హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సంస్థ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ పి.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 24 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2003, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలని, బీసీ, ఓసీ విద్యార్థులైతే 2005, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 31 మధ్య పుట్టినవారై ఉండాలన్నారు.
2015-16 ఏడాదిలో తప్పనిసరిగా 4వ తరగతి చదివి ఉం డాలన్నారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థులైతే రూ.2 లక్షలు మించి ఉండరాదని, సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి వర్తించదన్నారు. ఆసక్తిగల విద్యార్థినీ,విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రూ.50 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 98665 59678 నంబర్‌లో సంప్రదించవచ్చు.
గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం
Published Tue, Mar 15 2016 4:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM
Advertisement