Sand Reach
-
ఇసుక కోసం టీడీపీ, జనసేన సిగపట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఇసుక కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు గురువారం సిగపట్లు పట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు, సిద్దవటం మండల జనసేన పార్టీ నాయకుడు అతికారి కృష్ణ వర్గీయులు బాహాబాహీకి దిగారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కలెక్టరేట్లోనే ఈ రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణపడ్డాయి. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల గ్రామం వద్ద ఇసుక రీచ్‌కి గనులు, భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 5.30 లోగా టెండర్లు దాఖలు చేయాలని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరువర్గాల నాయకులు గురువారం ఉదయమే చేరుకున్నారు. టెండరు పత్రాల దాఖలు సమయంలోనే వివాదం మొదలైంది. తమ సొంత మండలమైన సిద్దవటంలో ఇసుక టెండరు తమకే దక్కాలని అతికారి కృష్ణ వర్గీయులు పట్టుపట్టారు. బీటెక్ రవి వర్గీయులు ససేమిరా అన్నారు. అతికారి కృష్ణ వర్గీయుల నుంచి టెండరు ఫారాలు లాగేసుకున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి, అతికారి కృష్ణ వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారి తీసింది. ఒక దశలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో కార్యాలయం ప్రాంతం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ వాతావరణంలోనే టెండర్లు వేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు సైతం టెండర్లకు హాజరయ్యారు. టెండర్లను ఖరారు చేస్తారా లేదా తిరిగి నిర్వహిస్తారా అనే విషయం కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా మైన్స్ అండ్ జియాలజీ డీడీ సూర్యచంద్రరావు అందుబాటులోకి రాలేదు. -
Andhra Pradesh: కాసులకే ఇసుక
⇒ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో శనివారం 20 టన్నుల ఇసుక కోసం ఓ వినియోగదారుడు అధికారికంగానే రూ.18,570 చెల్లించాడు. ఇదికాకుండా లోడ్ చేసినందుకు రూ.3 వేలు, టోల్గేట్ రూ.660, ఇతరాలన్నీ కలిపి ఇంటికి వెళ్లేసరికి రూ.25 వేలు సమర్పించుకున్నాడు. ⇒ విశాఖలో 20 టన్నుల ఇసుకను రూ.45 వేలకుపైగా చెల్లించి కొనాల్సి వస్తోంది. విజయవాడలోనూ 20 టన్నుల ఇసుక రూ.25 వేలకు తక్కువ దొరకడం లేదు.సాక్షి, అమరావతి:డబ్బులెవరికీ ఊరికే రావు..! ఉచిత ఇసుక కూడా ఊరికే రాదు!!డబ్బులిస్తే మాత్రం ఉచితంగానే వస్తుంది!!విచిత్రంగా ఉన్నా ఇది నిజం! ఉచిత ఇసుక అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రీచ్‌లను పచ్చముఠాల చేతుల్లో పెట్టేసి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఉచితంగా ఇస్తున్నామని నమ్మబలుకుతూ వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాధారణ ధరకు ఇసుక దొరికే పరిస్థితి లేకుండాపోయింది. 20 టన్నుల లారీ ఇసుక రూ.25 వేల నుంచి రూ.45 వేలకు పైనే పలుకుతోంది. ట్రాక్టర్ ఇసుకను రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత డబ్బులు కట్టాక ఇక ఉచితం ఏమిటని వినియోగదారులు వాపోతున్నారు. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల టన్నులను పచ్చముఠాలు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం తెలిసిందే. మిగతా ఇసుకను సైతం ఊడ్చేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేయడంతో 40 లక్షల మందికిపైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. వసూళ్లు మామూలేఇసుకపై జీఎస్టీ, సీనరేజీ చార్జీలు రద్దు చేశామంటూ ఇటీవల మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి సర్కారు ప్రకటించింది. అయితే వసూళ్లు మాత్రం ఆగలేదు. తవ్వకం, లోడింగ్ చార్జీలతోపాటు జీఎస్టీ ముక్కుపిండి వసూలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. రీచ్‌లన్నీ ప్రైవేట్ చేతిలో పెట్టేసి..ఇసుక రీచ్‌లను టెండర్ల ప్రక్రియ నిర్వహించి మరీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిన కూటమి సర్కారు ఉచితంగా ఇస్తున్నట్లు బుకాయించడం విడ్డూరంగా ఉందని ప్రజాసంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టన్ను ఇసుక తవ్వేందుకు రూ.35 నుంచి రూ.120 వరకూ వసూలు చేసేలా టెండర్ వేసి దక్కించుకున్న టీడీపీ నేతలు ఉచితంగా ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం విచిత్రమైన సమాధానాలు చెబుతోంది. ఇసుక కావాల్సిన వారు రీచ్‌లకు నేరుగా కార్మికులను తీసుకెళ్లి తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది! లేదంటే కాంట్రాక్టు సంస్థలకు డబ్బులు కట్టి ఇసుకను తీసుకెళ్లాలంటోంది. రీచ్‌లు లేని చోట్ల సొంత మనుషులకు లైసెన్సులు! ఒకవైపు రీచ్‌లన్నింటినీ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేసి మరోవైపు వినియోగదారులు లారీలు, కార్మికులను తీసుకెళ్లి ఇసుక తవ్వించుకుని తీసుకెళ్లాలని ప్రభుత్వం చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు రీచ్‌లు అప్పగించిన తర్వాత వినియోగదారులు వారిని కాదని ఇసుకను తవ్వించే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలి. ఉచితంగా ఇస్తున్నట్లు చిత్రీకరించే క్రమంలో ఇలాంటి వింత విధానాలు తెచ్చింది. సాధ్యం కాని రీతిలో ప్రజలే ఇసుకను తవ్వించుకోవాలని చెబుతూ పచ్చ ముఠాల దోపిడీకి లైన్ క్లియర్ చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఇక ఇసుక రీచ్‌లు లేని జిల్లాల్లో తమ సొంత మనుషులకు మినరల్ డీలర్ లైసెన్సులు ఇచ్చి మరో తరహా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో ఇందుకు టెండర్లు పిలవనున్నారు. తీసుకెళ్లనివ్వని ‘తమ్ముళ్లు’స్థానిక అవసరాలకు ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఎవరైనా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చన్న ప్రభుత్వ ప్రకటన బోగస్ అని తేలిపోయింది. ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇసుకను లోడ్ చేయించుకునేందుకు టీడీపీ నేతలు ఎక్కడా ఒప్పుకోవడం లేదు. సామాజిక అవసరాలు, వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా స్థానికంగా ఎక్కడా అందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా సరే తమకు డబ్బు కట్టాల్సిందేనని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు వారే ట్రాక్టర్లలో ఇసుకను రీచ్‌ల నుంచి ప్రైవేట్ డంప్‌లకు భారీగా తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. రీచ్‌ల్లో అమ్మకాల కంటే అక్రమ రవాణాయే ఎక్కువగా జరుగుతోంది. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా అది అంత సులభంగా జరిగే ఆస్కారం లేకుండా పోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నానా తిప్పలు పడి ఎలాగోలా బుక్ చేసుకున్నా స్లాట్ రావడానికి నాలుగైదు రోజులు పడుతుండటంతో నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు.పూతలపట్టు నుంచి బెంగళూరుకు !రోజూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీడీపీ నేతసాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ టీడీపీ నేతలకు వరంగా మారింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించటంతో ఆ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సురక్షిత ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రిళ్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఒక టీడీపీ నేత నిర్వాకమే ఇందుకు నిదర్శనం. పూతలపట్టు మండలం వావిల్‌తోట వంకలోని ఇసుకను టీడీపీ నేత తవ్వించి ట్రాక్టర్లలో తరలించి శివారు ప్రాంతంలోని వినియోగంలో లేని క్రషర్స్, వాటి పరిసర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. రాత్రి వేళ ఆ ఇసుకను లారీలు, కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా ఎవరైనా అడిగితే... తన సొంతానికి అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా 15 రోజులుగా నిత్యం పెద్ద ఎత్తున ఇసుకను అడ్డగోలుగా తవ్వి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది. సదరు టీడీపీ నేత ఈ దందాలో మరికొందరు టీడీపీ నాయకులు, అధికారులకు వాటా ఇస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’ఇసుక తీసుకెళుతున్న ఎడ్లబండ్లు, ట్రాక్టర్లకు డబ్బు వసూలు చేస్తున్న టీడీపీ నేతప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలియాస్ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధికార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమతించడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.అక్రమ రవాణాకు అడ్డారామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే ఇసుక ఇస్తున్నారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతల సిఫార్సులు ఉంటేనే ఇసుక దొరుకుతుంది. లేదంటే ఇసుక దొరికే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు, భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకాణి చెప్పుకొచ్చారు.నెల్లూరులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఉచిత ఇసుక ఇస్తామన్న ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతోంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చుల పేరుతో ప్రభుత్వం ఇసుకను మూడు నాలుగు రెట్లు అధిక రేటుకు అమ్ముతున్నారు. టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే ఇసుక దొరుకుతుంది.. లేకుంటే ఇసుక దొరికే ప్రసక్తే ఉండదు.సంగం దగ్గర ఉన్న సూరాయపాలెం ఇసుక రీచ్ దగ్గర సోమిరెడ్డి అధిక ధరకు ఇసుక అమ్మాలి అని ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందని చెప్తున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జిల్లా మైనింగ్ డీడీగా ఉన్న అధికారినే ఎందుకు కొనసాగిస్తున్నారు. జిల్లాలో మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడి ఉంటే జిల్లా మైనింగ్ డీడీ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఉచిత ఇసుక విధానంలో సరైన చర్యలు తీసుకుని సరసమైన ధరలకు ప్రజలకు అందేలా చూడాలి లేదంటే ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం. జిల్లా యంత్రాంగమంతా ఇసుక అక్రమార్కులకు సహకరిస్తుంది. జిల్లా ఎస్పీ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై కూడా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి.. వైఎస్ జగన్ నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే ఆయన పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తాడా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారిన వారు కాలగర్బంలో కలిసిపోయారు.. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదన్నారు. -
అదంతా ‘పచ్చ’ అబద్ధం!
సాక్షి, అమరావతి: నిత్యం కట్టుకథలతో పేజీలకు పేజీలు నింపేస్తున్న ఈనాడు పత్రిక గురువారం మరో అబద్దాన్ని అందంగా అచ్చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల పోద్బలంతో అక్కడి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్న అమరావతి ఈనాడు విలేకరిపై ఏకంగా పెట్రోల్‌పోసి నిప్పంటించేస్తామని బెదిరించి... చంపబోయారన్నట్టు... ఓ అబద్దపు వార్త ప్రచురించింది. వాస్తవానికి ఆ విలేకరి పీడీయాక్ట్పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన టీడీపీ నేత దండా నాగేంద్రతో సన్నిహితంగా ఉంటూ అతను చెప్పినట్టు ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. అక్రమాలకు పాల్పడుతున్న ఆ విలేకరిని వేరే పత్రిక తొలగిస్తే టీడీపీనేత దండా సిఫార్సుతో ఈనాడులో కొన్నాళ్ల క్రితం చేరాడు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్న నాగేంద్రం సూచనమేరకు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. ఇసుక ర్యాంపులోకి అక్రమంగా... అమరావతి మండలం మల్లాది ఇసుకరీచ్‌ను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం స్వయంగా పరిశీలించారు. కానీ తవ్వకాలు ఆపమని బుధవారానికి ఎటువంటి ఆదేశాలు రాకపోవటంతో యథావిధిగానే ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థాయి అధికారులు ఉదయం 10.30గంటలకు వచ్చి తవ్వకాలు ఆపేయాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడింగ్ చేయటానికి నిర్వాహకులు బిల్లులు రాశారు, ఇంకా బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనక్కు పంపారు. బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలతో ఇసుక పంపించేశారు. అదే సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో “ఏంటబ్బాయ్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నావు... గతంలో కూడా ఇలాగే ఫొటోలు తీసి నిజాలు దాచిపెట్టి అబద్దాలు రాసి మన ఊరి పరువుతీస్తున్నావ’ని సరదాగా అన్నారు. దానికి ఆయన “నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రీచ్‌లోకి రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తాను’ అంటూ దురుసుగా మాట్లాడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఈనాడు కంట్రిబ్యూటర్ కవ్వింపు చర్యలకు దిగడంతో తోపులాట జరిగింది. వెంటనే ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి కంట్రిబ్యూటర్‌ను ద్విచక్ర వాహనంపై పంపించేశారు. కిందపడిపోయిన ఆయన సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం ద్వారా అప్పగించారు. ఈనాడులో వచ్చింది అబద్ధం జరిగిన సంఘటన ఒకటైతే... ఈనాడు పత్రికలో వేరేవిధంగా వార్త వచ్చిందని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు మీడియాకు తెలిపారు. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఈనాడు కంట్రిబ్యూటర్ ఇసుక రీచ్‌లోకి ప్రవేశించడమే గాకుండా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగాడనీ ఆ సమయంలో “పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం’ అని ఎవరూ అనలేదని, అసలు నిర్బంధించలేదని చెప్పారు. ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్సీపీ అనిగానీ, ఎమ్మెల్యే శంకరరావు పేరుగానీ ప్రస్తావించకపోయినా ఈనాడులో తప్పుడు కథనాలు ప్రచురించారని తెలిపారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, రాజకీయ రంగు పులిమారనీ పేర్కొన్నారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో కంట్రిబ్యూటర్ గుంటూరు ఈనాడు కార్యాలయానికి వెళ్లాక, అక్కడ కట్టు కథ అల్లి అడ్డగోలుగా వార్త ప్రచురించినట్టు స్పష్టమైంది. -
ఇసుక తవ్వకాలపై నిషేధం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి–2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరీలో 18 ఓపెన్ ఇసుక రీచ్‌లకు ఇచ్చిన అనుమతులను మాత్రమే కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని తెలిపారు. మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను ఆ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆ 18 రీచ్‌ల్లో తవ్వకాలు జరపవచ్చని తెలిపారు. పర్యావరణానికి విఘాతం కలిగించారంటూ ఈ రీచ్‌లపై ఎన్జీటీ విధించిన జరిమానాపైనా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరీల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణ శాఖ పునఃసమీక్షించాలని కోర్టు సూచించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, పర్యావరణానికి విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణ రంగానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని చోట్లా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ప్రభుత్వంపై తప్పుడు వార్తలను ప్రచురించడమే పనిగా పెట్టుకున్న ఈనాడు దినపత్రిక ఇష్టారాజ్యంగా వక్రీకరణలతో అర్థంలేని రాతలు రాయడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే దందా అంటూ ఇసుక ఆపరేషన్స్‌పై మళ్ళీ, మళ్ళీ తప్పుడు ఆరోపణలతో వార్తా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు. పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నామని వెంకటరెడ్డి వివరించారు. -
ఇసుక దోపిడీ రూ.100 కోట్లు.. పట్టించుకోని టీఎస్ఎండీసీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నకిలీ వే బిల్లులతో రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ మార్గంలో తరలిపోతోందని వరంగల్ కమిషనరేట్ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలంగా రెండున్నరేళ్లలో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆదాయం పక్క దారి పట్టినట్లు తెలుస్తోంది. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలోనే నకిలీ వే బిల్లుల దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కొందరు ఇసుక రవాణాదారులు, టీఎస్ఎండీసీ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ములుగు నుంచి తీగలాగితే... రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34 యాక్టివ్ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక లభ్యత ఉన్నచోట స్థానికులకు భాగస్వామ్యం కల్పించి టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 6 ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి నిత్యం 300 నుంచి 600 లారీలు లోడింగ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం ములుగు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుక లారీని వరంగల్‌లో పోలీసులు తనిఖీ చేశారు. నకిలీ వేబిల్లులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా.. యజమానికి 8 లారీలు ఉన్నాయని, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో యజమాని చెప్పిన చోటుకు వెళ్లి లోడింగ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకోకుండా నేరుగా లోడింగ్ చేసుకోవడం,, డబ్బులు చెల్లించడమేంటని పోలీసులకు అనుమానం వచ్చి టాస్‌్కఫోర్స్ అధికారులకు కేసును అప్పగించారు. రూపాయి చెల్లించకుండా 30 టన్నుల ఇసుక ములుగు, ఏటూరు ప్రాంతంనుంచి వచ్చే ఇసుక లారీలపై పోలీసులు నిఘా పెట్టారు. వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగాం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి దాదాపు 40 లారీలను స్వాదీనం చేసుకున్నారు. 12 టైర్ల లారీలో 26 టన్నుల ఇసుక నింపుకుంటే రూ.10,500 చెల్లించాల్సిన కొందరు లారీ యజమానులు నకిలీ వేబిల్లులతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 26 నుంచి 30 టన్నులు తీసుకెళ్లినట్లు తేలింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి 16 లారీలు, 65 నకిలీ వే బిల్లులు, 16 టీఎస్ఎండీసీ స్టాంపులు, 1 లాప్ టాప్, 11 సెల్ఫోన్లు, రూ. 41,000ల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక కొందరు టీఎస్ఎండీసీ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి క్వారీ వద్ద టీఎస్ఎండీసీకి చెందిన సూపర్వైజర్ ఉంటారు. వీరి ప్రమేయం లేకుండా ఇసుక లారీ బయటకు వెళ్లే ప్రసక్తే ఉండదు. కొందరు అధికారులు, క్వారీ నిర్వాహకులు, లారీల యజమానులు కలిసే అక్రమ దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 3 నెలల్లో 1800 లారీల ఇసుక అక్రమ తరలింపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచే మూడు నెలల్లో 1800 లారీల ఇసుక ఎలాంటి సొమ్ము చెల్లించకుండా తరలినట్లు పోలీ సు విచారణలో తేలగా, రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 యాక్టివ్ రీచ్‌ల నుంచి రూ.100 కోట్లకు పైగా వి లువచేసే ఇసుక తరలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇసుక కాదది.. ఎల్లో బురద
అయ్యా... రామోజీరావూ!! కాస్త సలహా చెప్పకూడదూ.. రాష్ట్రంలో ఇసుక ఎలా విక్రయించాలో? ఎవరిద్వారా విక్రయించాలో? ఎంతకు విక్రయించాలో? ఎందుకంటే మీ సలహా సూచనల ప్రకారం.. మీ అదుపాజ్ఞల్లో నడిచే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. కాబట్టి మీ వాటాలు మీకు రావు. ఆ కడుపుమంటతో రగిలిపోతూ మీరు రాసే కథనాలకు విశ్వసనీయత కాదు కదా... వాటిలో వీసమెత్తు విజ్ఞత కూడా ఉండటం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచి జేపీ సంస్థకు అప్పగిస్తే... ఇక్కడి సంస్థలు లేవా అంటూ వాపోయింది మీరే. ఆ సంస్థ చెన్నైకి చెందిన మరో సంస్థకు సబ్ కాంట్రాక్టుకిస్తే... రీచ్‌లన్నీ తమిళనాడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, లేబర్ కూడా కనీసం తెలుగువారు లేరని ఆక్రందనలు చేసిందీ మీరే. ఇప్పుడేమో ఏమీ లేకున్నా... చెన్నై సంస్థ తప్పుకుంటోందని, అంతా స్థానిక నేతల చేతుల్లోకి వెళ్లిపోతోందని గుండెలు బాదుకుని రోదిస్తున్నదీ మీరే!!. అసలేంటి మీ బాధ? ప్రభుత్వ వ్యతిరేకత అనే ఏకసూత్ర ఎజెండాతో రోజూ కాలాల కొద్దీ వార్తలు వండి వారుస్తున్న మీకు... మనస్సాక్షి ఉండదా? పోనీ మీ పాఠకులకైనా అది ఉంటుందని మీరనుకోరా? బాబుకు అధికారం లేకపోతే.. ఆయన, మీరు ఇలా పోటీపడి మరీ దిగజారిపోవాలా!? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం సమీపంలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు (ఫైల్) ఈ రాష్ట్రంలో ఏ మంచిపని జరిగినా ‘ఈనాడు’కు నచ్చదు. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’ పేరిట నిరుపేదల కళ్యాణానికి ప్రభుత్వం బాసటగా నిలవటమనేది రామోజీ ఒంటిపై తేళ్లూజెర్రులూ పాకించినట్లుంది. అందుకే ఆ వార్తకు ప్రాధాన్యమివ్వకుండా పాఠకుల్ని పక్కదోవ పట్టించడానికి ‘ఇక నేతలదే ఇసుక’ అనే బురద కథనాన్ని పతాక శీర్షికల్లో వార్చేశారు. అసలు చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన ఇసుక దోపిడీని వర్ణించడం సాధ్యమా? ఉచితమనే పేరుతో టీడీపీ లీడర్లంతా దందా చేస్తూ... జనానికి భారీ రేట్లకు విక్రయిస్తూ సాగించిన అరాచకాలపై ‘ఈనాడు’ ఏనాడైనా ఒక్క అక్షరం ముక్క రాసిందా? అడ్డు వచ్చిన మహిళా అధికారిని టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఈడ్చేసినా... చంద్రబాబు ఇంటి పెరట్లో రాత్రీపగలూ లారీలకొద్దీ ఇసుకను కుమ్మేసినా అదంతా బాబు ఘనతేనని చెబుతూ తరించిపోయారు రామోజీరావు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడంతో పాటు... ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు... అంటే ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు ఆదాయం వచ్చేలా చేశారు. ఆ టెండర్లను కూడా జాతీయ స్థాయిలో... కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. నిజంగా ఇసుక విక్రయం తాను రాసినంత లాభసాటిగా ఉంటుందని భావిస్తే ఆనాడే రామోజీరావు నేరుగా రూ.120 కోట్లు డిపాజిట్ కట్టి టెండర్లలో పాల్గొని ఉండొచ్చు. అలా చేయకుండా విమర్శలు చేయటాన్ని ఏమనుకోవాలి? ఫైల్ ఫొటోలు మీకసలు కల్లోనైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఇసుకపై ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. పైపెచ్చు ప్రజలకు ఏ ధరకు విక్రయించాలో ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఇందుకోసం ‘ఈనాడు’తో సహా పత్రికల్లో ప్రతి ఆదివారం ప్రకటనలిస్తోంది. దీన్లోనే ధరను నిర్దేశించటంతో పాటు... ఆ ధరకు విక్రయించకపోతే ఫిర్యాదు చేయాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) నెంబర్లూ ఇస్తోంది. ఫిర్యాదులొచ్చిన చోట ఎస్ఈబీ దాడులు చేయటమే కాక కేసులూ నమోదు చేస్తోంది. ఇవి చాలవా రామోజీ... ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో చెప్పటానికి? అసలు చంద్రబాబు హయాంలో వీటిలో ఏ ఒక్కటైనా ఉందా? ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా రాలేదు. అలాగని ప్రజలకూ ఫ్రీగా అందలేదు. ఇప్పటికన్నా ఎక్కువ ధరలకే విక్రయించారు. ఇక నేతల దందాపై ఫిర్యాదు చేసే అవకాశం లేదు. చేసినా పట్టించుకునే దిక్కూ లేదు. నేతలు చెలరేగిపోయి దౌర్జన్యాలకు పాల్పడినా... వాటన్నిటినీ హీరోగారి చర్యల్లానే చూస్తూ తాదాత్మ్యం చెందారు రామోజీరావు. ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... వాటికి లేని రంధ్రాలు వెదుకుతూ మరీ దిగజారుడు కథనాలు అచ్చేయటమే ఘోరాతిఘోరం. సబ్ కాంట్రాక్టులకివ్వటం తప్పా? ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్థలైనా కాంట్రాక్టు ఇచ్చేటపుడు కొన్ని అర్హతలను నిర్దేశించి, కాంట్రాక్టు సంస్థకు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆ అర్హతలకు లోబడి కాంట్రాక్టును సాధించిన సంస్థ... సదరు నిబంధనలను పాటిస్తోందో లేదో పర్యవేక్షించటమే ప్రభుత్వ విధి. ఆ నిబంధనలకు లోబడి సదరు కాంట్రాక్టు సంస్థ ఎవరికైనా సబ్ కాంట్రాక్టుకి స్తే వద్దనే హక్కు ఎవరికీ ఉండదు. ఇవన్నీ రామోజీకి తెలియనివి కావు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు టీడీపీ నేత శ్రీనివాస్‌కు అప్పగిస్తే... ఆయన సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. ఇక పోలవరం పనుల్లో ఏకంగా రూ.3వేల కోట్లకుపైగా పనుల్ని రామోజీ వియ్యంకుల కంపెనీ నవయుగకు కేవలం నామినేషన్‌పై ఇచ్చేశాడు చంద్రబాబు. ఇవన్నీ ‘ఈనాడు’కు సమయోచిత నిర్ణయాలుగా కనిపించటమే దౌర్భాగ్యం. నిరంతర పర్యవేక్షణ... అవసరమైన నిల్వలు జేపీ సంస్థ నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు, ఇసుక డిపోలను గనుల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు ఇసుక నిల్వలు, ఏ మేరకు అనుమతులకు దరఖాస్తు చేశారనే దానిని గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకోవడం సాధారణం. దీనికి విరుద్ధంగా.. ఇప్పటివరకు గనుల శాఖ రీచ్‌లు, ఇసుక డిపోలను పరిశీలించనే లేదంటూ ‘ఈనాడు’ అచ్చేసిన కథనం లక్ష్యం ప్రభుత్వంపై విషం చిమ్మటమేననటానికి నిదర్శనం... ఆ శాఖ వివరణ కూడా తీసుకోకపోవటమే. మరో విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో వర్షాకాలం 4 నెలల పాటు ఇసుక లభించక రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయేవి. కారి్మకులు ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనికి ప్రణాళికాబద్ధంగా అడ్డుకట్ట వేసింది. వర్షాకాలంలోనూ ఇసుక లభ్యమయ్యేందుకు దాదాపు 50 లక్షల టన్నులకుపైగా ఇసుకను డిపోల్లో నిల్వ చేయించారు. దీంతో ఎక్కడా నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడలేదు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పదు. ఇసుక ఆపరేషన్స్‌పై పటిష్టమైన నిఘా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై పటిష్టమైన నిఘా వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జేపీ వెంచర్స్ ఇసుక విక్రయాలకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న రశీదులను జారీ చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఎస్ఇబి, గనుల శాఖ, రెవెన్యూ, స్థానిక పోలీస్ అధికారులకు అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకునే అధికారమిచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కేసుల్లో రెండు లక్షల జరిమానాతో పాటు రెండేళ్ళ పాటు జైలు శిక్ష కూడా విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి వాస్తవాలతో పనిలేదు కాబట్టి రామోజీ తన మార్కు పాత్రికేయానికి పదునుపెడుతున్నారు. ఆ వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? ఇప్పుడు ఇసుకను కాంట్రాక్టుకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో వచ్చే రూ.4వేల కోట్లు అప్పుడు ఐదేళ్లలో ఎవరి జేబుల్లోకి పోయాయన్నది జవాబులేని ప్రశ్నేమీ కాదు. చంద్రబాబు, ఆయన మీడియా మిత్రులైన ట్రిపుల్ ఆర్ (రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 రవీంద్రనాథ్ నాయుడు) చేతుల్లోకేనన్నది ఎవరికీ తెలియనిదీ కాదు. ఈ చతుష్టయం బరి తెగించేసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అంటూ చెలరేగి పోయిందని, అవన్నీ ఇప్పుడు సాగటం లేదు కనకే ఇసుకపై నిత్యం ఏదో ఒకటి రాస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. అందులో భాగమే... ఆదివారంనాటి కథనం. ఎక్కడో చెన్నైలోని హోటల్లో సమావేశం జరిగిందని, అందులో ఒక నిర్ణయం తీసేసుకున్నారని... అందులో పాల్గొన్నట్టుగా, బల్లకింద ఉండి గమనించినట్లుగా రామోజీ రాసి పారేయడాన్ని ఏమనుకోవాలి? కళ్యాణమస్తు అనే మంచి పథకానికి ప్రచారం కల్పించకుండా ఉండేందుకే ఇలా చేశారనుకోవాలి. అయినా సబ్ కాంట్రాక్టు ఎవరికివ్వాలనే దానిపై జేపీ సంస్థ అత్యంత రహస్యంగా, స్టార్ హోటల్లో చర్చలు జరపాల్సినంత అవసరం వుందా? ‘ఈనాడు’ రాసినట్లు నిజంగా వైసీపీ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. ఇవీ... ఇసుక వెనక నిజాలు ► పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించిన టెండర్లలో.. రెండేళ్లపాటు రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహించే కాంట్రాక్టును జేపీ పవర్ వెంచర్స్ సంస్థ దక్కించుకుంది. దీనికోసం ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లిస్తోంది. ► సబ్ కాంట్రాక్టుకు ఇవ్వాలా.. వద్దా? ఎవరికివ్వాలి? వంటివన్నీ పూర్తిగా కాంట్రాక్టు సంస్థ ఇష్టం. సబ్ కాంట్రాక్టరు ఎవరైనా బాధ్యత మాత్రం జేపీదే. ► ఇందులో భాగంగానే జేపీ సంస్థ టర్న్ కీని ఎంచుకుంది. దీంతో ప్రభుత్వానికెలాంటి సంబంధం ఉండదు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం చెప్పినా... రామోజీ బురద రాతలు మానలేదు. ► ఇప్పుడు టర్న్ కీ సంస్థ తప్పుకుందంటూ... అదికూడా ప్రభుత్వ పెద్దలతో పొసగకనే అంటూ అడ్డగోలు రాతలకు దిగజారారు. అసలు సబ్ కాంట్రాక్టరు విషయంలోనే జోక్యం చేసుకోని ప్రభుత్వం, ఆ సబ్ కాంట్రాక్టరు పనుల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుంది? -
జేపీ గ్రూప్ ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసులో వ్యక్తి అరెస్ట్
-
ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసు: వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, విజయవాడ: జేపీ గ్రూప్ ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసులో తీగలాగే కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. నిందితుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఎమ్మెల్సీలు ఇప్పిస్తానంటూ రూ.కోటి వసూలు చేసినట్లు సమాచారం. ఇరిగేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని స్టీల్‌ప్లాంట్ ఉద్యోగికి రూ.25 లక్షలు టోకరా వేసినట్లు తెలిసింది. విశాఖలో ఉడా భూములు లీజుకు ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ధవళేశ్వరం వద్ద ఇసుక ట్రెడ్జింగ్ కాంట్రాక్ట్ పేరిట రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు కస్టడీ కోరనున్నారు. చదవండి: ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’ మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. -
ఇసుక రీచ్‌ల సబ్ లీజుల దందాలో మోసగాడి అరెస్ట్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించి కోట్ల రూపాయలను దండుకున్న నిందితుడు రామకృష్ణ చంద్రశేఖర్‌ని విజయవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ఫోర్జరీకి ఉపయోగించిన స్టాంప్ లు, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, మూడు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.95 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలను ప్రభుత్వం న్యూఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్‌కు అప్పగించిన సంగతి తెలి సిందే. అయితే ఆ సంస్థ నుంచి తాము సబ్ కాం ట్రాక్ట్ పొందినట్లు కొందరు వ్యక్తులు తప్పుడు కాంట్రాక్ట్ కాపీలను చూపుతూ కృష్ణా జిల్లాలోని వివిధ రీచ్‌ల వద్ద హల్చల్ చేస్తున్నట్లు జేపీ గ్రూప్ కు తెలిసింది. దీనిపై ఆరా తీసేందుకు జేపీ గ్రూప్ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ రంగంలోకి దిగారు. విజయవాడ రూరల్ గొల్లపూడి మైలు రాయి సెంటర్ సమీపంలోని పంట కాలువ రోడ్లో ఒక ఇంట్లో ఉంటున్న కొప్పురావూరి ప్రవీణ్‌కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావును కలిశారు. తాము హైదరాబాద్‌కు చెందిన సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులమని విశ్వనాథన్ సతీష్‌తో ముగ్గురు పరిచయం చేసుకున్నారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు జేపీ గ్రూప్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ట్లు రెండు జిరాక్స్ కాపీలను ఆయనకు చూపించారు. వాటిని పరిశీలించిన విశ్వనాథన్ సతీష్ అవి నకిలీ పత్రాలుగా గుర్తించి ఈ నెల 3న విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 420, 465, 467, 471 రెడ్ విత్ 120(బి) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఈ క్రమంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పశ్చిమ మండల ఏసీపీ కె.హనుమంతరావు, భవానీపురం ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ డీకేఎన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్ (29)ని అరెస్ట్ చేశారు. నిందితుడు 2016 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో ఒక ఫార్మాసూ్యటికల్ కంపెనీలో పనిచేశాడు. ఆ సమయంలో కంపెనీకి రావాల్సిన సొమ్మును తెలం గాణ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వాహా చేశాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. రామకృష్ణ చంద్రశేఖర్ మరికొన్ని మోసాలు.. హైదరాబాద్‌కు చెందిన కె.సురేంద్రనాథ్, వెలంపల్లి రఘు నరసింహరాజు ఇసుక రీచ్‌ల కాంట్రాక్టులు తీసుకోవాలని భావించి తమ మిత్రుడు తిరుమలరెడ్డిని సంప్రదించారు. తిరుమలరెడ్డి తన స్నేహితుడు లోకాభిరాముడుకు విషయం చెప్పారు. దీంతో లోకాభిరాముడు.. రామకృష్ణ చంద్రశేఖర్ ఈ పనిచేయించగలడని తెలిపారు. ఈ పరిస్థితిని సావకాశంగా తీసుకున్న చంద్రశేఖర్ వారందర్నీ బురిడీ కొట్టిం చాడు. సురేంద్రనాథ్, నరసింహరాజుల నుంచి రూ.5.40 కోట్లు వసూలు చేశాడు. తెలంగాణలో ఈఎస్ఐ ఆస్పత్రులకు మందుల సరఫరా కాంట్రా క్టు ఇప్పిస్తానని చెప్పి ఫార్మా కంపెనీలను నమ్మించి రూ.12 లక్షలు కొల్లగొట్టాడు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి లోకాభిరాముడి కుమారుడికి భారత్‌మాల ప్రాజెక్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు దండుకున్నాడు. లోకాభిరాముడికి ప్రభుత్వ భూములను లీజుకు ఇప్పిస్తానని చెప్పి రూ.45 లక్షలు వసూలు చేశాడు. -
ఇసుక రీచ్‌ల సబ్ లీజుల పేరిట భారీ మోసం
సాక్షి, అమరావతి/ భవానీపురం (విజయవాడ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇస్తామని బురిడీ కొట్టిస్తూ రాష్ట్రంలో భారీ దందాకు పన్నాగం పన్నిన ముఠా గుట్టురట్టైంది. ఇప్పటికే ఆ ముఠా పలు జిల్లాల్లో ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇస్తామని చెప్పి ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు కొల్లగొట్టిందని వెలుగు చూసింది. ఈ ముఠాకు చెందిన ఆరుగురిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇసుక రీచ్‌ల తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాశ్ (జేపీ) గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్‌ల సబ్ లీజు కాంట్రాక్టు తాము పొందామని సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ ముఠా ఘరానా మోసానికి తెరతీసింది. హైదరాబాద్ చిరునామాతో ఆ కంపెనీని ఏర్పాటు చేసినట్టు చెబుతూ విజయవాడ గొల్లపూడిలోని ఓ ఇంటి నుంచి దందా మొదలుపెట్టింది. ఇందుకోసం రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి మరీ డాక్యుమెంట్లు సృష్టించింది. ఇసుక రీచ్‌లు కావాలంటే రూ.40 కోట్లు చెల్లించాలంటూ.. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీకి సబ్ లీజుకు కోట్ల రూపాయలు చెల్లించిన కొందరు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు ప్రయత్నించగా జేపీ గ్రూప్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ నుంచి సబ్ లీజుకు తీసుకున్నామని చెప్పడంతో జేపీ గ్రూప్ సిబ్బంది నివ్వెరపోయారు. ఈ విషయాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఈబీ అధికారులు, జేపీ గ్రూప్ ప్రతినిధులు కలిసి ఈ ఇసుక సబ్ లీజుల అక్రమ బాగోతాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. జేపీ గ్రూప్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ విజయవాడ భవానీపురంలోని సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులు ఉన్న ఇంటికి వెళ్లి ఇసుక రీచ్‌ల సబ్‌లీజు కోసం వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగమల్లేశ్వరరావు తమను తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడేళ్లపాటు ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇచ్చేందుకు రూ.40 కోట్లు చెల్లించాలని చెప్పారు. తమ కంపెనీ జేపీ గ్రూప్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు తీసుకున్నట్టు సృష్టించిన ఫోర్జరీ పత్రాలు చూపించారు. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధి కె.సురేంద్రనాథ్ తమ కంపెనీ తరఫున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇచ్చే అధికారాన్ని నీలాపు తిరుమలరెడ్డి (విశాఖపట్నం), వెలంపల్లి రఘు నరసింహరాజు (హైదరాబాద్)లకు అప్పగించినట్టు మరో ఫోర్జరీ పత్రాలను చూపారు. వారిని నమ్ముతున్నట్టుగానే వ్యవహరించిన జేపీ గ్రూప్ ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి వచ్చేశారు. అనంతరం తమ కంపెనీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఆరుగురిపై భవానీపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలోనూ ఫోర్జరీ పత్రాలతో మోసం పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగ మల్లేశ్వరరావు, సురేంద్రనాథ్, నీలాపు తిరుమలరెడ్డి, వెలంపల్లి రఘు నరసింహరాజు, తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్లీజుకు ఇస్తామని చెప్పి రూ.3.50 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఆ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్లు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గతంలో తెలంగాణలో కూడా ఫోర్జరీ పత్రాలతో మోసానికి పాల్పడటంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఇసుక రీచ్‌ల పేరిట భారీ మోసం: రూ.కోట్లకు టోకరా
సాక్షి, అమరావతి: ఏపీలో ఇసుక రీచ్‌ల పేరిట ఓ వ్యక్తి భారీ మోసాకి పాల్పడ్డాడు. ఇసుక రీచ్‌లకు సంబంధించి తవ్వకాల సబ్ లీజులు ఇస్తానని చెప్పి రూ.కోట్లకు టోకరా వేశాడు. వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ కేటుగాడు గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేశాడు. సంతకం ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ మోసాలకు తెగపడ్డాడు. జేపీ గ్రూప్ నుంచి తాను సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్నట్లు నమ్మబలికాడు. ఈ విషయంపై జేపీ గ్రూప్ మేనేజర్ హర్షకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు నిందితుడు కాకినాడకు చెందిన సతీష్‌కుమార్‌గా గుర్తించారు. నిందితుడు సతీష్‌పై 471, 420, 465, 469, 471, 120(బి) సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు బ్యాంక్ అకౌంట్లో రూ.2 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి -
అన్ని ఇసుక రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జేపీ పవర్ వెంచర్స్‌కు స్వాధీనం చేసిన అన్ని ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, విక్రయాలు వెంటనే ప్రారంభం కావాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఇసుక ఆపరేషన్స్‌పై గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ఇసుక రీచ్‌లను గత నెల 14వ తేదీన జేపీ పవర్ వెంచర్స్‌కు స్వాధీనం చేసినట్టు తెలిపారు. గత నెల 17 నుంచి ఆ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు, నిల్వ, రవాణా ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 384 రీచ్‌లు జేపీ గ్రూపునకు అప్పగించగా, వాటిల్లో 136 రీచ్‌లలోనే ఇసుక ఆపరేషన్లు జరుగుతుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం మిగిలిన అన్ని రీచ్‌ల్లోనూ ఇసుక ఆపరేషన్స్ ప్రారంభం కావాలని, ఇందుకోసం జాయింట్ కలెక్టర్(రెవెన్యూ)లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఆయా జిల్లాల పరిధిలోని రీచ్‌లలో జరుగుతున్న ఇసుక ఆపరేషన్స్‌పై కాంట్రాక్ట్ ఏజెన్సీ, శాండ్, మైనింగ్ అధికారులు రోజువారీ నివేదికలను జేసీలకు పంపాలని సూచించారు. వినియోగదారులకు సులభంగా ఇసుక లభ్యమయ్యేలా ఇసుక డిపోల ఏర్పాటును పరిశీలించాలని జేసీలను ఆదేశించారు. ప్రతి రీచ్ వద్ద కచ్చితంగా టన్ను ఇసుక రూ.475కు విక్రయించేలా చూడాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు అనుగుణంగా ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
ఇసుక రీచ్...విలేజ్ రిచ్
సాధారణ రోజుల్లో కనీసం టీ దొరకని మారుమూల ఊళ్లలో ఇప్పుడు పదుల సంఖ్యలో హోటళ్లు, దుకాణాలు వెలుస్తున్నాయి. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలు నేడు ఇసుక రీచులతో ప్రత్యామ్నాయ ఉపాధి, ఆదాయం పొందుతున్నాయి. సాధారణంగా వ్యవసాయభూమి ఎకరం కౌలు రూ. 8–9 వేలు ఉంటే ప్రస్తుతం ఏడాదికి రూ.లక్ష వరకు భూ యజమానులకు లీజు చెల్లిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతాలైన కాళేశ్వరం, మహదేవపూర్ పరిధి గ్రామాల్లో కొత్తగా ఇసుక రీచులు ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ బతుకు చిత్రం మారుతోంది. సాక్షి, భూపాళపల్లి : భూమికి నీటి వసతి ఉంటేనే ఎవరైనా కౌలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. అప్పుడు కూడా ఇచ్చేది ఎకరాకు పదివేలు మించదు. అయితే గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక రీచులు ఏర్పాటు చేస్తున్న చోట మాత్రం ఎకరా వ్యవసాయ భూమి లీజు ధర రూ.లక్ష వరకు ఉంటోంది. దీంతో వ్యవసాయం చేసినా ఇంత లాభం ఉండదని రైతులు ఆనందంగా తమ భూములను డంపింగ్ యార్డుల కోసం లీజుకిచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఇసుక రీచులు ఉన్న జిల్లాగా భూపాలపల్లికి పేరుంది. ఇప్పటికే ఐదు రీచులు నడుస్తుండగా ప్రస్తుతం జిల్లాలో కొత్తగా మరో 10 ఇసుక రీచులు ఏర్పాటు చేసి 73 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను తీయనున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం పరిసరాల్లోని పలుగుల, మద్దులపల్లి, కుంట్లం, పూస్కుపల్లి, కుదురుపల్లిలో వ్యవసాయ భూముల లీజు ధరలకు రెక్కలొచ్చాయి. గోదావరి నుంచి తీసిన ఇసుకను స్టాక్ చేయడానికి సాగు భూములను ఉపయోగిస్తుండటంతో ఇంతటి విలువ వచ్చింది. ఇలా ఒక్కో రీచ్‌కు సుమారు 50– 60 ఎకరాల చొప్పున 600 నుంచి 700 ఎకరాల భూమిని ఇసుక రీచుల నిర్వాహకులకు రైతులు అప్పగించారు. సొంతూళ్లలో ఉపాధి ఇసుక రీచులతో గ్రామాల్లోని ప్రజలకు స్థానికంగా ఉపాధి దొరుకుతోంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. ఇసుక రీచులు ప్రారంభం కావడంతో ఇక్కడే ఉపాధి వెతుక్కుంటున్నారు. నలభై మందితో బ్యాచ్‌లుగా ఏర్పడి లారీలకు టార్పాలిన్లు కప్పడం, లారీలోని ఇసుకను చదును చేయడం, రీచ్‌ల్లో ర్యాంప్‌లను సిద్ధం చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ట్రాక్టర్ పనులతో పాటు లారీలకు డ్రైవర్లు, క్లీనర్లుగా ఉపాధి పొందుతున్నారు. రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తున్నారు. మరికొంతమంది హోటళ్లు, కిరాణా షాపులు పెట్టుకుని స్వయంఉపాధి పొందుతున్నారు. ఇసుక రీచులతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి జనం రాకపోకలు పెరగడంతో వీరికి గిరాకీ ఉంటోంది. పదెకరాలు లీజుకిచ్చాను క్వారీలు ఏర్పాటు కావడంతో పంట నష్టాన్ని కూడా కలిపి ఎకరాకు రూ.లక్ష చొప్పున 10 ఎకరాలు లీజుకు ఇచ్చాను. వ్యవసాయం చేసినా కూడా ఇంత లాభాలు రావు. నాతో పాటు చాలామంది రైతులు తమ భూములను ఇసుక డంపింగ్ కోసం ఇచ్చారు. – మచ్చ లచ్చన్న, రైతు, పలుగుల, మహదేవపూర్ గిరాకీ మంచిగ ఉంటోంది కిరాణా షాపు, హోటల్ బిజినెస్‌కు మంచిగానే గిరాకీ ఉంది. లారీ డ్రైవర్లతో పాటు క్వారీల సిబ్బందికి భోజనం పార్సిళ్లు ఆర్డర్లు వస్తున్నాయి. రోజుకు రూ.2 వేల దాకా గిరాకీ అవుతోంది. – రాగం మధుకర్, హోటల్ నిర్వాహకుడు, పలుగుల గ్రామం -
ఇసుక రీచ్‌లపై సమగ్ర మ్యాపులు: పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త రీచ్‌లకు అనుమతులు ఇస్తామని భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పర్యావరణ చట్టాలకు లోబడి ఎక్కువ ఇసుక రీచ్‌లను ప్రారంభించడం ద్వారా వినియోగదారులకు సులువుగా ఇసుకను అందించాలని ఆదేశించారు. ఇందుకోసం కొత్త రీచ్‌లకు పర్యావరణ నియంత్రణ మండలి నుంచి అన్ని అనుమతులు వేగంగా తీసుకోవాలని తెలిపారు. ఇసుక కార్పోరేషన్‌పై గురువారం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇసుక పాలసీలు, వాటిలోని లోటుపాట్లపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి హరినారాయణ్ పాల్గొన్నారు. ఇసుక కార్పోరేషన్ విధివిధానాలపై చర్చ జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఇసుక డిమాండ్, సప్లయ్‌లపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయిలో ఇసుక రీచ్‌లపై సమగ్ర మ్యాప్‌లను తయారు చేసి, వాటిని జాయింట్ కలెక్టర్లతో సమన్వయం చేసుకునేలా బాధ్యతలు అప్పగించాలన్నారు. నదుల్లో వరదనీరు అధికంగా వున్న నేపథ్యంలో స్టాక్ యార్డ్ల నుంచి ఇసుకను సకాలంలో వినియోగదారులకు చేరువ చేయాలని ఆదేశించారు. (చదవండి: మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ ఉండాలి: సీఎం జగన్) -
హుస్నాబాద్‌లో యువకుడి దారుణ హత్య
-
‘ఇసుక ధరల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ: గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొయ్యూరు ఇసుక రీచ్‌ను సోమవారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో మంత్రి రీచ్ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రోజుకు ఎంత ఇసుకను వెలికితీస్తున్నారు, ఏ మేరకు వినియోగదారులకు ఇసుకను అందిస్తున్నారు అని మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌ను బట్టి రీచ్‌లో అదనంగా మిషన్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసిన వారికి రవాణా చేస్తున్న లారీ యాజమానులతో మంత్రి ముచ్చటించారు. కాగా ఇసుక తరలింపులో ఎటువంటి జాప్యం లేకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు. ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న వారికి సీరియల్ నంబరు కేటాయించి త్వరితగతిన ఇసుక బయటకు వెళ్లేలా చూడాలని అన్నారు. పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపులు జరగాలని, అలాగే వేయింగ్, ఇసుక ధరల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
ఇసుక అక్రమ రవాణాకు జీపీఎస్‌తో 'చెక్'!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా.. ఇసుకను వినియోగదారులకు చేరవేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను తప్పనిసరి చేయనుంది. రీచ్ నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనం స్టాక్ పాయింట్‌కు వెళుతుందా? లేక పక్కదారి పట్టిందా? అనే వివరాలను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసేందుకు వీలు కలగనుంది. జీపీఎస్‌ను తప్పనిసరిగా సోమవారం(25వ తేదీ) నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జీపీఎస్ అమర్చుకోవాల్సిందే.. ‘‘ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుకను తీసుకెళ్లే అన్ని వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. స్టాక్ పాయింట్ నుంచి బల్క్ ఆర్డర్లకు సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని కాంట్రాక్టు సంస్థలకు స్పష్టం చేశాం’’ – మునిస్వామి, ఏపీఎండీసీ జిల్లా మేనేజర్, అనంతపురం జీపీఎస్‌తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నదుల్లో వరదలు తగ్గిపోవడంతో ప్రస్తుతం రీచ్‌ల్లో పూర్తిస్థాయిలో ఇసుక వెలికితీసేందుకు అవకాశం ఏర్పడింది. రీచ్ నుంచి వెలికితీసిన ఇసుకను మొదట స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నారు. ఏయే స్టాక్ యార్డు నుంచి ఏయే స్టాక్ పాయింట్‌కు ఇసుకను తరలించాలనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా దగ్గరలోని స్టాక్ పాయింట్లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇసుక యార్డు నుంచి ఇసుకను తీసుకెళ్లిన టిప్పర్లు నేరుగా స్టాక్ పాయింట్‌కు వెళుతున్నాయా? లేక పక్కదారి పడుతున్నాయా అనేదానిపై పర్యవేక్షణ నిరంతరం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సదరు వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చడం ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్ చేసే వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను అమరావతిలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. తద్వారా రీచ్‌లో వెలికితీసిన ఇసుక కచ్చితంగా స్టాక్ పాయింట్‌కు చేరనుంది. అంతేకాకుండా బల్క్ ఆర్డర్లకు ఇసుక సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ అమర్చడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నేరుగా వినియోగదారుడికే ఇసుక చేరనుంది. -
కోరినంత ఇసుక.. నిర్మాణాలు చకచకా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక కొరత లేదు. టీడీపీ హయాంలో ఉచిత విధానం ముసుగులో వసూలు చేసిన రేటు కన్నా తక్కువకు దొరుకుతోంది. ఎవరికెంత అవసరమో అంత ఇసుక సరఫరా చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఫలితంగా నిర్మాణాలు జోరందుకున్నాయి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నాగావళి, వంశధార నదుల్లో 18 రీచ్‌లకు అనుమతి వచ్చింది. వాటిలో 12 లక్షల 45 వేల టన్నుల ఇసుక లభ్యత ఉంది. అనుమతులొచ్చిన వాటిలో 13 రీచ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటిలో 8 లక్షల 68 వేల టన్నుల ఇసుక ఉంది. మరో 5 రీచ్‌లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వాటిలో మరో 4 లక్షల టన్నుల ఇసుకను తవ్వు కోవచ్చు. మొత్తానికి జిల్లాలో 12 లక్షల 45 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు జరిపేందుకు అవకాశం ఉంది. భవన నిర్మాణదారులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు. ఇసుక కొరత కారణంగా పని దొరకలేదన్న పరిస్థితులు ఎక్కడా లేవు. రెండు పట్టా భూములకు కూడా అనుమతులిచ్చారు. వాటిలో ఒక పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవికాకుండా బాహుద, మహేంద్రతనయ నదుల్లో తహశీల్దార్ల ఆధ్వర్యంలో కార్యదర్శుల సమక్షంలో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. టెక్కలి, పలాసలోనైతే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ఇసుక కొరత అనేది ఎక్కడా లేదు. మన జిల్లా అవసరాలను తీర్చడమే కాకుండా విశాఖపట్నం, డెంకాడ, బొబ్బిలిలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఇసుక తరలిస్తున్నారు. కేవలం స్టాక్ పాయింట్ల ద్వారా రోజుకి 2వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నారు. అవసరానికి మించి... జిల్లాలో ప్రతి రోజూ 8 వేల నుంచి 10 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రోజుకు 4 వేల టన్నుల వరకు బుకింగ్ జరుగుతున్నది. బయట ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లు, జిల్లాలోని బుక్ చేసుకున్న వారికి కలిపి ప్రతి రోజూ 5 వేల నుంచి 6 వేల టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఈ లెక్కన ఇసుక ఎంత అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్కలి, పలాస స్టాక్ పాయింట్ల ద్వారా పలాస, టెక్కలి నియోజకవర్గాలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేస్తుండగా, బాహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి కార్యదర్శుల ఆధ్వర్యంలో నడుస్తున్న రీచ్‌ల ద్వారా çపలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సమస్య లేకుండా ఇసుక సరఫరా జరుగుతున్నది. ఉచితం కన్న తక్కువ ధరకే.. గతంలో ఇసుక ఉచిత విధానం పేరుకే తప్ప ఎక్కడా ఇసుక ఉచితంగా దొరకలేదు. టీడీపీ నేతలు దోపిడీదారులుగా తయారై రీచ్‌లను ఆక్రమించి ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టి అమ్మకాలు సాగించారు. ప్రభుత్వానికి పైసా రాకపోగా టీడీపీ నేతలు కోట్లు దండుకున్నారు. ఉచిత విధానమని చెప్పి ట్రాక్టర్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రూ.2400 నుంచి రూ.4 వేల వరకు ఇసుక దొరుకుతున్నది. ఈ లెక్కడ అప్పట్లో ఇసుక సొమ్ము అంతా ఎక్కడికెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రారంభమైన రీచ్‌లివి.. మడపాం, పర్లాం, ఎరగాం, పెద చావలాపురం, పురుషోత్తపట్నం 2, గోపాలపెంట, పోతయ్యవలస, కిల్లిపాలెం, కల్లేపల్లి, సింగూరు, తునివాడ, అంగూరు, చవ్వాకులపేటలో ఇసుక రీచ్‌లు ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా మహేంద్రతనయ, బాహుదా నదుల్లో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. స్థానికంగా కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రీచ్‌లివి. ఇసుక పుష్కలంగా దొరుకుతోంది.. మా ప్రాంతంలో ఇసుక పుష్కలంగా లభిస్తోంది. రోజుకు 90 వరకు ట్రాక్టర్లు ఇక్కడకు వస్తున్నాయి. అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్నారు. ఇసుకను అక్ర మంగా తరలించే చాన్సే లేదు. ఇళ్ల పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. భవన కార్మికులందరికీ చేతి నిండా పనులు ఉన్నాయి. ఇసుకకు కట్టే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు అమలు జరిపేందుకు ఇది అవకాశం ఇస్తుంది. పుష్కలంగా ఇసుక జిల్లాలో ఇసుక పూర్తిగా అందుబాటులో ఉంది. ఎవరికెంత అవసరమో అంతా బుక్ చేసుకోవచ్చు. సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొరత అనేది లేదు. రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కూడా సరఫరా చేసే స్థాయిలో ఉన్నాం. – ఎస్.కె.వి.సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్, భూగర్భ గనుల శాఖ ఇసుక సరఫరా పెరిగింది.. వంశధారలో నీటిమట్టం బా గా తగ్గింది. ప్రస్తుతం ఇసుక అందుబాటులోకి వచ్చింది. 10 రోజుల క్రితం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు సమస్య తీరింది. నరసన్నపేటలో రూ.2700 కు లభిస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో మరింతగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం. –అరవల ఆదినారాయణ, పోతయ్యవలస, నరసన్నపేట ఇసుక కొరత లేదు ప్రస్తుతం ఇసుక బిర్లంగిలో పుష్కలంగా దొరుకుతోంది. భవన నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తొలి నెల రోజులు ఇబ్బంది పడినా నేను సోంపేట నుంచి వచ్చి ఇక్కడే ఇసుకను కొనుగోలు చేస్తున్నాను. త్వరలో మరో మూడు ఇసుక రీచ్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ అధికారులు చెబుతున్నారు. – టి.దుర్యోధన, ట్రాక్టర్ డ్రైవర్, ఇచ్ఛాపురం మండలం -
వరద తగ్గింది.. ‘ఇసుక’ పెరిగింది
సాక్షి, అమరావతి: ఇసుక రీచ్‌ల వద్ద వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ఇసుక సరఫరాను క్రమేణా పెంచుతోంది. రీచ్‌లలో నీరు పూర్తిగా ఇంకిపోతే ప్రజలు కోరినంత ఇసుకను స్టాక్ యార్డుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 1వ తేదీన 31,576 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు చేరింది. శుక్రవారం ఇది 96,600 టన్నులకు పెరిగింది. గడచిన ఐదు రోజుల్లో మూడు రెట్లు అధికంగా ఇసుక లభించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సుమారు 4 లక్షల టన్నుల ఇసుకను ఏపీ ఎండీసీ స్టాక్ యార్డులకు చేరవేసింది. తూర్పు గోదావరి జిల్లాల్లో తవ్విన ఇసుకను కలిపితే 4.30 లక్షల టన్నుల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో తవ్వకాలను రెట్టింపు చేయడం ద్వారా కోరినంత ఇసుకను ప్రజలకు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. రోజుకు 2 లక్షల టన్నుల సరఫరా ఇదే పరిస్థితి కొనసాగి మరిన్ని రీచ్‌లలో వరద నీరు ఇంకిపోతే రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వర్షాలు ఆగిపోతే వారం రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అధిగమించి ప్రజలకు కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాల్లోని వంకలు, వాగులు, ఏర్లలో ఇసుక తవ్వకాలకు అనువైన 300 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. -
ఇసుకే బంగారమాయె..
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక ధరలు అమాంతంగా పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగి భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలతో ఇసుక రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, ఇదే అదనుగా దళారులు ఇసుక కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతీరోజు సగటున 60 వేల మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్లైన్ విధానంలో విక్రయిస్తోంది. ఆన్లైన్లో టన్ను ఇసుక ధర రూ.600 కాగా, రవాణా, ఇతర చార్జీలు కలుపుకుని లారీ యజమానులు, దళారులు సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50 ఇసుక రీచ్‌లను టీఎస్ఐఐసీ నిర్వహిస్తుండగా, వర్షాలతో వరద పోటెత్తుతుండటంతో నదీ గర్భం నుంచి ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. దీంతో టీఎస్ఎండీసీ ఆన్లైన్లో పరిమితంగా అనుమతులు జారీ చేస్తుండటంతో.. బహిరంగ మార్కెట్లో దళారులు టన్ను ఇసుకను రూ.3 వేలకు పైగా విక్రయిస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. 15 రీచ్‌లలో మాత్రమే వెలికితీత రిజర్వాయర్ల పూడికతీత, గోదావరిలోని ఇసుక తిన్నె లు, పట్టా భూముల నుంచి టీఎస్ఎండీసీ ఇసుకను వెలికితీసేందుకు 13 జిల్లాల పరిధిలోని 50కి పైగా ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. ఇసుక వెలికితీత ప్రధానంగా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా రిజర్వాయర్ల పరిధిలోని 27 ఇసుక రీచ్‌ల వద్ద జరుగుతుండగా, గోదావరి వరదల మూలంగా ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. అందుబాటులోని ఇసుకను ప్రభుత్వ పథకాలకు టీఎస్ఎండీసీ కేటాయిస్తోంది. ప్రస్తుతం సుమారు 15 రీచ్‌లలో పాక్షికంగా ఇసుక వెలికితీత జరుగుతున్నట్లు టీఎస్ఎండీసీ వర్గాలు చెప్తున్నాయి. స్టాక్ పాయింట్లలో 41 లక్షల క్యూబిక్ మీటర్లు వర్షాకాలంలో ఎదురయ్యే ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఎండీసీ ముందు జాగ్రత్తగా 2 కోట్ల క్యూబిక్ మీటర్లు (సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నులు) నిలువ చేసేలా ప్రణాళిక సిద్దం చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నడుమ 65 లక్షల క్యూబిక్ మీటర్లను స్టాక్ పాయింట్లకు తరలించగా, ప్రస్తుతం 41 లక్షల క్యూబిక్ మీటర్లు (సుమారు 62 లక్షల మెట్రిక్ టన్నులు) అందుబాటులో ఉంది. వీటిని అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాలకు, ఇతరులకు ఆన్లైన్లో కేటాయిస్తున్నారు. అయితే రోజువారీ డిమాండుకు అనుగుణంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌తో పాటు, మరో రెండు సబ్ స్టాక్పాయింట్లలో జంట నగరాల అవసరాల కోసం ఇసుక విక్రయిస్తున్నా, ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇసుక లేక.. ఇంటి పనులు నిలిపేశా..! ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.20 లక్షలు ఖర్చు చేశా. స్లాబ్ దశ వరకు పనులు జరిగాయి. ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కనీసం 50 టన్నుల ఇసుక అవసరమవుతుందని అనుకుంటున్నా. అయితే మార్కెట్లో ప్రస్తుతం సన్న ఇసుక టన్ను ధర రూ.3,200, దొడ్డు ఇసుక రూ.2,500 వరకు ఉంది. నిర్మాణం ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఎక్కువ ధర పెడతామనుకున్నా.. ఎక్కడా దొరకడం లేదు. దీంతో నిర్మాణ పనులను ప్రస్తుతానికి నిలిపేశా. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. ––వరికుప్పల శంకర్, తమ్మలోనిగూడ, రంగారెడ్డి జిల్లా ప్లాస్టరింగ్ ఇసుక ధరలు పెరిగాయి గతంలో స్లాబ్ ఇసుక టన్ను రూ.1,100 వరకుండేది. ఇప్పుడు రెండింతలై రూ.2,200 వరకు పలుకుతోంది. ప్లాస్టరింగ్ ఇసుక ధర దాదాపు మూడింతలు పెరిగింది. ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందనే భయంతో పనులు నిలిపేస్తున్నాం. తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అనుకున్నా దళారీలు ధరలు పెంచేశారు. ఇసుకపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మాకు కూడా గిట్టుబాటయ్యే అవకాశం లేదు. ––మేతరి స్వామి, బిల్డర్, తుర్కయాంజాల్ వర్షాకాలం వల్లే.. వర్షాకాలంలో రీచ్‌ల నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. రహదారులకు వెళ్లే దారులు బురదతో ఉండటంతో వాహనాలకు అనుమతినివ్వడం లేదు. వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో 65 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వచేశాం. దీంతో ఇసుక కొరతను దాదాపు 70 శాతం మేర ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్లో టీఎస్ఎండీసీ నిర్దేశించిన ధర రూ.600కు టన్ను చొప్పున అత్యంత పారదర్శకంగా విక్రయిస్తున్నాం. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో త్వరలో ఇసుక లభ్యత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ––మల్సూర్, ఎండీ, టీఎస్ఎండీసీ -
‘150 ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక సరఫరా మెరుగుపరుస్తామని మైనింగ్‌శాఖ కార్యదర్శి రాంగోపాల్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని నదుల్లో వరద ప్రవాహం ఉందని తెలిపారు. ఎన్నడూ ఊహించని విధంగా వరద, వర్షాలు ముంచెత్తాయని గుర్తు చేశారు. రీచ్‌లు, ఇసుక ఉన్నా తవ్వడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ప్రతికూల వాతావరణంలోనూ రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తీస్తున్నామని తెలిపారు. వరదలు తగ్గగానే పూర్తిస్థాయిలో రీచ్‌లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘150 ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 267 రీచ్‌ల్లో 69 చోట్ల మాత్రమే ఇసుక తీయగలుగుతున్నాం. త్వరలో రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేస్తాం. ఇసుక మైనింగ్‌లో స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఎం ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్‌లు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. మరో నాలుగేళ్ల వరకు ఇబ్బందులు లేని ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇసుక రవాణా వాహనాలకు కూడా జీపీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నాం’అని రాంగోపాల్ చెప్పారు. -
అన్ని రీచ్‌లను తెరవండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ఇసుక రీచ్‌లను తెరవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారిని అనుమతించాలని.. కిలోమీటర్‌కు నిర్దేశించిన చార్జీ రూ.4.90 చొప్పున రవాణా చేసే వారందరినీ తీసుకోవాల్సిందిగా ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం స్పందన కార్యక్రమంపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, సరఫరా స్థితిగతులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లాల్లో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని, ఆ అధికారి కేవలం ఈ పని మాత్రమే చూడాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలని, దీనిపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టి పెట్టాల్సిందిగా ఆయన ఆదేశించారు. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనుమతించొద్దని.. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కచ్చితంగా కనిపించి తీరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంచేశారు. ఇసుక మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దన్నారు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరాను నిరోధించేందుకు చెక్‌పోస్టుల్లో నిఘాను పెంచాల్సిందిగా ఆయన సూచించారు. ఇసుక కొరతనేది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండు నెలల్లో మార్పు రావాలి రైతుల భూముల్లో ఇసుక ధర రూ.60 నుంచి రూ.100లకూ పెంచినా అభ్యంతరంలేదని వైఎస్ జగన్ అన్నారు. కానీ, ఇసుక సరఫరాపై వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాల్సిందేనని స్పష్టంచేశారు. కాగా, వరదల కారణంగా ఇసుక తరలింపు సాధ్యం కావడంలేదని కలెక్టర్లు చెప్పగా.. ప్రస్తుతం వరదలు తగ్గినందున తక్కువ రేట్లకు సత్వరంగా ఇసుకను అందించడంపై అధికారులు దృష్టిసారించాలని సీఎం కోరారు. ప్రతి జిల్లాలోని 2 వేల మంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్‌ను కూడా కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు ఇచ్చేలా చూడాలని, దీనిపై మార్గదర్శకాలు వెంటనే రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. -
అందరికీ ‘రీచ్’ అయ్యేలా!
సాక్షి, మచిలీపట్నం: ఇసుక కష్టాలకు ఇక చెక్ పడనుంది. కృష్ణా నది వరద కారణంగా నూతన ఇసుక పాలసీ అమలులోకి వచ్చినా.. రీచ్‌ల నుంచి ఇసుకను తరలించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు రీచ్‌లను తెరచినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో రెండు రీచ్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లాలో ఇసుక కొరత వేధిస్తోంది. రీచ్‌ల్లోకి వరదనీరు చేరడంతో గడిచిన 15 రోజులుగా డిమాండ్ మేరకు ఇసుక సరఫరా చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి అనుకూలిస్తుండటంతో ఇప్పటికే తెరచిన ఆరు రీచ్‌లకు తోడు మరో పది రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గతంలో లూటీ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితం మాటున ఇసుకాసురులు లూటీ చేసారు. సరిహద్దులు దాటించి ఇష్టమొచ్చిన రీతిలో అమ్మకాలు సాగించి కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. కొత్త ఇసుక పాలసీతో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు కళ్లెం వేశారు. కొత్త పాలసీ ప్రకారం ప్రస్తుతం జిల్లాలో కంచెల, కాసరబాద, శనగపాడు, చెవిటికల్లు, శ్రీకాకుళం, తోట్లవల్లూరు రీచ్‌లను ఈ నెల 5వ తేదీన ప్రారంభించారు. కానీ వరదల కారణంగా నాలుగు రీచ్‌లు ప్రారంభించిన ఒకటి రెండు రోజుల్లోనే ఆపాల్సిన వచ్చింది. ప్రస్తుతం కంచెల, శనగపాడు రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు సాగు తున్నాయి. కొత్తగా అందుబాటులోకి 10 రీచ్‌లు వరదలు తగ్గుముఖం పడితే మిగిలిన నాలుగు రీచ్‌లతో పాటు మరో పది రీచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వీటిలో ప్రధానంగా కంచికచర్ల మండలం మున్నలూరు, కునికెనపాడు, చందర్లపాడు మండలం ఏటూరు, ఉస్తేపల్లి, పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం, శనగపాడు–2, కంకిపాడు మండలం మద్దూరు–1, 2, పమిడిముక్కల మండలం లంకపల్లి– 1, 2 రీచ్‌ల్లో తవ్వకాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కావల్సినంత ఇసుక.. జిల్లాలో ఏటా పదిలక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంది. ప్రస్తుతం కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా నదీపరివాహక ప్రాంతంలో లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పేరుకుపోయింది. ప్రస్తుతం జిల్లా డిమాండ్‌కు మించే ఇసుక అందుబాటులో ఉంది. కనీసం మరో ఐదారేళ్ల అవసరాలకు సరిపడా ఇసుక అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం వెలికి తీసేందుకు సానుకూల పరిస్థితులు లేకపోవడం వల్లే ఇసుక కొరత నెలకొందని వివరిస్తున్నారు. వరద నీరు కాస్త తెరిపినిస్తే రీచ్‌లు çపూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. కావాల్సిన వారికి కావాల్సినంత ఇసుక సరఫరా చేసే అవకాశం ఉంది. ఇంటికే ఇసుక.. ప్రస్తుతం రీచ్‌ల వద్దే స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయగా, భవిష్యత్‌లో విజయవాడతో సహా ప్రధాన పట్టణాల్లో స్టాక్ యార్డులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. అదే కనుక జరిగితే ఇసుక కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఇలా బుక్ చేయగానే అలా ఇంటికి చేరుతుంది. ఇసుక కొరత రానీయం జిల్లాలో ఇసుక కొరత రానీయం. డిమాండ్ మేరకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని రీచ్‌లను కూడా తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. సామాన్యులకు సైతం చౌకగా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆలోచన. భవిష్యత్‌లో స్టాక్ యార్డులు పెంచే ఆలోచనలో ఉన్నాం. – సుబ్రహ్మణ్యం, ఏడీ, మైనింగ్ -
నూతన ఇసుక రీచ్‌ను ప్రారంభించిన మంత్రి
సాక్షి, కృష్ణా: నందిగామలో చెవిటికల్లు ప్రాంతంలో ఇసుకరీచ్, ఇసుక నిల్వ అమ్మక కేంద్రాన్ని పంచాయతీ రాజ్, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక మాఫియాకు కళ్లెం వేసేలా నూతన ఇసుక విధానం తీసుకువచ్చామన్నారు. వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. స్టాక్ యార్డ్‌లో లోడింగ్‌తో కలిపి టన్ను ఇసుక రూ.375 గా నిర్ణయించామన్నారు. 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్టోబర్ నాటికి 70 నుంచి 80 వరకు స్టాక్ పాయింట్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, ఏపీ ఎండీసీ అధికారులు పాల్గొన్నారు. -
నూతన ఇసుక పాలసీ అమలుకు ప్రభుత్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన ఇసుక పాలసీను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఇసుక పాలసీ అమలుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 102 ఇసుక రీచులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 57 ఇసుక స్టాక్ పాయింట్లను అధికారులు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇసుక నిల్వలు స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారిగా... శ్రీకాకుళం 6, విజయనగరం 2, విశాఖ 2, తూర్పుగోదావరి 13, పశ్చిమగోదావరి 5, కృష్ణా జిల్లా 6, గుంటూరు జిల్లాలో 4 ఇసుక స్టాక్ యార్డులు, ప్రకాశం 3, నెల్లూరు 6, కడప 4, చిత్తూరు 2, అనంతపురం 3, కర్నూలు జిల్లాలో 2 స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోగానే సరసమయిన ధరకు సరఫరా చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. -
నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు
అధికారంలో ఉన్నంతకాలం నదులనే కాదు వాగులు, వంకలను కూడా వదల్లేదు. ఇసుక దోపిడీకి తెగబడ్డారు. ఉన్న పళంగా రూ.కోట్లకు పడగెత్తారు. రూ.1500 కోట్లకు పైగా టీడీపీ నేతలు ఆర్జించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడా నేతలకు వీలుపడటం లేదని సామాన్యుల కోసమంటూ.. రోడ్డెక్కుతున్నారు. దోపిడీకి గురి కాకూడదని, తక్కువ ధరకు ఇసుకను అందించాలన్న ఉద్దేశంతో కొత్త ఇసుక పాలసీని రూపొందించి, మరో ఐదు రోజుల్లో అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ పచ్చనేతలు ఇసుక రాజకీయాలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎవరైతే ఇసుకను దోచుకున్నారో వారే నేడు ఇసుక కోసం ధర్నాలకు దిగుతున్నారు. సెప్టెంబర్ 5నుంచి వచ్చే పాలసీ తమ వల్లే వచ్చిందని చెప్పుకునేందుకు కూడా ఆరాటపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు గత ఐ దేళ్ల కాలంలో బక్కచిక్కిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి గుల్లగా మారిపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కదాన్నీ విడిచిపెట్టలేదు. నిరాటంకంగా ఇసుక దోపిడీ సాగించారు. టీడీపీ నాయకులు మాఫియాతో చేతులు కలిపి ఇసుకను దోచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానం సామాన్యులకు ఉపయోగపడలేదుగానీ టీడీపీ నేతలకు మాత్రం కాసులు కురిపించింది. ఇసుక ర్యాంపులను తమ అడ్డాగా చేసుకుని కోట్ల రూపాయలు దోచుకున్నదెవరంటే టీడీపీ నాయకులని ప్రజల వేళ్లు చూపిస్తాయి. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు బాతులా మారిపోయిన విషయం తెలిసిందే. నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదలకుండా మింగేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లా సాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయిన్లతో తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేశారు. వంతెనలకు, ఇరిగేషన్ పంపులు, వాటర్ ఫిల్టర్ సంపులకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాల వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలను వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోయారు. రీచ్‌ల వద్ద లారీకి రూ.6 వేల నుంచి 10 వేల వరకూ వసూలు చేసిన దాఖలాలున్నాయి. నేతలపై ఆరోపణలు.. ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న వంశధార, నాగావళి నదుల్లో అక్రమంగా నిర్వహించిన ఇసుక ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధువులు, అనుచరగణం పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. పోతయ్యవలస ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే లారీలు రాకపోకలు సాధించాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు వద్ద ఇసుక కోసం వందల సంఖ్యలో లారీలు బారులు తీరిన సందర్భాలుండేవి. ఆమదాలవలస మండలం దూసి రైల్వే వంతెన సమీపంలో నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోనైతే 25 లారీలతోపాటు నాలుగు జేసీబీలు వరద పోటుకు మునిగిపోయాయి. డ్రైవర్లు, క్లీనర్లు వరద దిగ్బంధంలో చిక్కుకున్నారు. రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి తవ్వకాలు చేస్తుండగా వరద ముంపునకు గురయ్యారు. ఆ వాహనాలన్నీ కూన రవికుమార్ ప్రధాన అనుచరులవేనంటూ కోడై కూసింది. -శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపుల నిర్వహణలో అచ్చెన్నాయుడు అనుచరులు దందా చేశారన్న వాదనలు ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్ బట్టేరు వద్ద అయితే ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు గ్రామ రెవెన్యూ అధికారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. కల్లేపల్లి, భైరీ ర్యాంపుల్లో టీడీపీ నేతల ఆగడాలు తెలిసిందే. -నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం తదితర ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు భారీగా వసూళ్లు చేశారన్న వాదనలు ఉన్నాయి. -పాతపట్నం నియోజకవర్గంలో మాతల వద్ద నాటి ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరిగాయన్నది అందరికీ తెలిసిందే. -ఎచ్చెర్ల నియోజకవర్గంలో తమ్మినాయుడుపేట, ముద్దాడ పేట, పొన్నాడలో అనధికార ఇసుక ర్యాంపులు నడిచాయి. నాటి జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, నాటి మంత్రి కళా వెంకటరావు మధ్య వివాదం కూడా నడిచింది. ఇసుక ర్యాంపుల్లో వాటాల గురించి టీడీపీ నేతలు గొడవకు దిగిన దాఖలాలున్నాయి. టీడీపీ రాకముందు... అధికారంలోకి వచ్చాక... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరేజి వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరేజి రూపేణా జిల్లాలో ఏటా రూ.50 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను స్థానిక సంస్థల మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు పెట్టేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 300 లారీల వరకు ఇసుకను విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా సాగించారు. విశాఖ మార్కెట్లో లారీ ఇసుక డిమాండ్‌ను క్యాష్ చేసుకున్నారు. లారీ ఇసుక రూ.20 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మొత్తానికి ఐదేళ్లలో రూ.1500 కోట్ల వరకు అక్రమంగా ఆర్జించారు. -
ఇసుకపై నిరంతర నిఘా!
సాక్షి, అమరావతి: నిరంతర నిఘా ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క టన్ను ఇసుక కూడా దారిమళ్లడానికి, దుర్వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు నిరంతర నిఘా కొనసాగించనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. కాగా, రాష్ట్రంలో అన్ని ఇసుక రేవులు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో అతి తక్కువ మొత్తానికి రూ.58,970.5కు కోట్ చేసిన ఆర్యాస్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–1గా నిలిచింది. ‘రూ.59,689.66కు బిడ్ వేసిన యాపిల్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–2గా, రూ.1,32,299కి కోట్ చేసిన బ్రిస్పతి అనే సంస్థ ఎల్–3గా నిలిచాయి. కెమెరా, స్తంభం, బ్యాటరీ, సోలార్ ప్యానల్, ఇన్స్టలేషన్ కలిపి సీసీ కెమెరా యూనిట్‌గా నిర్ణయించి 302 యూనిట్లకు టెండర్లు పిలవగా ఒక్కో యూనిట్‌కు రూ.58,970.5కు ఆర్యాస్ బిడ్ వేసింది. ఇదే తక్కువ మొత్తం కావడంతో ఈ సంస్థకే టెండరును ఖరారు చేశారు. అలాగే ఇసుక తవ్వకం (క్వారీల్లో ఇసుక తవ్వకం, కూలీలతో ట్రాక్టర్‌కు లోడింగ్, స్టాక్ యార్డుకు రవాణా, అన్ లోడింగ్, అక్కడ నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు టిప్పర్‌కు లోడింగ్) కోసం తొమ్మిది షెడ్యూళ్లకు టెండర్లు పిలవగా 40 మంది బిడ్లు వేశారు. అంతకుముందు తొలి విడతలో 38 షెడ్యూళ్లకు టెండర్లు ఖరారు చేశారు. రవాణా టెండర్లు రద్దు స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుక రవాణా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా యూనిట్‌గా పిలిచిన టెండర్లు రద్దు కానున్నాయి. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ టెండర్లు రద్దయినట్టే. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను తీసుకెళ్లే అవకాశం వాహన యజమానులందరికీ కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ అధికారులు వాహన యజమానుల అసోసియేషన్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇసుక రవాణా ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. -
సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ
-
ఇసుక రీచ్‌లు పెంచాలి
సాక్షి, అమరావతి: గుర్తించిన ప్రతి స్టాక్ యార్డులో ఇప్పటినుంచే ఇసుక నింపడం ప్రారంభించాలని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని ఎక్కువ రీచ్‌లను అందుబాటులోకి తేవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువకే ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. ‘స్పందన’పై సమీక్షలో భాగంగా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన పలు సూచనలు చేశారు. ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి.. ‘‘సెప్టెంబర్ 5 నుంచి ఇసుక సరఫరాకు కొత్త విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్లో ఇవాళ ఉన్న ధర కంటే తక్కువ రేటుకే ఇసుకను అందుబాటులోకి తేవాలి. ఇసుక సరఫరా పెంచకపోతే ధరలు తగ్గవు. అందువల్ల ఇప్పటి నుంచి తరలించి స్టాక్ యార్డులను ఇసుకతో నింపడంతోపాటు వీలైనన్ని ఎక్కువ రీచ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలి. ఇసుక రవాణా చేసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించండి. ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టన్ను ఇసుక కూడా అక్రమ తవ్వకం, రవాణా జరగడానికి వీల్లేదు. గతంలో ఇసుక ద్వారా దోచుకున్న మాఫియా వారే ఇప్పుడు మన ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. మనం ప్రజలకు మంచి చేస్తే చూడలేక దెబ్బతీయాలని చూస్తున్నారు. అందువల్ల అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరించండి. ఉద్దేశపూర్వకంగా ఇసుక విధానాన్ని దెబ్బతీయాలనే కుట్రలతో కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా, ఇతరత్రా మోసాలు చేసినా ఎక్కడా సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అందుబాటులో ఉంచుకోండి’’ అని సీఎం తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
ఇసుక రెడీ.. 5 నుంచి సరఫరా
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని స్టాక్ యార్డుల నిండుగా ఇసుక నింపాలని, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి కోరిన చోటుకు వెంటనే చేరవేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 102 ఇసుక రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి (ఒక్కో దానిలో రెండు మూడు రీచ్‌లు ఉండేలా) స్టాక్ యార్డులకు ఇసుక చేర వేసేందుకు జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్ టెండర్లు నిర్వహించింది. సింగిల్ బిడ్లు వచ్చిన వాటిని రద్దు చేసి వీటితో కలిపి అసలు బిడ్లు రాని వాటికి తిరిగి టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. పారదర్శకత, ప్రజలకు సరసమైన ధరకు ఇసుక సరఫరా, ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం సర్కారుకు రాబడి లక్ష్యాలుగా ఇసుక విషయంలో కొత్త విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా, లోప రహితంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వొద్దు వచ్చే నెల 5వ తేదీ నుంచి ఎవరు ఇసుక బుక్ చేసుకున్నా తక్షణమే సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు మార్గనిర్దేశం చేసింది. నూతన పాలసీని అత్యంత పారదర్శకంగా, ఏమాత్రం అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించింది. రాష్ట్రంలో టన్ను ఇసుక కూడా దుర్వినియోగం కావడానికి వీల్లేకుండా సరసమైన ధరలకు ప్రజలకు అందించాలన్నదే సీఎం ఉన్నతాశయమని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా ప్రయోజనాలకు వినియోగించడమే లక్ష్యమని పేర్కొంది. ‘గత ఐదేళ్లు మాఫియాగా మారి ఇసుక విక్రయాల ద్వారా దండుకున్న వారికి ప్రస్తుత సర్కారు కొత్త విధానం తేవడం సుతరామూ ఇష్టం లేదు. అందువల్ల ఈ మాఫియా గ్యాంగులు తెరవెనుక ఉండి టెండర్లను దెబ్బతీయాలని, ఇసుక సరఫరాలో ప్రభుత్వాన్ని విఫలం చేయాలని కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నాయి. టన్ను ఇసుకను రీచ్‌లో తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ చేసి స్టాక్ యార్డుకు తరలించి అన్లోడ్ చేసి, తిరిగి వినియోగదారులకు రవాణా చేసేందుకు వాహనానికి లోడ్ చేయడం కోసం కేవలం పది పైసలకే టెండరు దాఖలు చేయడం ఇందుకు నిదర్శనం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాఖలైన టెండర్లు ఈ కోవలోనివేనని గుర్తించి ముందుకెళ్లండి. ఎవరి ఆటలూ సాగనీయొద్దు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లండ’ని ప్రభుత్వం పేర్కొంది. కొత్త రీచ్‌లకు త్వరితగతిన అనుమతులు ప్రస్తుతం గుర్తించిన 102 ఇసుక రీచ్‌లతోపాటు కొత్త రీచ్‌లను గుర్తించి అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు త్వరితగతిన తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే అనుమతులు ఉన్న రీచ్‌లలో కొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల నదులు ప్రవహిస్తున్నందున ఇసుక తీయలేని పరిస్థితి ఉందని, అందువల్ల మిగిలిన చోట్ల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పింది. ‘రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల అమరిక త్వరగా పూర్తి చేయాలి. జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న ప్రతి వాహనానికి ఏపీఎండీసీలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ఎక్కడా ఏకస్వామ్యం ఉండరాదు. జిల్లా యూనిట్‌గా ఇసుక రవాణా బాధ్యతలు ఒకే సంస్థకు గంపగుత్తగా అప్పగించొద్దు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక రవాణా చేసేందుకు జీపీఎస్ అమర్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ వాహనమైనా అనుమతించండి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం వాహనాలకు జీపీఎస్ యంత్రాలు తప్పనిసరిగా అమర్చాలనే నిబంధన పెడుతున్నాం’ అని ప్రభుత్వం పేర్కొంది. సర్వసన్నద్ధం దిశగా ఏర్పాట్లు ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకే కాకుండా నూతన విధానం కొలిక్కి వచ్చే వరకు లోటుపాట్లను సవరించి గాడిన పెట్టేందుకు ప్రతిరోజూ సమీక్షించాలని సీఎం జగన్ తన ముఖ్య సలహాదారు అజేయకల్లంను ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు ఇసుక పాలసీ అమలుకు సన్నద్ధత, లోటుపాట్ల సవరణ, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారులతో అజేయ కల్లం సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేస్తే ప్రభుత్వం పరిష్కార మార్గాలు సూచిస్తుందని, లోపాలు, విమర్శలకు తావులేని విధంగా ఇసుక సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వరదల వల్ల ప్రస్తుతం 70 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ప్రారంభించి స్టాక్ యార్డులకు చేరవేస్తామని, నీరు తగ్గగానే మిగతా 32 రీచ్‌లలో కూడా తవ్వకాలు సాగిస్తామని అధికారులు వివరించారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 30 – 32 స్టాక్ యార్డులతో ఇసుక సరఫరా ప్రారంభించి తర్వాత వీటి సంఖ్య క్రమంగా పెంచుతామని చెప్పారు. స్టాక్ యార్డుల నుంచి సరఫరా కోసం 5 జిల్లాల్లో టెండర్లు స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుకను టిప్పర్లు, లారీల్లో తరలించడం కోసం జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్ టెండర్లు నిర్వహించగా రెండు జిల్లాల్లో సింగిల్ టెండర్లు వచ్చాయి. వీటిని ఏపీఎండీసీ తిరస్కరించింది. మరో మూడు జిల్లాల్లో గిట్టుబాటుకాని రేట్లకు బిడ్లు దాఖలయ్యాయి. దీంతో కాంట్రాక్టర్లతో అధికారులు చర్చించి వీటిని రద్దు చేశారు. దీంతో విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇసుక రవాణాకు తిరిగి టెండర్లు ఆహ్వానిస్తూ 29 తుది గడువుగా ఏపీఎండీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాక్టర్లకు టెండర్లు స్టాక్ యార్డుల నుంచి 30 కిలోమీటర్ల లోపు దూరానికి తక్కువ పరిమాణంలో ఇసుక అవసరమైన వారికి సరఫరా కోసం ట్రాక్టర్లు వినియోగించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది. ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది. కనీసం పది ట్రాక్టర్లు సొంతంగా కలిగి ఉన్న, లీజుకు తీసుకుని ఉన్న వారు టెండర్లలో పాల్గొనడానికి అర్హులు. టెండర్ల దాఖలుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉంది. ఈ మూడు టెండర్లకు సంబంధించి నిబంధనలు, ఇతర వివరాల కోసం ఏపీఎండీసీ వెబ్సైట్లో చూడవచ్చు. సింగిల్ టెండర్లు రద్దు రీచ్‌లలో ఇసుక తవ్వకం, ట్రాక్టర్లకు కూలీలతో లోడింగ్, సమీపంలోని స్టాక్ యార్డుకు రవాణా, అక్కడ అన్లోడింగ్, తిరిగి వినియోగదారులకు చేరవేసేందుకు లోడింగ్‌కు 102 రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి జిల్లా యూనిట్‌గా ఏపీఎండీసీ ఈ– టెండర్లు నిర్వహించింది. వీటిలో అతి తక్కువకు కోట్‌చేసిన ఎల్–1ను గరిష్ట మొత్తంగా నిర్ణయించి రివర్స్ యాక్షన్ (రివర్స్ టెండర్లు) జరిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో రెండేసి షెడ్యూళ్లకు సింగిల్ టెండర్లు రావడంతో రద్దు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు షెడ్యూళ్లకు అధిక మొత్తాల్లో బిడ్లు రావడంతో తిరస్కరించింది. అనంతపురం జిల్లాలో ఒకదానికి, తూర్పు గోదావరి జిల్లాలో రెండింటికి బిడ్లు రాలేదు. దీంతో మొత్తం తొమ్మిది షెడ్యూళ్లకు మళ్లీ టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 29వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని అందులో పేర్కొంది. 97.82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా 97.82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ఈ మేరకు జిల్లాలు, రీచ్‌ల వారీగా ఇసుక నిల్వలను ప్రభుత్వం గుర్తించింది. నదుల్లో 90 ఓపెన్ రీచ్‌లు, 31 డీసిల్టేషన్ కేంద్రాలు, 82 పట్టా భూముల్లో ఎక్కడ ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయో గనుల శాఖ గుర్తించి ఏపీఎండీసీకి పంపించింది. -
ఇసుక కొరతపై ముందస్తు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ఇసుక కొరత తలెత్త కుండా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) జాగ్రత్తలు తీసుకుంటోంది. సీజన్‌లేని సమయంలో ఇసుకధరలను నియం త్రించి భవననిర్మాణాలకు కొరతలేకుండా సన్నాహాలు చేస్తోంది. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా స్టాక్ పాయింట్లు, సబ్ స్టాక్పాయింట్లలోనూ ఇసుక నిల్వ చేయాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో 30 రీచ్‌ల ద్వారా ఇసుకను వెలికి తీసి, ఆన్లైన్ విధానంలో విక్రయిస్తున్నారు. రీచ్‌ల సమీపంలో 30 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన వారికి సరఫరా చేస్తున్నారు. ఇసుక డిమాండ్ దృష్ట్యా కొత్తగా మరో 3 రీచ్‌లను తెరిచేందుకు టీఎస్ఎండీసీ సన్నాహాలు చేస్తోంది. గోదావ రిపై ఖమ్మం జిల్లా పోలంపల్లి, మానేరు నుం చి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నుంచి ఇసుకను వెలికితీసేందుకు కొత్త రీచ్‌లు ఏర్పాటు చేయాలని టీఎస్ఎం డీసీ నిర్ణయించింది. 30 రీచ్‌ల నుంచి ఇసు కను వెలికి తీస్తున్నా 27 రీచ్‌లు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో సరఫరా అవుతున్న ఇసుకలో 96 శాతం ఈ రెండు జిల్లాల పరిధిలోని రీచ్‌ల నుంచే వెలికి తీస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ టీఎస్ఎండీసీ ద్వారా రోజుకు 53 వేల క్యూ బిక్ మీటర్ల ఇసుకను వెలికి తీసి విక్రయిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో 30 వేల క్యూబిక్ మీటర్ల మేర డిమాండ్ ఉండగా, ప్రస్తుతం రెట్టింపు ఉన్నట్లు టీఎస్ఎండీసీ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాలం సమీపి స్తుండటంతో భవన నిర్మాణదారులు ముందుజాగ్రత్తగా నిలువ చేస్తుండటంతో డిమాం డ్ పెరుగుతోంది. టన్ను ఇసుకను టీఎస్ ఎండీసీ రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్ర యిస్తోంది. రవాణా, ఇతర చార్జీలు కలుపు కుని బహిరంగమార్కెట్లో రూ.1,250 నుంచి రూ.1,500 వరకు ధర పలుకుతోంది. వర్షా కాలం ఆరంభం అవుతుండటంతో రీచ్‌ల వద్ద ఇసుక వెలికితీత మొదలుకుని, స్టాక్ పాయిం ట్ల నుంచి రవాణా వరకు అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో దళారీలు మార్కెట్లో రేటు అమాంతం పెంచేస్తుండ టంతో వినియోగదారులపై భారం పెరగ నుంది. గత అక్టోబర్‌లో టన్ను ఇసుకధర మార్కెట్లో రూ.3 వేలకు చేరిన విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. 60 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వl స్టాక్ పాయింట్ల వద్ద ఇప్పటివరకు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసిన టీఎస్ ఎండీసీ మరో 40 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జంటనగరాల పరిధిలోనే ఇసుక వినియోగం ఎక్కువగా ఉండటంతో సబ్ స్టాక్ పాయింట్ల వద్ద నిల్వలు పెంచాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్, మరో రెండుచోట్ల సబ్ స్టాక్ పాయింట్లను నిర్వహి స్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ నుంచి రవాణా అవుతున్న ఇసుకను కొంత మేర కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టాక్ పాయింట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇసుక డిమాండ్ పెరిగే పక్షంలో స్టాక్ పాయింట్లతో పాటు, సబ్ స్టాక్ పాయింట్లలోనూ నిల్వలు పెంచేలా టీఎస్ఎండీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
ఇసుక లెక్కలు సరే..
♦ నిబంధనల అమలు ఎక్కడ? .. ♦ కఠిన శిక్షలు ఏమయ్యాయి? ♦ ‘సాక్షి’ కథనంతో అధికారుల్లో చలనం వచ్చినా.. తాడేపల్లిరూరల్ : ‘పర్యవేక్షకులే ఇసుకాసురులు’ శీర్షికన ఈనెల 20న ప్రచురించిన ‘సాక్షి’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక రీచ్‌లలో గురువారం నుంచి రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చి వెళ్లే వాహనాల లోడింగ్ వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎవరికి తోలుతున్నారనే విషయాలను కూడా సేకరిస్తూ లారీ నంబర్‌తో కలిపి ఆధార్ కార్డ్‌ను లింక్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఉచిత ఇసుక పాలసీలో నిబంధనలను మాత్రం గాలికొదిలేశారు. ఎవరైనా తప్పు చేస్తే కఠిన శిక్షలు తప్పవని వివిధ శాఖలకు చెందిన అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారం రీచ్‌ల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించకూడదు. కానీ గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ లాంటి మహానగరాలకే ఇసుక తరలిపోతోంది. అంతేగాక నిబంధనల ప్రకారం ట్రాక్టర్లకు, చిన్న చిన్న ఆరు టైర్ల టిప్పర్లకే లోడ్ చేయాల్సి ఉండగా, రాజధాని ప్రాంతంలో 10 టైర్లు, 12 టైర్లు, 14 టైర్ల వాహనాలకు కూడా లోడ్ చేసి, ఇతర రాష్ట్రాలకు దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదిమాత్రం అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టగానే రీచ్‌ల సమీపంలోనూ, ప్రధాన రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఈ చెక్ పోస్టులు కనిపించకపోవడం గమనార్హం. ఏదో తూతూమంత్రంగా రెవెన్యూ శాఖ అధికారులతో లెక్కలు తీసినంతమాత్రాన దోపిడీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. రెవెన్యూ అధికారులు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కలు వేస్తున్నారే తప్ప రాత్రి సమయంలో తరలిపోయే లక్షల టన్నుల ఇసుక లెక్కలు ఎలా తీస్తారో స్పష్టత లేదు. -
ఇసకేస్తే రూ.కోట్లు!
► జీవీఎంసీలో ఇసుకాసురుల దందా ► ఉచిత ఇసుకకూ అనుచిత వసూళ్లు ► శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి ఇసుక రవాణా ► దానికి అనుమతి పేరుతో దోచేస్తున్న అధికారులు ► ట్రిప్పునకు రూ.500 ఇస్తేనే స్లిప్పు ► ప్రతిరోజూ వందలాది ట్రిప్పులు మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో పనిచేసిన పాము పాండురంగారావు రూ. వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారంటే మొదట్లో ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు.. కూసింత బయటపడితే.. చింపి చేటంత చేస్తారన్న వ్యాఖ్యలు వినిపించాయి.. కానీ పక్కా ఆధారాలతో వెల్లడైన ఆస్తుల లెక్కలు.. అందరి కళ్లూ అంటుకుపోయేలా చేశాయి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. జీవీఎంసీలో అలాంటి అవినీతి ‘కట్టల’ పాములు ఇంకా చాలానే ఉన్నాయి మరి.. ప్రతి పనిలోనూ కాసులు వెతుక్కొని కోట్లు కూడబెట్టేవారు ఇంకెంతో మంది ఉన్నారు.. అంతెందుకు.. ప్రభుత్వం ఇసుక సరఫరాను ఉచితం చేసినా.. అందులోనూ రూ. కోట్ల కుప్పలు పోగేసుకోగల ఘనులు.. మన జీవీఎంసీ అధికారులు! రవాణాకు అనుమతుల పేరుతో.. ట్రిప్పునకు ఇంత అని రేటు పెట్టి మరీ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అదెలాగంటే... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గతంలో ఇసుక రీచ్‌ల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం.. ఇసుక కొరత నెలకొనడం వంటి కారణాలతో ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎక్కడో ఏమో గానీ.. జీవీఎంసీ అధికారులకు మాత్రం ఈ విధానం ‘ఉచిత’ సంపాదన మార్గంగా మారింది. అడ్డదారిలో రూ.కోట్లు సంపాదించిపెడుతోంది. జీవీఎంసీ పరిధిలో భారీ స్థా?ఇలో భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇసుక కొరత తీవ్రమైంది. జిల్లాలో ఏ రీచ్‌లోనూ ఇసుక లభ్యం కాని పరిస్థితుల్లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అక్కడి రీచ్‌ల నుంచి ఇసుక తెప్పిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలోని నిర్మాణాలకు అవసరమైన ఇసుకను శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం ముద్దాడ, పింగూరు రీచ్‌ల నుంచి తీసుకునేందుకు అనుమతులు పొందారు. అక్కడ కూడా పూర్తి ఉచితంగానే ఇసుక పంపిణీ చేస్తారు. అయితే రవాణా ఖర్చులు మాత్రం వినియోగరారుడే భరించాలి. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తమకు అవసరమైన ఇసుక కోసం కార్పొరేషన్ అధికారుల నుంచి సిఫారసు చేయించుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా దీన్నే అవకాశంగా తీసుకొని జీవీఎంసీ అధికారులు దోపిడీ పర్వానికి తెర తీశారు ఇసుక కావాల్సిన కాంట్రాక్టర్లు జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని సంప్రదించాలి. తమ నిర్మాణాలకు సంబంధించి ఎన్ని ట్రిప్పుల ఇసుక కావాలో ముందుగా తెలియజేయాలి. ఆ మేరకు ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి సదరు కాంట్రాక్టర్లకు స్లిప్‌లు అందిస్తారు. ఆ స్లిప్ తీసుకుని పొందూరు మండలంలోని రీచ్‌కు వెళ్తే అక్కడ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తారు. కానీ కార్పొరేషన్ అధికారులు ట్రిప్పునకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని రూ.500 వాళ్లకు ముట్టజెప్పాల్సిందే. అసలే తీవ్రమైన ఇసుక కొరతతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయిన తరుణంలో కాంట్రాక్టర్లు మారు మాట్లాడకుండా ట్రిప్పుకు 500 చొప్పున ఇచ్చి స్లిప్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా రోజుకు 300 నుంచి 400 ట్రిప్పులు పొందూరు మండలం నుంచి వస్తున్నాయి. దీన్ని బట్టి జీవీఎంసీ అధికారులు ఉచిత ఇసుక పంపిణీ ద్వారా ఎంత కొల్లగొడుతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏం చేస్తున్నట్టు? ఉచిత ఇసుక వ్యవహారంలోనూ జీవీఎంసీ అధికారులు కాసులు వెతుక్కుంటుంటే కాంట్రాక్టర్స్ అసోసియేన్ ఏం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ దశలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ద్వారా స్లిప్‌లు అందించే పని చేపట్టారు. అయితే అసోసియేషన్‌లోని కొందరు.. అవినీతి అధికారులతో కుమ్మక్కై.. స్లిప్ రాస్తే తమకూ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వాళ్లకు కొంత.. వీళ్లకు కొంత అంటూ అటు అసోసియేషన్.. ఇటు అధికారులు వాటాలు వేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నా విధి లేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎవరికివ్వాల్సింది వారికి ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి
– జిల్లాస్థాయి కమిటీకి జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌లను జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి ఫీజు బులిటీకి అవకాశం ఉందా లేదా అనే దానిపై వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. సోమవారం రాత్రి తన ఛాంబర్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుంగభద్రలో కౌతాళం మండలం గుడికంబాలిలో మూడు, నదిచాగిలో రెండు, హొళగుంద మండలం ముదటమాగిలో రెండు రీచ్‌లను గుర్తించినట్లు తెలిపారు. దేవనకొండ మండలంలోని హంద్రీ, ఇతర వాగులు, వంకల్లో ఏడు రీచ్‌లు గుర్తించామన్నారు. వీటిలో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని పరిశీలించాలన్నారు. ఇందుకు ఇరిగేషన్ ఎస్ఈ, భూగర్భ జలవనరుల శాఖ డీడీ, మైనింగ్ ఏడీ, సంబంధిత ఆర్డీఓలు రీచ్‌లను పరిశీలించి వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హంద్రీ వెంట 36 గ్రామాలు ఉండగా లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక ఉన్న గ్రామాలు 15 ఉన్నాయన్నారు. వీటిలో కూడా ఇసుక తీసేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ రవీందర్రావు, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
కార్డుందా.. రైట్ రైట్
జోరుగా ఇసుక అక్రమ రవాణా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారగణం చక్రం తిప్పుతున్న అధికారపార్టీ నేత ఇసుక రవాణా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇసుక రీచ్‌ల నిర్వహణను రద్దు చేసి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లాలని తీసుకున్న నిర్ణయం అధికారపార్టీ వారికి కాసులు కురిపిస్తోంది. ఇది వారి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు నిత్యం లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. సోమశిల(ఆత్మకూరు): కార్డుల పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అటు పోలీసు అధికారులు, ఇటు రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అనంతసాగరం మండల పరిధిలో రెండు ఇసుకరీచ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి పీకేపాడు కాగా, రెండోది లింగంగుంట ఇసుక రీచ్. లింగంగుంట ఇసుక రీచ్‌లో గ్రామస్తులు అడ్డుకోవడంతో ప్రస్తుతం రవాణా సాగడం లేదు. మండలంలోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం, బెస్తవారిపేట, కంభం తదితర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది. రోజూ 150 నుంచి 200 ట్రాక్టర్లలో ఇసుక బద్వేల్ వరకు తరలుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇసుక రవాణా మొత్తం అక్రమంగానే సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధించిన నిబంధనల కన్నా ఇసుకను అధికంగా లోడ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. రోజూ వేలాది రూపాయలు దండుకొంటున్నారు. స్థానిక రెవెన్యూ, రవాణా ఇతర శాఖలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. ట్రాక్టర్లకు నెల కార్డులు ఈ ప్రాంతంలో ఇసుక రవాణాకు సంబంధించి ఒక్కో ట్రాక్టరుకు నెలకు రూ.2000 చెల్లించాలనే అక్రమ నిబంధన నెల కార్డుల పేరుతో ఉండడంతో ట్రాక్టర్ల డ్రైవర్లు సైతం అధికంగా ఇసుకను అక్రమంగా లోడ్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇసుక రవాణా చేసేందుకు పత్రాలు సక్రమంగా ఉన్నా లేకపోయినా ఆత్మకూరు రవాణా శాఖ అధికారికి రూ.1500, మర్రిపాడు పోలీసులకు రూ.2000, వైఎస్సార్ జిల్లా బద్వేల్ పోలీసులకు రూ.2500, రవాణా శాఖ వారికి రూ.1500, పోరుమామిళ్ల పోలీసులకు రూ.1500 నెల కార్డులకు సమర్పించుకుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకునే వారు ఉండరని సమాచారం. చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తన అనుచరగణానికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపకుంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. అక్రమ రవాణాపై చర్యలు చేపడతాం పీకే పాడు ఇసుక రీచ్ నుంచి అధిక లోడుతో ఇసుక తరలుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దానిపై దృష్టి సారించి చర్యలు చేపడతాం. ఎంసీ కృష్ణమ్మ, తహసీల్దార్, అనంతసాగరం -
మూసుకుపోయింది!
►దూసి ఆర్ఎస్ ఇసుక అక్రమ ర్యాంపు మూసివేత ►నది పక్కనే పొక్లయినర్లను దాసి పరారైన ముఠా ► వాటిని సీజ్ చేయకుండా తిరిగొచ్చిన అధికారులు ► పది రోజుల్లోనే రూ.56 లక్షలు దండుకున్న అక్రమార్కులు ► సీజ్ చేయకుంటే మళ్లీ ఇసుక తవ్వేందుకు అవకాశం ► పకడ్బందీ చర్యల్లేకుంటే పొంచివున్న పెను ప్రమాదం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే నాగావళి నదిని ఇసుక తవ్వకాలతో తూట్లు పొడుస్తున్న మరో ముఠా తోక ముడిచింది! ఆమదాలవలస మండలం దూసిపేటలో పరిమితికి మించి పొక్లయినర్లతో నిబంధనలను విరుద్ధంగా రూ.15 కోట్లు విలువైన ఇసుకను దోపిడీ చేసిన ముఠా ఆగడాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చింది. దీంతో దూసిపేటలో ర్యాంపు నిలిచిపోయినా ఆ పక్కనే దూసి రైల్వేస్టేషన్ వద్ద మరో ర్యాంపును అక్రమంగా తెరిచింది మరో ముఠా. దీనిపై కూడా సాక్షి కథనం ఇచ్చింది. ఈ ముఠా నిలువుదోపిడీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం సోమవారం జిల్లా కలెక్టరు పి.లక్ష్మీనృసింహానికి ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం ర్యాంపును పరిశీలించి.. అక్రమమని తేల్చారు. దీన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దూసి రైల్వే క్వార్టర్ల పక్కనుంచి ర్యాంపు వరకూ అక్రమంగా నిర్మించిన గ్రావెల్ రోడ్డు ప్రవేశమార్గాన్ని రైల్వే అధికారులు మూసివేశారు. అయితే ర్యాపు వద్దే గడ్డిలో ముఠా దాచేసిన రెండు భారీ పొక్లయినర్లను అధికారులు సీజ్ చేయకపోవడంపై దూసి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడగానే ముఠా మళ్లీ ఇసుక తవ్వకాలు సాగించేందుకు ఇది అవకాశం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో వర్షం పడితే జిల్లాలో భారీ వరదతో పొటెత్తే నాగావళి, వంశధార నదుల గురించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియనది కాదు! అది ప్రకృతి విపత్తు అని సరిపెట్టుకోవచ్చు... కానీ ఎక్కడి నుంచో జిల్లాకు వచ్చి నదుల్లో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతూ పరివాహక ప్రాంతాలకు ముఠాలు పెనుముప్పు తెస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన తర్వాత ఈ ముఠాలు రెక్కలు విచ్చుకున్నాయి. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులను మచ్చిక చేసుకొనో, వారి బంధువులకు, బినామీలకు వాటాలిచ్చో ఒక్కో ప్రాంతాన్ని వరుసగా దోచుకుపోతున్నాయి. ' దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది క్వార్టర్ల పక్కనుంచి నాగావళి నదీగర్భం వరకూ జీడిమామిడి తోటలను తొలగించి రూ.7 లక్షల ఖర్చుతో కిలోమీటరు రోడ్డును ఇసుక మాఫియా ఆఘమేఘాలపై వేసింది. ఇందుకు అవసరమైన కంకర అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి క్వారీల నుంచి సరఫరా కావడం గమనార్హం. ఇందుకు ప్రతిఫలం ర్యాంపులో ఆయన కుమారుడికి వాటా రూపంలో దక్కింది. అలా ఆరుగురు వాటాదారుల్లో ముగ్గురికి అధికార పార్టీ నేతలతో ఏదొక రూపంలో సంబంధాలు ఉండటం, మాఫియా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల పేరు చెప్పి బెదిరించడంతో దూసి గ్రామస్థులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. దీనిపై అధికారులు కూడా స్పందించలేదు. యథేచ్ఛగా సాగుతున్న ఈ దోపిడి వ్యవహారాన్ని సాక్షి ఈనెల 16న ‘కళ్లు మూసుకున్నారు!’ శీర్షికతో వెలుగులోకి తీసుకొచ్చింది. పది రోజుల్లో రూ.56 లక్షల దోపిడీ దూసి ఆర్ఎస్ ర్యాంపుకు ఇసుక కోసం వచ్చే ఒక్కో లారీకి రూ.4,800 చొప్పున ముఠా వసూలు చేసింది. రాత్రీపగలు తేడాలేకుండా గత పది రోజుల్లో వందల సంఖ్యలో లారీలు ఇసుక తరలించుకుపోయాయి. వాటి నుంచి ముఠా వసూలు చేసింది దాదాపు రూ.56 లక్షలని సమాచారం. పొక్లెయినర్లను పట్టించుకోలేదు వాస్తవానికి ర్యాంపు వద్ద పొక్లయినర్ల వంటి యంత్రాలేవీ ఇసుక ఎత్తిపోతకు ఉపయోగించకూడదు. కానీ దూసిపేట ర్యాంపులోనే ఆరు పొక్లెయినర్లను పెట్టి నాలుగు నెలల పాటు నిర్విరామంగా లక్షల యూనిట్ల ఇసుక తరలించుకుపోయింది. అదే నిబంధనల ప్రకారం చేస్తే సంవత్సరం అంతా స్థానికులకు ఉపాధి దొరికేది. పొక్లయినర్లను అధికారులు సీజ్ చేయకపోవడంతో దూసి ఆర్ఎస్ ర్యాంపులోనూ మూడు పొక్లెయినర్లను ముఠా దించింది. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం దూసి గ్రామస్థులతో కలిసి ర్యాంపు వద్ద ఆందోళనకు దిగనున్నారని, అలాగే అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలుసుకున్న ఇసుక మాఫియా అప్రమత్తమైంది. మూడు పొక్లెయినర్లలో ఒకదాన్ని ఉదయాన్నే అక్కడి నుంచి పంపించేశారు. మిగిలిన రెండింటిని నదిపక్కన ఒక గొయ్యిలో గడ్డిమధ్య దాచేశారు. తమ్మినేని బృందం పరిశీలించి వచ్చిన తర్వాత రెవెన్యూ, గనుల శాఖ అధికారులు ర్యాంపులో పరిశీలనకు వచ్చారు. ర్యాంపు అక్రమమని ప్రకటించారు. కానీ ఆ రెండు పొక్లయినర్లను సీజ్ చేయలేదు. -
ఉచిత దోపిడీ
► యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ► ట్రాక్టర్ ఇసుక రూ.4వేలు ► అనుమతి లేని రీచ్‌ల నుంచీ తరలింపు ► ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఇసుక డంప్ ► రోజుకు 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్ముకుంటున్న తమ్ముళ్లు అధికారికంగా జిల్లాలో మొత్తం రీచ్‌లు : 28 మొన్నటి వరకు అధికారికంగా విక్రయించిన ఇసుక : 12,65,251 క్యూబిక్ మీటర్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం : రూ.73.04 కోట్లు అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్‌ల ద్వారా టీడీపీ నేతలు మొన్నటి వరకు సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించినట్లు అంచనా. అక్రమ రవాణా ద్వారా టీడీపీ నేతలు రూ.70 కోట్ల వరకు కొల్లగొట్టారు. డ్వాక్రా సభ్యుల పేరుతో చేసిన దోపిడీ ఇది. ప్రస్తుతం.. జిల్లాలో 21 రీచ్‌లు, 29 వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. అందులో పొట్టేపాళెం, కోలగట్ల, పడమటిపాళెం, అప్పారావుపాళెం, పుచ్చలపల్లి, గొల్లకందుకూరు, చిగురుపాడు, ఎస్వీకండ్రిగ, సజ్జాపురం, మినగల్లు, ముదివర్తి, ముదివర్తిపాళెం, పల్లిపాడు, వేగూరు, జమ్మిపాళెం, లింగంగుంట, మాముడూరు, పడమటికంభంపాడు, పడమటిపాళెం, సూరాయపాళెం, ఇరువూరు రీచ్‌ల నుంచి ప్రస్తుతం ఇసుకను తరలిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రస్తుతం జిల్లాలో అనుమతులు ఉన్న రీచ్‌ల ద్వారా రోజుకు 50వేల క్యూబిక్ మీటర్లు ఇసుకను తరలిస్తునట్లు అంచనా. ఒక్క పొట్టేపాళెం రీచ్ నుంచి రోజుకు 200 ట్రాక్టర్ల ద్వారా సుమారు 3వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసుకెళ్తున్నారు. పేరుకు ఇసుక ఉచితమే అయినా ఒక ట్రాక్టర్ రూ.1,800 నుంచి రూ.4వేల దాకా విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక తరలింపులో టీడీపీ ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పరసారత్నం, నెలవల సుబ్రమణ్యం, వేనాటి రామచంద్రారెడ్డి, కన్నబాబు అనుచరులు రీచ్ల్ వద్ద ట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారు. ఈ ఇసుక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మరికొందరు పరిశ్రమలకు ఇసుకను అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. అనుమతులు లేని రీచ్‌ల నుంచి చేజర్ల మండల పరిధిలోని కోటితీర్థం, టీకే పాడు, పుట్టుపల్లి, ఉలవపల్లి మడపల్లి, పెరుమాళ్లపాడు రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల నుంచి రాత్రి, పగలు యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నబాబు అనుచరులు బుజ్జినాయుడు, కండే శీనయ్య, చీర్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీనరసారెడ్డి, మహేష్‌రెడ్డి, బీజేపీ నాయకులు ప్రేమ్‌చంద్ నుంచి ఇసుకను వాహనాల ద్వారా తరలించి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రుళ్లు కర్ణాటకకు తరలిస్తున్నారు. టీడీపీకి చెందిన బడా కాంట్రాక్టర్ బొల్లినేని శ్రీనివాసులు (బొల్లినేని కన్స్ట్రక్షన్స్)కు చేజర్ల తహసీల్దార్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రీచ్‌ల నుంచి ఇసుకను కాంట్రాక్ట్ పనులకు వినియోగించుకుంటున్నారు. చేజర్ల పరిధిలోని రీచ్‌లలో ప్రొక్లైనర్లతో ఇసుకను తోడుకుంటున్నారు. అదేవిధంగా దగదర్తి మండలంలో టీడీపీ నాయకులు మాలేపాటి సోదరులు అటవీ ప్రాంతంలో ఉన్న ఇసుకను అక్రమంగా తీసుకొచ్చి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్టేషన్ వెనుక వైపు డంప్ చేసి ఉన్నారు. ఆ ఇసుకతో ఇటుకలు తయారుచేసి విక్రయిస్తున్నారు. -
ఉచిత రీచ్‌లలో... దేశం వసూలు
► లారీకి రూ. 300 కట్టాల్సిందేనని హుకుం.. ► ఓ నాయకుడి ఆదాయం రోజుకు రూ. 60 వేలు ► రోడ్ల నిర్మాణం పేరిట తమ్ముళ్ల దందా ప్రాతూరు (తాడేపల్లి రూరల్) : తాడేపల్లి మండల పరిధిలోని ఉచిత ఇసుక రీచ్‌లలో లోడింగ్ కన్నా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. గతంలో కూడా ఇదే విధంగా వసూలు చేస్తే మంగళగిరి సీఐ హరికృష్ణ నేతృత్వంలో వారిని అడ్డుకుని నిలువరించారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు తన ఆధీనంలో ఉన్న 40 లారీలకు ట్రిప్పుకు రూ. 300 చొప్పున వసూలు చేస్తున్నారు. రూ. 300 చెల్లించిన లారీ యజమాని సీరియల్ లేకుండా డెరైక్టుగా లోపలకు వెళ్లి ఇసుక లోడు చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అలా ఒక్కో లారీ రోజుకు 5-6 ట్రిప్పులు వేస్తుండగా, ఆ నాయకుడి ఆదాయం రోజుకు రూ. 60 వేలుగా ఉంది. వాస్తవానికి ఇసుక రీచ్‌లలోకి పొక్లెయిన్ యజమానులు రోడ్లు నిర్మించాల్సి ఉండగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రోడ్లు తాము వేస్తామని, డబ్బులు కట్టాల్సిందేనని గ్రామానికి చెందిన లారీ యజమానుల దగ్గర వసూలు చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. గతంలో రోడ్లు వేసేందుకు మూడు రోజుల వ్యవధిలో రూ. 2.30 లక్షలు వసూలు చేసిన వీరు మళ్లీ కొత్తగా వసూలు కార్యక్రమం మొదలుపెట్టారు. నగదు వసూలు చేసేందుకు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను కూడా రోజుకు రూ. 1000 ఇచ్చి ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే సీరియల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న లారీలకు లోడు చేస్తారా? లేదా? అని డ్రైవర్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా లారీ యజమానులు లోడు చేయమని అడిగితే, తమ గ్రామంలో ఇసుక లోడు చేస్తున్నాం, కాబట్టి తరువాతే మీవి లోడు చేస్తామని అంటున్నారంటే ఉచిత ఇసుక విధానంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ హవా ఏ విధంగా కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
మరో 11 ఇసుక రీచ్‌లకు అనుమతులు
కాకినాడ : జిల్లాలో మరో 11 ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసినట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్ కోర్టు హాలులో బుధవారం జరిగిన జిల్లా పర్యావరణ అనుమతుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జిల్లాలో 23 రీచ్‌లుండగా, కొత్తగా గోవలంక, పిల్లంక, కమిని, కొమ్మనపల్లి, వెదుళ్ళపల్లి, తాడిపూడి, కాతేరు, కొత్తపేట, కేదార్లంక, తాతపూడి, కోరుమిల్లి రీచ్‌లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేశారు. కపిలేశ్వరపురం-4 రీచ్ మైనింగ్‌కు అనువుగా లేదని పేర్కొంటూ ఈ రీచ్ ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది. అన్ని రీచ్‌లలో యంత్రాలు వినియోగించకుండా, కేవలం మనుషుల ద్వారా మాత్రమే తవ్వకాలు జరపాలని నిర్దేశించారు. గోవలంక, పిల్లంక, కమిని, కొమ్మనపల్లి రీచ్‌లను కేవలం పరిసర గ్రామాలు, కోనసీమ ప్రాంతవాసుల వినియోగానికి బోట్ల ద్వారా మాత్రమే తవ్వేందుకు అనుమతించారు. మిగిలిన ఏడు రీచ్‌లను జిల్లా అవసరాలకు నిర్దేశించారు. గన్నవరం మండలం ఎర్రంశెట్టిపాలెంలో రీచ్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించి ప్రతిపాదించాలని మైనింగ్ ఏడీకి సూచించారు. వ్యవసాయానికి అనువైన రైతుల ప్రైవేటు భూముల్లో ఇసుక మేటల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులపై కమిటీ సభ్య శాఖల అధికారులు ఉమ్మడిగా పరిశీలన జరిపి, అర్హత మేరకు అనుమతుల కోసం ప్రతిపాదించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మైన్స్ ఏడీ రౌతు గొల్ల, గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ తిరుపతిరావు, పర్యావరణ కాలుష్య మండలి ఈఈ డి.రవీంద్రబాబు, ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఆర్ మూర్తి, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, డీఎఫ్‌వో టి.శ్రీనివాసరావు, భూగర్భ జలశాఖ డీడీ పీఎస్ విజయకుమార్ పాల్గొన్నారు. -
సార్.. అనుమతులు చూపించండి!
► ఇసుక రీచ్ నుంచి వెళ్లిపోతాం ► పెనుమాక క్వారీలో అధికారుల ఆవేదన తాడేపల్లి రూరల్: ‘సార్! అనుమతులు చూపించండి.. ఇసుక రీచ్‌లో నుంచి మేము వెళ్లిపోతాం.. మిమ్ముల్ని సతాయించాలని మేము ఇక్కడకు రాలేదు’ ఓ అధికారి బుధవారం పెనుమాక రీచ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడితో ఫోన్లో సంభాషించిన తీరు ఇదీ. సేకరించిన సమాచారం మేరకు.. పెనుమాక ఇసుక రీచ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులకు, టీడీపీ తాడేపల్లి మండల నాయకులకు మధ్య ఇసుక అమ్ముకునే విషయంపై గత రెండు రోజుల నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు చేతులెత్తేసి, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా నుంచి రెవెన్యూ డిపార్టుమెంట్ ప్రత్యేక గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ సత్యసాయి క్వారీలో జరుగుతున్న ఆధిపత్య పోరును సద్దుమణిగించేందుకు పెనుమాక ఇసుక రీచ్‌కి బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు తమ దగ్గర ఉన్న పత్రాలను సత్యసాయికి చూపించారు. అలాగే రెండో వర్గానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులను కూడా పత్రాలు చూపించమని కోరడంతో వారు పత్రాలు చూపించకుండా, మా సార్ మాట్లాడతారు, మీరు ఫోన్లో మాట్లాడమంటూ డిప్యూటి కలెక్టర్‌కు ఫోన్ అందజేశారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి గుంటూరుకు వస్తే పత్రాలు చూపిస్తానని తెలియజేశారు. అధికారి మాత్రం రెండు గంటలైనా ఇక్కడే ఉంటాను.. మీరు పంపించండంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఎమ్మెల్యే అనుచరులు పలుసార్లు అధికారిని బెదిరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు సత్యసాయి ఇరిగేషన్ ఎస్ఈని ఫోన్లో సంప్రదించగా.. అనుమతులు ఇవ్వలేదనీ, ఇసుక తీసుకోమని జిల్లా కలెక్టర్ చెప్పారని సెలవిచ్చారు. దీంతో అసహనం చెందిన డిప్యూటి కలెక్టర్ సత్యసాయి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. జరుగుతున్న ఈ తంతు చూస్తుంటే ఎటువంటి అనుమతులు లేకుండానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం అవుతోందని అక్కడకు వచ్చిన పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. -
రైతు కంట్లో ఇసుక!
► కృష్ణా తీరంలో అడ్డగోలు తవ్వకాలు ► అడుగంటుతున్న భూగర్భ జలాలు ► ఉచితం పేరుతో ‘తమ్ముళ్ల ’ ఇష్టారాజ్యం ► పట్టించుకోని అధికారులు తాడేపల్లి రూరల్:- ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు నిబంధనలకు నీళ్లొదిలేశారు.. ఉచిత ఇసుక సరఫరా అయినప్పటికీ ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతోంది. దీంతో కృష్ణా ఎగువ, దిగువ ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటాయి. దీంతో కృష్ణమ్మకు జలకళ తప్పింది. ఇసుక తవ్వకాలతో పచ్చగా ఉన్న ప్రాంతం బీడుగా మారుతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక రీచ్‌ల తవ్వకానికి ప్రథమంగా పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిఉంది. అది కష్టతరమైన పని కావడంతో అక్రమార్కులు చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని అనుమతులు ఇచ్చే భూగర్భశాఖ, జల వనరుల శాఖ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లా అధికారులు 50 వేల క్యూబిక్ మీటర్ల లోపు ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వవచ్చని తెలుసుకున్న ‘మాఫియా’ ఒకే గ్రామంలో నాలుగు, ఐదు చోట్ల అనుమతులు పొందేలా చూసుకుంది. ఇసుక తవ్వకాలు నిర్వహించే ప్రాంతంలో 8 మీటర్ల (25 అడుగుల) మేర ఇసుక ఉండి, దాని కింద జల వనరులు ఉన్నప్పుడు మాత్రమే ఒక మీటరు వరకు ఇసుక తవ్వుకునే అవకాశం ఉంది. ఇసుక మాఫియా అడుగు పెట్టిన టీడీపీ నేతలకు అధికారులు ఇలాంటి సూచనలే వీ చేయలేదు. దీంతో బరితెగించిన నాయకులు రెండు నుంచి నాలుగు మీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భూగర్భజలాలు అడుగంటడమే కాక అన్నదాతలు నష్టపోవాల్సివస్తుంది. 130 అడుగులు తవ్వినా నీళ్లు పడటం లేదు.. బోరులో నిత్యం మూడు అంగుళాల బోరులో రెండున్నర అంగుళాల నీటి ధార వచ్చేది. మేం రోజుకు రెండెకరాలకు నీళ్లు పెట్టేవాళ్లం. ప్రస్తుతం ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో బోర్ల నుంచి వచ్చే నీరు తగ్గుముఖం పట్టింది. గతంలో 80 అడుగుల లోతులో నీళ్లు పడేవి, ప్రస్తుతం 130 అడుగుల్లోనూ నీళ్లు పడటం లేదు. ఈ నెలలో మరీ దారుణం. మున్ముందు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. - యేసు ప్రసాద్, చిర్రావూరు -
మూడు ఇసుక రీచ్‌లకు మళ్లీ టెండర్లు
జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లకు తక్కువ రేటు దాఖలు చేసిన వ్యాపారులు ఈ టెండర్ల రద్దుకు మైనింగ్ శాఖ అధికారుల ప్రతిపాదనలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలోని జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం ఇసుక రీచ్‌లకు మళ్ళీ టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 11న జిల్లాలోని ఏడు రీచ్‌లకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువగా టెండర్లు దాఖలైనా, అలాగే తక్కు వగా దాఖలైనా వాటిని రద్దు చేయాలనే ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని అధికారులు మళ్లీ టెండర్లు ఆహ్వానించడానికి చర్యలు తీసుకుంటున్నారు. క్యూబిక్ మీటరుకు రూ.150 నుంచి రూ.500 లోపు రేటు వేయాల్సి ఉంటే జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లకు వరుసగా రూ.138, రూ.142, రూ.116 ల రేటును దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ.150 కంటే తక్కువగా ఉండడంతో వీటిని రద్దు చేయాలని మైనింగ్‌శాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు అందించారు. జిల్లా యంత్రాంగం వీటిని పరిశీలించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో వీటిపై నిర్ణయం తీసుకున్న తరువాత రెండోసారి టెండర్లు ఆహ్వానిస్తారు. మిగిలిన నాలుగు రీచ్‌లకు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే టెండర్లు దాఖలు చేసినా, వాటిని ఇంకా అధికారులు ఖరారు చేయలేదు. వ్యాపారులతో అగ్రిమెంట్ కుదుర్చుకుని రీచ్‌లను అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ రీచ్‌ల ఖరారుపై ఇంకా ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో టెండర్లు ఖరారు చేయలేదు. నదీ పరివాహక భూములపై సన్నగిల్లిన ఆశలు ... ఇసుక రీచ్‌ల తరువాత జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో నదికి సమీపంలోని సొంత రైతుల్లో ఆశలు చిగు రించాయి. అయితే ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు నదీ పరివాహక ప్రాంతాల్లోని రైతులకు అను కూలంగా లేకపోవడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. ఇటీవల జరిగిన ఇసుక రీచ్‌ల టెండర్లలో వ్యాపారులు ఏ రీచ్‌కు ఎక్కువ రేటు వేస్తారో ఆ రేటును పట్టా భూములు కలిగిన రైతులు చెల్లించాలనే నిబంధనల ఉండడంతో ఆ రైతులకు ఆశలు సన్నగిల్లాయి. ఈ నెల 11న జరిగిన ఇసుక రీచ్‌ల టెండర్లలో క్యూబిక్ మీటరుకు రూ.356లను చెల్లించేందుకు కస్తల, కోనూరు వ్యాపారులు ముందుకు వచ్చారు. దీని ప్రకారం ఈ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చిన వారికే నదీ పరివాహక ప్రాంతాల్లోని భూముల్లో ఇసుక తవ్వడానికి అధికారులు అనుమతి ఇస్తారు. అంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించి, అధికారులకు మామూళ్లు చెల్లిస్తే మిగిలేది పెద్దగా ఉండదనే ఉద్దేశంతో రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కనీసం అధికారులను ఈ భూములకు సంబంధించిన నిబంధనలు కూడా అడగడం లేదు. -
భూగర్భ ఘోష
సరి‘హద్దులు’ దాటిన దందా పట్టా భూమి ఒడ్డున ఉంటే.. గోదావరిలో ఇసుక తవ్వకాలు నిబంధనలను నదిలోతొక్కుతున్న ఇసుకాసురులు నిత్యం 150 వాహనాల్లో రవాణారోజుకు లక్షలు దండు కుంటున్న అక్రమార్కులు టీఎస్ఎండీసీ పేరుతోకాంట్రాక్టర్లకు కాసులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :చెన్నూరు వద్ద గోదావరిలో సాగుతున్న ఇసుక దందా సరి‘హద్దులు’ దాటిందా? పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు నదిలో ఉన్నట్లు చూపి తవ్వకాలకు తలుపులు బార్లా తీశారా? ఈ క్రమంలో రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయా? అంటే అవుననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టా భూములు ఒక చోట ఉంటే, బడా ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు ఆ భూములు నదిలో ఉన్నట్లు తేల్చి ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చెన్నూరు గ్రామ శివారులోని సర్వే నెం.230లో 1.12 ఎకరాల్లో 12 వేల క్యూబిక్ మీటర్లు, 227, 227/1లోని 29 గుంటల్లో 6,750 క్యూబిక్ మీటర్లు, అలాగే సర్వే నెం.231లోని 2.19 ఎకరాల్లో మరో 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు అధికారులు డిసెంబర్లో అనుమతులు కట్టబెట్టిన విషయం విధితమే. ఆదిలాబాద్ :జిల్లాలో ఒకవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే విధంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాగా.. ఈ అనుమతుల పేరుతో చేపడుతున్న ఇసుక దందా ఇప్పుడు మూడు టిప్పర్లు.. ఆరు లారీలు అన్న చందంగా నడుస్తోంది. నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల వరకు భారీ వాహనాల్లో ఇసుకను తరలించి రూ.లక్షలు గడిస్తుంటే, అధికార యంత్రాంగం మామూళ్లతో జేబులు నింపుకుంటోంది. అయితే.. ఈ పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు మాత్రం నదిలో ఉన్నట్లు తేల్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలే చోటు చేసుకున్నాయి. జైపూర్ మండల పరిధిలో కూడా పట్టా భూముల పేరుతోనే నది గర్భాన్నంతా తొలిచేసే వరకు రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని కళ్లు మూసుకున్న అధికారులు, అంతా అయ్యాక విచారణల పేరుతో హడావుడి చేయడం జిల్లాలో పరిపాటిగా తయారైంది. నిత్యం రూ.లక్షల్లో... నగరాల్లో ఇసుక ఇప్పుడు బంగారమైంది. ఒక్కో టన్నుకు రూ.వేలల్లో ధర పలుకుతోంది. ఈ ఇసుక రీచ్ నుంచి నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల లారీల్లో ఇసుక తరలిపోతోంది. ఒక్కో లారీలో 15 నుంచి 20 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు తరలించి నిత్యం రూ.లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలు నదిలో తొక్కుతున్నారిలా.. ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పూర్తిగా నదిలో తొక్కుతున్నారు. జీవనదిగా పేరున్న గోదావరిని భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. పేరుకు టీఎస్ఎండీసీ అయినప్పటికీ, బడా ఇసుక కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించకూడదు. కూలీల చేత ఇసుకను తవ్వించి, డంప్ యార్డుకు తరలించి అక్కడి నుంచి ఇసుకను తరలించాలి. డంప్ యార్డుల్లో ఇసుక లోడ్ చేసేందుకు యంత్రాలను వాడవచ్చు. కానీ.. ఇక్కడ భారీ యంత్రాలతో నది గర్భాన్ని తొలిచేస్తున్నారు. జేసీబీలు, ప్రొక్లయినర్లతో ఇసుకను తోడేస్తున్నారు.నిర్ణీత లోతుకు మించి ఇసుక తవ్వరాదు. కానీ.. భూమి కనిపించే వరకు తవ్వుతుండటంతో నదిలో లోతైన గోతులు ఏర్పడుతున్నాయి. గతంలో ఈ గోతుల్లో పడి స్థానికులు చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇసుక తవ్వకాలు జరుపుతున్న చోట్ల టీఎస్ఎండీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ.. అవేవీ లేకుండానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అటువైపు కన్నెత్తి చూస్తున్న నాథుడే లేకుండా పోవడంతో ఇష్టారాజ్యం కొనసాగుతోంది.రాత్రి ఆరు గంటల తర్వాత ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. కానీ.. పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.ఈ ఇసుక రవాణా చేసేందుకు పర్మిట్లు మంజూరు గనుల శాఖకు ఉండేది. కానీ.. టీఎస్ఎండీసీకి లీజుకిచ్చాక.. పర్మిట్ల మంజూరు కూడా ఆ సంస్థే జారీ చేస్తోంది. దీంతో ఒక్కో వే బిల్లుపై పదుల సంఖ్యలో భారీ వాహనాలు రవాణా అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒక్కో వాహనంలో పరిమితికి మించి ఇసుకను రవాణా చేస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఈ లారీలను తనిఖీ చేసిన దాఖలాల్లేవంటే రవాణా శాఖకు కూడా ఏ స్థాయిలో ముడుపులందుతున్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. -
ఇసుకే బంగారమాయే
* ఈనెల నుంచి కొత్తపాలసీ అమల్లోకి.. * డ్వాక్రా మహిళల నుంచి భూగర్భ, గనుల శాఖకు రీచ్‌లు అప్పగింత * కోర్టు స్టే విధించడంతో ఆగిపోయిన కొత్త విధానం అనంతపురం సెంట్రల్: జిల్లాలో బంగారు అయినా వెంటనే దొరుకుతుందేమో కానీ ఇసుక దొరకడం గగనంగా తయారైంది. పదిరోజుల నుంచి పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వివరాలు.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విక్రయాలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల పేరుతో జిల్లాలో 41 ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసి క్రయ విక్రయాలు జరిపారు. శింగనమల మండలంలోని ఉల్లికల్లు, పెద్దపప్పూరు మండలం దేవునిఉప్పలపాడు, తాడిమర్రి మండలం చిన్న చిగుళ్ళరేవు, కణేకల్లు మండలం రచ్చుమర్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బుడిమేపల్లి ఇసుకరీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుక విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల ముసుగులో అధికారపార్టీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ దందాలపై వార్తాపత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. ఉల్లికల్లు రీచ్‌లో జరిగిన అక్రమాలు నిగ్గుతేలడంతో పలువురు వెలుగు అధికారులపై వేటు పడింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో ఇసుక విధానంలో ప్రభుత్వం కొత్తపాలసీని తీసుకొచ్చింది. ఇసుక విక్రయాలను డ్వాక్రా సంఘాలకు తప్పించి వేలం పద్ధతిలో రీచ్‌లు అప్పగించాలని నిర్ణయించారు. వీటిపై పర్యవేక్షణాధికారాలను భూగర్భ, గనుల శాఖకు అప్పగించారు. కొత్తపాలసీ విధానం ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే వేలం ద్వారా ఇసుక విక్రయాలు జరిపితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం స్టే విధించడంతో కొత్తపాలసీ విధానం అమలు కాలేదు. అధికారులు విఫలం ఇసుక విక్రయాల బాధ్యత నుంచి జనవరి 31తో డ్వాక్రా మహిళలు తప్పుకున్నారు. ఆరోజు నుంచి ఇసుక క్రయవిక్రయాలు నిలుపుదల చేశారు. దీంతో ఇసుక కావాలనే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇసుక కోసం వినియోగదారులు మీసేవా కేంద్రాలకు వెళ్తే డీడీలు కట్టించుకోకపోవడంతో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. డిమాండ్ దృష్ట్యా అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ ఇసుక రూ. 3వేలకు పైగా విక్రయిస్తున్నారు. సామాన్యులకు ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపో వడంతో బంగారంలా తయారైంది. 31లోపు వాటికి అందిస్తున్నాం ఈనెల 1వ తేదీ నుంచి కొత్త పాలసీ వచ్చింది. జనవరి 31 వరకూ వచ్చిన డీడీలకు క్లియరెన్స్ చేస్తున్నాం. ఆతర్వాత డీడీలు కట్టించుకోవడం లేదు. ఇసుక విక్రయాల బాధ్యతలు భూగర్భ గనులశాఖకు అప్పగించడంతో వారే టెండర్లు ఖరారు చేసి విక్రయించే అవకాశముంది. - వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్డీఏ-వెలుగు ప్రాజెక్టు . -
ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఇసుక విధానంపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 387 ఇసుక రీచ్‌ల గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 368 రీచ్‌లలో తవ్వకాలు జరుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇసుక రీచ్‌లలో అక్రమాలు అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా 44 రీచ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొత్తం 6,317 వాహనాలు జీపీఎస్‌కి అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 387 ఇసుక రీచ్‌ల గుర్తింపు 368 రీచ్‌లలో తవ్వకాలు రూ.2 కోట్ల 82 లక్షల క్యుబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు 1.37 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయం 4,023 స్వయం సహాయక గ్రూపులకు ఇసుక రీచ్‌ల అప్పగింత అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో రూ.147.37 కోట్ల ఆదాయం అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో రూ.12.79 కోట్ల ఆదాయం -
ఆలీబాబా..ఆరుగురు దొంగలు!
- అధికారికంగా గంగలాపురంలో రీచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం - దానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అక్రమ తవ్వకాలు - ‘రచ్చుమర్రి’ ఇసుక మాఫియాలో ఆరుగురు టీడీపీ నేతలే కీలకం - టీడీపీ ‘ముఖ్య’నేత సూచనతో ‘పచ్చ’దందా - ఎన్నికల ఖర్చు రాబట్టుకునేలా ప్రణాళిక - ఒకటిన్నర నెలలో రూ.6 కోట్లు గడించిన నేతలు అనంతపురం టౌన్ : అధికారదర్పంతో తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వేదవతికి వేదన మిగిల్చి రూ.కోట్లు కొల్లగొట్టారు. మహిళా సంఘాలకు ఎప్పుడైతే ఇసుక రీచ్‌లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారో అప్పటి నుంచి అందినకాడికి తవ్వుకునేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన డబ్బును వీలైనంత తొందరగా రాబట్టుకునేందుకు ఇసుక మాఫియాగా ఏర్పడ్డారు. రాత్రికి రాత్రి తోడేసి సరిహద్దులు దాటించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద గ్రామస్తుల సమాచారంతో దాడులు చేసి ఐదు టిప్పర్లు, రెండు లారీలను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. 15 మందిని అరెస్ట్ చేయగా సోమవారం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆలీబాబా.. ఆరడజను దొంగల తరహాలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధి సహకారం అందించగా ఆరుగురు టీడీపీ నేతలు కీలకంగా వ్యవహరించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అందినకాడికి దండుకున్నారు. ఒకటిన్నర నెలలో రూ.6 కోట్ల ఆదాయం కణేకల్లు మండలంలోని వేదవతి హగిరి ఇసుక చాలా నాణ్యతగా ఉంది. ఈ ఇసుకకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం గంగలాపురం గ్రామంలో ఇసుకరీచ్ ఏర్పాటు చేసింది. ఈ గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో రచ్చుమర్రి అనే గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో ఇసుకతోడేస్తే ఎవరికీ అనుమానం రాదని అనుకొన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకదందాకు ఇదే అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. సుమారు నెలన్నరగా ఇసుకదందాను సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీస్థాయిలో ఖర్చులు భరించామని అందుకు పదిరెట్లు తమ సంపాందించేలా దారి చూపాలని ఈ ప్రాంతంలోని నేతలు ‘ముఖ్య’నేతను కోరడంతో ఆయనే ఇసుకదందాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాజు అనుగ్రహం తోడుకావడంతో ఇక అడ్డెవరంటూ ఆరుగురు నేతలు రెచ్చిపోయారు. రచ్చుమర్రిలో లోడ్ చేసుకొన్న వాహనాలు ఆదిగానిపల్లి, వేపరాలక్రాస్ మీదుగా రాయదుర్గం చేరుకుని అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దుకు చేరుకుంటున్నాయి. ఒకటిన్నర నెల వ్యవధిలోనే సుమారు రూ.6 కోట్ల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారికి బంపర్ ఆఫర్ ఇసుక అక్రమ రవాణ చేస్తూ శనివారం రాత్రి వాహనాలు పట్టుబడటంతో టీడీపీ నేతలు అవాక్కయారు. బయటపడేందుకు ఓ పోలీస్ అధికారికి రూ.5 లక్షలు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వాహనాలు వదిలేస్తే తన ఉద్యోగానికే ముప్పని.. ఒప్పుకొనేది లేదని ఆ అధికారి చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో ఫోన్ చేయించినట్లు తెలిసింది. కాగా కొద్ది రోజుల క్రితమే ఆరుగురు టీడీపీ నేతలు రెవెన్యూ, పోలీసు అధికారులకు ‘మామూలు’గా గాలం వేసినట్లు తెలిసింది. అంతాసవ్యంగా జరిగితే ఎవరివాటా వారికిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇదిలావుండగా సోమవారం అధికారుల విచారణ కూడా తూతూమంత్రంగా సాగినట్లు తెలుస్తోంది. -
నేడు మూడు ఇసుక రీచ్‌లకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోని 3 ఇసుక రీచ్‌లకు నేడు టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ అమలులోకి వచ్చింది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఇసుక రీచ్‌ల వేలం ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తొలుత కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రీచ్‌లను టీఎస్ఎండీసీ వేలం వేసింది. అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మరో మూడు రీచ్‌ల వేలం నిర్వహించాలని మంగళవారం నిర్ణయించింది. నేడు ఈ రీచ్‌లకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ రీచ్‌లలో ఇసుక వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు టీఎస్ఎండీసీ ఎండీ లోకేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా వేలం ద్వారా ఇప్పటికే కరీంనగర్లో టన్ను ఇసుక రూ. 375, నల్లగొండలో రూ. 400కు అందుబాటులో ఉంచారు. -
ఇసుక రీచ్‌ల్లో రక్షణ గార్డులు !
ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళల రక్షణార్థం ప్రభుత్వం త్వరలో గార్డులను ఏర్పాటు చేయనుంది. ఐడీ కార్డులు, యూనిఫారం కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ రాయపూడి ఇసుక రీచ్‌ను పరిశీలించి ఈ విషయాలను అక్కడి మహిళలకు స్వయంగా వెల్లడించారు. తుళ్లూరు: మండలంలోని రాయపూడి ఇసుక రీచ్‌ను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. రీచ్ నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళలతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలో రీచ్‌ల్లో చేపడుతున్న ఏర్పాట్లను ఆయన వివరించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు సూచన చేస్తూ రీచ్ వద్దకు వచ్చిన వారెవరైనా నిబంధనలను ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టు వివరించాలన్నారు. ఇసుక రీచ్‌లో మహిళలకు రక్షణగా గార్డులను ఏర్పాటు చేయబోతున్నట్టు జేసీ తెలిపారు. మరుగుదొడ్లు నిర్మాణాలు, యూనిఫారం, ఐడీ కార్డులు ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే లావాదేవీలు నిర్వహించేలా పలు నెట్ సంస్థలతో చర్చిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ చలనాలు, డీడీలు తీసుకోవద్దని, మీ-సేవా కేంద్రంలో నగదు చెల్లించిన రశీదులు మాత్రమే తీసుకోవాలని మహిళలకు సూచించారు. వే బిల్లులను పరిశీలించిన జేసీ అవి లారీ యజమానుల పేరిట ఉండ టంతో అసహనం వ్యక్తం చేశారు. త్వరలో జీపీఆఎర్ఎస్ విధానం ద్వారా ఇసుక నాణ్యత, ఎక్కడకు సరఫరా చేస్తున్నది తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలో వేబ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లారీ కిరాయి కూడా ఆన్లైన్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో గుంటూరులో లారీ ఇసుక ధర రూ. 14 వేలు ఉండేదని, ఇప్పడు రూ.7 వేలకు లభ్యమవుతుందన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలకు క్యూబిక్ మీటర్‌కు రూ. 40 సెస్ రూపంలో వస్తోందన్నారు. విజెలెన్స్ అధికారులు కదలనీయలేదు... రీచ్‌లో ఇబ్బందులను డ్వాక్రా మహిళలు జేసీ శ్రీధర్ దృష్టికి తెచ్చారు. సంపతమ్మ అనే మహిళ మాట్లాడుతూ గురువారం రాత్రి విజిలెన్స్ అధికారు లు తమను రాత్రి 11 గంటల వరకు ఇక్కడ నుంచి కదలనీయలేదన్నారు. రీచ్‌లో లారీలు, భారీ పడవలు, పొక్లయిన్లను అదుపులోకి తీసుకున్నారని , వాటిని వినియోగించకూడదని హెచ్చరించారని ఆమె జేసీకి వివరించారు. దీనిపై స్పందించిన జేసీ శ్రీధర్ ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదని ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. ఇదిలావుండగా, ఇసుక లేక చర్చి నిర్మాణం నిలిచిపోయిందని బోరు పాలెం గ్రామస్తులు జేసీని కలిసి వివరించారు. దీనిపై తహశీల్దార్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జేసీ వెంట ఆర్డీవో భాస్కర నాయుడు ఇతర అధికారులు ఉన్నారు. ఇసుక రీచ్, డ్వాక్రా మహిళల రక్షణార్థం, డాక్టర్ చెరుకూరి శ్రీధర్ రాయపూడి, -
టీడీపీ కార్యకర్తలకు కమిటీల ముసుగు
ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను నిర్వహించే కమిటీల నియామకం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. డ్వాక్రా మహిళల ముసుగులో అధికార పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుండటం, ఆ పార్టీ నాయకులే పెత్తనం చెలాయిస్తుండటంతో వివాదాలు రేగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికి పది కమిటీల నియామకాలు జరగ్గా దాదాపు అన్నీ వివాదాస్పదమయ్యాయి. పొదుపు, చిన్న చిన్న వ్యాపారాలతో ప్రశాంతంగా సాగిపోతున్న డ్వాక్రా సంఘాలు ఇప్పుడు ఇసుక తుపానులో చిక్కుకున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇసుక అమ్మకాలు ప్రారంభమైతే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇసుక రీచ్ నిర్వహణను పేరుకు డ్వాక్రా సంఘాలకు కట్టబెట్టినా.. రీచ్‌ల నిర్వహణకు కమిటీల ఏర్పాటు ప్రక్రియలో అధికార పార్టీ జోక్యం పెరుగుతుండటం వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వం నిర్దేశించినట్లు ఎవరి ప్రమేయం లేకుండా మహిళా సంఘాలే రీచ్‌లను నిర్వహించుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఈ సంఘాల ముసుగులో ఆధికార టీడీపీ కార్యకర్తల పెత్తనం పెరుగుతుండటంతో అప్పుడే వివాదాలు ప్రారంభమవుతున్నాయి. రీచ్‌లను నిర్వహించే మహిళా కమిటీల్లో అధికార పార్టీ నేతలు తమ అనుయాయులనే ఎంపిక చేస్తూ, మిగిలిన వారిని విస్మరిస్తున్నారు. కొన్ని చోట్ల ‘ఆధికారం మాది, కమిటీల్లో మేమే ఉంటాం, మేమే రీచ్‌లు నిర్వహిస్తామని టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. క మిటీల ఏర్పాటులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు కూడా కలెక్టర్‌కు అందాయి. 13 రీచ్‌లకు అనుమతులు జిల్లాలో 18 రీచ్‌లను ఆధికారులు ఇప్పటి వరకు గుర్తించారు. వీటిలో 13 రీచ్‌లకు అనుమతులు వచ్చాయి. వీటి నిర్వహణకు గ్రామ సంఘాల అధ్యర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి మ్యాక్స్(సహకార) చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. కాగా 10 రీచ్‌లకు కమిటీలు ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ తంతు కూడా పూర్తి చేసేశారు. దాదాపు వీటన్నింటిలోనూ వివాదాలు ఉన్నాయి. ఒక వర్గానికే ప్రాధాన్యమిచ్చి మిగిలిన వారిని విస్మరించారని, ఆధికార పార్టీ నేతలు సూచనల మేరకే కమిటీల్లో సభ్యుల నియామకం జరిగిందని మిగిలిన సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంకా అనుమతి రాని 5 రీచ్‌లకు వారం రోజుల్లో అనుమతి తీసుకొచ్చి, కమిటీ నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లాలోని 10 మండలాల్లోని 18 గ్రామైఖ్య సంఘాల పరిధిలో 656 సంఘాలు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో వీటికి రీచ్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. మరోవైపు పొన్నాడ, కల్లేపల్లి, తలవరం రీచ్‌లలో ఇసుక అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇసుక లభ్యత వివరాలు గుర్తించిన 18 రీచ్‌లలో 11,48,220 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు వీలున్నట్లు అధికారులు గుర్తించారు. రీ చ్లవారీగా చూస్తే.. బూర్జ మండలం అల్లెనలో 38,450, కాఖండ్యాంలో 80,500, ఎచ్చెర్ల మండలం పొన్నాడలో 1,63,250, జలుమూరు మండలం దుం పాకలో 50 వేలు, శ్రీకాకుళం మండలం బట్టేరులో 35 వేలు, కిల్లిపాలెంలో 65 వేలు, కల్లేపల్లిలో 50 వేలు, సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురంలో 2,42, 120, పురుషోత్తపురంలో 80,900, గరగాంలో 1.38 లక్షలు, సంతకవిటి మండ లం తమరాంలో 1.50 లక్షలు, వీరఘట ్టం మండలం తలవరంలో 55 వేలు, భామిని మండలం సింగిడిలో 50,400, బిల్లుమడలో 50,400, కొత్తూరు మండలం అంగూరులో 60 వేలు, సిరుసువాడలో 60 వేలు, కడుంలో 60 వేలు, ఆకులతంపరలో 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. -
ఏ తీరమైనా దుమారమే
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో డ్వాక్రా సంఘాలకు అప్పగించిన ఇసుక రీచ్‌లు వివాదాలకు కేంద్రాలవుతున్నాయి. అక్కడ విధివిధానాలకు రేణువంత తావు లేకుండా పోయింది. అమ్మకాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే అక్రమార్కులు పర్మిట్ల ముసుగులో రీచ్‌ల నుంచి ఇసుక తరలించారు. డీడీలు తీసిన గృహ వినియోగదారులకు తొలి రెండు రోజులు లారీ ఇసుక దొరకలేదు. మరికొన్ని చోట్ల డీడీలు లేక పోయినా డబ్బులు వసూలు చేసి సరుకు తరలించారు. రాజమండ్రిలో బినామీలు డీడీలు తె చ్చి తమ లారీలు క్యూల్లో పెట్టి మరీ లోడ్ చేయించుకున్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు తమ మనుషులతో డీడీలు తీయించి సరుకును తరలించేశారు. జిల్లాలో 27 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. గోదావరిలో పూడిక తీత చేపట్టే పనులకు పర్యావరణ అనుమతులు అవసర ం లేకపోవడంతో ఏడు రీచ్‌ల్లో ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలను సోమవారం ప్రారంభించింది. కానీ ఈ విధానం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందంగా తయారైంది. ఎక్కడికక్కడ రీచ్‌ల నిర్వహణకు మహిళా సొసైటీల ఎంపిక అసమ్మతికి దారి తీసింది. టీడీపీ నేతలు తమ వారికి రీచ్‌లు కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తవ్వకాలు జరుగుతున్న చోట వివాదాల ముసుగులో నిబంధనలను గోదావరిలో కలిపేశారు. ఉల్లితోట సమాఖ్య ధర్నా రాజమండ్రి కుమారి టాకీస్ ఎదురుగా, జీవకారుణ్య సంఘం వద్ద ఉన్న రీచ్‌లలో మంగళవారం కూడా వివాదాలు కొనసాగాయి. గత 30 ఏళ్లుగా ఈ రీచ్‌లపై ఆధారపడి జీవిస్తున్న తమకు కాదని కొత్త బోట్ సొసైటీలకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని వెంకటేశ్వరా బోట్స్‌మన్ అసోసియేషన్ వారు జీవకారుణ్య సంఘం వద్ద ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న తమను కాదని వేరే డివిజన్ మహిళా సమాఖ్యకు రీచ్‌ను అప్పగించడమేంటని ఉల్లితోట మహిళా సమాఖ్య కుమారి టాకీస్ వద్ద ధర్నాకు దిగింది. దీంతో రెండుచోట్టా మధ్యాహ్నం వరకూ అమ్మకాలు నిలిచిపోయాయి . ఇక కపిలేశ్వరపురం, కేదారిలంకల్లో రెండు రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభం కాలేదు. కానీ పేరు మహిళా సమాఖ్యదైనా పెతన్తం మాత్రం టీడీపీ నేతలు చేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. కేదారిలంక పేరుతో ఏర్పడ్డ శాండ్ మైనింగ్ ఎయిడెడ్ సొసైటీ అధ్యక్షురాలు సాదా పార్వతి గ్రామ టీడీపీ అధ్యక్షుని సోదరి కావడం వివాదాలకు వేదికవుతోంది. మరో తొమ్మిది మంది సభ్యులు కూడా టీడీపీకి చెందిన వారే కావడాన్ని మిగిలిన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తవ్వకాలు రెండు రోజుల్లో ప్రారంభం అవుతాయని భావిస్తుండగా అడ్డుకునేందుకు ఇతర మహిళా సమాఖ్యలు సిద్ధమవుతున్నాయి. సీతానగరం మండలం ముగ్గళ్లలో మహిళా సంఘాలు తవ్వకాలను అడ్డుకున్నాయి. గ్రామంలోని 93 డ్వాక్రా సంఘాలను సంప్రదించకుండా టీడీపీ నాయకులు 12 మందితో రహస్యంగా కమిటీ వేసి రీచ్‌ను అప్పగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మొత్తం అన్ని సంఘాల నుంచీ కమిటీని ఎన్నుకుంటే తప్ప తవ్వకాలు సాగనిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తవ్వకాలు నిలిచి పోయాయి. ఇసుక ట్రాక్టర్లకు ‘దేశం’ జెండాలు మామిడికుదురు మండలం పాశర్లపూడి రీచ్‌లో తవ్వకాలను పాశర్లపూడి శాండ్ మైనింగ్ సొసైటీ పేరుతో ఏర్పడ్డ మహిళా సొసైటీకి అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ప్రారంభించిన రీచ్‌లో టీడీపీ వారు ట్రాక్టర్లకు పార్టీ జెండాలు కట్టి హడావిడి చేశారు. తొలిరోజు మొత్తం 26 ట్రాక్టర్ల ఇసుక విక్రయాలు జరగ్గా అందులో 13 ట్రాక్టర్లకు మాత్రమే డీడీలు తీశారు. మిగిలిన వాటికి నిబంధనలకు విరుద్ధంగా రీచ్ వద్దే రూ.2100 చొప్పున వసూలు చేసి లోడ్‌చేశారు. ఇక్కడ ఇసుక తవ్వకాలు తమకే అప్పగించాలంటూ మత్స్యకార సొసైటీలు కూడా మధ్యాహ్నం వరకూ ధర్నా చేశాయి. రీచ్‌లో రూ.4 వేలు..బయట రూ.9 వేలు ఇసుక రీచ్‌లలోకి లారీలకు ప్రవేశం లేదని, ట్రాక్టర్లు, చిన్న వాహనాలను మాత్రమే రవాణాకు అనుమతిస్తామని ప్రభుత్వం చెప్పినా.. రాజమండ్రిలో రవాణాను పూర్తిగా లారీలతో సాగిస్తున్నారు. యూనిట్‌కు రూ.2 వేల చొప్పున రీచ్‌లో చెల్లించిన వారు.. ఒక్కో లారీలోని రెండు యూనిట్ల ఇసుకను బయటకు రాగానే రూ.9 వేలకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఒకే వ్యక్తి బినామీ పేర్లతో డీడీలు తీసి రీచ్‌ల నుంచి బయటికి వెళ్లిన ఇసుకను అమ్ముకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. రాజమండ్రిలో మంగళవారం సుమారు 20 లారీల వరకూ ఇలా అక్రమ విక్రయాలు సాగాయని తెలుస్తోంది. రేవుల్లో ఇసుక తవ్వకాలకు కొత్తగా అనుమతులు పొందిన సొసైటీలు వినియోగిస్తున్న బోట్లకు రిజిస్ట్రేషన్ లేదని తెలుస్తోంది. ఇంకా తమకు ఎవరూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సమర్పించలేదంటున్న అధికారులు నేతల వత్తిడితో వీటి విషయంలో జోక్యం చేసుకునేందుకు జంకుతున్నారు. -
ఎట్టకేలకు ఇసుక రీచ్‌లకు అనుమతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః జిల్లాలో ఎట్టకేలకు ఆరు ఇసుక రీచ్‌లకు జిల్లా యంత్రాంగం అనుమతిచ్చింది. భూగర్భజల శాఖ పరిశీలించి, అంగీకరించిన తర్వాత నిర్ధేశిత రీచ్‌లలో ఇసుకను వినియోగించడానికి అనుమతి ఇచ్చినట్టు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అవసరం ఎక్కువగా ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ(మేక్స్)గా ఏర్పడిన గ్రామైక్య సంఘాలకు ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. గుర్ల మండలం కలవచర్ల, నెల్లిమర్ల మండలం పారసాం, కొమరాడ మండలం నిమ్మలపాడు(దుగ్గి), కల్లికోట, జియ్యమ్మవలస మండలం బిట్రపాడు, బొబ్బిలి మండలం పారాదిలో ఇసుక రీచ్‌లు గుర్తించి అనుమతులిచ్చినట్టు వివరించారు. జిల్లాలో దాదాపు 60 ఇసుక రీచ్‌లను పరిశీలించగా అందులో మూడో తరగతి రీచ్‌లుగా ఆరింటిని భూగర్భ జల శాఖ గుర్తించడంతో అనుమతులిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆరు రీచ్‌లలో 63 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. జిల్లా అవసరాలకు ఇది సరిపోనందున మరికొన్ని ఇసుక రీచ్‌ల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా అవసరమైతే శ్రీకాకుళం నుంచి రప్పించే ఆలోచన ఉందన్నారు. విజయనగరం, బొబ్బిలిలలో డిపోలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ డిపోల వద్దకు ఇసుక తీసుకొచ్చి, అక్కడ నుంచి రవాణా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తుఫాన్ బీభత్స నేపథ్యంలో మాన్యువల్‌గా నిర్వహిస్తామని, తదుపరి ఆన్లైన్లో కంప్యూటరీకరణ ద్వారా ఇసుక నిర్వహణ చేపడతామని, సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకోవడానికి పరిశీలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతానికి ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.500లకు విక్రయించడానికి నిర్ణయించామన్నారు. మేక్స్ పేరుపై ఆంధ్రా బ్యాంకు శాఖలో చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ, సంబంధిత ఇంజినీరింగ్ అధికారి ధ్రువీకరణపత్రం పొంది సమర్పించాలన్నారు. ప్రస్తుతం కొనుగోలుదారులు తమ సొంత ఖర్చులతో వేతనదారులను(లోడింగ్, అన్లోడింగ్) ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేనికోసం ఇసుకను కొనుగోలు చేస్తున్నారో అదే అవసరం నిమిత్తం అదే స్థలంలో ఉపయోగించాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక రీచ్ వద్ద ఎడ్లబండి, ట్రాక్టర్లకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఇసుక తవ్వడానికి యంత్రాల వినియోగం నిషేధమని తెలిపారు. అనధికార ఇసుక స్టాకు పాయింట్ల నిర్వహణను కూడా నిషేధించినట్టు చెప్పారు. ఇసుక అక్రమ రవాణా, ఇతర అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులకు 8008201341 నంబర్‌కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి గ్రామ మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల శాఖలు పర్యవేక్షిస్తాయని, జిల్లా స్థాయిలో గనులు భూగర్బ జలశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. కొసమెరుపు ఏంటంటే కొత్తగా అమలు చేస్తున్న ఈ ప్రక్రియలో లోపాలు ఎదురవుతాయని, అవకతవకలకు అవకాశం ఉంటుందని, అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం విశేషం. ఈ సమావేశంలో డీఆర్డీఎ ప్రాజెక్టు డెరైక్టర్ పెద్దిరాజు, అదనపు పీడీ సుధాకర్, భూగర్భగనుల శాఖ ఏడీ చౌదరి, ఇనిస్టిట్యూషనల్ బిల్డింగ్ ప్రాజెక్టు మేనేజర్ డైసీ పాల్గొన్నారు. -
భూలావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి
విజయవాడ : రాజధాని నిర్మాణం పేరుతో నగరంలో, జిల్లాలో జరుగుతున్న భూ లావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యునియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక మాఫీయా, రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లు కేటాయిస్తున్నామని ప్రకటనలు చేస్తూ, వాటి చాటున పచ్చచొక్కాలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. కిలో బియ్యం కన్నా కిలో ఇసుక రేటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక భవన నిర్మాణాలు చేపట్టలేమని బిల్డర్స్ అసోసియేషన్లు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలై, దానిపైన ఆధారపడిన లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నగరం చుట్టు పక్కల ఎయిమ్స్, హైకోర్టు, ఎయిర్ పోర్టు వస్తున్నాయంటూ ముందుగా మంత్రులకు లీకులిచ్చి ఆయా ప్రాంతాల్లో భూములను జీపీ పద్ధతిలో కొని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని విమర్శించారు. జీపీల ద్వారా 60 వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోందన్నారు. మంత్రులే బృందాలుగా తయారై రియల్ఎస్టేట్ అరాచకాలక పాల్పడుతన్నారని ఆరోపించారు. బక బృందానికి సి.ఎం.రమేష్, మరో బృందానికి దేవినేని ఉమ, ఇంకో బృందానికి నారాయణ, సృజనాచౌదరి నేతృత్వం వహిస్తూ రియల్ దందాలతో ప్రభుత్వ ఖజానాకు కోత పెడుతూ వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని వివరించారు. ఎస్సీ నాయకులు కాలే పుల్లారావు, సేవాదళ్ నగర కన్వీనర్ కమ్మిలి రత్నకుమార్ పాల్గొన్నారు. -
ఇసుకాసురులపై నిఘా నేత్రం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా పెద్ద పెద్ద ఇసుక రీచ్‌లుగా గుర్తింపు పొందిన జిల్లాలోని పాయింట్లలో హై రిజొల్యుషన్ క్లోజ్డ్ సర్క్యూట్ (హెచ్ఆర్సీసీ)లను ఏర్పాటు చే సి ఎప్పటికప్పుడు ఇసుక తరలింపు ఎలా జరుగుతుందనే దాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ సీసీ కెమెరాలను సమీప పోలీస్‌స్టేషన్‌తో అనుసంధా నం చేస్తామని, ఇసుక పాయింట్లలో జరిగే తతంగాలను స్టేషన్ ద్వారా పరిశీలించి అక్రమ రవాణా జరగకుండా అడ్డుకుంటామని అధికారులు చెపుతున్నారు. ఈ మేరకు ఐదు పాయింట్లను గుర్తిం చిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు వాటిని త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చకచకా చర్యలు తీసుకుంటున్నారు. రీచ్‌లో ఏం జరిగేది క్షణాల్లో పోలీస్‌స్టేషన్‌కు.. జిల్లాలోని గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో, కిన్నెరసాని, ముర్రేడు, మున్నేరు లాంటి వాగుల్లో పెద్ద ఎత్తున ఇసుక రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల ద్వారా ఏటా సుమారు కోట్ల రూపాయల విలువైన ఇసుక తరలిస్తారు. ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు పెద్ద ఎత్తున ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు కూడా జిల్లా నుంచి ఇసుక తరలిపోతోంది. అయితే, ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా వెళుతున్న ఇసుకను అడ్డుకునే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. చెక్‌పోస్టుల్లో సైతం తగినంత సిబ్బంది లేకపోవడం, ఇసుకాసురులిచ్చే సొమ్ములకు కొందరు ప్రభుత్వ సిబ్బంది ఆశపడుతుండడం, రాత్రివేళల్లో సరైన గస్తీ లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా వర్ధిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఎంత ప్రయత్నించినా ఇసుక దందాను నియంత్రించ లేకపోతున్నారు. నిర్దిష్టంగా ఎవరిపై చర్యలు తీసుకునే, కేసు నమోదు చేసే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. హైరిజొల్యుషన్ ఉన్న సీసీ కెమెరాలను ఇసుక పాయింట్లలో ఉంచడం ద్వారా ఏ వాహనం ఎన్ని సార్లు ఇసుకను తీసుకెళ్లింది గుర్తించవచ్చనే ఆలోచనతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మైనింగ్ శాఖ గుర్తించిన విధంగా నాయకన్‌గూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాల ద్వారా వాహనం నంబర్‌తో పాటు డ్రైవర్‌ను కూడా గుర్తించవచ్చని, తద్వారా ఒకే వేబిల్లుపై అనేక ట్రిప్పులు కొట్టి అటు అక్రమ రవాణా చేయడంతో పాటు ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను నియంత్రించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్ ‘సాక్షి’తో చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ కెమెరాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది..? ఆచరణలో ఎలా సాధ్యమనేది పరిశీలించి త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని ఆయన వెల్లడించారు. -
మహిళలకే ఇసుక రీచ్‌లు
విజయనగరం కంటోన్మెంట్: ఎట్టకేలకు ఇసుక విధానం ఖరారయింది. రీచ్‌లను మహిళల కు కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. మైనింగ్ శాఖ కార్యాలయానికి శనివారం ఉత్తర్వులు చేరాయి. ఇసుక తవ్వకా లు, విక్రయాల బాధ్యతను ఇసుక రీచ్‌లు పొందే మహిళలకే అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్‌లోని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి పేరున విడుదలయిన ఉత్తర్వులు, రాష్ట్ర ఖనిజ తవ్వకాల నిబంధనల ప్రకారం ఈ ఇసుక రీచ్‌లను నిర్వహించాలి. ఇసుక రీచ్‌లను ఎంపిక చేసేందుకు, వేలం వేసేందుకు జిల్లాలోని డీఆర్డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ అధ్యక్షతన సమావేశమయ్యే ఈ కమిటీ జిల్లాలోని ఎక్కడెక్కడ ఇసుక రీచ్‌లున్నాయి, తవ్వకాలకు సరిపడా ఇసుక నిల్వలెక్కడున్నాయో పరిశీలించి, వాటిని వేలం వేయవచ్చునో లేదో నిర్ణయం తీసుకుంటుంది. భూ గర్భజల శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ వంటి శాఖల సమన్వయంతో ఇసుక రీచ్‌లను ఎంపిక చేస్తారు. మహిళా సంఘాల దరఖాస్తులననుసరించి అర్హత గల సంఘాలకు అప్పగిస్తారు. తవ్వకాలు జరిపే ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా ఎంత మేర ఇసుక తవ్వకాలు అనుమతులిచ్చినది, ఎంత మేర తవ్వుతున్నదీ పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. ఇసుక రీచ్‌లు పొందిన సంఘాలు చెల్లింపులను ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇసుకను తరలించే లారీలు జిల్లా సరిహద్దులు దాటడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకునేందుకు వీలు లేకుండా, విచ్చలవిడి వ్యాపారానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేశారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఇసుక రీచ్‌లను ఎంపిక చేసిన తరువాత మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు కోరతారు. దరఖాస్తులు చేసుకున్న మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు కేటాయిస్తారు. వారికి అవసరమైన పెట్టుబడులు కూడా జిల్లా స్థాయిలోని కమిటీ సమకూరుస్తుంది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అవసరమైన యంత్రాల సమీకరణ కూడా చేస్తారు. కలెక్టర్, ఎస్పీల సహాయంతో ఈ ఏర్పాట్లు చేస్తారు. కమిటీ సభ్యులు వీరే... డీఆర్డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో జేసీ, ఎస్పీలు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. జెడ్పీ సీఈఓ, ఇరిగేషన్ ఎస్ఈ, డ్వామా పీడీ, డీపీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, గనుల శాఖ ఏడీ, భూగర్భజల వనరుల శాఖ ఈఈ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు తదితరులు సభ్యులుగా ఉంటారు. మహిళా సంఘాలకు 25 శాతం ఇందులో వచ్చే లాభాల్లో 25 శాతం మాత్రమే మహిళలకు కేటాయిస్తారు. మిగతా లాభాలు జెడ్పీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. భూగర్భ జలాలకు విఘాతం కలిగించే ఇసుక రీచ్‌లను నిషేధించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అధికారం అప్పగించారు. ఇసుక రీచ్‌లను తవ్వేందుకు 500 మీటర్లకు పరిమితి విధించారు. ఈ పరిమితి మించి తవ్వకాలను చేపట్టకూడదు. పట్టాదారులకూ తవ్వకాలకు అనుమతి జిల్లాలోని జిరాయితీ భూముల్లో ఇసుక నిల్వలుంటే తవ్వుకోవడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అనుమతులను ఇస్తారు. ఈ అనుమతులకోసం పట్టాదారు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. జిరాయితీ భూముల్లోని ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే లాభంలో 25 శాతం మాత్రమే పట్టాదారుకు చెందుతుంది. మిగతా లాభం జెడ్పీలకే వెళ్తుంది. వాటిలో మండలాలకు కూడా కొంతవాటా ఉంటుంది. ఈ వాటాలను కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మండల, గ్రామాల పరిధిలో నాటుబళ్లు, ట్రాక్టర్ల ద్వారానే ఇసుక తరలింపు చేపట్టాలి. రెండు సార్లు జరిమానాలు విధించిన తరువాత మూడో సారి అదే వాహనం తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేస్తారు. ప్రతీ నెలా జిల్లాలోని కమిటీ సమావేశమై ఇసుక తవ్వకాలు, రవాణాలను పరిశీలించి సమీక్షిస్తుంది. ఐదేళ్లుగా అనుమతులు లేవు జిల్లాలో గతంలో 51 ఇసుక రీచ్లుండేవి. ప్రస్తుతం ఒక్కదానికి కూడా అనుమతులు లేవు. జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోతున్న కారణంగా ఇసుక తవ్వకాలను నిషేధించారు. దీంతో జిల్లాలో ఇసుక రీచ్‌లకు గడచిన ఐదేళ్లుగా మంజూరు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడంతో జిల్లా ఇసుక కమిటీ సమావేశమై ఇసుక రేవులను గుర్తిస్తేనే ఎక్కడెక్కడ ఇసుక ఉందన్న విషయం తెలుస్తుంది. తద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేయడానికి ఆస్కారం ఉంటుంది. -
ఏపీ పరిధిలోనే ఇసుక అమ్మకాలు
కొత్త ఇసుక విధానం ప్రకటించిన ప్రభుత్వం సరిహద్దులు దాటి ఇసుక రవాణాపై నిషేధం ఇసుక రీచ్‌లన్నీ డ్వాక్రా సంఘాలకే అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలపై భారీ జరిమానా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి తవ్విన ఇసుక 13 జిల్లాలలో మాత్రమే రవాణా చేయాలని ప్రభుత్వం ఆంక్ష విధించింది. రాష్ట్ర సరిహద్దు దాటి ఇసుక రవాణాపై నిషేదం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణకు పాల్పడే వాహనాలపై భారీ జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటసారి అక్రమ రవాణాకు కారణమయ్యే ట్రాక్టరుకు రూ. 15 వేలు.. పది టన్నుల లోపు సామర్థ్యం కలిగిన లారీకి రూ. 45 వేలు.. పది టన్నుల సామర్థ్యానికి మించిన లారీపై రూ. 75 వేల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. రెండోసారి కూడా అక్రమ రవాణాకు పాల్పడితే ట్రాక్టరుకు రూ. 45 వేలు.. పది టన్నుల లోపు సామర్థ్యం కలిగిన లారీకి రూ. 75 వేలు.. పది టన్నుల సామర్థ్యానికి మించిన లారీకి లక్షన్నర రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. రెండుసార్లకు మించి అక్రమ రవాణకు పాల్పడే వాహనాన్ని ఇసుకతో సహా అక్కడికక్కడే స్వా దీనం చేసుకునే అధికారాన్ని అధికారులకు కల్పించారు. ఇసుక తవ్వకాల కారణంగా సీనరేజీ రూపంలో వచ్చే ఆదాయంలో జిల్లా పరిషత్‌కు 25 శాతం, మండల పరిషత్‌కు 50 శాతం, గ్రామ పంచాయితీకి మిగిలిన 25 నిధులను కేటాయిస్తారు.