దానిపైనే కంపెనీల ఫోక‌స్‌.. క‌ల‌వర‌పెడుతున్న ఇన్ఫోసిస్ రీసెర్చ్‌!  | APAC businesses to nearly triple spends on GenAI in 2024: Infosys Research | Sakshi
Sakshi News home page

Infosys Research: దానిపైనే కంపెనీల ఫోక‌స్‌.. క‌ల‌వర‌పెడుతున్న ఇన్ఫోసిస్ రీసెర్చ్‌! 

Published Sun, Jan 28 2024 3:44 PM | Last Updated on Sun, Jan 28 2024 4:00 PM

APAC companies to triple spends on GenAI in 2024 Infosys Research - Sakshi

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. మ‌రీ ముఖ్యంగా జ‌న‌రేటివ్ ఏఐపై కంపెనీలు ఫోక‌స్ పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆసియా పసిఫిక్ కంపెనీలు ఉత్పాదక ఏఐ (GenAI)లో పెట్టుబడులను పెంచుతున్నాయి.  

భారత్ స‌హా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, సింగపూర్‌ల‌లో కంపెనీలు 2024లో జ‌న‌రేటివ్ ఏఐపై పెట్టే ఖ‌ర్చు దాదాపు మూడు రెట్లు పెర‌గ‌నుంద‌ని, ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు 3.4 బిలియన్ డాలర్లు (రూ.28 వేల కోట్ల‌కు పైగా) ఖర్చు చేయ‌నున్నాయ‌ని దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ చేప‌ట్టిన ఓ అధ్య‌య‌నం అంచ‌నా వేస్తోంది.

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ..

కాగా జ‌న‌రేటివ్ ఏఐపై ఖ‌ర్చు విష‌యంలో ఉత్తర అమెరికా దేశాల కంటే త‌క్కుగా ఉన్నప్ప‌టికీ ఆసియా ప‌సిఫిక్ దేశాల్లో ఈ సాంకేతిక‌త‌పై ప‌రిశోధ‌న‌లు, అభివృద్ధి అత్యధికంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్ ప‌రిశోధన విభాగమైన ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్ (IKI) తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, భారతదేశం, సింగపూర్ దేశాల్లోని వెయ్యి మందికిపైగా బిజినెస్ లీడ‌ర్లు, ఏఐ ప‌రిశోధ‌కుల‌తో ఇన్ఫోసిస్ ఈ సర్వే చేప‌ట్టింది.

 

జాబ్స్‌పై ప్రభావం ఉంటుందా?
ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో జ‌న‌రేటివ్ ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంది.  ఈ ఏడాది చైనా కంపెనీలు ఈ టెక్నాల‌జీపై పెట్టే  ఖ‌ర్చు 160 శాతానికిపైగా పెరిగి 2.1 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకోనుంది. అయితే దీని ప్ర‌భావం జాబ్స్‌పై క‌చ్చితంగా ఉంటుంద‌న్న ఆందోళ‌న ఉద్యోగులను క‌ల‌వ‌పెడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement