న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంపై కృత్రిమ మేథలో (ఏఐ) సర్టిఫికేషన్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఏఐ, జెనరేటివ్ ఏఐలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇందులో కోర్సులు ఉంటాయి.
అలాగే, పైథాన్ ప్రోగ్రామింగ్, లీనియర్ ఆల్జీబ్రా సహా డేటా సైన్స్‌కి సంబంధించిన వివిధ అంశాలతో సిటిజెన్స్ డేటా సైన్స్ కోర్సు కూడా ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సరి్టఫికెట్ లభిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ–ఫస్ట్ స్పెషలిస్టులు, డేటా స్ట్రాటెజిస్టులు ఈ బోధనాంశాలను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment