కొత్త ఇసుక విధానం ప్రకటించిన ప్రభుత్వం
సరిహద్దులు దాటి ఇసుక రవాణాపై నిషేధం
ఇసుక రీచ్‌లన్నీ డ్వాక్రా సంఘాలకే
అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలపై భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి తవ్విన ఇసుక 13 జిల్లాలలో మాత్రమే రవాణా చేయాలని ప్రభుత్వం ఆంక్ష విధించింది. రాష్ట్ర సరిహద్దు దాటి ఇసుక రవాణాపై నిషేదం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణకు పాల్పడే వాహనాలపై భారీ జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటసారి అక్రమ రవాణాకు కారణమయ్యే ట్రాక్టరుకు రూ. 15 వేలు.. పది టన్నుల లోపు సామర్థ్యం కలిగిన లారీకి రూ. 45 వేలు.. పది టన్నుల సామర్థ్యానికి మించిన లారీపై రూ. 75 వేల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. రెండోసారి కూడా అక్రమ రవాణాకు పాల్పడితే ట్రాక్టరుకు రూ. 45 వేలు.. పది టన్నుల లోపు సామర్థ్యం కలిగిన లారీకి రూ. 75 వేలు.. పది టన్నుల సామర్థ్యానికి మించిన లారీకి లక్షన్నర రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది.
రెండుసార్లకు మించి అక్రమ రవాణకు పాల్పడే వాహనాన్ని ఇసుకతో సహా అక్కడికక్కడే స్వా దీనం చేసుకునే అధికారాన్ని అధికారులకు కల్పించారు. ఇసుక తవ్వకాల కారణంగా సీనరేజీ రూపంలో వచ్చే ఆదాయంలో జిల్లా పరిషత్‌కు 25 శాతం, మండల పరిషత్‌కు 50 శాతం, గ్రామ పంచాయితీకి మిగిలిన 25 నిధులను కేటాయిస్తారు.
ఏపీ పరిధిలోనే ఇసుక అమ్మకాలు
Published Fri, Aug 29 2014 1:11 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement