
సాక్షి, విజయవాడ: జేపీ గ్రూప్ ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసులో తీగలాగే కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. నిందితుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఎమ్మెల్సీలు ఇప్పిస్తానంటూ రూ.కోటి వసూలు చేసినట్లు సమాచారం.
ఇరిగేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని స్టీల్‌ప్లాంట్ ఉద్యోగికి రూ.25 లక్షలు టోకరా వేసినట్లు తెలిసింది. విశాఖలో ఉడా భూములు లీజుకు ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ధవళేశ్వరం వద్ద ఇసుక ట్రెడ్జింగ్ కాంట్రాక్ట్ పేరిట రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు కస్టడీ కోరనున్నారు.
చదవండి: ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’
మాయమాటలతో బాలికను లొంగదీసుకుని..
Comments
Please login to add a commentAdd a comment