ఇసుక రీచ్‌ల‌పై స‌మ‌గ్ర మ్యాపు‌లు: పెద్దిరెడ్డి | Peddireddy Ramachandra Reddy Meeting On News Sand Reaches | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌ల‌పై స‌మ‌గ్ర మ్యాపు‌లు: పెద్దిరెడ్డి

Oct 8 2020 7:54 PM | Updated on Oct 8 2020 8:27 PM

Peddireddy Ramachandra Reddy Meeting On News Sand Reaches - Sakshi

సాక్షి, విజయవాడ: సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త రీచ్‌లకు అనుమతులు ఇస్తామ‌ని భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పర్యావరణ చట్టాలకు లోబడి ఎక్కువ ఇసుక రీచ్‌లను ప్రారంభించడం ద్వారా వినియోగదారులకు సులువుగా ఇసుకను అందించాలని ఆదేశించారు. ఇందుకోసం కొత్త రీచ్‌లకు పర్యావరణ నియంత్రణ మండలి నుంచి అన్ని అనుమతులు వేగంగా తీసుకోవాలని తెలిపారు. ఇసుక కార్పోరేషన్‌పై గురువారం ఆయ‌న విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యంలో మంత్రులతో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇసుక పాలసీలు, వాటిలోని లోటుపాట్లపై చ‌ర్చించారు. ఈ భేటీలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి హరినారాయణ్ పాల్గొన్నారు.

ఇసుక కార్పోరేషన్ విధివిధానాలపై చర్చ
జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఇసుక డిమాండ్, సప్లయ్‌లపై నిర్ణయం తీసుకోవాల‌ని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయిలో ఇసుక రీచ్‌లపై సమగ్ర మ్యాప్‌లను తయారు చేసి, వాటిని జాయింట్‌ కలెక్టర్‌లతో సమన్వయం చేసుకునేలా బాధ్యతలు అప్పగించాలన్నారు. నదుల్లో వరదనీరు అధికంగా వున్న నేపథ్యంలో స్టాక్‌ యార్డ్‌ల నుంచి ఇసుకను సకాలంలో వినియోగదారులకు చేరువ చేయాల‌ని ఆదేశించారు. (చ‌ద‌వండి: మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉండాలి: సీఎం జగన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement