stock points
-
పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
సాక్షి, అమరావతి : ఉచితంగా ఇసుక పేరుతో అందినకాడికి దండుకోవడానికి అధికార పార్టీ నేటి నుంచి ముసుగు తీయనుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక నిల్వలను నేటి నుంచి అవసరమైన వారికి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఆ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితి ఉండడంతో కొరత రాకుండా ఉండేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసింది. ఇప్పుడు ఆ ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఆ ముసుగులో ఆ పార్టీ నేతలకు భారీగా లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమైంది. పైకి మాత్రం వినియోగదారులే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకుంటే, అందులో ఉచితంగా ఇసుకను నింపి పంపుతారని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో మరో రకంగా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. ఇసుక లోడింగ్, స్టాక్ యార్డ్ నిర్వహణ, రవాణా, పన్నులు, లెవీకి సంబంధించి కొంత మొత్తాన్ని వసూలు చేయనున్నారు. వీటన్నింటికీ కలిపి జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి టన్నుకు రూ.250 నుంచి రూ.300 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నా, వాస్తవంగా అంతకు రెట్టింపు వసూలు చేయనున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.475తో ఇసుకను విక్రయించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.780 కోట్లకుపైగా ఆదాయం లభించేది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొత్తగా అమలు చేసే విధానంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. అదే సమయంలో వినియోగదారులపై భారం తప్పదు. ‘వాహనాలన్నీ టీడీపీ నేతలవే.. అలాంటప్పుడు ఆ పన్ను, ఈ పన్ను అంటూ బాదుడు మామూలే’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. సచివాలయ ఉద్యోగులకు స్టాక్ యార్డ్ బాధ్యతలు ఇసుక స్టాక్ యార్డు బాధ్యతలను ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కాంట్రాక్టు సంస్థలుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమి ఇన్ఫ్రా సంస్థలకు చెందిన సిబ్బందిని గత నెల అధికారం మారగానే టీడీపీ శ్రేణులు బెదిరించి అక్కడి నుంచి పంపించేశాయి. స్టాక్ యార్డులన్నీ ప్రస్తుతం టీడీపీ శ్రేణుల చేతిలో ఉన్నాయి. ఉచిత ఇసుక సరఫరాను అమలు చేయడం కోసం శనివారం నుంచి జిల్లా కలెక్టర్లు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొలిక్కి వచ్చినట్లు లేదు. మైనింగ్ సిబ్బందితోపాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వాటిని అప్పగించనున్నట్లు తెలిసింది. వారితోపాటు వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా ఇసుకను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి స్టాక్ యార్డ్రే ఒక ఇన్‌ఛార్జిని నియమించి, అతని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బంది కొందరు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో సెప్టెంబర్ వరకు ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అప్పటి వరకు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక నిల్వల్ని ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయనున్నారు. ఆ తర్వాత ఇసుక రీచ్‌లను తెరిచి తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఇసుక కాంట్రాక్టు సంస్థలు జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలను పక్కకు తప్పించి ఇసుక తవ్వకాలకు కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక స్టాక్ యార్డులను స్థానిక టీడీపీ లీడర్లే నిర్వహించనున్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల పాత్ర నిమిత్త మాత్రమేనని తెలుస్తోంది. -
స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లు
సాక్షి, అమరావతి: రేషన్ దుకాణాల్లో తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ఈ–పాస్ యంత్రాలను వినియోగిస్తున్నట్లే ఇకపై మండల స్థాయి స్టాక్ పాయింట్లలోనూ (ఎంఎల్ఎస్) అవకతవకలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లను తప్పనిసరి చేస్తూ పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద 50 కిలోల బస్తా నుంచి 1–2 కిలోల బియ్యం తీసి, డీలర్లకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. గతంలో స్టాక్ పాయింట్లలో అక్రమాలకు అలవాటుపడ్డ కొందరు సిబ్బంది ఈ యంత్రాలను వినియోగించకుండా పక్కన పడేశారు. డీలర్ల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఇకపై స్టాక్పాయింట్లలో ఈ–వేయింగ్ యంత్రాల వినియోగాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. - శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరంలో 15, విశాఖపట్నంలో 30, తూర్పు గోదావరిలో 21, పశ్చిమ గోదావరిలో 14, కృష్ణాలో 17, గుంటూరులో 20, ప్రకాశంలో 19, నెల్లూరులో 15, చిత్తూరులో 28, వైఎస్సార్ కడపలో 19, అనంతపురంలో 24, కర్నూలు జిల్లాలో 17 మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. - 257 స్టాక్ పాయింట్ల నుంచి 29 వేల రేషన్ దుకాణాలకు ప్రతినెలా 2.60 లక్షల టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇందులో క్వింటాల్‌కు 1–2 కిలోల చొప్పున బియ్యం తగ్గుతున్నట్లు ఆరోపణలున్నాయి. - స్టాక్ పాయింట్లలో పనిచేసే కొందరు సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. - ఇకపై స్టాక్ పాయింట్లలో తప్పనిసరిగా ఈ–వేయింగ్ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేసి, డీలర్లకు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. - తూకాల్లో మోసాలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి లబ్ధిదారులకు 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. - ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. - ఏప్రిల్ నుంచి జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున ఈ విధానాన్ని అమలు చేసి, ప్రతినెలా కొన్ని చొప్పున ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
ఇసుక కొరతకు ఇక చెల్లు!
ఇసుక ఇక సామాన్యునికి అందుబాటులోకి రానుంది. కోరిన వెంటనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పారదర్శకత కోసం కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే దీనికోసం కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో ఇసుక నిల్వలున్నట్టు గుర్తించారు. వాటిని స్టాక్ చేసేందుకు సాలూరు, బొబ్బిలిలో రెండు పాయింట్లు గుర్తించి పదెకరాల స్థలాన్ని కేటాయించారు. కొద్దిరోజులుగా ఇసుక కొరతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్న వారి నోళ్లకు ఇక తాళాలు పడనున్నాయి. సాక్షి, బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టనున్న ఇసుక కొత్త పాలసీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే నెల 5 నాటికి ఇసుక సరఫరాను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇసుక విధానం అమలు చేసేందుకు సంబంధిత శాఖల కమిటీ ఇప్పటికే జిల్లాలోని రీచ్‌లను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇందుకోసం జిల్లాలో 62 ఇసుక రీచ్‌లు ఉండగా ఇందులో 55 ప్రాంతాల్లో ఇసుక నిల్వలను సంబంధిత శాఖాధికారులు గుర్తించారు. ఈ ఇసుక నిల్వలు ఎంత మేరకు తవ్వాల్సి ఉంటుందన్నది ఇప్పుడు చర్చిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఈ కొత్త ఇసుక పాలసీని నిర్ణీత సమయానికి ప్రారంభించేందుకు ఆయా శాఖలు పనిలో పడ్డాయి. ఒక్కో స్టాక్‌పాయింట్‌కు ఐదు ఎకరాలు.. జిల్లాలో ఇసుకను ఇతర ప్రాంతాల్లోని రీచ్‌లనుంచి తీసుకువచ్చి స్టాక్‌పాయింట్ల వద్ద నిల్వ చేస్తారు. ఈ పాయింట్ల నుంచి లబ్ధిదారులకు ఇసుకను తరలించేందుకు అనుమతులు జారీ చేస్తారు. జిల్లాలో సాలూరు, బొబ్బిలిలోని గొర్లె సీతారామపురం వద్ద గల ఐదేసి ఎకరాల వంతున స్థలాలను ఆయా తహసీల్దార్లు సిద్ధం చేసి చూపించారు. వీటిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ఏయే రీచ్‌ల నుంచయినా ఈ పాయింట్ల వద్దకు ఇసుకను లారీలతో తరలించి డంప్ చేస్తారు. ఇసుక లభ్యతను బట్టి త్వరలోనే స్టాక్‌పాయింట్లను పెంచే అవకాశం ఉంది. విజయనగరంలో ఇంకా గుర్తించాల్సి ఉంది. బ్యాంకులో డీడీ తీసి స్టాక్ పాయింట్‌కు వెళితే సరి.. జిల్లాలో గుర్తించిన స్టాక్‌పాయింట్ల నుంచి ఇసుకను తరలించేందుకు బ్యాంకులో డీడీలు తీయాల్సి ఉంటుంది. ఈ డీడీలను అందజేసిన వెంటనే వారికి కూపన్లు వస్తాయి. వాటిని తీసుకుని స్టాక్‌పాయింట్‌కు వెళితే అక్కడ ఇసుకను ఆయా వాహనాలకు పరిమాణాన్ని అనుసరించి అందజేస్తారు. వ్యాపారులకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరు ధరలు.. జిల్లాలోని ఇసుక వినియోగదారులను రెండు రకాలుగా అధికారులు విభజిస్తున్నారు. ఒకటి సాధారణ లబ్ధిదారులు, రెండోది కాంట్రాక్టర్లు. యూనిట్ ధరను కాంట్రాక్టర్లకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరుగా నిర్ణయించే ప్రక్రియ సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఓ యాప్ సిద్ధం చేసి ఆ యాప్ ద్వారా నమోదు చేసుకుని ఇసుకను తరలించుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పట్లో యాప్ విధానాన్ని అమలు పరిచే అవకాశం లేదు. శ్రీకాకుళం జిల్లా రీచ్‌లను ఇవ్వాలని లేఖ: జిల్లాలో ఇసుక కొరత ఉంది. నదులు, గెడ్డలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను పెద్ద ఎత్తున తరలించేశారు. ఒక మీటరు ఇసుకను తీసుకోవాలంటే 5 మీటర్ల లోతున ఇసుక నిల్వలుండాలి. అలాగే రెండు మీటర్ల లోతున ఇసుకను తవ్వాలంటే 8 మీటర్ల లోతు ఇసుక ఉండాలి. కానీ జిల్లాలో ఇప్పటికే మీటరు లోతున్న ఇసుకను కూడా పూర్తిగా తవ్వేశారు. దీనివల్ల జిల్లాలో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ కొరతను అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి సమీపంలోని గోపాలపురం, అన్నవరం ప్రాంతాల్లో ఇసుక లభ్యత బాగానే ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఈ ఇసుక రీచ్‌లను విజయనగరం జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖరాశారు. ఇవి గాకుండా ఈ జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలసల్లో అత్యధికంగా ఇసుక నిల్వ లున్నాయి. వీటి నుంచి ప్రభుత్వం ఇసుకను రెండు స్టాక్పాయింట్లకు తరలించి ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. విక్రయ బాధ్యత ఏపీఎండీసీకే.. జిల్లాలో గుర్తించిన వివిధ రీచ్‌లనుంచి ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించాక వాటిని విక్రయించడం, నిర్వహణ బాధ్యతలను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు. స్టాక్ పాయింట్ స్థలాలను అప్పగించాక వాటికి ప్రహరీగానీ కంచెగానీ ఏర్పాటు చేసుకోవడం పొక్లెయిన్, వాహనాలు, కంప్యూటర్లు, సిబ్బందిని కేటాయించి వారికి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు. వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరా.. జిల్లాలో వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటికే రెండు చోట్ల స్టాక్‌పాయింట్లు గుర్తించాం. జిల్లాలో ఇసుకను యథేచ్ఛగా తోడేశారు. నిల్వలు తక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు రీచ్‌ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశాం. ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇసుక కొరతను తీర్చే ప్రయత్నాల్లో ఉన్నాం. – డాక్టర్ ఎస్.వి.రమణారావు, మైన్స్ ఏడీ, విజయనగరం -
ఇసుక కొరతపై ముందస్తు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ఇసుక కొరత తలెత్త కుండా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) జాగ్రత్తలు తీసుకుంటోంది. సీజన్‌లేని సమయంలో ఇసుకధరలను నియం త్రించి భవననిర్మాణాలకు కొరతలేకుండా సన్నాహాలు చేస్తోంది. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా స్టాక్ పాయింట్లు, సబ్ స్టాక్పాయింట్లలోనూ ఇసుక నిల్వ చేయాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో 30 రీచ్‌ల ద్వారా ఇసుకను వెలికి తీసి, ఆన్లైన్ విధానంలో విక్రయిస్తున్నారు. రీచ్‌ల సమీపంలో 30 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన వారికి సరఫరా చేస్తున్నారు. ఇసుక డిమాండ్ దృష్ట్యా కొత్తగా మరో 3 రీచ్‌లను తెరిచేందుకు టీఎస్ఎండీసీ సన్నాహాలు చేస్తోంది. గోదావ రిపై ఖమ్మం జిల్లా పోలంపల్లి, మానేరు నుం చి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నుంచి ఇసుకను వెలికితీసేందుకు కొత్త రీచ్‌లు ఏర్పాటు చేయాలని టీఎస్ఎం డీసీ నిర్ణయించింది. 30 రీచ్‌ల నుంచి ఇసు కను వెలికి తీస్తున్నా 27 రీచ్‌లు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో సరఫరా అవుతున్న ఇసుకలో 96 శాతం ఈ రెండు జిల్లాల పరిధిలోని రీచ్‌ల నుంచే వెలికి తీస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ టీఎస్ఎండీసీ ద్వారా రోజుకు 53 వేల క్యూ బిక్ మీటర్ల ఇసుకను వెలికి తీసి విక్రయిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో 30 వేల క్యూబిక్ మీటర్ల మేర డిమాండ్ ఉండగా, ప్రస్తుతం రెట్టింపు ఉన్నట్లు టీఎస్ఎండీసీ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాలం సమీపి స్తుండటంతో భవన నిర్మాణదారులు ముందుజాగ్రత్తగా నిలువ చేస్తుండటంతో డిమాం డ్ పెరుగుతోంది. టన్ను ఇసుకను టీఎస్ ఎండీసీ రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్ర యిస్తోంది. రవాణా, ఇతర చార్జీలు కలుపు కుని బహిరంగమార్కెట్లో రూ.1,250 నుంచి రూ.1,500 వరకు ధర పలుకుతోంది. వర్షా కాలం ఆరంభం అవుతుండటంతో రీచ్‌ల వద్ద ఇసుక వెలికితీత మొదలుకుని, స్టాక్ పాయిం ట్ల నుంచి రవాణా వరకు అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో దళారీలు మార్కెట్లో రేటు అమాంతం పెంచేస్తుండ టంతో వినియోగదారులపై భారం పెరగ నుంది. గత అక్టోబర్‌లో టన్ను ఇసుకధర మార్కెట్లో రూ.3 వేలకు చేరిన విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. 60 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వl స్టాక్ పాయింట్ల వద్ద ఇప్పటివరకు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసిన టీఎస్ ఎండీసీ మరో 40 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జంటనగరాల పరిధిలోనే ఇసుక వినియోగం ఎక్కువగా ఉండటంతో సబ్ స్టాక్ పాయింట్ల వద్ద నిల్వలు పెంచాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్, మరో రెండుచోట్ల సబ్ స్టాక్ పాయింట్లను నిర్వహి స్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ నుంచి రవాణా అవుతున్న ఇసుకను కొంత మేర కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టాక్ పాయింట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇసుక డిమాండ్ పెరిగే పక్షంలో స్టాక్ పాయింట్లతో పాటు, సబ్ స్టాక్ పాయింట్లలోనూ నిల్వలు పెంచేలా టీఎస్ఎండీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
జాతీయ రహదారిపై స్టాక్ దందా
దగదర్తి (బిట్రగుంట): దగదర్తి మండలం ఉలవపాళ్ల నుంచి సున్నపుబట్టీ వరకు జాతీయ రహదారి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. డీజిల్, పెట్రోల్ నుంచి వివిధ రకాల రసాయనాలకు సంబంధించి కొందరు అక్రమ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న దాబా హోటళ్లు, టైర్లకు పంక్చర్లు వేసే దుకాణాలు ఇందుకు వేదికగా మారుతున్నాయి. వీటి పక్కనే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుంటున్న అక్రమార్కులు ట్యాంకర్ల నుంచి సేకరిస్తున్న డీజిల్, పెట్రోల్‌ను కిరోసిన్, ఇతర రసాయనాలతో కల్తీ చేసి గ్రామాల్లోని దుకాణాలకు తరలిస్తున్నారు. వీటితో పాటు కల్తీ పామాయిల్, ఎముకల నుంచి తీసిన ఆయిల్‌ను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి నాణ్యమైన పామాయిల్‌గా డబ్బాల్లో నింపి దాబా హోటళ్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఉలవపాళ్ల నుంచి సున్నపుబట్టి వరకూ ఆరు కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి అక్రమ స్టాక్ పాయింట్లు పది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో స్టాక్ పాయింట్ నుంచి పోలీసులకు నెలనెలా భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉలవపాళ్ల వద్ద దాబా హోటల్ పక్కనే ఉన్న పెట్రోల్, డీజిల్ అక్రమ స్టాక్ పాయింట్‌పై కొద్ది నెలల క్రితం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దగదర్తి రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. డీజిల్, పెట్రోల్‌ను భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అంతలోనే నిర్వాహకులు తమదైన శైలిలో పావులు కదపడంతో కేసు లేకుండానే వదిలేశారు. ప్రస్తుతం ఈ స్టాక్ పాయింట్లోరోజూ 500 నుంచి వెయ్యి లీటర్ల వరకూ డీజిల్, పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీజిల్, పెట్రోల్ సేకరించేదిలా.. నెల్లూరు వైపు వెళ్లే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లతో అక్రమ స్టాక్ పాయింట్ నిర్వాహకులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ బయలుదేరిన వెంటనే డ్రైవర్ స్టాక్ పాయింట్ నిర్వాహకుడికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. అనంతరం స్టాక్ పాయింట్ల వద్ద ట్యాంకర్లను నిలిపి 25 లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ సేకరిస్తారు. ఇందుకు గాను డ్రైవర్, క్లీనర్లకు లీటరు డీజిల్‌కు రూ.35, పెట్రోల్‌కు రూ.45 వంతున చెల్లిస్తారు. ఇలా సేకరించిన పెట్రోల్, డీజిల్‌ను కిరోసిన్, ఇతర రసాయనాలతో కల్తీ చేసి గ్రామాల్లోని విక్రేతలకు డీజిల్ లీటరు రూ.50 వంతున, పెట్రోల్ రూ.60 వంతున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈఅక్రమ స్టాక్ పాయింట్లపై ఎస్పీకి నేరుగా ఫిర్యాదులు అందటంతో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది రహస్యంగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దాడులు నిర్విహ స్తాం.. గతంలో ఉలవపాళ్లలో పెట్రోల్, డీజిల్ అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాం. కేసులు కూడా నమోదు చేశాం. ఇటీవల కాలంలో మళ్లీ విక్రయాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. మరోమారు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ దందాను అడ్డుకుంటాం. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుంటాం. -వెంకట్రావు, దగదర్తి ఎస్ఐ -
పటిష్టంగా కొత్త ఇసుక పాలసీస
మండల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కలెక్టర్ యువరాజ్ ఆదేశం విశాఖ రూరల్ : జిల్లాలో కొత్త ఇసుక పాలసీని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ అమలుకు విధివిధానాలు జారీ చేసిందని చెప్పారు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా ఆయా శాఖల అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయి శాండ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇసుక తవ్వకాలకు వీలున్న నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి, సరిహద్దులను నిర్ణయిస్తూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు జిల్లా స్థాయి ఇసుక కమిటీ అప్పగించాల్సి ఉందన్నారు. ఆ నివేదికను ఈ నెల 8కి తనకు సమర్పించాలన్నారు. ఆయా ఇసుక తవ్వక ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జీలు, మండల మహిళా సమాఖ్యలతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై అవగాహనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తవ్విన ఇసుకను నిల్వ ఉంచేందుకు ప్రధాన రహదారుల దగ్గర్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచి, వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని చెప్పారు. తహశీల్దార్, ఎంపీడీఓ, పోలీసులతో మండల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్, అన్లోడింగ్ పనులకు ఉపాధి హామీ కూలీలను వినియోగించుకొనే అంశాన్ని పరిశీలించాలని డ్వామా పీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీపీఓ సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పెన్నా విలాపం
రెండు దశాబ్దాల క్రితం ఇసుక తిన్నెల సొగసులతో పామిడి వద్ద పెన్నా నది కళకళలాడేది. వర్షా కాలం నీటితో నిండుగా ప్రవహిస్తూ సుందర దృశ్యాలతో కనువిందు చేసేది. ఆట విడుపుగా జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల ప్రజలు పెన్నా నదీ తీరానికి వెళ్లి.. నదిలో జలకాలాడుతూ మధురానుభూతిని పొందేవారు. నీరు లేని సమయంలో ఇసుక తిన్నెల దొంతరలు కనిపించేవి. ఇపుడా పరిస్థితి లేదు. ‘పెన్నా’ విలపిస్తోంది. ఇసుకాసురుల తవ్వకాలతో నది ‘గుంతల’ గాయాలతో విలవిలలాడుతోంది. పామిడి : పామిడి పెన్నా నది నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ‘తెల్ల’ బంగారాన్ని రవాణా చేస్తూ కాసులు పండించుకుంటున్నారు. నదీ తీరాన ఉన్న సమాధులను సైతం పెకలించి.. శ్మశానాలను దురాక్రమణ గావిస్తూ ఇసుకను కొల్లగొడుతున్నారు. ‘స్టాక్ పాయింట్లు’ ఏర్పాటు చేసుకుని, అనంతపురంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకే కాకుండా సమీప కర్నూలు, వైఎస్సార్, కర్ణాటకలోని బళ్లారి తదితర జిల్లాలతో పాటు బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాలకు కూడా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. రోజుకు 500 పైబడి ట్రాక్టర్ల లోడుతో ఇసుక తోడేస్తున్నారు. అయినా అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో నది పరిసరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. సుమారు వంద అడుగులు పైబడి లోతున కూడా నీరు లభ్యం కాని దుస్థితి. మరోవైపు నదీ ప్రాంతాన్ని, శ్మశానాలనూ సైతం కొందరు దురాక్రమణ చేస్తుండడంతో తోటలు, వరిమళ్లు, ఇటుక బట్టీలు, అక్రమ కట్టడాలు పెరిగి పోతున్నాయి. దీంతో పెన్నా విస్తీర్ణం కుంచించుకు పోతోంది. దీనికి తోడు కంప చెట్లు, చెత్తదిబ్బల మయంగా మారిన పెన్నా నదిలో పలు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. చెత్తదిబ్బల వల్ల పబ్లిక్ ట్యాపుల్లో కలుషిత నీరు వస్తోంది. తద్వారా తీవ్ర కీళ్ల నొప్పులు వస్తున్నాయని పామిడి ప్రజలు వాపోతున్నారు. పెన్నా నది దుస్థితిపై రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి ఇసుక అక్రమ రవాణాతో పెన్నానది పొడవునా గుంతలు పడ్డాయి. నదిలో నీరు చేరగానే గుంతలు నిండి సుడిగుండాలుగా మారుతున్నాయి. వాటిని గుర్తించలేక అందులో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెన్నాను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. - నాగరాజు ‘నిధి’గా మారిన నది పెన్నా నదిలోని ఇసుక అక్రమార్కులకు నిధిగా మారింది. వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలించేస్తున్నారు. ఇక కబ్జాదారులు సైతం ఇష్టారాజ్యంగా స్థలాన్ని ఆక్రమించుకుని క్రయవిక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. - ఆనంద్ శ్మశానాలకు దారులే లేవు ఇసుక అక్రమ రవాణాదారులు శ్మశానానికి వెళ్లే దారులను సైతం వదలడం లేదు. దీంతో పెన్నాలో అంత్యక్రియలు నిర్వహించడానికి దారి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పూడ్చిన చోటే మళ్లీమళ్లీ మృతదేహాలను పూడ్చాల్సిన దుస్థితి. అధికారులు చర్యలు తీసుకుని నదిని కాపాడి, ప్రజలకు ఇబ్బందులు తొలగించాలి. - జయరాజు -
గోదాముల్లో హద్దు దాటుతున్న అవినీతి
సాక్షి, అనంతపురం : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రాయలసీమ జిల్లాల సరిహద్దులోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిపోతోంది. నిత్యావసర సరుకుల గోదాముల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న 231 మండలాలకు 96 చోట్ల మండల లెవల్ స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్) ఉన్నాయి. ఇక్కడికొచ్చే నిత్యావసర సరుకులను రేషన్ షాపులకు ప్రతినెలా సరఫరా చేస్తుంటారు. బియ్యం, చక్కెర సహా ఇతర వస్తువులను క్వింటాళ్ల కొద్దీ తూకం వేసి డీలర్లకు అందించాలి. చాలా గోదాముల్లో నిర్వాహకులు (డిప్యూటీ తహశీల్దార్లు) తూకాలు వేయకుండానే అందిస్తున్నారు. డీలర్లు సైతం నమ్మకమే తూకంగా సరుకులను వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. ఇంటికెళ్లిన తరువాత బస్తాల్లో తక్కువ వచ్చిన బియ్యాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ భారాన్ని పూడ్చుకునేందుకు ప్రతినెలా కార్డుదారులకు కోత వేస్తున్నారు. కొందరైతే అసలే ఎగ్గొడుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉంటోంది. ఎందుకిలా? తూకాల్లో మోసాల నివారణకు రెండేళ్ల క్రితం సీమ పరిధిలోని అన్ని గోదాములకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు పంపిణీ చేశారు. ఇవి నెలలు కూడా గడవకముందే మూలకు చేరాయి. కొన్నిచోట్ల ఉన్నా..విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో ఉపయోగపడటం లేదు. ఈ పరిస్థితి గోదాముల ఇన్‌చార్జ్‌లకు వరంగా మారింది. డీలరుకు అందే బియ్యం బస్తా బరువు కచ్చితంగా 50 కిలోల 660 గ్రాములు ఉండాలి. ఇందులో 660 గ్రాములు సంచి బరువుగా పరిగణిస్తారు. ఏ గోదాములోనూ ఈ మేరకు ఇవ్వడం లేదు. రెండు కిలోలు తక్కువ ఇస్తున్నారు. ఇలా బొక్కుతున్న బియ్యాన్ని ఆయా జిల్లాల సరిహద్దులు దాటిస్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా 38,37,180 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతినెలా ప్రభుత్వం 59,594 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. 50 కిలోల బస్తాకు రెండు కిలోల చొప్పున బొక్కుతున్న గోదాము ఇన్‌చార్జ్‌లు మొత్తం 59,594 మెట్రిక్ టన్నుల బియ్యంపై 23,83,760 కిలోలు (దాదాపు 2,384 మెట్రిక్ టన్నులు) కొట్టేస్తున్నారు. ఈ బియ్యాన్ని పొరుగు రాష్ట్రాల్లో కిలో రూ.10-12లకు విక్రయిస్తున్నారు. త ద్వారా నెలకు దాదాపు రూ. 2.50 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు పంపకాలు ఉండటంతో ఎవరూ నోరుమెపడం లేదన్న విమర్శలున్నాయి. అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు చేరుతున్న చౌక బియ్యాన్ని అక్కడి మిల్లర్లు రీసైక్లింగ్ చేస్తున్నారు. వాటిని మిల్లింగ్, పాలిషింగ్ చేసిన త ర్వాత సన్నబియ్యం పేరిట తిరిగి సీమ పరిధిలోని వ్యాపారులకు కిలో రూ.29-30 చొప్పున విక్రయిస్తున్నారు. దాడులు శూన్యం రేషన్ బియ్యం పెద్దఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నా అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. కాసులకు కక్కుర్తి పడి గోదాము ఇన్‌చార్జ్‌లకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డీలర్లకు ఎంత బియ్యం సరఫరా అవుతోంది..కార్డుదారులకు ఏ మేరకు విక్రయిస్తున్నారనే విషయాలపై పక్కాగా రికార్డులు పరిశీలన చేయాల్సివున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై అనంతపురం జిల్లా సివిల్‌సప్లయీస్ జిల్లా మేనేజర్ వెంకటేశంను ‘సాక్షి’ వివరణ కోరగా.. గోదాములను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. బస్తాల్లో బియ్యం తక్కువగా వచ్చినట్లు తెలిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
గోదాముల్లో గూడు పుఠాణి
సాక్షి, అనంతపురం : మండల స్థాయి స్టాక్ పాయింట్లు(ఎంఎల్ఎస్) అక్రమాలకు నిలయంగా మారాయి. ఇక్కడి నుంచి చౌక డిపోలకు సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇది తెలిసినా డీలర్లు కిమ్మనడం లేదు. అధికారులను ప్రశ్నిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో సర్దుకుపోతున్నారు. ఆ మేరకు ‘లోటు’ను పూరించుకునేందుకు కార్డుదారులకు ‘కోత’ వేస్తున్నారు. దీనివల్ల అంతిమంగా పేదలు నష్టపోవాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 63 మండలాలకు గాను 24 మండలాల్లో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి చౌక డిపోలకు ప్రతినెలా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంటారు. బియ్యం, చక్కెర వంటి వాటిని క్వింటాళ్ల కొద్దీ తూకం వేసి డీలర్లకు అందజేయాలి. అయితే... సరైన తూకాలు లేకుండానే అంటగడుతున్నారు. డీలర్లు కూడా కిమ్మనకుండా వాహనాల్లో ఎక్కిస్తున్నారు. ఇంటికెళ్లిన తరువాత తూకం తక్కువగా ఉండడం చూసి కంగుతింటున్నారు. ఆ లోటును పూడ్చుకునేందుకు కార్డుదారులకు తూకాల్లో మోసం చేస్తున్నారు. గోదాముల్లో సరుకులను తూకం వేసేందుకు సరైన పరికరాలు లేవు. దీంతో సలువుగా మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో మోసాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని 2008లో అప్పటి కలెక్టర్ జనార్దనరెడ్డి ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే... అది మరుగున పడిపోయింది. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు లేకపోవడంతో గోదాముల ఇన్‌చార్జ్‌లు (సీఎస్డీటీలు) యథేచ్ఛగా బియ్యాన్ని బొక్కేస్తున్నారు. అనంతపురం మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పౌరసరఫరాల గోదామును ‘సాక్షి’ పరిశీలించగా.. అక్రమాలు వెలుగు చూశాయి. గోదాములోని బియ్యం బస్తాలలో 20 బస్తాలను సాధారణ వేయింగ్ మిషన్ ద్వారా తూకం వేయగా... ఒకటి మినహా 19 బస్తాలు 46-47 కిలోలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయమై సిబ్బందిని ప్రశ్నించగా... ‘మాకేమీ తెలీదు సార్! సీఎస్డీటీకే తెలుసం’టూ తప్పుకున్నారు. సీఎస్‌డీటీ కోసం ఆరా తీయగా...ఆయన గోదాము పరిసరాల్లోనే కనిపించలేదు. బస్తాకు 3-4 కిలోల లోటు డీలరుకు సరఫరా చేసే బియ్యం బస్తా బరువు (గోనె సంచితో కలుపుకుని) కచ్చితంగా 50 కిలోల 660 గ్రాములు ఉండాలి. ఇందులో 50 కిలోల బియ్యం, 660 గ్రాములు సంచి బరువుగా లెక్కిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన 23 గోదాముల్లోనూ 46-47 కిలోల లోపే ఉంటోందని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. బస్తాకు 3-4 కిలోలు తక్కువ ఇస్తుండడంతో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ లెక్కన ఒక డీలర్ వంద క్వింటాళ్ల బియ్యం (200 బస్తాలు) తీసుకెళ్తే... బస్తాకు 3-4 కిలోల చొప్పున మొత్తం 600 నుంచి 800 కిలోల బియ్యాన్ని కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రతినెల 10.50 లక్షల తెల్లకార్డులకు 14,500 మెట్రిక్ టన్నుల (2.9 లక్షల బస్తాలు) బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. బస్తాకు 3-4 కిలోల చొప్పున మొత్తమ్మీద 8 లక్షల నుంచి 11.6 లక్షల కిలోల బియ్యం (8 వేల నుంచి 11,600 క్వింటాళ్లు) మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి పక్కదారి పడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ మోసం కారణంగా అంతిమంగా కార్డుదారులు నష్టపోతున్నారు. ప్రతి నెలా గోదాముల్లో బియ్యాన్ని బొక్కుతున్న అధికారులు... వారికి అనుకూలురైన దళారుల సాయంతో నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం చౌక బియ్యం బస్తాల తూకం తక్కువగా ఉంటున్న విషయం ఇంతవరకు నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - పౌరసరఫరాల జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు అది మామూలే బియ్యం బస్తాలు తక్కువగానే ఉంటాయి. మిల్లర్ల వద్ద నుంచి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసేటప్పుడు అవి తడిగా ఉంటాయి. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటుంది. గోదాముల్లోకి వచ్చిన తరువాత బియ్యంలో తేమ శాతం తగ్గిపోవడమే కాకుండా... ఎలుకలు రంధ్రాలు పెట్టి తినడం వల్ల తూకాలు తగ్గిపోతాయి. - జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) శాంతకుమారి -
బియ్యానికి భరోసా
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే రేషన్ సరకులకు ఇబ్బందులు తప్పాయి. ఉధృతంగా కొనసాగుతున్న సమైక్య సమ్మె వల్ల సెప్టెంబరు కోటా సరకుల పంపిణీకి ఇబ్బందులు తప్పవని భావించినా చివరకు ఆటంకాలు తొలగాయి. తొలుత రేషన్ డీలర్ల నుంచి సమ్మె సెగ తగులుతుందనే భయంతో అధికారులు కంగారుపడ్డారు. కానీ సరకుల పంపిణీకి సహకరించడానికి ముందుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో సమ్మె మరింత ఉధృతం అయ్యేలోగా జిల్లాలో ఎక్కడికక్కడ బియ్యం పంపిణీ పూర్తి చేయించడానికి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే అమ్మహస్తం సంచులను కార్డుదారులకు అందించనున్నారు. జిల్లాకు ప్రతి నెలా తెల్ల బియ్యం కోటా కింద 1500 టన్నుల బియ్యం అవసరం. నెల రోజులకుపైగా జరుగుతున్న సమైక్య ఉద్యమం కారణంగా ఆగస్టు నెల బియ్యం కోటా ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. చాలామంది కార్డుదారులు సైతం సరకులు విడిపించుకోలేదు. ఈ నేపథ్యంలో చాలావరకు సరకు మిగిలిపోయింది. దీనికి తోడు సెప్టెంబరు కోటా బియ్యం తొలి విడతగా విడుదలైన బియ్యంతో ప్రసుత్తం పలు గోడౌన్లలో 750 టన్నుల బియ్యం నిల్వలున్నాయి. మిగిలిన సరకు చేతికి వచ్చేలోపు వీటిని కార్డుదారులకు సరఫరాచేయాలని అధికారులు నిర్ణయించారు. సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపించడంతో రెండురోజుల నుంచి అధికారులు రేషన్ డీలర్ల నుంచి డీడీలు కట్టించుకోవడం మొదలుపెట్టారు. మరో రెండు రోజుల్లో మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం వాహనాలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల బియ్యం తరలించే వాహనాలను ఆందోళనకారులు అడ్డగిస్తుండడంతో సరకు గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర జాప్యమవుతోంది. ఇప్పటికే పలుజిల్లాలో ఇటువంటి పరిస్థితులు సంభవించడంతో జిల్లాలో ఆ సమస్యలు లేకుండా ఉండేందుకు అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించే వాహనాలను అడ్డుకోవద్దని పిలుపునిచ్చారు. అవసరమైతే వాహనాలకు కొంతవరకు భద్రత కల్పించాలని ఆలోచిస్తున్నారు. మరోపక్క జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా పౌరసరఫరాశాఖ అధికారులు ఎక్కడికక్కడ మండలాలకు బియ్యం సకాలంలో చేరేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు తెల్ల బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత అమ్మ హస్తం సంచులు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెల్ల కార్డుల ప్రకారం జిల్లాకు 10.84 లక్షల సంచులు అవసరం. వీటిలో మొత్తం అన్నీ ఒకేసారి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అందులో సగమైనా జిల్లాకు రప్పించి పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నారు.