మేకలను దొంగలను ఇద్దరు ఆటో డ్రైవర్లను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఓ ఆటో, రెండు మేకలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై బి. రమేశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... భవానీనగర్ తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ ఆలియాస్ షిషి (20), నషేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ ఆలియాస్ చావూస్ (23)లు ఆటో డ్రైవర్లు.
కాగా ఈ నెల 5వ తేదీన వీరిద్దరు తలాబ్‌కట్టా ప్రాంతంలో సాయంత్రం ఓ వ్యక్తి ఇంటి ముందు కట్టేసిన రెండు మేకలను దొంగలించి ఆటోలో తీసుకొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఉదయం ఈదిబజార్ జోరాబీ దర్గా వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా వీరిద్దరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. విచారించగా దొంగతనం చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేకలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.