సాక్షి, శ్రీకాకుళం : ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో లోపాలు ఉంటే ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే స్వాగతిస్తామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం తెలిపారు. గురువారం జిల్లాలోని ఆముదాలవలస మున్సిపాలిటీలోని రెండో వార్డులో శుభోదయం కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల ముఖ చిత్రాన్నే మార్చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. మున్సిపాలిటీలలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని స్పష‍్టం చేశారు. త్వరలోనే ఆక్రమణదారుల భరతం పడతామన్నారు. అలాగే ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం వారోత్సవాలు చేపడుతుంటే.. ప్రతిపక్షనేత చంద్రబాబు దొంగ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ఉనికిని చాటుకోడానికి చేపడుతున్న దొంగ దీక్షలను ప్రజలు హర్షించరన్న విషయం ప్రతిపక్షం తెలుసుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment