shankarapatnam
-
కరీంనగర్: ముసలమ్మ నాకొద్దు!
నవ మాసాలు మోసి కనాలి. పాలిచ్చి పెంచాలి. అడిగివన్నీ చేసి పెట్టాలి. అపురూపంగా చూసుకోవాలి. కానీ, వయసు మీద పడితే.. ఆ తల్లి భారమైపోతుందా?.. అలాగే అనుకున్నాడు ఇక్కడ ఓ కొడుకు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోలేనంటూ చలిలో రోడ్డు పక్కన పడేశారు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్తతోపాటు పెద్ద కొడుకు రాజయ్య, ఓ కూతురు కొన్నాళ్ల కిందట చనిపోయారు. వయసు పైబడడంతోపాటు ఇళ్లు పాడుబడి పోయింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకుల కుటుంబాలు వంతులవారీగా లచ్చమ్మను చూసుకుంటూ వస్తున్నారు. రాజయ్య కుటుంబం మహారాష్ట్రంలో ఉంటోంది. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్ తీసుకొచ్చి దిగబెట్టింది. అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చిన్న కొడుకు కుటుంబం అడ్డుకుంది. రాజయ్య కొడుకు వెళ్లిపోయే దాకా చూసి.. ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేశాడు. చలిలో రోడ్డు మీద వణుకుతూ కనిపించిన లచ్చమ్మను స్థానికులు చూశారు. డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు చిన్న కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే యత్నం చేశారు. కానీ, అతను ముసలి అమ్మ వద్దంటూ కరాకండిగా చెప్పేశాడు. కావాలంటే పాత ఇంట్లో ఆమె ఉండొచ్చని.. తిండి కావాలంటే అక్కడికే తీసుకెళ్లి ఇస్తానని చెప్పాడు. దీంతో.. చేసేది ఏం లేక ఆ 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు ఆమె పాత ఇంటి వద్ద దిగబెట్టారు. -
3 ఏళ్లుగా చెరువులో చేపలు మాయం.. కారణమేమిటంటే
శంకరపట్నం: మూడేళ్లుగా చెరువులో చేపలు మాయమవుతున్నాయి. ప్రభుత్వం వేసిన చేప పిల్లలు కొద్దిగా పెద్దవి అవుతున్నాయో లేదో.. అప్పుడే చెరువులో కనిపించకుండా పోతున్నాయి. దీంతో వాటిని నమ్ముకుని వ్యాపారం చేద్దామనుకున్న మత్య్సకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో చేపల మాయంపై మత్య్సకారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా చేపల దొంగలను పట్టుకోవాలని కష్టపడి గస్తీ కాశారు. ఫలితంగా దొంగలు చిక్కారు. చేపలు దొంగతనం చేస్తున్న ముఠా ఎట్టకేలకు గ్రామస్తులకు చిక్కడంతో వారు పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చెరువులో మూడేళ్లుగా చెరువులో వేసిన చేపలు మాయమవుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు చెరువుపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు రాత్రిపూట నిఘా పెట్టడంతో చేపలు దొంగిలిస్తున్న ఏడుగురి కనిపించారు. వారిని వెంటపడగా నలుగురు మత్స్యకారులకు చిక్కారు. ముగ్గురు పారిపోయారు. ఆ నలుగురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిలో కొత్తగట్టుకు చెందిన నలుగురితో పాటు రేకొండ కమలాపూర్‌కు చెందిన మరో ముగ్గురు చేపల దొంగతనానికి పాల్పడుతున్నారని మత్స్యకారుల సంఘం ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు. చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు కొత్తగట్టు చెరువు వద్ద దొంగలకు దేహశుద్ధి చేస్తున్న మత్స్యకారులు -
దేవునిగుట్టపై ‘గ్రానైట్’ కన్ను
సాక్షి, శంకరపట్నం(కరీంనగర్) : గ్రానైట్ వ్యాపారుల కన్ను దేవునిగుట్టపై పడింది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామంలో సర్వేనంబర్221లో 36 ఎకారాల్లో దేవుని గుట్ట, పేదలకు పట్టాలకు ఇచ్చిన స్థలం కూడా ఉంది. ఈ సర్వే నంబర్లో తవ్వకాలకు గ్రానైట్ వ్యాపారులు 2006లో 3హెక్టార్లలో అనుమతి పొందారు. కలర్ గ్రానైట్ రాయికోసం తవ్వకాలు చేపట్టారు. గుట్టచుట్టూ అసైన్డ్భూములు ఉన్నాయి. అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన సముద్రాల కొంరయ్యకు 15 గుంటలు, సముద్రాల ఎల్లయ్యకు 15గుంటలు, దామెర చిలుకమ్మకు 25 గుంటలు, సముద్రాల కొంరయ్యకు 15 గుంటలు, దామెర రాజేశ్వరికి 15 గుంటలకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. వీరి నుంచి లీజ్‌కు తీసుకున్న వ్యాపారులు షెడ్లు వేసి నిర్మించుకున్నారు. దేవునిగుట్టపై కలర్గ్రానైట్ రాయి వెలికితీయడంతో మార్కెట్లో డిమాండ్ ఉండగా అదనంగా అను మతి కోసం వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం జారీ కాకపోవడంతో అనుమతి ఇంకా రాలేదు. ఈ క్రమంలో గుట్టపై పనులు చేస్తూ అసైన్డ్‌భూముల్లో వృథాగా క్వారీలో నుంచి వెలికితీసిన రాయిని కుప్పలుగా పోస్తున్నారు. పట్టాభూముల్లో మాత్రమే వృథా రాయిని పోయాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో రాయి పోస్తే అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. రూ.లక్షల విలువ చేసే బ్లాకులు గ్రానైట్ క్వారీలో రూ.లక్షలు విలువ చేసే బ్లాకు లు గుట్టపై నిల్వ చేశారు. అనుమతి కంటే ఎక్కు వ విస్తీర్ణంలో గుట్టపై పనులు చేసి బ్లాకులు తీశారని ఆరోపణలు ఉన్నాయి. కలర్ గ్రానైట్‌కు డిమాండ్ ఉండడంతో అదనంగా అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అనుమతి విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈనెల20న మైనింగ్, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ నివేదిక ఆధారంగా గ్రానైట్‌క్వారీ ఎంత విస్తీర్ణంలో చేశారో తేలనుంది. పదిరోజులు గడుస్తున్నా ఇవ్వని నివేదిక అనుమతి కంటే ఎక్కువ విస్తీర్ణంలో గ్రానైట్క్వారీలో పనులు చేశారని అంబాల్‌పూర్ మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్ గాజుల మల్లయ్య, మోరె గణేశ్ ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారి సైదులు, సర్వేయర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వేయర్ సంపత్‌లు ఈనెల20న సర్వేచేశారు. అదేరోజు పంచనామా కాపీ అందించాలి. సర్వే చేసి పది రోజులు గడిచినా నివేదికను అందించకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. చర్యలు తీసుకోవాలి శ్మశాన వాటికకోసం ఎంపిక చేసిన భూమిలో క్వారీ యజమానులు బండరాళ్లు వేసిండ్రు. గుట్టపై అనుమతి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పనులు చేసిండ్రని ఫిర్యాదు చేస్తే సర్వే చేసిన అధికారులు నివేదికను ఇవ్వమంటే కాలయాపన చేస్తున్నరు. ఎక్కువ స్థలంలో పనులు చేసిన దానిపై చర్యలు తీసుకోవాలి. – గాజుల మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ -
కరీంనగర్ జిల్లాలో దంపతుల అనుమానస్పద మృతి
-
శంకరపట్నంలో భారీ వర్షం
శంకరపట్నం (కరీంనగర్ జిల్లా) : శంకరపట్నం మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులతో కూడిన వర్షం కారణంగా తాడికల్ గ్రామం వద్ద వరంగల్-కరీంనగర్ రహదారిపై చెట్లు, విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. -
అధికారులపై మహిళల ఆగ్రహం
శంకరపట్నం (కరీంనగర్) : నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించకుండా.. తూతూ మంత్రంగా సర్వే నిర్వహించి డబుల్ బెడ్రూం అర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ మహిళలు అధికారులపై తిరగబడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో డబుల్ బెడ్రూం అర్హులకు సంబంధించిన సభ నిర్వహిస్తుండటంతో.. అక్కడికి మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్హులకు మాత్రమే ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ దశలో అధికారులకు, మహిళలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అధికారులు తిరిగి సర్వే నిర్వహిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
అమ్మాయి పుడితే.. అమ్మదే నేరమా?!
శంకరపట్నం, న్యూస్‌లైన్ : ఆడపిల్లను కన్నావంటూ అత్తిం టివారు నిత్యం సూటిపోటి మాటలం టే భరించింది. అదనపుకట్నం తేవాలంటూ కట్టుకున్నోడే ఇంటినుంచి గెంటివేయడంతో అవమానభారం తట్టుకోలేకపోయింది. చివరకు ఉరివేసుకుని తనువుచాలించింది. ఈ విషా ద సంఘటన శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసు ల కథనం ప్రకారం.. తాడికల్ గ్రామానికి చెందిన, ఇప్పలపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న వరాల పుణ్యవతి కుమార్తె జ్యోత్స్న(24)ను 2011లో కొడిమ్యాలకు చెందిన రాగి సప్తగిరికి ఇచ్చి వివాహం జరిపిం చారు. ఏడాదిపాటు వీరి సంసారం సాఫీగా సాగింది. తర్వాత వీరికి పాప పుట్టింది. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టిందని, అదనపుకట్నం తీసుకురావాలని అత్తింటివారు సూటిపోటి మాటలతో వేధించసాగారు. పలుమార్లు పంచాయితీలు నిర్వహించారు. భర్త పెట్టే వేధింపులు పుట్టింటి వారికి చెప్పుకోలేక జ్యోత్స్న కుమిలిపోయింది. సంక్రాంతి పండుగకు తల్లి పుణ్యవతి ఉద్యోగం చేస్తున్న ఇప్పలపల్లెకి కూతురుతో వచ్చింది. పండుగ తర్వాత కొడిమ్యాలకు వెళ్లగా, మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. కట్నం తేలేదన్న అక్కసుతో జ్యోత్స్నకు అన్నం పెట్టకుండా భర్త చిత్రహింసలకు గురిచేశాడు. ఈనెల 22న మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో జ్యోత్స్నను భర్త సప్తగిరి ఇంటినుంచి గెంటివేశాడు. కుమార్తెను మాత్రం తనవద్దే ఉంచుకున్నారు. దీంతో మరుసటి రోజు జ్యోత్స్న ఇప్పలపల్లెలోని తల్లివద్దకు చేరుకుంది. అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన జ్యోత్స్న.. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో గురువారం రాత్రి ఇంట్లో గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. భర్త సప్తగిరి, అత్త కళావతి, మామ భూమానందం, మరిది శేషగిరి వేధింపుతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడందని పుణ్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లియాఖత్ అలీ తెలిపారు. తహశీల్దార్ కరీం శవపంచనామా నిర్వహించగా, హుజూరాబాద్ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, రూరల్ సీఐ భీంశర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో చేప చిక్కింది
కరీంనగర్ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని అవినీతి యంత్రాంగాన్ని ఏసీబీ వెంటాడుతోంది. సోమవారం అవినీతి నిరోధక దినోత్సవం రోజు శంకరపట్నం తహశీల్దార్ మట్ట వెంకటరమణ..ఓ రైతు వద్ద రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మరువకముందే బుధవారం కరీంనగర్ మండలం చింతకుంట గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఇంటి నంబరు కేటాయించేందుకు ఓ వ్యక్తి వద్ద రూ.6,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు. వరుస సంఘటనలు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన సయ్యద్ ఆరీఫ్హుస్సేన్ ఆర్నేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. పదిరోజుల క్రితం ఇంటినంబరు కోసం పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డిని సంప్రదించాడు. రూ. 6500 లం చం ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్ చేయడంతో మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి వెంకటరమణారెడ్డి, బిల్‌కలెక్టర్ రాములకు రూ.6500 ఇచ్చాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ దాడి చేసి పట్టుకున్నారు. కార్యదర్శి, బిల్ కలెక్టర్లపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. తన తల్లి పేరిట ఇల్లు నిర్మించామని, అనుమతి కోసం అప్పుడు కూడా కార్యదర్శికి రూ.7500 లంచం ఇచ్చానని బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం ఇంటినంబరు ఇవ్వాలంటే లంచం కోసం వేధించడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు చెప్పాడు. ఏసీబీకి చిక్కిన రెండో కార్యదర్శి కరీంనగర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇది రెండో ఘటన. తొలిసారి తీగలగుట్టపల్లి పంచాయతీ కార్యదర్శి నవాజొద్దిన్తోపాటు కారోబార్ మల్లయ్యలు గత నెల 13న ఏసీబీకి చిక్కారు. ఇంటిపేరుమార్పిడి కోసం కేవలం రూ. 2వేలకు కార్యదర్శి పట్టుబడగా ప్రస్తుతం కూడా ఇంటి నంబర్ విషయంలోనే కార్యదర్శి చిక్కాడు. కారోబార్లదే పెత్తనం.. కరీంనగర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్లుకలెక్టర్లదే పెత్తనం కొనసాగుతోంది. కారోబార్లు చెప్పినట్లుగా పంచాయతీ కార్యదర్శులు నడుచుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. కొన్నేళ్లుగా పనిచేస్తుండటంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. తీగలగుట్టపల్లిలో కార్యదర్శి కంటే కారోబార్ మల్లయ్యదే పెత్తనం ఎక్కువగా ఉండేది. కారోబార్లు చేసిన పనికి కార్యదర్శులు బలవుతున్నట్లు పలువురు పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు.