- 20వ తేదీ వరకుదరఖాస్తుకు అవకాశం
సంగారెడ్డి జోన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఇంగ్లిష్ వర్క్ రీడ్‌నెస్ అండ్ కంప్యూటర్స్ (ఈడబ్ల్యూఆర్‌సీ) కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్న డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫె యిల్ అయిన 19 నుంచి 26 ఏళ్ల వయసు కలిగిన గ్రామీణ యువకులు శిక్షణకు అర్హులన్నారు.
మూడు నెలల ఈ శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలతోపాటు బేసిక్ కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌తోపాటు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు శనివారం నుంచి ఈనెల 20 తేదీ వరకు గజ్వేల్‌లోని ఎస్టీ హాస్టల్ పక్కన గల ఈడబ్ల్యూఆర్‌సీ శిక్షణ కేంద్రంలో ప్రవేశాలను పొందవచ్చన్నారు. వివరాల కోసం 94925 61363, 96528 82296 నంబర్లను సంప్రదించాలని సూచించారు.