satyanarayana reddy
-
కవ్వింపులు.. ఆపై గొడవలు
పెళ్లకూరు (తిరుపతి జిల్లా): పెళ్లకూరు మండలం చిల్లకూరులో టీడీపీ కార్యకర్త దుందుడుకు చర్యలతో గొడవ చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడులతో సంబంధం లేని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. వివాదాస్పద ఈ గ్రామంలో కొద్ది రోజులుగా పోలీసు పికెట్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత దువ్వూరు విజయసేనారెడ్డి టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాడు. గడ్డివాములు, చిన్న పిల్లలపై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మురళి, మరి కొందరు విజయసేనారెడ్డితో మాట్లాడేందుకు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వేర్వేరు వాహనాల్లో చికిత్స నిమిత్తం ఒక వర్గాన్ని శ్రీకాళహస్తికి, మరో వర్గాన్ని నాయుడుపేట ఆసుపత్రులకు తరలించారు. అదే సమయంలో సత్యనారాయణరెడ్డిపై కక్ష సాధించడం కోసం దాడుల్లో గాయపడిన రాకే‹Ùరెడ్డికి మద్దతుగా నాయుడుపేటకు చెందిన కొందరు టీడీపీ యువత పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సత్యనారాయణరెడ్డి తమపై దాడి చేయించాడంటూ రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన పిల్లిమిట్ట మురళి, వంశీకృష్ణ, ఆళ్ల చంద్రబాబు, సుజిత్, మణి, నాగార్జున్, చెంచయ్య, పుట్టయ్యలతో పాటు రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణరెడ్డిని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధంలేని సత్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నాయుడుపేట రూరల్ సీఐ జగన్మోహన్రావు అత్యుత్సాహం వల్లే సత్యనారాయణరెడ్డిని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ ఎస్పీ జక్కా కులశేఖర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కేసు వివరాలను పరిశీలించారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసి సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరిచారు. ఎన్నికల సమయంలో డబుల్ గేమ్ అడుతున్న సీఐని బదిలీ చేయాలని అప్పట్లో ఎమ్మెల్యే సంజీవయ్యకు సూచించడాన్ని మనసులో పెట్టుకొని అన్యాయంగా తనను కేసులో ఇరికించినట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి కన్నుమూత
సాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హనుమకొండలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడలో 1936, సెప్టెంబర్ 2న మందాడి రంగమ్మ, రాంరెడ్డి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డి, కూతురు రమ ఉన్నారు. బీజేపీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ నేతగానే కాకుండా.. గాయకుడిగా, కవి, రచయితగా కూడా ఆయన గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందాడి సత్యనారాయణరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా పాటలు రాసి అసెంబ్లీ వేదికగా పాడారు. మందాడి సత్యనారాయణరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ వైపు.. మందాడి సత్యనారాయణరెడ్డి వరంగల్‌లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే 1952లో ఆర్ఎస్ఎస్లో చేరారు. విద్యాభ్యాసం అనంతరం 1957లో భారతీయ జన సంఘ్‌లో ఫుల్‌టైం ఆర్గనైజర్‌గా పనిచేశారు. వివాహం అనంతరం కూడా ఫుల్‌టైం ఆర్గనైజింగ్ సెక్రెటరీగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆయన పనిచేశారు. విద్యాభ్యాసం సమయంలో కూడా జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కచ్ ఐక్యత, గోవా ఉద్యమాల్లో అరెస్టయి కొన్నిరోజులు జైలు జీవితం గడిపారు. తెలంగాణకోసం పోరాటం 1997 నుంచి వివిధ వేదికల ద్వారా మందాడి తెలంగాణ సమస్యలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకోసం పోరాటాలు చేశా రు. 1971లో జనసంఘ్, 1997లో బీజేపీలకు తెలంగాణ ఆవిర్భావం ఆవశ్యకత గురించి చెప్పి ఒప్పించారు. 2001లో టీఆర్ఎస్లో చేరిన సత్యనారాయణరెడ్డి 2004 ఎన్నికల్లో నాటి హన్మకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందుగానే టీఆర్ఎస్ను వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో తిరిగి బీజేపీలో చేరిన సత్యనారాయణరెడ్డి తుది శ్వాస వరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. ప్రముఖుల సంతాపం మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మందాడి సత్యనారాయణరెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సత్యనారాయణరెడ్డి కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డికి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు మందాడి భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
‘టెన్త్’ కొత్త కేంద్రాలపై మెసేజ్‌లు
సాక్షి, హైదరాబాద్ : కరోనా జాగ్రత్తల్లో భాగంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కొత్త పరీక్ష కేంద్రాల సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభా గం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. సెల్ఫోన్లు లేని, ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, విద్యార్థుల కోసం చేపడుతున్న చర్యలపై సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన వెల్లడించిన వివిధ అంశాలు... విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు పరీక్షల ముందు రోజు విద్యార్థులు, తల్లి దండ్రులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలను చూసుకుంటే పరీక్ష ప్రారంభం రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పాత కేంద్రాల్లో ఏ హాల్‌టికెట్ నంబర్ నుంచి ఏ హాల్‌టికెట్ నంబర్ వారికి సెంటర్ ఉంది.. మిగతా వారికి సమీపంలోని ఏ భవనంలో అదనంగా కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేశామన్న వివరాలు తెలుసుకోవచ్చు. జూన్ 7నే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచుతాం. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తాం కాబట్టి విద్యార్థులు అదే రోజు వెళ్లినా సమీపంలోని (కిలోమీటర్ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చు. ఆ వివరాలను తెలియజేసేందుకు సహాయకులను నియమిస్తాం. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కొద్దిగా ఆలస్యమైనా అనుమతిస్తాం. విద్యార్థుల ప్రత్యక్ష తనిఖీ (ఫ్రిస్కింగ్) ఉండదు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్క్‌లు అందజేస్తాం. విద్యార్థులూ వాటిని తెచ్చుకోవచ్చు. మంచినీళ్ల బాటిళ్లను కూడా అనుమతిస్తాం. పరీక్ష కేంద్రాలన్నింటినీ కెమికల్‌తో శానిటైజ్ చేస్తాం. పక్కాగా జాగ్రత్తలు.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే 5,34,903 మంది విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు పక్కా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా ఒక బెంచీపై ఒకరే కూర్చొని పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచాం. పాత కేంద్రాలు 2,530 ఉండగా మరో 2,005 కేంద్రాలను గుర్తించాం. అవసరమైతే ఇంకా కేంద్రాలను పెంచాలని డీఈవోలను ఆదేశించాం. స్కూళ్లల్లోని అదనపు గదులను వినియోగించుకోవడంతోపాటు కాలేజీల భవనాలు, ఫంక్షన్ హాళ్లు, ఆడిటోరియాలను తీసుకొని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. భౌతికదూరం పాటించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి 20 స్కూళ్లకు కలిపి ఒక జోన్‌గా చేశాం. అందులో నాలుగు సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయా జోన్లలో వాటికి సమీపంలోని (కిలోమీటర్ లోపే) భవనాల్లోనే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కంటైన్మెంట్ జోన్లలో ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక కేంద్రం.. ప్రస్తుతం రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు తక్కువే ఉన్నాయి. హోం క్వారంటైన్లో సంబంధిత ఇళ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ వరకు చూస్తాం. ఆలోగా హోం క్వారంటైన్లో ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోని పిల్లలు ఎవరైనా ఉన్నారా? కంటైన్మెంట్ జోన్లలో విద్యార్థులు ఎంత మంది ఉంటారన్న లెక్కలు తీస్తున్నాం. కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చే విద్యార్థులు తక్కువ మంది ఉంటే వారికి ప్రత్యేక గదులను కేటాయించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తాం. ఒకవేళ కంటైన్మెంట్ జోన్లలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అక్కడే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలకు వచ్చే వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉంటే వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తాం. -
వాకర్స్ జిల్లా గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి
అమలాపురం రూరల్ : నడక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని వాకర్స్ జిల్లా గవర్నర్‌గా ఎన్నికైన అమలాపురానికి చెందిన తేతలి సత్యనారాయణరెడ్డి అన్నారు. వాకర్స్ జిల్లా 103వ గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి స్థానిక కిమ్స్ వైద్య కళాశాల సమావేశపు హాలులో సోమవారం ప్రమాణ స్వీకారం చేసి ప్రసంగించారు. వాకర్స్ అంతర్జాతీయ సంస్థ మాజీ అధ్యక్షుడు కె.రామానందం జిల్లా గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. వాకర్స్ మాజీ గవర్నర్ ఎం.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అతిథిగా మాట్లాడుతూ అమలాపురంలో నాలుగు దశాబ్దాల కిందట నడక ఉద్యమానికి ఊపిరి పోసిన డాక్టర్ డి.రామచంద్రరావు కృషితో ఏర్పాటైన వాకర్స్ క్లబ్ నుంచి సత్యనారాయణరెడ్డి గవర్నర్ కావటం అభినందనీయమన్నారు. అనంతరం రెడ్డిని సత్కరించారు. వాకర్స్ మాజీ గవర్నర్ డాక్టర్ పీఎస్ శర్మ, వాకర్స్ ప్రతినిధులు డాక్టర్ గంధం రామం, డాక్టర్ నిమ్మకాయల రామమూర్తి పాల్గొన్నారు. -
వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి
అమలాపురం టౌన్ : వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 103వ గవర్నర్‌గా అమలాపురానికి చెందిన తేతల సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 2006 సంవత్సరం నుంచి రెడ్డి నడక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, వాకర్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన్ను గవర్నర్ పదవి వరించింది. అమలాపురం వాకర్స్ క్లబ్లో అధ్యక్ష పదవితో పాటు ఎన్నో పదవులు చేపట్టారు. -
అవార్డు బాధ్యత పెంచింది
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు సత్యనారాయణ ఎంపిక వేళంగి కాలేజీ అభివృద్ధికి విశేష కృషి వేళంగి(కరప): నిబద్ధతతో పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందనడానికి వేళంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్తి వీరవెంకట సత్యనారాయణరెడ్డి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా జిల్లా నుంచి సత్యనారాయణరెడ్డి ఒక్కరే ఎంపికయ్యారు. కష్టించి పనిచేసి అంచెలంచెలుగా ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిన ఆయన అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. వ్యక్తిగత వివరాలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలేటిపాడు గ్రామానికి చెందిన సత్తి సత్యనారాయణరెడ్డి తులసమ్మ దంపతుల కుమారుడు వీర వెంకట సత్యనారాయణరెడ్డి. 10వ తరగతి వరకు సొంతగ్రామంలో, ఇంటర్మీడియట్, డిగ్రీ పెనుగొండలో చదివారు. డిగ్రీతో 1984లో రికార్డు అసిస్టెంట్‌గా రావులపాలెం కళాశాలలో చేరారు. 1990లో ఆయనకు అదే కళాశాలలో టైపిస్ట్‌గా పదోన్నతి లభించింది. ఆlకళాశాలలో లెక్చరర్‌గా అప్పుడు పని చేస్తున్న పి.కోటేశ్వరరావు సలహా మేరకు సత్యనారాయణరెడ్డి ఎమ్మెస్సీ ప్రైవేట్‌గా రాసి ఉత్తీర్ణులయ్యారు. 1998లో జూనియర్ లెక్చరర్(లెక్కలు)గా పదోన్నతిరాగా ఆలమూరు కళాశాలలో పనిచేశారు. జేఎల్‌గా రావులపాలెం, ఆలమూరు కళాశాలల్లో సత్యనారాయణ సేవలందించారు. 2000– 2005 సంవత్సరాల మధ్య ఎన్ఎస్ఎస్ ప్రోగామ్ ఆఫీసర్‌గా ఏడాదికి రెండు వంతున 10 ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అధికారుల, ప్రజల మన్ననలు పొందారు. తాను జేఎల్ పనిచేసిన కళాశాలల్లో లెక్కల సబ్జెక్టులో నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. 2012లో ప్రిన్సిపాల్‌గా పదోన్నతిపై సత్యనారాయణరెడ్డి ఆలమూరు నుంచి వేళంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చారు. కళాశాల ప్రగతి సత్యనారాయణరెడ్డి ప్రిన్సిపాల్‌గా వచ్చేంతవరకూ వేళంగి కాలేజీలో 40 శాతం ఉత్తీర్ణత వచ్చేది. ఈ నాలుగేళ్లలో ఉత్తీర్ణతాశాతాన్ని పెంచుతూ జిల్లాలో ఉత్తీర్ణతలో ద్వితీయ స్థానానికి కళాశాలను తీసుకువెళ్లిన ఘనత ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డికే దక్కుతుంది. 2014లో జిల్లాలో తృతీయస్థానం, 2015లో ద్వితీయ స్థానం, 2016లో 83.03 శాతంతో ఫస్ట్ ఇయర్లో జిల్లాలో ద్వితీయ స్థానంలో కళాశాల నిలిచింది. జిల్లాలో ఎక్కడాలేని విధంగా సిబ్బంది, దాతల సహకారంతో కాలేజీలో మధ్యాహ్నభోజనపథకాన్ని అమలు చేశారు. గ్రామపెద్దలు మెర్ల వీరయ్యచౌదరి, డాక్టర్ బొండా వెంకన్నారావు, చుండ్రు వెంకన్నరాయ్చౌదరి, చుండ్రు శంకర్రావు, స్టాప్ సహకారంతో 200 మంది విద్యార్థులకు నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలవరకు మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారు. ఓఎజ్జీసీ సంస్థ ఆర్థిక సాయంతో కళాశాలలో రూ. లక్షతో మరుగుదొడ్లు, రూ. 3.21 లక్షలతో సైకిల్ షెడ్ నిర్మింపజేశారు. అందరి సహకారంవల్లే ఈ అవార్డు కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, గ్రామస్తుల సహకారంతో కళాశాల ప్రగతికి చేసినకృషి ఫలితమే రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు రావడానికి కారణమని ప్రిన్సిపాల్ సత్తి వీరవెంకట సత్యనారాయణరెడ్డి అన్నారు. ఈఅవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని, అధ్యాపకుల సహకారంతో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యనందించేందుకు కృషిచేస్తానన్నారు. -
విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణరెడ్డికి పురస్కారం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : విద్యుత్ శాఖను అగ్రస్థానంలో నిలపడంలో భాగంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో విశేష సేవలందించిన సూపరెంటెండెంటింగ్ ఇంజినీర్ సీహెచ్ సత్యనారాయణరెడ్డి సేవా అవార్డు అందుకున్నారు. సోమవారం విశాఖపట్నంలోని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ చేతులమీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా జిల్లాలో నూరుశాతం విద్యుత్ సౌకర్యం కల్పించి దేశంలోనే జిల్లాను ప్రథమస్థానంలో నిలపడంలో సత్యనారాయణరెడ్డి విశేషకృషి చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రికార్డుస్థాయిలో 5 రోజుల్లో విద్యుత్ ఉపకేంద్రం నిర్మించి విద్యుత్ సరఫరా కల్పించడంలోనూ ఆయన పాత్ర విశేషమనే చెప్పాలి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 21 నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు నిర్మించి వాటిని ప్రారంభించడం, 27 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కెపాసిటీ పెంచడం, 12 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించారు. విద్యుత్ పొదుపులో భాగంగా జిల్లాలో 15.61 లక్షల ఎల్ఈడీ బల్బులు, 26,700 విద్యుత్ పొదుపు ఫ్యాన్లు పంపిణీ చేయించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపారు. సత్యనారాయణరెడ్డికి అవార్డుపై పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
వ్యక్తిపై దాడి కేసులో ఐదుగురికి రిమాండ్
ఓ వ్యక్తిపై నిన్న(శనివారం రాత్రి) 20 మంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలు.. కోంపల్లిలో నివాసముండే చింతల సత్యనారాయణ రెడ్డి(35) అనే వ్యక్తి నిన్న కిరాణా సరుకులు కొందామని ప్రజయ్ అపార్ట్మెంట్ వద్దకు తన కారులో వెళ్లాడు. కారును కిరాణా షాపు ముందు పార్క్ చేశాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ప్రజయ్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నాగరాజు, వార్డు మెంబర్ వినోద్, బాలరాజు, నగేష్, సెక్యురిటీ గార్డు నగేష్ సహా మొత్తం 20 మంది సత్యనారాయణ రెడ్డిని బాగా తిట్టి కర్రలతో కొట్టారు. దీనిపై బాధితుడు సత్యనారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. ఆ విషయాన్ని గురువారం ఉదయం జైలు సిబ్బంది గుర్తించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గంజాయి అక్రమ రవాణా కేసులో మూడు రోజుల కిందటే ఖైదీ సత్యనారాయణరెడ్డి (38) అరెస్ట్ చేసినట్లు జైళ్లు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఖైదీ మృతిపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు. -
నేటినుంచి ఈడబ్ల్యూఆర్‌సీలో ఉచిత శిక్షణ
- 20వ తేదీ వరకుదరఖాస్తుకు అవకాశం సంగారెడ్డి జోన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఇంగ్లిష్ వర్క్ రీడ్‌నెస్ అండ్ కంప్యూటర్స్ (ఈడబ్ల్యూఆర్‌సీ) కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్న డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫె యిల్ అయిన 19 నుంచి 26 ఏళ్ల వయసు కలిగిన గ్రామీణ యువకులు శిక్షణకు అర్హులన్నారు. మూడు నెలల ఈ శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలతోపాటు బేసిక్ కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌తోపాటు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు శనివారం నుంచి ఈనెల 20 తేదీ వరకు గజ్వేల్‌లోని ఎస్టీ హాస్టల్ పక్కన గల ఈడబ్ల్యూఆర్‌సీ శిక్షణ కేంద్రంలో ప్రవేశాలను పొందవచ్చన్నారు. వివరాల కోసం 94925 61363, 96528 82296 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
‘మిషన్’ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
భగీరథ, కాకతీయ పనులపై సమీక్షలో కలెక్టర్ నల్లగొండ : మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేసేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్ విలేజ్ పైపులైను పనులు మే నెలాఖరు నాటికి పూర్తిచేసి 153 గ్రామాల్లో తాగునీరు అందించే విధంగా పనులు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా పైపులైన్ల లీకేజీ, పగిలిపోవడం జరిగితే తక్షణమే వాటిని మరమ్మతులు చేయించాలని కోరారు. సమీక్షలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రమణ, ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కరువు మండలాల్లో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధకశాఖ చేపట్టిన కరువు నివారణ పనుల పై కూడా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఎస్ఈ బి.ధర్మానాయక్, ఈఈలు, జేడీఏ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
అర్థరాత్రి తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం !
నల్గొండ: వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల తుది ఫలితాలు గురువారం అర్థరాత్రి తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ గెలుపునకు 7,013 ఓట్లు కావాల్సి ఉండగా, బీజేపీ గెలుపునకు 19,736 ఓట్లు కావాల్సి ఉందని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ పూర్తి అయిందన్నారు. అలాగే రెండో ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. -
పెద్ద సారొచ్చారు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : చదువులమ్మ ఒడిలో ఉన్న జిల్లా విద్యాశాఖకు ఎట్టకేలకు పూర్తిస్థాయి డీఈవో సత్యనారాయణరెడ్డి నియామకమయ్యారు. గతంలో పూర్తిస్థాయి అధికారిగా పనిచేసిన అక్రముల్లాఖాన్ జనవరి 31న ఉ ద్యోగ విరమణ చేయడంతో సీనియర్ అధికారి రామారావును తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ విరమణ నేపథ్యంలో అక్రముల్లాఖాన్ శాఖను పెద్దగా పట్టించుకోక పోవడంతోపాటు, తాత్కాలికంగా పనిచేసిన రామారావు కఠిన చర్యల వైపు అడుగు వేయకపోవడంతో విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పదో తరగతి ఫలితాలు ఊహించని రీతిలో చివరి స్థానం రాక తప్పలేదు. కొత్త డీఈవోకు సమస్యల మాల కొత్తగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారికి అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మారుమూల ప్రాంతంలో పాఠశాలలు ఎక్కువగా ఉండటంతోసమస్యలు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రెండేళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియ నిలిచింది. సకాలంలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందకపోవడంతో సమయం వృథా అవుతోంది. పదో తరగతి వార్షిక పరీక్షలకు కొద్ది రోజుల ముందు డిప్యూటేషన్ ఇచ్చి ఆ తరగతి విద్యార్థులకు బోధించమంటూ అదనపు భారం ఉపాధ్యాయులపై వేస్తున్నారు. జూన్‌లోనే ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇచ్చినచో సకాలంలో పాఠ్యాంశాలు పూర్తి చేసి ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఇన్‌చార్జీలే అధికం జిల్లాలో 48 మండలాలకు పీజీ హెచ్ఎంలే ఇన్చార్జి మండల విద్యాధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు పనిచేస్తున్న పాఠశాలల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వీరిలో 15 మంది అధికారులు ఈ ఇన్చార్జి బాధ్యతలు తాము మోయలేమని, బాధ్యతలను తప్పించాల్సిందిగా మొరపెట్టుకుంటున్నా కనికరించడంలేదు. అదే విధంగా 38 ఉన్నత పాఠశాలలకు పీజీ హెచ్ఎంలు లేక పోవడంతో ఆ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంటులే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. వారు అటు పాఠాలు చెప్పలేక, ఇటు పాఠశాల బాధ్యతలను నిర్వర్తించలేక సతమత మవుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో 350 స్కూల్ అసిస్టెంటు పోస్టులు కోర్టు జోక్యంతో పదోన్నతులు నిలిచాయి. దీంతో ఆ పాఠశాలల్లోని విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. కుంటుపడుతున్న విద్య డీఎస్సీ ద్వారా భర్తీ కావాల్సిన సుమారు 1200 భర్తీ కాకపోవడంతో ప్రాథమిక, ప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులతోపాటు ఉపాధ్యాయులకు అదనపు బారం పడుతోంది. గడిచిన విద్యాసంవత్సరంలో పదో తరగతి తరగతుల నిర్వహణతో పాటు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల ప్రగతిపై ఏ ఒక్క సమీక్ష జరిగిన సందర్భం లేదని, ఈ నేపథ్యంలోనే పదో తరగతి ఫలితాలు ఆశించిన మేరకు రాలేదని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ఆరంభంకు ముందుగానే విద్యాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు. -
కొత్త డీఈఓగా రాజేశ్వర్
మెదక్/సంగారెడ్డి, న్యూస్‌లైన్: ఎట్టకేలకు జిల్లా విద్యాశాఖాధికారి గాజర్ల రమేష్ బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం కొత్త డీఈఓగా రాజేశ్వర్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రమేష్‌తో ఉపాధ్యాయ సంఘాలకు ఏర్పడిన భేదాభిప్రాయాల వల్ల విద్యాశాఖలో వివాదానికి దారి తీసిన విషయం విదితమే. 2012 ఏప్రిల్‌లో రమేష్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విద్యాశాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల స్థాయి, నిధుల వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ పాఠశాలలను సందర్శిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించారన్న వాదనలున్నాయి. 2013 ఫిబ్రవరిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారిగా ఆయనపై మండిపడ్డాయి. రమేష్ కఠిన వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఉపాధ్యాయులంతా సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. స్పందించిన అప్పటి కలెక్టర్ దినకర్‌బాబు ఉపాధ్యాయుల సంఘాలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కాని డీఈఓకు ఉపాధ్యాయ సంఘాల మధ్య అంతరం అలాగే కొనసాగింది. రమేష్ పనిచేసిన రెండేళ్ల కాలంలో పలువురు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతోపాటు సుమారు 46 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఓ ప్రైవేట్ పాఠశాల విషయమై సంగారెడ్డి ఎమ్మెల్యేకు డీఈఓ రమేష్ మధ్య వివాదం నెలకొంది. ఇదే సమయంలో డీఈఓ రమేష్ పదోన్నతులను ఇవ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు నష్టపోయారని, డీసీసీబీ నిధులను తన కార్యాలయానికి వినియోగించుకున్నారని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదాలు ముదిరి పాకాన పడటంతో ఫిబ్రవరి 2014లో డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే డీఈఓ రమేష్ అప్పటికే ఎన్నికల విధుల్లో భాగంగా మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా పనిచేస్తున్నందున ఆయన బదిలీ ఆగిపోయింది. అనంతరం ఎన్నికల విధులు ముగిసినందున ఆదివారం రాజేశ్వర్ మెదక్ డీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, రమేష్ బదిలీపై డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు వెళ్లిపోయారు. సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి: డీఈఓ రాజేశ్వర్ ఉపాధ్యాయులు, అధికారుల సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి జరుగుతుందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిని సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లాను విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారులు భుజంగం, గీతా, చర్చి ప్రాపర్టీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, సంగారెడ్డి డిప్యూటీ ఈఓ శోభారాణి తదితరులు ఉన్నారు. -
సంయమనం కోల్పోవద్దు
సాక్షి, కాకినాడ : రాష్ట్రంలో 40 రోజుల వ్యవధిలో వరుస ఎన్నికలు వచ్చాయని, విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సంయమనం కోల్పోకుండా ఈ యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన బి.రామాంజనేయులు, సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టుహాలులో ఎన్నికలకు నియమితులైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ఒకే లొకేషన్లో రెండు పోలింగ్స్టేషన్లు ఉంటే, ఓటర్లు ఇబ్బంది పడకుండా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని అంశాలు శిక్షణల్లో తెలుసుకున్నందున ఎవరి పనుల్లో వారు నిమగ్నమవ్వాలన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో పోలీసు శాఖ చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ మూర్తి మాట్లాడుతూ నగరంలో 30 లొకేషన్లు హైపర్సెన్సిటివ్గాను, 35 లొకేషన్లు సెన్సిటివ్గాను గుర్తించామన్నారు. ఎక్కడికక్కడ నిబంధనల మేరకు సాయుధ సిబ్బందిని నియమించామన్నారు. నగరంలో తొమ్మిడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, 600 మందిని బైండోవర్ చేశామన్నారు. 139 ఆయుధ లెసైన్సులకు గాను 93 ఉపసంహరించుకున్నామని, 46 రక్షణ కార్యకలాపాల్లో ఉండగా, రెండు కమిషన్ అనుమతిలో ఉన్నాయన్నారు. మిగిలిన వాటి ఉపసంహరణకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ వివిధ మున్సిపాలిటీలో 290 పోలింగ్ కేంద్రాల్లో 12 హైపర్ సెన్సిటివ్ ఉన్నాయన్నారు. 23 స్ట్రైకింగ్ టీమ్‌లు, 10 స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్‌లు నియమించి, 30 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. అంతర్గత శాఖల సమన్వయంతో 13, తొమ్మిది ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉండగా, 402 ఆయుధాలను సరెండర్ చేసుకున్నామన్నారు. 3,700 మందిని బైండోవర్ చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ స్లిప్‌ల ముద్రణ కొనసాగుతోందన్నారు. ఈ నెల 22 నుంచి ఓటర్ స్లిప్‌లో మున్సిపల్ స్థాయిలో బూత్‌లెవెల్ అధికారులతో పంపిణీ చేయిస్తామన్నారు. 26వ తేదీకల్లా ఈవీఎంలు సిద్ధం చేస్తామన్నారు. ఇంతవరకు చెక్‌పోస్టుల తనిఖీ ద్వారా రూ.91 లక్షల విలువైన నగదు, ఇతర సామగ్రి సీజ్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు చర్యలు చేపడుతున్నామన్నారు. వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు క్యూలైన్లో ఉంచకుండా లోపలికి వెంటనే అనుమతించాలని ఆర్ఓలను ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు అందాయని వివరించారు. ర్యాంపులు లేని చోట్ల తాత్కాలికంగానైనా ఏర్పాటు చేసి వికలాంగులకు సహకరించాలన్నారు. ఈవీఎంల తనిఖీ రానున్న మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు చేరుకున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ నీతూ ప్రసాద్ పరిశీలించారు. నడకుదురు మార్కెటింగ్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రాత్రి మొదటిస్థాయి చెకింగ్‌లో భాగంగా కలెక్టర్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలను భద్రపరిచే అంశంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. ఏజేసీ డి.మార్కండేయులు, సహాయ కలెక్టర్ ఆర్వీ కన్నన్, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల తర్వాత బదిలీ
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: డీఈఓబదిలీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఎన్నికలు ముగిసిన తరువాత రమేష్‌ను జిల్లా నుంచి రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. డీఈఓను బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని బుధవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె పీఆర్టీయూ నాయకులు సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, సాయిలు, తదితరులతో చర్చలు జరిపారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నేతలే ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాము డీఈఓ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేయగా, అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. డీఈఓపై వచ్చిన ఆరోపణల గురించి త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే డీఈఓ రమేష్‌ను కొనసాగిస్తున్నట్లు ఆమె వెల్లడించారనీ, ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన్ను రిలీవ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సమస్యలపట్ల కూడా కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
అమ్మాయి పుడితే.. అమ్మదే నేరమా?!
శంకరపట్నం, న్యూస్‌లైన్ : ఆడపిల్లను కన్నావంటూ అత్తిం టివారు నిత్యం సూటిపోటి మాటలం టే భరించింది. అదనపుకట్నం తేవాలంటూ కట్టుకున్నోడే ఇంటినుంచి గెంటివేయడంతో అవమానభారం తట్టుకోలేకపోయింది. చివరకు ఉరివేసుకుని తనువుచాలించింది. ఈ విషా ద సంఘటన శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసు ల కథనం ప్రకారం.. తాడికల్ గ్రామానికి చెందిన, ఇప్పలపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న వరాల పుణ్యవతి కుమార్తె జ్యోత్స్న(24)ను 2011లో కొడిమ్యాలకు చెందిన రాగి సప్తగిరికి ఇచ్చి వివాహం జరిపిం చారు. ఏడాదిపాటు వీరి సంసారం సాఫీగా సాగింది. తర్వాత వీరికి పాప పుట్టింది. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టిందని, అదనపుకట్నం తీసుకురావాలని అత్తింటివారు సూటిపోటి మాటలతో వేధించసాగారు. పలుమార్లు పంచాయితీలు నిర్వహించారు. భర్త పెట్టే వేధింపులు పుట్టింటి వారికి చెప్పుకోలేక జ్యోత్స్న కుమిలిపోయింది. సంక్రాంతి పండుగకు తల్లి పుణ్యవతి ఉద్యోగం చేస్తున్న ఇప్పలపల్లెకి కూతురుతో వచ్చింది. పండుగ తర్వాత కొడిమ్యాలకు వెళ్లగా, మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. కట్నం తేలేదన్న అక్కసుతో జ్యోత్స్నకు అన్నం పెట్టకుండా భర్త చిత్రహింసలకు గురిచేశాడు. ఈనెల 22న మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో జ్యోత్స్నను భర్త సప్తగిరి ఇంటినుంచి గెంటివేశాడు. కుమార్తెను మాత్రం తనవద్దే ఉంచుకున్నారు. దీంతో మరుసటి రోజు జ్యోత్స్న ఇప్పలపల్లెలోని తల్లివద్దకు చేరుకుంది. అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన జ్యోత్స్న.. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో గురువారం రాత్రి ఇంట్లో గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. భర్త సప్తగిరి, అత్త కళావతి, మామ భూమానందం, మరిది శేషగిరి వేధింపుతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడందని పుణ్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లియాఖత్ అలీ తెలిపారు. తహశీల్దార్ కరీం శవపంచనామా నిర్వహించగా, హుజూరాబాద్ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, రూరల్ సీఐ భీంశర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో మగ్గాలు లేవు
నూతనకల్ , న్యూస్‌లైన్ : జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా క్రీడాల అభివృద్ధిశాఖ అధికారి మక్బూల్‌అహ్మద్ చెప్పారు. నూతనకల్‌లోని మర్రి సత్యనారాయణరెడ్డి మినీ స్టేడియంలో వివిధ ట్రాక్‌ల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ స్టేడియం అభివృద్ధి కోసం రూ.47లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్, మధ్యలో ఫుట్‌బాల్, హాకీ మైదానాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రన్నింగ్ ట్రాక్ భయట వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్ కోర్టులతో పాటు స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఆర్.యాదయ్య, ఏఈ జనార్దనమూర్తి, పీడీ వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
86 దేవాలయాలకు మాస్టర్ ప్లాన్!
అడ్డగోలు నిర్మాణాలు, పాలకమండళ్ల నిర్ణయాలకు చెక్! వేములవాడ, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అడ్డగోలు నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. వాటిపై నిధులు వృథా చేసేలా ఉండే పాలకమండళ్లు, కార్యనిర్వాహక అధికారుల (ఈవోల) నిర్ణయాలు ఇక చెల్లవు. ఇందుకోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. సంస్కృతీ సంప్రదాయాలు, స్థలపురాణం, భక్తుల మనోభావాలు, వారికి సౌకర్యాల కల్పన తదితర అంశాలన్నింటికీ పెద్దపీట వేస్తూ ప్రధాన ఆలయాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 15లోగా ఆయా ఆలయాల స్థితిగతులపై నివేదికలు సమర్పించాలని ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆలయాలకున్న స్థిరాస్తుల పరిరక్షణతో పాటు మరో 30 సంవత్సరాల వరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన నిర్మాణాలను చేపట్టడం మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వర్రావు, చీఫ్ ఇంజనీరు సత్యనారాయణ రెడ్డి, స్థపతి సౌందర్యరాజన్, స్థపతి సలహాదారు వేలుతో కూడిన ప్రత్యేక కమిటీ... హైదరాబాద్‌లో బుధవారం ప్రధాన దేవాలయాల ఈవోలు, ఈఈలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాయింట్ కమిషనర్, డిప్యూటీ జాయింట్ కమిషనర్, సహాయ కమిషనర్ స్థాయి అధికారులు ఈవోలుగా ఉన్న మొత్తం 86 ఆలయాలకు ఈ మాస్టర్ ప్లాన్ వర్తిస్తుంది. వాటిలో జాయింట్ కమిషనర్ స్థాయిలో వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, విజయవాడ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవాలయాలున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన జాబితాలో సికింద్రాబాద్ గణేశ్ ఆలయం, బాసర, కొమురవెల్లి, కొండగట్టు, మహానంది, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయాలను చేర్చారు. సహాయ కమిషనర్‌స్థాయి కలిగిన సుమారు 68 దేవాలయాలను మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఇలా... ప్రస్తుతం ఆలయ స్థితిగతులు, సౌకర్యాలు, చేపట్టిన పనులు, దేవస్థానానికి చేరుకునే మార్గాలు, వాటిలో దుకాణాలు, వాటి నిర్వహణ, నీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, గత పదేళ్లలో ఏటా ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య తదితర వివరాల ఆధారంగా నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని కమిటీ సూచించింది. మరో 30 ఏళ్ల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, దూరం నుంచికూడా ఆలయం కనిపించేలా ఆవరణను విస్తరించడం, రానున్న రోజుల్లో పెరిగే భక్తుల సంఖ్య అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. -
‘గాలికుంటు’తో బెంబేలు
ప్రొద్దుటూరు/ ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు మండలం కానపల్లెలో సుమారు 3వేలకు పైగా పశువులు ఉన్నాయి. కొందరు కర్మాగారాలకు పాలు తరలిస్తుండగా అనేకమంది రైతుల ద్వారా సేకరించి ద్విచక్రవాహనాలలో పట్టణాలలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని సత్యనారాయణరెడ్డి అనే ఏజెంట్ ఈడాది ఏప్రిల్ నెలలో 15 రోజులకు 3389 లీటర్ల పాలు సేకరించారు. అక్టోబర్‌లో 795 లీటర్లు మాత్రమే సేకరించాడు. పాలదిగుబడి పడిపోవడానికి గాలికుంటు వ్యాధి ప్రభావమే ప్రధాన కారణమని పాడిరైతులు తెలుపుతున్నారు. రోజూ 10 లీటర్ల్లు పాలు పోసే రైతు ప్రస్తుతం అందులో సగం కూడా పోయలేని పరిస్థితి. దీంతో వీరి జీవనం దుర్భరంగా మారింది. కేసీ కెనాల్‌కు గత ఏడాది సాగునీరు విడుదల చేయకపోవడంతో జిల్లాలో వరిపంట సాగు చేయలేదు. ఈ కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీనికి తోడు ఈ ఏడాది కూడా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. దీంతో కరువు పరిస్థితుల కారణంగా రైతులకు పశుపోషణ భారంగా మారింది. పచ్చి గడ్డిలేని కారణంగా పోషకులు ఎంత ఖర్చుపెట్టినా, చివరగా భారీ వర్షాలు పడినా నెలరోజులు పశువులు మేయలేని పరిస్థితి ఏర్పడిందని ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామానికి చెందిన మహిళా పాడిరైతు ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నెల 1 నుంచి 15వ తేదీ వరకూ, రెండో విడతగా వచ్చే ఫిబ్రవరి 15 నుంచి నెలాఖరు వరకూ గ్రామాల్లో గాలికుంటువ్యాధి నివారణకు టీకాలు వేయాల్సి ఉంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న సిబ్బంది చాలాచోట్ల సకాలంలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మేత తినలేని పరిస్థితుల్లో వ్యాధి ప్రబలి గ్రామాల్లో పశువులు మృత్యువాత పడ్డాయి. సమస్య తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు ఉద్యమంతో సంబంధం లేకుండా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. అయితే కొన్నిచోట్ల ఈ ఆదేశాలను సిబ్బంది ఖాతరు చేయకపోగా మరికొన్నిచోట్ల స్పందించే సమయానికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వ్యాధి నివారణ కోసం టీకాలు వేస్తే సాధారణంగానే పాడి ఉత్పత్తి సగానికి తగ్గిపోతుంది. పశువైద్యాధికారులు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రామాభివృద్ధి సమాఖ్య జిల్లా డిప్యూటీ డైరక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అనేక కారణాల వల్ల గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 50 శాతం పాలదిగుబడి తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందన్నారు చిన్నదండ్లూరును దెబ్బతీసిన గాలికుంటు ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరు గ్రామం వ్యవసాయానికి, పాడిపరిశ్రమకు పెట్టిందిపేరు. ఫ్యాక్షన్ గ్రామమైన చిన్నదండ్లూరులో ప్రస్తుతం గ్రామస్తులందరూ వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమతో అభివృద్ధి చెందుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి లో సుమారు 5 నుంచి 10 దాక గేదెలు ఉన్నాయి. గాలికుంటు వ్యాధిసోకి వారం రోజుల్లోనే 50 గేదెలు మృతి చెందాయని పాడిరైతులు వాపోతున్నారు. వ్యాధి సోకడంతో పశువులు నడవలేకపోతున్నాయన్నారు. వ్యాధి నివారణకు సరైన మందులు దొరకడం లేదన్నారు. ఇంత జరుగుతున్నా పశువైద్యులు గ్రామానికి వచ్చిన పాపాన పోలేదన్నారు. ఉత్పత్తి తగ్గిపోయింది పలు కారణాల వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గింది. పాడి రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదు. - గుమ్మళ్ల సత్యనారాయణరెడ్డి, ఏజెంటు గాలికుంటు వ్యాధి తీవ్రంగా ఉంది ఎక్కడ చూసినా గాలికుంటు వ్యాధి ఉంది. గతంలో 3.5 లీటర్ల పాలుపొస్తుండగా ప్రస్తుతం అర లీటరు మాత్రమే పోస్తున్నాను. పాల ధరలు కూడా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. -భైరవేశ్వరుడు మా పశువులకు సోకింది మా ఇంటిలోని పశువులకు కూడా గాలికుంటు వ్యాధి సోకింది. ఎలాగోలా కష్టపడి టీకాలు వేయించాం. పాల దిగుబడి తగ్గింది. పశువులు బాధపడుతుంటే చూడలేకపోతున్నాం. - సుబ్బమ్మ వ్యాధి నిరోధక టీకాలు వేస్తాం.. గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామాలలో పశువైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించాం. -వెంకట్రావు, జేడీ, జిల్లా పశుసంవర్థక శాఖ