్వం హయాంలో నెలూరురూరల్ పరిధిలోని పొట్టేపాళెం ఇసుక రీచ్ నుంచి శ్రీహరికోటలోని షార్‌లోని నిర్మాణాలు, శ్రీసిటీలోని పలు పరిశ్రమల నిర్మాణాల కోసం ఇసుక రవాణా కోసం టీడీపీ నేతలు ప్రత్యేక అనుమతులు తీసుకొన్నారు. ఆ అనుమతులు అడ్డుపెట్టుకొని రీచ్‌లో భారీ యంత్రాలతో పరిధికి మించి ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేశారు. పొట్టేపాళెం నుంచి షార్‌తో పాటు శ్రీసిటీకి, అటు నుంచి ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి రూ.కోట్ల దోచుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా నూతన పాలసీపై కసరత్తు చేస్తున్న క్రమంలో ఇసుక రీచ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయినా కూడా పొట్టేపాళెంలోని ఇసుక మాఫియా మాత్రం అడ్డదారుల్లో ఇసుక రవాణా సాగిస్తున్నారు. పొట్టేపాళెం రీచ్ నుంచి అర్ధరాత్రి యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ ద్వారా రీచ్ పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లోకి డంప్ చేయిస్తున్నారు. డంప్ చేసిన ఇసుకను టిప్పర్లకు లోడ్ చేసి నెల్లూరు నగరంలోని అపార్ట్మెంట్ల నిర్మాణాల యజమానులకు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం.. పోలీసులకు మామూళ్లు పొట్టేపాళెం రీచ్ పక్కన ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి నెల్లూరు నగరానికి అర్ధరాత్రి ఇసుక తరలింపునకు కోసం పోలీసుల సహకారం అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు 30 వాహనాల్లో 90 నుంచి 100 యూనిట్ల ఇసుకను నగరానికి అక్రమంగా రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు యూనిట్లు ఇసుకతో పాటు రవాణా చార్జీలకు నగరంలోని బిల్డర్స్ వద్ద రూ.35 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి రోజు అక్రమార్కులు రూ.10 లక్షల వరకు ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. నగరం నిద్రిస్తున్న వేళ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఇబ్బంది లేకుండా సహకరించినందుకు నెల్లూరురూరల్ , ఐదో నగర పరిధిలోని పోలీసులకు ఒక్కో వాహనం నుంచి రూ.5 వేలు వంతున మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు అవినీతికి అస్కారం ఇవ్వవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వేళ్లూనుపోయిన అవినీతి మాత్రం ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పోలీసు అధికారులు మాత్రం అక్రమ రవాణాకు సహకరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం విస్మయ పరుస్తోంది. -
ఇసుక కొరతపై ముందస్తు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ఇసుక కొరత తలెత్త కుండా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) జాగ్రత్తలు తీసుకుంటోంది. సీజన్‌లేని సమయంలో ఇసుకధరలను నియం త్రించి భవననిర్మాణాలకు కొరతలేకుండా సన్నాహాలు చేస్తోంది. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా స్టాక్ పాయింట్లు, సబ్ స్టాక్పాయింట్లలోనూ ఇసుక నిల్వ చేయాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో 30 రీచ్‌ల ద్వారా ఇసుకను వెలికి తీసి, ఆన్లైన్ విధానంలో విక్రయిస్తున్నారు. రీచ్‌ల సమీపంలో 30 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన వారికి సరఫరా చేస్తున్నారు. ఇసుక డిమాండ్ దృష్ట్యా కొత్తగా మరో 3 రీచ్‌లను తెరిచేందుకు టీఎస్ఎండీసీ సన్నాహాలు చేస్తోంది. గోదావ రిపై ఖమ్మం జిల్లా పోలంపల్లి, మానేరు నుం చి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నుంచి ఇసుకను వెలికితీసేందుకు కొత్త రీచ్‌లు ఏర్పాటు చేయాలని టీఎస్ఎం డీసీ నిర్ణయించింది. 30 రీచ్‌ల నుంచి ఇసు కను వెలికి తీస్తున్నా 27 రీచ్‌లు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో సరఫరా అవుతున్న ఇసుకలో 96 శాతం ఈ రెండు జిల్లాల పరిధిలోని రీచ్‌ల నుంచే వెలికి తీస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ టీఎస్ఎండీసీ ద్వారా రోజుకు 53 వేల క్యూ బిక్ మీటర్ల ఇసుకను వెలికి తీసి విక్రయిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో 30 వేల క్యూబిక్ మీటర్ల మేర డిమాండ్ ఉండగా, ప్రస్తుతం రెట్టింపు ఉన్నట్లు టీఎస్ఎండీసీ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాలం సమీపి స్తుండటంతో భవన నిర్మాణదారులు ముందుజాగ్రత్తగా నిలువ చేస్తుండటంతో డిమాం డ్ పెరుగుతోంది. టన్ను ఇసుకను టీఎస్ ఎండీసీ రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్ర యిస్తోంది. రవాణా, ఇతర చార్జీలు కలుపు కుని బహిరంగమార్కెట్లో రూ.1,250 నుంచి రూ.1,500 వరకు ధర పలుకుతోంది. వర్షా కాలం ఆరంభం అవుతుండటంతో రీచ్‌ల వద్ద ఇసుక వెలికితీత మొదలుకుని, స్టాక్ పాయిం ట్ల నుంచి రవాణా వరకు అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో దళారీలు మార్కెట్లో రేటు అమాంతం పెంచేస్తుండ టంతో వినియోగదారులపై భారం పెరగ నుంది. గత అక్టోబర్‌లో టన్ను ఇసుకధర మార్కెట్లో రూ.3 వేలకు చేరిన విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. 60 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వl స్టాక్ పాయింట్ల వద్ద ఇప్పటివరకు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసిన టీఎస్ ఎండీసీ మరో 40 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జంటనగరాల పరిధిలోనే ఇసుక వినియోగం ఎక్కువగా ఉండటంతో సబ్ స్టాక్ పాయింట్ల వద్ద నిల్వలు పెంచాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్, మరో రెండుచోట్ల సబ్ స్టాక్ పాయింట్లను నిర్వహి స్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ నుంచి రవాణా అవుతున్న ఇసుకను కొంత మేర కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టాక్ పాయింట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇసుక డిమాండ్ పెరిగే పక్షంలో స్టాక్ పాయింట్లతో పాటు, సబ్ స్టాక్ పాయింట్లలోనూ నిల్వలు పెంచేలా టీఎస్ఎండీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
11నుంచి సాండ్ టాక్సీ విధానం
నల్లగొండ : ఈ నెల 11 నుంచి సాండ్ టాక్సీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాండ్ టాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి మండలంలో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు విధిగా సాండ్ టాక్సీ కింద నమోదు చేసుకోవాలని సూచించారు. సాండ్ టాక్సీ కింద నమోదు చేయించుకునే యజమానులు రూ.15 వేలు డీడీనీ సాండ్ మేనేజ్మెంట్ సొసైటీ పేరున, రూ.10 వేల జీపీఎస్ సర్వీస్ ఏర్పాటు చేసేం దుకు.. వెర్తోనిక్ ఐటీ సొల్యూషన్ పేరున చెల్లించి తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని సూచించారు. సాండ్ టాక్సీలో నమోదు చేయించుకున్న ట్రాక్టర్లుకు ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.55లు చొప్పున చెల్లిస్తామని తెలిపారు. జిల్లాలోని నల్లగొండ మండలం నర్సింగ్‌భట్ల, మిర్యాలగూడెం మండలం తక్కెళ్లపాడు, మునుగోడు మండలం కొరటికల్, దేవరకొండ మండలం ముదిగొండ, శాలిగౌరారం మండలం చిత్తలూరు, కనగల్ మండలం ఎస్. లింగోటం, బొమ్మేపల్లి, అనుమల మండలం పు లిమామిడి, వేములపల్లి మండలం సల్కునూర్, నాంపల్లి మండలం టీపీ గౌరారం గ్రామాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించామన్నారు. ఇసుక అవసరం ఉన్నవారు మీసేవ, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకో వాలని సూచించారు. సాండ్ టాక్సీ ద్వారా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో జేసీ నా రాయణరెడ్డి, డీఆర్వో ఖీమ్యానాయక్, పీఆర్ ఎస్ఈ భాస్కర్‌రావు, ఐబీ ఎస్ఈ హమీద్ ఖాన్, జేడీఏ నర్సిం గరావు, మైన్స్ ఏడీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
'టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఉచిత ఇసుక'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలజానాథ్ శుక్రవారం మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి సొమ్ము లావాదేవీలను నిర్వహించేందుకే మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన చేపడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ఉచితమంటోందని శైలజానాథ్ ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత భూముల్లో దొరికిన ఎర్రచందనం దుంగలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనితీరు బాగోలేదని సర్వేలే చెబుతున్నాయని శైలజానాథ్ గుర్తు చేశారు. -
' ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని సర్కార్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆరోపించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై శుక్రవారం శాసనమండలిలో ఆయన అడిగిన ప్రశ్న.. కాసేపు గందరగోళానికి గురిచేసింది. ఓవైపు ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక మాఫియా రాజ్యమేలుతుంటే.. మరోవైపు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీ ఇంటికే ఇసుక వస్తుందని ప్రభుత్వం చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయా జిల్లాల్లో ఇసుక రీచ్‌లు స్థానికంగా టీఆర్ఎస్ నేతలకు ఉపాధి హామీ పథకంగా మారాయన్నారు. హరీశ్‌రావు స్పందిస్తూ.. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అక్రమాలను కూడా అరికడతామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. టీచర్ల‘పంచాయితీ’ని పరిశీలిస్తాం: మంత్రి కేటీఆర్ స్థానిక సంస్థల అజమాయిషీలో ఉన్న పాఠశాల విద్యను విద్యాశాఖ పరిధిలోకి తేవాలనే ఉపాధ్యాయుల డిమాండ్‌ను పరిశీలిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక, మాధ్యమిక విద్య గ్రామ పంచాయతీలకు అప్పగించారని, అయితే.. వాటి నియంత్రణ మాత్రమే విద్యాశాఖ పరిధిలో ఉందన్నారు. పంచాయతీరాజ్ విభాగాలను బలోపేతం చేయడంతోపాటు టీచర్ల సమస్యను పరిష్కరించేందుకు త్వరలో విద్యాశాఖ మంత్రి, అధికారులతో చర్చిస్తామన్నారు. -
ఇసుక పాలసీపై సీపీఐ నిరసన
అనంతపురం: నూతన ఇసుక పాలసీ విధానంపై సీపీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇసుక పాలసీని నిరసిస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ కలెక్టరేట్ వద్ద కిలో ఇసుక రూ.3 లకు విక్రయిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.