
సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విష ప్రచారానికే టీడీపీ పరిమితమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన సజ్జల.. రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ టీడీపీ ఏడుపు మొదలుపెట్టిందని, గత ప్రభుత్వం హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారనే సంగతి వారు తెలుసుకుంటే మంచిదని చురకలంటించారు.
గతంలో ఇసుక లేకుండానే నిర్మాణాలు జరిగాయా? అని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇసుక లేకుండా ఇళ్లు ఎలా కట్టాలో చంద్రబాబు చెప్పాలి. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు చెబుతున్న దాంట్లో వాస్తవమే లేదు’ అని సజ్జల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment