సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన ఇసుక పాలసీను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఇసుక పాలసీ అమలుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 102 ఇసుక రీచులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 57 ఇసుక స్టాక్ పాయింట్లను అధికారులు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇసుక నిల్వలు స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి.
వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారిగా... శ్రీకాకుళం 6, విజయనగరం 2, విశాఖ 2, తూర్పుగోదావరి 13, పశ్చిమగోదావరి 5, కృష్ణా జిల్లా 6, గుంటూరు జిల్లాలో 4 ఇసుక స్టాక్ యార్డులు, ప్రకాశం 3, నెల్లూరు 6, కడప 4, చిత్తూరు 2, అనంతపురం 3, కర్నూలు జిల్లాలో 2 స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకోగానే సరసమయిన ధరకు సరఫరా చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment