సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతల సిఫార్సులు ఉంటేనే ఇసుక దొరుకుతుంది. లేదంటే ఇసుక దొరికే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు, భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకాణి చెప్పుకొచ్చారు.
నెల్లూరులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఉచిత ఇసుక ఇస్తామన్న ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతోంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చుల పేరుతో ప్రభుత్వం ఇసుకను మూడు నాలుగు రెట్లు అధిక రేటుకు అమ్ముతున్నారు. టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే ఇసుక దొరుకుతుంది.. లేకుంటే ఇసుక దొరికే ప్రసక్తే ఉండదు.
సంగం దగ్గర ఉన్న సూరాయపాలెం ఇసుక రీచ్ దగ్గర సోమిరెడ్డి అధిక ధరకు ఇసుక అమ్మాలి అని ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందని చెప్తున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జిల్లా మైనింగ్ డీడీగా ఉన్న అధికారినే ఎందుకు కొనసాగిస్తున్నారు. జిల్లాలో మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడి ఉంటే జిల్లా మైనింగ్ డీడీ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఉచిత ఇసుక విధానంలో సరైన చర్యలు తీసుకుని సరసమైన ధరలకు ప్రజలకు అందేలా చూడాలి లేదంటే ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం. జిల్లా యంత్రాంగమంతా ఇసుక అక్రమార్కులకు సహకరిస్తుంది. జిల్లా ఎస్పీ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై కూడా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి.. వైఎస్ జగన్ నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే ఆయన పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తాడా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారిన వారు కాలగర్బంలో కలిసిపోయారు.. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment