ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైన ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రలను చేపడతాననడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. చైతన్య యాత్రల కంటే ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలను అమలు చేయాలని శైలజానాథ్ సూచించారు.