సాక్షి, హైదరాబాద్: ఇసుక కొరత తలెత్త కుండా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) జాగ్రత్తలు తీసుకుంటోంది. సీజన్‌లేని సమయంలో ఇసుకధరలను నియం త్రించి భవననిర్మాణాలకు కొరతలేకుండా సన్నాహాలు చేస్తోంది. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా స్టాక్ పాయింట్లు, సబ్ స్టాక్‌పాయింట్లలోనూ ఇసుక నిల్వ చేయాలని టీఎస్‌ఎండీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో 30 రీచ్‌ల ద్వారా ఇసుకను వెలికి తీసి, ఆన్‌లైన్ విధానంలో విక్రయిస్తున్నారు. రీచ్‌ల సమీపంలో 30 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన వారికి సరఫరా చేస్తున్నారు. ఇసుక డిమాండ్ దృష్ట్యా కొత్తగా మరో 3 రీచ్‌లను తెరిచేందుకు టీఎస్‌ఎండీసీ సన్నాహాలు చేస్తోంది. గోదావ రిపై ఖమ్మం జిల్లా పోలంపల్లి, మానేరు నుం చి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నుంచి ఇసుకను వెలికితీసేందుకు కొత్త రీచ్‌లు ఏర్పాటు చేయాలని టీఎస్‌ఎం డీసీ నిర్ణయించింది. 30 రీచ్‌ల నుంచి ఇసు కను వెలికి తీస్తున్నా 27 రీచ్‌లు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో సరఫరా అవుతున్న ఇసుకలో 96 శాతం ఈ రెండు జిల్లాల పరిధిలోని రీచ్‌ల నుంచే వెలికి తీస్తున్నారు.
పెరుగుతున్న డిమాండ్
టీఎస్‌ఎండీసీ ద్వారా రోజుకు 53 వేల క్యూ బిక్ మీటర్ల ఇసుకను వెలికి తీసి విక్రయిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో 30 వేల క్యూబిక్ మీటర్ల మేర డిమాండ్ ఉండగా, ప్రస్తుతం రెట్టింపు ఉన్నట్లు టీఎస్‌ఎండీసీ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాలం సమీపి స్తుండటంతో భవన నిర్మాణదారులు ముందుజాగ్రత్తగా నిలువ చేస్తుండటంతో డిమాం డ్ పెరుగుతోంది. టన్ను ఇసుకను టీఎస్ ఎండీసీ రూ.600 చొప్పున ఆన్‌లైన్‌లో విక్ర యిస్తోంది. రవాణా, ఇతర చార్జీలు కలుపు కుని బహిరంగమార్కెట్‌లో రూ.1,250 నుంచి రూ.1,500 వరకు ధర పలుకుతోంది. వర్షా కాలం ఆరంభం అవుతుండటంతో రీచ్‌ల వద్ద ఇసుక వెలికితీత మొదలుకుని, స్టాక్ పాయిం ట్ల నుంచి రవాణా వరకు అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో దళారీలు మార్కెట్‌లో రేటు అమాంతం పెంచేస్తుండ టంతో వినియోగదారులపై భారం పెరగ నుంది. గత అక్టోబర్‌లో టన్ను ఇసుకధర మార్కెట్‌లో రూ.3 వేలకు చేరిన విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు.
60 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వl
స్టాక్ పాయింట్ల వద్ద ఇప్పటివరకు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసిన టీఎస్ ఎండీసీ మరో 40 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జంటనగరాల పరిధిలోనే ఇసుక వినియోగం ఎక్కువగా ఉండటంతో సబ్ స్టాక్ పాయింట్ల వద్ద నిల్వలు పెంచాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్, మరో రెండుచోట్ల సబ్ స్టాక్ పాయింట్లను నిర్వహి స్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ నుంచి రవాణా అవుతున్న ఇసుకను కొంత మేర కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టాక్ పాయింట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇసుక డిమాండ్ పెరిగే పక్షంలో స్టాక్ పాయింట్లతో పాటు, సబ్ స్టాక్ పాయింట్లలోనూ నిల్వలు పెంచేలా టీఎస్‌ఎండీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇసుక కొరతపై ముందస్తు ప్రణాళిక
Published Fri, Jun 14 2019 3:26 AM | Last Updated on Fri, Jun 14 2019 3:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment