న్యూఢిల్లీ: ఎన్‌విడియా ఏఐ టెక్నాలజీలో తమ కంపెనీకి చెందిన 50,000 మంది ఉద్యోగులకు శిక్షణ, సర్టిఫికేషన్ ఇవ్వాలని ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ యోచిస్తోంది. ఇందుకోసం ఎన్‌విడియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సర్వీసులను కస్టమర్లకు అందించే దిశగా ఇన్ఫీ, చిప్‌సెట్ కంపెనీ ఎన్‌విడియా చేతులు కలిపిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం తమ వ్యాపార కార్యకలాపాలకు అవసరమయ్యే ఏఐ అప్లికేషన్స్‌ను తయారు చేసుకోవడంలో కస్టమర్లకు సహాయపడే దిశగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సహా ఎన్‌విడియా జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఇన్ఫోసిస్ వినియోగించుకుంటుంది. వ్యాపార సంస్థలు ఏఐ వైపు మళ్లడంలో తమ ఏఐ సొల్యూషన్స్ ఉపయోగపడగలవని ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment