గౌతమ్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట | Supreme Court Given Anticipatory bail To YSRCP Goutham Reddy | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

Published Fri, Jan 24 2025 11:31 AM | Last Updated on Fri, Jan 24 2025 1:08 PM

Supreme Court Given Anticipatory bail To YSRCP Goutham Reddy

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ నాయకుడు గౌతమ్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్‌ రెడ్డికి సు​ప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. విచారణ సందర్బంగా కూటమి సర్కార్‌ పెట్టిన కేసుల్లో సెక్షన్లను చూసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

వైఎస్సార్‌సీపీ నేత గౌతమ్‌ రెడ్డిపై కూటమి సర్కార్‌ అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గౌతమ్‌ రెడ్డి పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.

వాదనల సందర్భంగా.. కేసులో సెక్షన్లను చూసి ధర్మాసనం ఆశ్చర్యపోయింది. అనంతరం ధర్మాసనం.. దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు కుట్ర చేశారన్న గౌతమ్‌రెడ్డిని విచారించాలి కదా?. ఈ కేసులో నిందితులంతా బెయిల​్‌పైనే ఉన్నారు. ఈ కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు. కుట్రను మీరు విచారణలో తేల్చండి అని పేర్కొంది. ఈ క్రమంలో గౌతమ్‌ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement