సాక్షి,అమరావతి : ఇసుక పాలసీ వైఫల్యంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పాటించిన విధానాలనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇసుక దోపిడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో జీవోని సవరించిన ప్రభుత్వం..గత ప్రభుత్వం హయాంలో స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్లే విధానానికే మొగ్గుచూపింది, వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment