‘‘సెప్టెంబర్ 5 నుంచి ఇసుక సరఫరాకు కొత్త విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్‌లో ఇవాళ ఉన్న ధర కంటే తక్కువ రేటుకే ఇసుకను అందుబాటులోకి తేవాలి. ఇసుక సరఫరా పెంచకపోతే ధరలు తగ్గవు. అందువల్ల ఇప్పటి నుంచి తరలించి స్టాక్ యార్డులను ఇసుకతో నింపడంతోపాటు వీలైనన్ని ఎక్కువ రీచ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలి.