అమ్మాయి పుడితే.. అమ్మదే నేరమా?! | karimnagar News | Sakshi
Sakshi News home page

అమ్మాయి పుడితే.. అమ్మదే నేరమా?!

Published Sat, Jan 25 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

karimnagar News

శంకరపట్నం, న్యూస్‌లైన్ : ఆడపిల్లను కన్నావంటూ అత్తిం టివారు నిత్యం సూటిపోటి మాటలం టే భరించింది. అదనపుకట్నం తేవాలంటూ కట్టుకున్నోడే ఇంటినుంచి గెంటివేయడంతో అవమానభారం తట్టుకోలేకపోయింది.
 
 చివరకు ఉరివేసుకుని తనువుచాలించింది. ఈ విషా ద సంఘటన శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసు ల కథనం ప్రకారం.. తాడికల్ గ్రామానికి చెందిన, ఇప్పలపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న వరాల పుణ్యవతి కుమార్తె జ్యోత్స్న(24)ను 2011లో కొడిమ్యాలకు చెందిన రాగి సప్తగిరికి ఇచ్చి వివాహం జరిపిం చారు. ఏడాదిపాటు వీరి సంసారం సాఫీగా సాగింది. తర్వాత వీరికి పాప పుట్టింది. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టిందని, అదనపుకట్నం తీసుకురావాలని అత్తింటివారు సూటిపోటి మాటలతో వేధించసాగారు. పలుమార్లు పంచాయితీలు నిర్వహించారు. భర్త పెట్టే వేధింపులు పుట్టింటి వారికి చెప్పుకోలేక జ్యోత్స్న కుమిలిపోయింది. సంక్రాంతి పండుగకు తల్లి పుణ్యవతి ఉద్యోగం చేస్తున్న ఇప్పలపల్లెకి కూతురుతో వచ్చింది. పండుగ తర్వాత కొడిమ్యాలకు వెళ్లగా, మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. కట్నం తేలేదన్న అక్కసుతో జ్యోత్స్నకు అన్నం పెట్టకుండా భర్త చిత్రహింసలకు గురిచేశాడు. ఈనెల 22న మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో జ్యోత్స్నను భర్త సప్తగిరి ఇంటినుంచి గెంటివేశాడు. కుమార్తెను మాత్రం తనవద్దే ఉంచుకున్నారు. దీంతో మరుసటి రోజు జ్యోత్స్న ఇప్పలపల్లెలోని తల్లివద్దకు చేరుకుంది.
 
 అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన జ్యోత్స్న.. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో గురువారం రాత్రి ఇంట్లో గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. భర్త సప్తగిరి, అత్త కళావతి, మామ భూమానందం, మరిది శేషగిరి వేధింపుతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడందని పుణ్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లియాఖత్ అలీ తెలిపారు. తహశీల్దార్ కరీం శవపంచనామా నిర్వహించగా, హుజూరాబాద్ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, రూరల్ సీఐ భీంశర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement