ప్రతీకాత్మక చిత్రం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించి కోట్ల రూపాయలను దండుకున్న నిందితుడు రామకృష్ణ చంద్రశేఖర్‌ని విజయవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ఫోర్జరీకి ఉపయోగించిన స్టాంప్ లు, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, మూడు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.95 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలను ప్రభుత్వం న్యూఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్‌కు అప్పగించిన సంగతి తెలి సిందే. అయితే ఆ సంస్థ నుంచి తాము సబ్ కాం ట్రాక్ట్ పొందినట్లు కొందరు వ్యక్తులు తప్పుడు కాంట్రాక్ట్ కాపీలను చూపుతూ కృష్ణా జిల్లాలోని వివిధ రీచ్‌ల వద్ద హల్‌చల్ చేస్తున్నట్లు జేపీ గ్రూప్ కు తెలిసింది. దీనిపై ఆరా తీసేందుకు జేపీ గ్రూప్ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ రంగంలోకి దిగారు.
విజయవాడ రూరల్ గొల్లపూడి మైలు రాయి సెంటర్ సమీపంలోని పంట కాలువ రోడ్‌లో ఒక ఇంట్లో ఉంటున్న కొప్పురావూరి ప్రవీణ్‌కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావును కలిశారు. తాము హైదరాబాద్‌కు చెందిన సుధాకర ఇన్‌ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులమని విశ్వనాథన్ సతీష్‌తో ముగ్గురు పరిచయం చేసుకున్నారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు జేపీ గ్రూప్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ట్లు రెండు జిరాక్స్ కాపీలను ఆయనకు చూపించారు. వాటిని పరిశీలించిన విశ్వనాథన్ సతీష్ అవి నకిలీ పత్రాలుగా గుర్తించి ఈ నెల 3న విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 420, 465, 467, 471 రెడ్ విత్ 120(బి) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
ఈ క్రమంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పశ్చిమ మండల ఏసీపీ కె.హనుమంతరావు, భవానీపురం ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ డీకేఎన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్ (29)ని అరెస్ట్ చేశారు. నిందితుడు 2016 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో ఒక ఫార్మాసూ్యటికల్ కంపెనీలో పనిచేశాడు. ఆ సమయంలో కంపెనీకి రావాల్సిన సొమ్మును తెలం గాణ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వాహా చేశాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లాడు.
రామకృష్ణ చంద్రశేఖర్ మరికొన్ని మోసాలు..
హైదరాబాద్‌కు చెందిన కె.సురేంద్రనాథ్, వెలంపల్లి రఘు నరసింహరాజు ఇసుక రీచ్‌ల కాంట్రాక్టులు తీసుకోవాలని భావించి తమ మిత్రుడు తిరుమలరెడ్డిని సంప్రదించారు. తిరుమలరెడ్డి తన స్నేహితుడు లోకాభిరాముడుకు విషయం చెప్పారు. దీంతో లోకాభిరాముడు.. రామకృష్ణ చంద్రశేఖర్ ఈ పనిచేయించగలడని తెలిపారు. ఈ పరిస్థితిని సావకాశంగా తీసుకున్న చంద్రశేఖర్ వారందర్నీ బురిడీ కొట్టిం చాడు. సురేంద్రనాథ్, నరసింహరాజుల నుంచి రూ.5.40 కోట్లు వసూలు చేశాడు. తెలంగాణలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందుల సరఫరా కాంట్రా క్టు ఇప్పిస్తానని చెప్పి ఫార్మా కంపెనీలను నమ్మించి రూ.12 లక్షలు కొల్లగొట్టాడు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి లోకాభిరాముడి కుమారుడికి భారత్‌మాల ప్రాజెక్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు దండుకున్నాడు. లోకాభిరాముడికి ప్రభుత్వ భూములను లీజుకు ఇప్పిస్తానని చెప్పి రూ.45 లక్షలు వసూలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment