
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక, మద్యం పాలసీల అమలుతీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నెంబరు ఖరారయ్యింది. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు.. మద్యం అక్రమ విక్రయాలపై ఫిర్యాదులకు ‘14500’ నెంబర్‌ను కేంద్ర టెలికం శాఖ కేటాయించింది. దీంతో దీనిని టోల్‌ఫ్రీ నంబరుగా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తగు ఏర్పాట్లుచేసిన తర్వాత ఈ నంబర్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని.. ఆ సమాచారం త్వరలో ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment