ఓ వ్యక్తిపై నిన్న(శనివారం రాత్రి) 20 మంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఓ వ్యక్తిపై నిన్న(శనివారం రాత్రి) 20 మంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలు.. కోంపల్లిలో నివాసముండే చింతల సత్యనారాయణ రెడ్డి(35) అనే వ్యక్తి నిన్న కిరాణా సరుకులు కొందామని ప్రజయ్ అపార్ట్‌మెంట్ వద్దకు తన కారులో వెళ్లాడు. కారును కిరాణా షాపు ముందు పార్క్ చేశాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ప్రజయ్ అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ నాగరాజు, వార్డు మెంబర్ వినోద్, బాలరాజు, నగేష్, సెక్యురిటీ గార్డు నగేష్ సహా మొత్తం 20 మంది సత్యనారాయణ రెడ్డిని బాగా తిట్టి కర్రలతో కొట్టారు. దీనిపై బాధితుడు సత్యనారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.