అధికారులపై మహిళల ఆగ్రహం | Women protest against Double bed room survey | Sakshi
Sakshi News home page

అధికారులపై మహిళల ఆగ్రహం

Published Mon, Mar 21 2016 4:56 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

Women protest against Double bed room survey

శంకరపట్నం (కరీంనగర్) : నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించకుండా.. తూతూ మంత్రంగా సర్వే నిర్వహించి డబుల్ బెడ్రూం అర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ మహిళలు అధికారులపై తిరగబడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం అర్హులకు సంబంధించిన సభ నిర్వహిస్తుండటంతో.. అక్కడికి మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్హులకు మాత్రమే ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ దశలో అధికారులకు, మహిళలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అధికారులు తిరిగి సర్వే నిర్వహిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement